lining works
-
హంద్రీ–నీవా కాలువ పనుల్లో.. రూ.3,000 కోట్లు కొట్టుకుపోయాయ్!
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి మొదటి దశ ప్రధాన కాలువ వెడల్పు.. రెండో దశ ప్రధాన కాలువ, దానిలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్(పీబీసీ), కుప్పం బ్రాంచ్ కెనాల్ (కేబీసీ) లైనింగ్ పనుల్లో డొల్లతనం బట్టబయలైంది. గత నెల 24న మల్యాల పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయడం ఆపేయడంతో.. కాలువలో నీటి ప్రవాహం ఆగిపోయి పనితనం తేలిపోయింది. కర్నూలు, అనంతపురం జిల్లాలలో హంద్రీ–నీవా ప్రధాన కాలువ వెడల్పు మొదటి దశ పనులను ఇష్టారాజ్యంగా చేయడంతో ప్రవాహ ఉద్ధృతికి కాలువ గట్లు కోతకు గురై బలహీనంగా మారాయి. కాంక్రీట్ నిర్మాణాలు ఉన్న చోట్ల నాసిరకంగా చేసిన లైనింగ్ కొట్టుకుపోయింది.ఇక అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో హంద్రీ–నీవా రెండో దశ, పీబీసీ, కేబీసీ కాలువ సైడ్ స్లోప్స్ (వాలు) సరిచేసి, గట్టిపరచకుండా నాసిరకంగా లైనింగ్ చేయడంతో అనేక చోట్ల జారిపోయింది. సిమెంటు కాంక్రీట్ కరిగిపోయి కొట్టుకుపోయింది. నిబంధనలు తుంగలో తొక్కి.. పని స్వభావాన్ని మార్చేసి నాసిరకంగా లైనింగ్ చేస్తుండటాన్ని గతేడాది జూలై 14న ‘ఈ లైనింగ్ దండుకునేందుకే’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. తొలి దశ ప్రధాన కాలువ విస్తరణ పనులకు సంబంధించి గతంలో చేసినవే మళ్లీ ఇప్పుడు చేసినట్లుగా చూపడంపై ‘హంద్రీ–నీవాలో మహాపాతకం’ శీర్షికన గతేడాది జూలై 16న ప్రచురించిన కథనం ద్వారా ‘సాక్షి’ బహిర్గతం చేసింది.ఆ కథనాలు అక్షర సత్యమన్నది హంద్రీ–నీవా కాలువను పరిశీలిస్తే స్పష్టమవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు, రైతులు స్పష్టం చేస్తున్నారు. రికార్డు సమయంలో పూర్తి చేశామని గొప్పలు చెప్పుకునేందుకు నాసిరకంగా పనులు చేయడం వల్ల రూ.3 వేల కోట్ల మేర ప్రజాధనం వృథా చేశారని ఆరోపిస్తున్నారు. హంద్రీ–నీవా మొదటి దశ ప్రధాన కాలువలో రోజుకు 3,850 క్యూసెక్కులు తరలించేలా వెడల్పు చేసే పనులు, రెండో దశ కాలువ, పీబీసీ, కేబీసీ లైనింగ్ పనులను రూ.3,500 కోట్లతో చేపట్టి రికార్డు సమయంలో పూర్తి చేశామని చంద్రబాబు సర్కార్ గొప్పగా ప్రకటించుకుంది.గతేడాది జూలై 17న శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోయడాన్ని అధికారులు ప్రారంభించి మార్చి 24న ఆపేశారు. మొత్తం 248 రోజుల్లో 52.023 టీఎంసీలు తరలించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ లెక్కన రోజుకు సగటున 2,427.46 క్యూసెక్కులను మాత్రమే తరలించారన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు సర్కార్ గొప్పగా ప్రకటించినట్లుగా రోజుకు 3,850 క్యూసెక్కులను ఎత్తిపోసి ఉంటే 248 రోజుల్లో హంద్రీ–నీవా ద్వారా రాయలసీమకు 82.50 టీఎంసీలు సరఫరా అయ్యేవని ఇంజనీరింగ్ నిపుణులు, రైతులు స్పష్టం చేస్తున్నారు. 2019–24 మధ్య కాలువను వెడల్పు చేయకున్నా రోజుకు గరిష్టంగా 2,850 క్యూసెక్కులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరలించిందని.. దీన్ని బట్టి చూస్తే వెడల్పు, లైనింగ్ ముసుగులో చంద్రబాబు సర్కార్ భారీ ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నది స్పష్టమవుతోందని పేర్కొంటున్నారు.రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించినా..హంద్రీ–నీవా రెండో దశ కాలువ, పీబీసీ, కేబీసీ కాలువకు సిమెంట్ లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరు బావులు ఎండిపోతాయని.. పంటలు ఎండిపోయి తాము రోడ్డున పడతామని అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 216.30 కి.మీ నుంచి 400–500 కి.మీ వరకు ఐదు ప్యాకేజీలుగా విభజించి ఆర్నెల్ల్లలో పనులు పూర్తి చేయాలనే నిబంధనతో రూ.972.19 కోట్లతో (రూ.520.75 కోట్ల విలువైన మూడు ప్యాకేజీల పనులు ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌కు.. రూ.451.44 కోట్ల విలువైన రెండు ప్యాకేజీల పనులు సీఎం చంద్రబాబు సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాకు అప్పగించారు.పుంగనూరు బ్రాంచ్ కాలువలో 0 కి.మీ నుంచి 75వ కి.మీ వరకు లైనింగ్ పనులను రెండు ప్యాకేజీల కింద విభజించి కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు రూ.319.6 కోట్లతో అప్పగించారు. పుంగనూరు బ్రాంచ్ కాలువలో 75 కి.మీ నుంచి 207.80 కి.మీ వరకు వెడల్పు చేయడం, లైనింగ్ పనులను రూ.480.22 కోట్లతో సీఎం చంద్రబాబు సన్నిహితుడికి చెందిన ఎన్సీసీ సంస్థకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు రూ.196.91 కోట్లతో అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ లైనింగ్ టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర ఉన్న చోట్ల మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. నిబంధనల్లో ఎక్కడా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ ప్రస్తావనే లేదు. పని స్వభావం మారితే స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) ఆమోదంతోపాటు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ.. టెండర్లో నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలనే సాకు చూపించి ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానాన్ని కాంట్రాక్టర్లు ప్రతిపాదిస్తే ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజనీరింగ్ అధికారులు నోరు మెదపలేకపోయారని జల వనరుల శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. రాతి పొర లేకున్నా.. మట్టి పొరకే.. కనీసం కాలువ సైడ్ వాలు (స్లోప్)ను క్రమానుగతంగా సరి చేయకుండానే ఇష్టారాజ్యంగా అత్తెసరు మందంతో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో కాంట్రాక్టర్లు లైనింగ్ పనులు కానిచ్చేశారు. కాలువకు నీటిని విడుదల చేయడంతో ఆ ప్రవాహ ఉద్ధృతికి ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో వేసిన లైనింగ్ అనేక చోట్ల కరిగిపోయి కొట్టుకుపోయింది. వెడల్పు పేరుతో రూ.695.53 కోట్లు వృథా..:హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచే పనులను టీడీపీ హయాంలో 2017లో చేపట్టింది. 2019 ఫిబ్రవరి 18 నాటికే 2,73,32,444 క్యూబిక్ మీటర్ల మట్టి పని పూర్తయింది. ఈ పనులకు రూ.435 కోట్ల మేర బిల్లులు చెల్లించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ.. 