breaking news
Lizelle Lee
-
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్‌కు భారీ షాక్
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ క్రికెటర్ లీజెల్లి లీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఆమెకు జరిమానా పడింది. అంతేకాదు లీజెల్లి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ కూడా చేరింది.మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026లో భాగంగా ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (MIW vs DCW) మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. వడోదర వేదికగా టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ చేసింది.నట్ సీవర్, హర్మన్ మెరుపులుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ నట్ సీవర్- బ్రంట్ (45 బంతుల్లో 65 నాటౌట్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur- 33 బంతుల్లో 41) రాణించడంతో ఈ మేర స్కోరు సాధ్యమైంది.లీజెల్లి లీ ధనాధన్ఢిల్లీ బౌలర్లలో నల్లపురెడ్డి శ్రీచరణి మూడు వికెట్లు పడగొట్టగా.. మరిజానే కాప్, నందిని శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 19 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లలో షఫాలీ వర్మ (29) ఫర్వాలేదనిపించగా.. లీజెల్లి లీ ధనాధన్ దంచికొట్టింది. 28 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 46 పరుగులు చేసింది.అయితే, అర్ధ శతకానికి చేరువైన వేళ లీ పొరపాటుతో మూల్యం చెల్లించుకుంది. అమన్‌జోత్ కౌర్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి లీ విఫలం కాగా.. వికెట్ కీపర్ రాహిలా ఫిర్దోజ్ చక్కటి స్టంపౌట్‌తో ఆమెను పెవిలియన్‌కు పంపింది. రివ్యూలోనూ లీజెల్లి లీదే తప్పని తేలడంతో థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చారు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన ఆమె బ్యాట్‌ను కొట్టినట్లు కనిపించింది.జరిమానా, డీమెరిట్ పాయింట్ఈ నేపథ్యంలో లీజెల్లి లీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జరిమానా విధిస్తున్నట్లు డబ్ల్యూపీఎల్ ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్ 2.2 నిబంధన ప్రకారం.. లీ లెవల్ 1 తప్పిదానికి పాల్పడింది. క్రికెట్ పరికరాలను డ్యామేజ్ చేసే రీతిలో వ్యవహరించినందుకు గానూ ఈ నిబంధన ప్రకారం చర్యలు ఉంటాయి.లెవల్ 1 తప్పిదం కాబట్టి లీ మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధిస్తున్నాం. అదే విధంగా ఆమె ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ జత చేస్తున్నాం’’ అని డబ్ల్యూపీఎల్ పేర్కొంది. గెలిపించిన జెమీమాఇక ఈ మ్యాచ్‌లో లీతో పాటు కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 51 నాటౌట్) దంచికొట్టడంతో ఢిల్లీ విజయతీరాలకు చేరింది. 19 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 155 పరుగులు చేసి.. ముంబైపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ఇక ఈ సీజన్లో ఢిల్లీ ఇప్పటికి ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఇది రెండో విజయం కాగా.. ముంబై ఆరింట రెండు మాత్రమే గెలిచి నాలుగు ఓడిపోయింది. మరోవైపు.. ఇప్పటిదాకా ఓటమన్నదే ఎరుగక ఐదింటికి ఐదు గెలిచి ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. చదవండి: భారత్‌లో ఆడబోము.. ఇదే మా నిర్ణయం: బంగ్లాదేశ్ ఓవరాక్షన్ -