2025లో మళ్లీ కొత్తగా హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచే పనులను చంద్రబాబు సర్కారు రూ.695.53 కోట్లతో చేపట్టింది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి.. ఒకటో ప్యాకేజీ (0 నుంచి 88 కి.మీ వరకు) కింద రూ.255.79 కోట్లకు మేఘా సంస్థకు, రెండో ప్యాకేజీ (88 కి.మీ నుంచి 216.3 కి.మీ వరకు) కింద రూ.439.74 కోట్లకు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి చెందిన వీపీఆర్–డీఎస్సార్(జేవీ) సంస్థకు అప్పగించింది.ప్రధాన కాలువను వెడల్పు చేయడంతోపాటు.. బ్రిడ్జిలు, అక్విడెక్టులు లాంటి కాంక్రీట్ నిర్మాణాలు ఉన్న చోట ఇరువైపులా వంద మీటర్ల పొడవున కాలువకు లైనింగ్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఒకటో ప్యాకేజీలో 37.79 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 5.61 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని.. రెండో ప్యాకేజీలో 84.97 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 14.13 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలని లెక్క కట్టింది.కానీ.. కాలువ గట్లపై ముళ్ల పొదలు తొలగించి, ఇన్స్పెక్షన్ పాత్ (తనిఖీ మార్గం)ను సరి చేసి.. ప్రొక్లెయిన్‌తో అక్కడక్కడ తవ్వి.. గతంలో చేసిన పనులనే మళ్లీ కొత్తగా చేసినట్లు కాంట్రాక్టర్లు మాయాజాలం చేశారు. ఇక కాంక్రీట్ నిర్మాణాలు ఉన్న చోట్ల అత్యంత నాసిరకంగా లైనింగ్ చేశారు. మల్యాల ఎత్తిపోతల నుంచి కాలువలోకి నీటిని ఎత్తిపోయడంతో ప్రవాహ ఉధృతికి కాలువ గట్లు కోతకు గురై బలహీనంగా మారాయి. అనేక చోట్ల సిమెంటు లైనింగ్ కొట్టుకుపోయింది.⇒ హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో 87.622 కి.మీ. నుంచి 88.925 కి.మీ. వరకు ఎక్కడికక్కడ జారిపోయిన కాంక్రీట్ లైనింగ్‌కు ఈ ఫొటోనే సాక్ష్యం. అన్నమయ్య జిల్లా పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 75 కి.మీ నుంచి 207.80 కి.మీ వరకు వెడల్పుతో లైనింగ్ పనులను రూ.480.22 కోట్లకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడి సంస్థ ఎన్సీసీకి నామినేషన్‌పై కట్టబెట్టారు. కాలువ సైడ్ స్లోప్స్ (ఏటవాలు ప్రాంతం) సరిచేయకుండానే.. ఇన్క్లైయిన్డ్ రోలర్‌తో గట్టిపరచకుండానే మట్టి పొరకు అత్యంత నాసిరకం ఎం–25, ఎం–20 రకం కాంక్రీట్ మిశ్రమంతో లైనింగ్ చేశారు. దీంతో కాలువకు నీటిని విడుదల చేయగానే లైనింగ్ ఎక్కడికక్కడ పగిలిపోయి జారిపోయింది. నీటి ప్రవాహం ఆగిపోవడంతో కాలువ లైనింగ్ డొల్లతనం తేలిపోయింది.⇒ హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనుల్లో అక్రమాలకు ఇవో మచ్చుతునక. తొలి దశ, రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులను కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేసి అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకున్నారు. టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర, డీప్ కట్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. కానీ నిబంధనలను తుంగలో తొక్కి పని స్వభావం (స్కోప్ ఆఫ్ వర్క్) మార్చేసి.. వేగంగా పూర్తి చేయాలనే సాకుతో అడ్డగోలుగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ చేశారు. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ చేస్తే చదరపు మీటర్‌కు రూ.1,407 చొప్పున బిల్లు చెల్లిస్తారు. అదే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ చేస్తే రూ.1,854 చెల్లిస్తారు. కానీ.. హంద్రీ–నీవా పనుల్లో మాత్రం రూ.2,400 చొప్పున బిల్లులు చెల్లించారంటూ ఇంజనీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి సమీపంలో కమ్మవారిపల్లి వద్ద హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 340 కి.మీ నుంచి 341 కి.మీ. మధ్య స్టీల్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ (ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) విధానంలో వేసిన లైనింగ్ కరిగిపోయిందనడానికి ఈ ఫొటోనే రుజువు! చిన్న చిన్న ఇనుప తీగలు, సిమెంటు, సిలికా, ఇసుక, కంకర, నీటితో కలిపి ఎస్‌ఎఫ్‌ఆర్‌సీని తయారు చేస్తారు. కాలువ రాతి పొర ప్రదేశంలో మాత్రమే.. సైడ్ స్లోప్స్ (ఏటవాలు ప్రాంతం) సరిచేసుకుని 38 మిల్లీమీటర్ల (ఎంఎం) మందంతో ఒకసారి, ఆ తర్వాత అదే మందంతో మరోసారి అధిక ఒత్తిడితో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ చేయాలి.కానీ, మట్టి పొరకే.. అదీ కాలువ సైడ్ స్లోప్స్ క్రమానుగతంగా ఉండేలా చేయకుండానే, వాలు ఎగుడు దిగుడుగా ఉన్నప్పటికీ 10 నుంచి 20 ఎంఎం మందంతో మాత్రమే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ వేశారు. ఈ దారుణాన్ని గతేడాది జూలై 14న ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇంత అడ్డదిడ్డంగా లైనింగ్ చేసిన దాఖలాలు ఎక్కడా లేవని.. ఇదో వింత అని ఇంజనీరింగ్ నిపుణులు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షం కురిసినా, కాలువకు కనిష్ట స్థాయిలో నీటిని విడుదల చేసినా.. ఈ లైనింగ్ ఎక్కడికక్కడ జారిపోవడం, కరిగిపోవడం ఖాయమని.. భారీ ఎత్తున ప్రజాధనం వృథా కావడం తథ్యమని స్పష్టం చేశారు. ఇప్పుడు అదే జరిగిందని ఇంజనీరింగ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆ పనులు చేసిన కాంట్రాక్టు సంస్థ బీఎస్సార్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం.లైనింగ్ పనులు ఎలా చేయాలంటే..⇒ తొలుత కాలువ గట్లపై ముళ్ల కంప చెట్లను తొలగించాలి. కాలువపై ఇన్స్పెక్షన్ పాత్ (దారి) వేయాలి. కాలువకు ఇరు వైపులా(సైడ్ స్లోప్స్).. అడుగు భాగంలో ఇన్క్లెయిన్డ్ రోలర్ (ప్రొక్లెయినర్‌కు రోలర్‌ను అమర్చడం) ద్వారా గట్టి పరచాలి.⇒ ఆ తర్వాత 12 ఎంఎం, 20 ఎంఎం గ్రానైట్ కంకర, నాణ్యమైన ఇసుక, సిమెంటుతో తయారు చేసిన ఎం–25 మిక్సర్, ఎం–20 మిక్సర్‌తో పేవర్ మిషన్ ద్వారా కాలువకు ఇరువైపులా లైనింగ్ వేయాలి. ఆ తర్వాత అడుగు భాగంలో లైనింగ్ వేయాలి. అనంతరం రెండు వారాలపాటు క్యూరింగ్ (నీటితో తడపాలి) చేయాలి.⇒ రాతి పొర ఉన్న ప్రాంతాల్లో షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. రాతి పొరకు ఇనుప బోల్ట్ కొట్టి.. దానికి ఇనుప జాలరీ అమర్చి దానిపై అధిక ఒత్తిడితో ఎం–20 కాంక్రీట్ వేయాలి. ⇒ పనులను ఏఈ, డీఈ, ఈఈలు నిరంతరం పర్యవేక్షించాలి. ఎస్ఈ, సీఈలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. నాణ్యత నియంత్రణ విభాగం(క్వాలిటీ కంట్రోల్) అధికారులు ఎప్పటికప్పుడు సిమెంటు కాంక్రీట్ లైనింగ్ శాంపుల్స్‌ను తీసి ల్యాబొరేటరీల్లో పరీక్షించి నాణ్యతను ధ్రువీకరించాలి. నాసిరకంగా ఉన్నట్లు తేలితే వాటిని తొలగించి మళ్లీ నాణ్యంగా పనులు చేయించాలి.⇒ పనులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడానికి వీల్లేదు. ఏవైనా పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించాలంటే జల వనరుల శాఖ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. కానీ పనుల నాణ్యతకు ప్రధాన కాంట్రాక్టరే బాధ్యత వహించాలి.లైనింగ్ పనులు ఎలా చేశారంటే..⇒ కాలువ గట్లపై ముళ్ల కంప చెట్లను తొలగించి దారి వేశారు. ఇన్క్లెయిన్డ్ రోలర్‌తో కాలువ ఇరు వైపులా అడుగు భాగాన్ని గట్టి పరచలేదు. కేవలం పొక్లెయిన్ బకెట్‌తో తూతూ మంత్రంగా గట్టి పరిచే పనులు కానిచ్చేశారు. దాంతో కాలువకు ఇరు వైపులా మట్టి ఎక్కడికక్కడ జారిపోతున్నా సరే సిమెంటు కాంక్రీట్‌తో లైనింగ్ వేశారు.⇒ గతంలో కాలువ తవ్వినప్పుడు వచ్చిన మట్టిని, రాళ్లను గట్టుగా పోశారు. ఆ గట్లపై ఉన్న రాళ్ల నుంచే ఇప్పుడు కంకర తయారు చేస్తున్నారు. ఆ కంకర పిండి పిండిగా నాసిరకంగా ఉంది. సమీపంలో వాగులు, వంకల్లో నుంచి ఇసుకను తెచ్చారు. నాసిరకం కంకర, ఇసుక.. తక్కువ పరిమాణంలో సిమెంటుతో ఎం–25 మిక్సర్ (ఒక పాలు సిమెంటు, ఒక పాలు ఇసుక, రెండు పాళ్లు 20 ఎంఎం కంకర కలిపి తయారు చేసే మిశ్రమం), ఎం–20 (1 పాలు సిమెంటు, 1.5 పాళ్లు ఇసుక, 3 పాళ్లు 12 ఎం ఎం కంకర కలిపి తయారు చేసే మిశ్రమం) మిక్సర్ తయారు చేశారు. ⇒ కాలువకు ఇరువైపులా ఇన్క్లెయిన్డ్ రోలర్‌తో గట్టిపరచక పోవడంతో ఎక్కడికక్కడ మట్టి జారిపోతున్నా పేవర్ యంత్రాన్ని వినియోగించకుండా.. కార్మికుల ద్వారా సిమెంట్ కాంక్రీట్‌తో లైనింగ్ వేశారు. మట్టిజారిపోతున్నా సరే అలానే లైనింగ్ వేస్తున్నారు. దీని వల్ల లైనింగ్ ఎక్కువ కాలం నిలబడదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేశారు. ఇష్టారాజ్యంగా లైనింగ్ చేయడంతో నీటి ప్రవాహ ఉద్ధృతికి లైనింగ్ ఎక్కడికక్కడ కొట్టుకుపోయింది. ఎం–25, ఎం–20 కాంక్రీట్‌లో సిమెంటు తక్కువగా, ఇసుక ఎక్కువగా, నాసిరకం కంకర వినియోగించడం వల్ల లైనింగ్ చేసిన ప్రాంతాల్లో ఇసుక పైకి తేలి స్పష్టంగా కనిపిస్తోంది. -
హంద్రీనీవా కాలువలో లైనింగ్ పనులను వ్యతిరేకిస్తున్నాం
-
సీఎం రమేష్ చెప్పినట్టు వినాలి
సాక్షి, అమరావతి: తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన ప్రభుత్వ పెద్ద.. తప్పు చేసిన వారికే పనులు అప్పగించాలని అధికారులపై తీవ్ర స్థాయిలోఒత్తిడి తెచ్చారు. ఈ వ్యవహారానికి తెలుగుగంగ ప్రధాన కాలువలో మిగిలిపోయిన లైనింగ్ పనుల టెండర్ వేదికైంది. వివరాల్లోకి వెళితే.. తెలుగుగంగ ప్రాజెక్టు పనుల అంచనా వ్యయాన్ని రూ. 4,460.64 కోట్లుగా ఖరారు చేస్తూ మార్చి 20, 2007న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టులో 2009 నాటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం 5 శాతం పనులు మాత్రమే మిగిలి ఉండగా అంచనా వ్యయాన్ని రూ. 6,671.62 కోట్లకు పెంచేస్తూ 2018 మార్చి 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయించింది. అడ్డగోలుగా పెంచేసిన అంచనా వ్యయంతో.. మిగిలిన పనులను బినామీ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడానికి సీఎం చంద్రబాబు ఆదిలోనే స్కెచ్ వేశారు. తెలుగుగంగ ప్రధాన కాలువ 0.00 కి.