ఈ ఐదుగురిపైనే కళ్లన్నీ.. త్రిషకు మంచి రోజులు వచ్చినట్లేనా?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026 టోర్నమెంట్‌కు శుక్రవారం తెరలేచింది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ముంబై ఇండియన్స్‌పై గెలుపొంది శుభారంభం అందుకుంది.ఆర్సీబీ తరఫున అరంగేట్రంనవీ ముంబైలో జరిగిన ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ తరఫున ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు లారెన్ బెల్, లిన్సీ స్మిత్ అరంగేట్రం చేశారు. ఫాస్ట్ బౌలర్ బెల్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 14 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసింది. తద్వారా డబ్ల్యూపీఎల్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటింది.మరోవైపు.. లెఫ్టార్మ్ పేసర్ లిన్సీ స్మిత్ మాత్రం రెండు ఓవర్లలో ఏకంగా 23 పరుగులు ఇచ్చి నిరాశపరిచింది. అయితే, అంతర్జాతీయ టీ20లలో సత్తా చాటిన ఈ ఇద్దరు ఎవరికి ఎవరూ తక్కువకారు. తొలి మ్యాచ్‌లో విఫలమైనా లిన్సీ తిరిగి పుంజుకోగలదు. ఇందుకు గణాంకాలే కారణం.ఎన్ని వికెట్లు తీశారంటేబెల్ ఇప్పటికి 36 అంతర్జాతీయత టీ20లలో 50 వికెట్లు కూల్చగా.. లిన్సీ 22 మ్యాచ్‌లు ఆడి 6.6 ఎకానమీతో 22 వికెట్లు తీసింది. వుమెన్స్ 100లో బెల్ ఖాతాలో 60 (41 మ్యాచ్‌లలో), లిన్సీ ఖాతాలో 42 (37 మ్యాచ్‌లలో) వికెట్లు ఉన్నాయిఇక బెల్, లిన్సీలతో పాటు మరో ముగ్గురు ప్లేయర్లు కూడా ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. వారు మరెవరో కాదు లిజెలి లీ, గొంగడి త్రిష, దీయా యాదవ్.లిజెలి లీసౌతాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ లిజెలి లీ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికి 82 మ్యాచ్‌లు ఆడింది. 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో 1896 పరుగులు ఉన్నాయి.ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలిగినా.. తన విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా గత దశాబ్దకాలంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గతేడాది వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ లిజెలిని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఇప్పటికి 104 మ్యాచ్‌లు ఆడి ఐదు సెంచరీలు బాది.. 2770 పరుగులు చేసిన లిజెలి డబ్ల్యూపీఎల్‌నూ వాచౌట్ ప్లేయర్.గొంగడి త్రిషతెలంగాణ ఆల్‌రౌండర్, టీమిండియా అండర్-19 స్టార్ గొంగడి త్రిష. అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో మొట్టమొదటి సెంచరీ చేసిన మహిళా క్రికెటర్‌గా ఆమె చరిత్రకెక్కింది.టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడంతో పాటు.. పార్ట్‌టైమ్ లెగ్ స్పిన్నర్‌గా రాణించడం ఆమెకు ఉన్న అదనపు బలం. అయితే, గత రెండు సీజన్లలో వేలంలో పేరు నమోదు చేసుకున్నా ఫ్రాంఛైజీలు ఆమెను పట్టించుకోలేదు.ఈసారి యూపీ వారియర్స్ మాత్రం రూ. 10 లక్షల కనీస ధరకు 20 ఏళ్ల త్రిషను కొనుగోలు చేసింది. కీలక మ్యాచ్‌లలో ఫియర్లెస్ క్రికెట్ ఆడగల సత్తా ఉన్న త్రిషకు ఒక్క అవకాశం వచ్చినా తనను తాను నిరూపించుకోగలదు. ఇప్పటి వరకు 33 టీ20 మ్యాచ్‌లు ఆడిన త్రిష 583 పరుగులు సాధించింది.దీయా యాదవ్పదహారేళ్ల దీయా యాదవ్‌ను రూ. 10 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. తద్వారా అత్యంత పిన్న వయసులో డబ్ల్యూపీఎల్ కాంట్రాక్టు పొందిన ప్లేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. అండర్ 15 వన్డే కప్‌లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన దీయా.. దేశీ టీ20 క్రికెట్లోనూ నిలకడైన ఆటతో ఆకట్టుకుంటోంది. ఈమె కూడా ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.చదవండి: T20 WC: వేటు వేసిన సెలక్టర్లు.. తొలిసారి స్పందించిన శుబ్‌మన్ గిల్ -
వరుస సెంచరీలు.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్, సౌతాఫ్రికా ప్లేయర్ లిజెల్ లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. ప్రస్తుత ఎడిషన్‌లో అరివీర భయంకమైన ఫామ్‌లో ఉన్న లీ.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు విధ్వంసకర సెంచరీలు చేసింది. తొలుత పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 75 బంతుల్లో అజేయమైన 150 పరుగులు (12 ఫోర్లు, 12 సిక్సర్లు) చేసిన లీ.. తాజాగా అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో మెరుపు సెంచరీతో (59 బంతుల్లో 103; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించింది. తద్వారా మహిళల బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.