మీ నుంచి 18.20 కి.మీ వరకు లైనింగ్ చేయడం, 18.200 కి.మీ నుంచి 42.566 కిమీ వరకు గతంలో లైనింగ్ చేయకుండా మిగిలిపోయిన పనులు, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్) నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసే లింక్ ఛానల్ 0.00 కి.మీ నుంచి 7.380 కి.మీ వరకు లైనింగ్ చేయకుండా మిగిలిపోయిన పనులను చేపట్టాలని నిర్ణయించారు. 2007 నాటి ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల విలువ రూ.172.99 కోట్లు. కానీ.. మార్చి 9, 2018న జారీ చేసిన ఉత్తరులలో ఈ పనుల విలువను రూ. 180.48 కోట్లుగా ఖరారు చేశారు. ఆ పనుల వ్యయాన్ని మళ్లీ పెంచాలని ముఖ్యనేత ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. వాటికి తలొగ్గిన అధికారులు ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ. 280.27 కోట్లకు పెంచేస్తూ జూన్ 8, 2018న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులకు రూ. 239.03 కోట్లను అంతర్గత విలువగా నిర్ణయించిన అధికారులు.. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థకు ఆ పనులు దక్కేలా నిబంధనలతో జూలై 16న ఎల్ఎస్–ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నెలల్లో ఈ పనులకు పూర్తి గడువు విధించారు. జూలై 31న టెక్నికల్ బిడ్‌ను తెరిచారు. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థతో పాటు ష్యూ, హెచ్‌ఈఎస్ ఇన్‌ఫ్రాలు బిడ్లు దాఖలు చేశాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో.. పనులు చేసిన అనుభవం లేకున్నా ఉన్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను చూపి.. అధికార బలంతో పనులు దక్కించుకోవడంలో రిత్విక్‌ది అందెవేసిన చేయిగా జలవనరుల శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. తెలుగు గంగ లైనింగ్ పనుల టెండర్లో టెక్నికల్ బిడ్‌ను తెరిచిన సమయంలో రిత్విక్ సంస్థ తప్పుడు అర్హత పత్రాలు సమర్పించినట్లు ష్యూ సంస్థ ప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మీర్జాపూర్, అలహాబాద్ జిల్లాల పరిధిలో బన్సాగర్ కెనాల్ ప్రాజెక్టు పనులను రిత్విక్ సంస్థ సబ్ కాంట్రాక్టర్లతో చేయించిందని.. కానీ ఆ పనులు తానే చేసినట్లు తప్పుడు పత్రాలు సమర్పించిందని, ఈ నేపథ్యంలో ఆ సంస్థపై అనర్హత వేటు వేయాలని కోరారు. కానీ, ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఆగస్టు 6న ప్రైస్ బిడ్ తెరిచారు. 2.88% అధిక ధర (ఎక్సెస్)కు రిత్విక్ (ఎల్–1), 3.61% ఎక్సెస్‌కు ష్యూ (ఎల్–2), 4.31 శాతం ఎక్సెస్‌కు హెచ్‌ఈఎస్ (ఎల్–3) సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు వెల్లడైంది. ఎల్–1గా నిలిచిన రిత్విక్ సంస్థకు పనులు అప్పగించాలని సీవోటీకి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ అక్రమ వ్యవహారాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేసింది. టెండర్‌ను ఖరారు చేసి సీఎం రమేష్‌కు అప్పగించాలని నవంబర్ 30న సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఈ అంశాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. దాంతో సీవోటీ అధికారులు టెండర్‌ను రద్దు చేశారు. అయినా తీరు మారలేదు.. తెలుగుగంగ ప్రధాన కాలువలో మిగిలిపోయిన లైనింగ్ పనులకు రూ. 239.03 కోట్ల అంచనా వ్యయంతో జనవరి 14న రెండోసారి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. సీఎం రమేష్ సంస్థకే పనులు దక్కేలా నిబంధనలు పెట్టారు. ఇతర సంస్థలు టెండర్లో షెడ్యూళ్లు దాఖలు చేయకుండా ఇప్పటికే తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. ఈ క్రమంలో సీఎం రమేష్ చెప్పినట్టు విని.. పనులు ఆయనకు చెందిన సంస్థకే అప్పగించాలని జలవనరుల శాఖ అధికారులు, తెలుగుగంగ ప్రాజెక్టు అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈనెల 11లోగా షెడ్యూల్ దాఖలు చేసుకోవచ్చు. 12న టెక్నికల్ బిడ్.. 16న ఫైనాన్స్ బిడ్ ఖరారు చేసి సుమారు 4.85 శాతం అధిక ధర (ఎక్సెస్)కు సీఎం రమేష్ సంస్థ దాఖలు చేసిన షెడ్యూల్‌ను ఆమోదించి.. పనులు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారు. -
మేల్కొంటేనే సాగునీరు!
కాలువల లైనింగ్ పూర్తిచేయాలని తాండవ రైతుల వినతి నాతవరం : ఖరీఫ్ సీజన్లో తాండవ శివారు భూములకు సాగునీరు అందాలంటే అధికారులు తక్షణం మేల్కొని కాలువ లైనింగ్ పనులు పూర్తిచేయాలని పలువురు సూచిస్తున్నారు. లేకుంటే 10 వేల ఎకరాలకు సాగునీటి సమస్య తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో సుమారు 52 వేల ఎకరాలు తాండవ జలాశయం ఆధారంగా సాగవుతోంది. అయితే ఇటీవల కాలంలో తాండవ కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనివల్ల శివారు భూములకు సాగునీరు అందడం లేదు. ఈ నేపథ్యంలో తాండవ కాలువల అభివృద్ధికి 2007లో రూ.55 కోట్లు ప్రభుత్వం మంజూరుచేసింది. ఈ నిధులతో కాలువల సిమెంటు లైనింగ్ పనులు చేపట్టారు. సుమారు 80 శాతం మేర పూర్తయ్యాయి. గతేడాది సంభవించిన హుద్‌హుద్ తుపానుకు కొండగెడ్డల ఉధృతికి కుడి, ఎడమ కాలువకు సుమారు 178 చోట్ల లైనింగ్ దెబ్బతింది. వీటికి మరమ్మతులు చేపట్టకపోవడంతో కాలువలు అధ్వానంగా మారాయి. ఇండిగబెల్లి, కోటనందూరు మేజర్ కాలువల్లో... తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలంలోని ఇండిగబెల్లి, కోటనందూరు మేజర్ కాలువల సిమెంటు లైనింగ్ పనులు అప్పటిలో నిలిపివేశారు. సిమెంట్ లైనింగ్ మెరుగ్గా ఉన్నంత వరకు సాగునీరు సక్రమంగా అందేది. మిగతా ప్రాంతాలకు వెళ్లకపోవడంతో రైతులు శ్రమదానంతో నీటిని తరలించేవారు. గతేడాది జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నందున శివారుకు నీరు సక్రమంగా అందేది. ప్రస్తుతం నీటిమట్టం ఆశాజనకంగా లేదు. విడుదల చేసిన నీరు సక్రమంగా అందాలంటే లైనింగ్ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. తాండవ నీటి విడుదలకు మరో 20 రోజుల గడువు ఉన్నందున ఇప్పటికైనా లైనింగ్ పనులు చేపట్టాలని శివారు రైతులు కోరుతున్నారు. లేకుంటే ఈరెండు మేజర్ కాలువల పరిధిలోని 10 వేల ఎకరాలకు సాగునీటి కష్టాలు తప్పవని వారు ఆందోళన చెందుతున్నారు. దీనిపై తాండవ డీఈ శ్రీనివాస్ మాట్లాడుతూ కాలువలో పూడిక తొలగిస్తామన్నారు. శివారు భూములకు నీరందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
ఆధునికీకరణ పనుల్లో దగా!