కొడితే బ్యాట్ విరిగిపోయింది..!ఈ మ్యాచ్‌లో లిజెల్ కొట్టిన ఓ షాట్‌కు బ్యాట్ విరిగిపోయింది. ఓర్లా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ రెండో బంతికి లిజెల్ క్రీజ్ వదిలి ముందుకు వచ్చి భారీ షాట్ ఆడింది. ఈ షాట్‌కు బ్యాట్ విరిగిపోయినప్పటికీ బంతి బౌండరీని క్లియర్ చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హరికేన్స్.. లిజెల్ మెరుపు సెంచరీతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. లిజెల్కు నికోలా క్యారీ (46 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) సహకరించింది. హరికేన్స్ ఇన్నింగ్స్‌లో వ్యాట్ హాడ్జ్ డకౌట్ కాగా.. కెప్టెన్ ఎలైస్ విల్లాని 14 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. అడిలైడ్ బౌలర్లలో మెగాన్ షట్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో లిజెల్ రనౌటయ్యింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన అడిలైడ్ స్ట్రయికర్స్ 15 ఓవర్ల అనంతరం మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. స్మృతి మంధన (32 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో కదంతొక్కగా.. కేటీ మ్యాక్ 14, తహిళ మెక్‌గ్రాత్ 4 పరుగులు చేసి ఔటయ్యాడు. లారా వోల్వార్డ్ట్ (25), బ్రిడ్జెట్ ప్యాటర్సన్ (11) క్రీజ్‌లో ఉన్నారు. హరికేన్స్ బౌలర్లలో మోల్లీ స్ట్రానో, లారెన్ స్మిత్, యామీ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో అడిలైడ్ గెలవాలంటే 30 బంతుల్లో మరో 80 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. -
దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ విధ్వంసం.. 12 ఫోర్లు, 12 సిక్స్‌లతో ఊచకోత
మహిళల బిగ్ బాష్ లీగ్-2024లో హోబర్ట్ హరికేన్స్ మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సిడ్నీ వేదికగా పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగులతో తేడాతో ఘన విజయాన్ని హోబర్ట్ అందుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ స్టార్ ఓపెనర్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ లిజెల్ లీ విధ్వంసకర సెంచరీతో మెరిసింది.సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విఫలమైన లీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగింది. ప్రత్యర్ధి బౌలర్లను ఈ దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఊచకోత కోసింది. ఆమెను ఆపడం పెర్త్ స్కార్చర్స్ బౌలర్లు వంతు కాలేదు. ఆమె బౌండరీలు బాదుతుంటే ఫీల్డర్లు ప్రేక్షక పాత్ర పోషించారు.ఓవరాల్‌గా 75 బంతులు ఎదుర్కొన్న లీ..12 ఫోర్లు, 12 సిక్స్‌లతో 150 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హీథర్ గ్రహమ్(23) రాణించింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో హోబర్ట్ హరికేన్స్ 3 వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది.అనంతరం లక్ష్య చేధనలో పెర్త్ జట్టు కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. హోబర్ట్ బౌలర్లలో హీథర్ గ్రహమ్ మూడు వికెట్లు పడగొట్టగా, స్మిత్, స్ట్రానో తలా రెండు వికెట్లు సాధించారు. పెర్త్ బ్యాటర్లలో అనిస్వర్త్(41) ఒంటరి పోరాటం చేసింది.అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన లీ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్‌గా లీ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ స్టార్ ప్లేయర్ గ్రేస్ హ్యారీస్(136 నాటౌట్) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో హ్యారీస్ అల్‌టైమ్ రికార్డును లీ బ్రేక్ చేసింది.చదవండి: BAN vs AFG 2nd Odi: మెరిసిన షాంటో.. అఫ్గాన్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం -
దక్షిణాఫ్రికాకు భారీ షాక్.. అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ఓపెనర్ గుడ్ బై..!
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ క్రికెటర్ లిజెల్ లీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. లిజెల్ లీ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా శుక్రవారం ప్రకటించింది. ఈ విధ్వంసకర ఓపెనర్ 184 అంతర్జాతీయ మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించింది. లీ తన కెరీర్లో నాలుగు నాలుగు సెంచరీలతో సహా 5253 పరుగులు సాధించింది. ఇక ఈ ఏడాది జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ప్రోటీస్ జట్టులో లీ భాగంగా ఉంది. ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరడంలో లీ కీలక పాత్ర పోషించింది. "ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను. నాకు చిన్నతనం నుంచి క్రికెట్ నా జీవితంలో భాగమైంది. ముఖ్యంగా నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా గర్వంగా ఉంది. గత 8 ఏళ్లుగా దక్షిణాఫ్రికా క్రికెట్లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ప్రోటీస్ జట్టు నా వంతు సహకారం అందించాని భావిస్తున్నాను" అని లీ పేర్కొంది. చదవండి: Bhuvneshwar Kumar Inswinger: భువీ ఇన్‌స్వింగర్.. బట్లర్ బౌల్డ్.. వీడియో వైరల్ pic.twitter.com/H0p6bok1YY — Lizelle Lee (@zella15j) July 8, 2022 -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా భువీ..
దుబాయ్: మార్చి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఎంపికైనట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం భువీతో పాటు జింబాబ్వే ప్లేయర్ సీన్ విలియమ్స్, అఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్లు పోటీపడగా చివరికు ఈ అవార్డు భువీనే వరించింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అదరగొట్టిన భువీ.. 4.65 ఎకానమీతో 6 వికెట్లు సాధించాడు. అంతకుముందు జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో అతను 6.38 ఎకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో భువీ ఏకంగా 17 డాట్ బాల్స్ వేయడం విశేషం. ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస్తున్న నేపథ్యంలో వరుసగా మూడో నెల కూడా టీమిండియా ఆటగాడినే ఈ అవార్డు వరించడం మరో విశేషం. జనవరి నెలకు వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఫిబ్రవరి నెలకు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజెల్ లీ ఎంపికయ్యారు. ఈ విభాగంలో లిజెల్ లీతో పాటు రేసులో ఇద్దరు భారత అమ్మాయిలు(రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ రౌత్) ఉన్నప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లిజెల్ వైపే ఐసీసీ మొగ్గు చూపింది. -
తొలి వన్డేలో టీమిండియా ఓటమి
లక్నో: 5 వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు భారత్‌లో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు శుభారంభం లభించింది. లక్నో వేదికగా జరిగిన తొలి వన్డేలో పర్యాటక జట్టు 8 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టుపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 177 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ మిథాలి రాజ్ (85 బంతుల్లో 50; 4 ఫోర్లు, సిక్స్), వైస్ కెప్టెన్ హర్మాన్‌ప్రీత్‌కౌర్ (41 బంతుల్లో 40; 6 ఫోర్లు) రాణించడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. భారత జట్టులో దీప్తి శర్మ (46 బంతుల్లో 27; 3 ఫోర్లు), మంధాన (20 బంతుల్లో 14; 3 ఫోర్లు), పూనమ్ రౌత్ (29 బంతుల్లో 10; ఫోర్)లు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సఫారీ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ (10-3-28-3) కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు మ్లాబా(2/41), కాప్ (1/25), ఖాకా (1/29), కెప్టెన్ లస్ (1/23)లు రాణించారు. ఆనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సఫారీ జట్టు.. లిజెల్ లీ (122 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు, సిక్స్), వొల్‌వార్డ్డ్ (110 బంతుల్లో 80; 12 ఫోర్లు) అద్భుతంగా రాణించడంతో 40.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత బౌలర్లలో జులన్ గోస్వామికి (2/38) మాత్రమే వికెట్లు దక్కాయి. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 3 కీలకమైన వికెట్లు తీసుకున్న షబ్నిమ్ ఇస్మాయిల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా (మార్చి 9) మంగళవారం జరుగనుంది. -
దక్షిణాఫ్రికాకు తొలి విజయం
చెన్నై: టి20 మహిళల ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తొలి విజయాన్ని అందుకుంది. బుధవారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 156 పరుగులు చేసింది. ట్రిషా చెట్టి (35 బంతుల్లో 35; 4 ఫోర్లు), లిజెల్లే లీ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు; 1 సిక్స్) రాణించగా చివర్లో క్లో ట్రియాన్ (7 బంతుల్లో 20; 2 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడింది. కిమ్ గార్త్‌కు రెండు వికెట్లు పడ్డాయి. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 89 పరుగులు మాత్రమే చేసింది. లెగ్ స్పినర్ సునే లూస్ 8 పరుగులకు 5వికెట్లు తీయడంతో జట్టు కోలుకోలేకపోయింది.