లైనింగ్ పనులు పోయి రిటైనింగ్ వాల్ నిర్మాణాలు అధికారులతో కాంట్రాక్టర్ లాలూచీ రైతులకు ఉపయోగపడని పనులు చల్లపల్లి : కాంట్రాక్టర్లతో అధికారులు లాలూచిపడి ఇష్టారాజ్యంగా ఆధునికీకరణ పనులను మార్చేస్తున్నారు. రైతులకు ఉపయోగపడాల్సిన ఈ పనులు కాంట్రాక్టర్ల జేబులు నింపేవిగా మారాయి. సాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు ఆధునికీకరణ పనుల్లో భాగంగా ప్రధాన పంటకాలువలకు లైనింగ్ పనులు చేయాల్సి ఉండగా వాటిని మార్చి రైతులకు ఏవిధంగా ఉపయోగపడని రిటైనింగ్‌వాల్ నిర్మాణ పనులు చేపట్టడంపట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైనింగ్‌పోయి రిటైనింగ్ వచ్చే! రూ.2,180కోట్ల నిధులతో కృష్ణాజిల్లాలో డెల్టాను ఆధునికీకరించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 జూన్ 6న మోపిదేవి వార్పు వద్ద ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. మట్టిపని, లైనింగ్ చేయడం, వంతెనల నిర్మాణం, ఓటీలు, రెగ్యులేటర్లు, క్యాటిల్ ర్యాంపులు, మేజరు, మీడియం డ్రెయిన్ల పూర్తిస్థాయి ఆధునికీకరణ వంటి 25ప్యాకేజీల ద్వారా పనులు చేపట్టాల్సి ఉంది. శంకుస్థాపన నాటి నుంచి 51నెలల్లో పనులు పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఈ పనులు నత్తనడకన సాగాయి. పంటకాలువలకు లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. నాలుగు అంగుళాలలోపు మాత్రమే లైనింగ్ పనులకు ప్రభుత్వం అనుమతివ్వడంతో ఈ ప్రాంతంలో ఉన్న నల్లరేగడి నేలలో ఈ పనులు చేపడితే పగిలిపోతాయన్న ఉద్దేశంతో వీటిని రిటైనింగ్‌వాల్‌కు మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. లైనింగ్ పనులు చేపడితే సాగునీరు వృథాకాకుండా పంటపొలాలకు సక్రమంగా నీరందుతుంది. కోడూరు మండలం దింటిమెరక నుంచి ఊటగుండం వరకు, మచిలీపట్నం మండలంలోని 9/7వ నంబరు కాలువలో పెదయాదర నుంచి పల్లెతుమ్మలపాలెం వరకు లైనింగ్ పనులు చేయాల్సి ఉండగా వాటిని మార్చి రిటైనింగ్‌వాల్ నిర్మాణ పనులు చేపట్టడంపట్ల ఈ ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైనింగ్ పనులు చేయాల్సిన రూ.40కోట్ల నిధులతో ప్రస్తుతం అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ నుంచి అవనిగడ్డ వరకు, అవనిగడ్డ నుంచి కొత్తపేట వరకు, బందలాయిచెర్వు నుంచి గుడివాకవారిపాలెం వరకు రిటైనింగ్‌వాల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. వీటి వల్ల తమకు ఎలాంటి ఉపయోగం ఉండదని రైతులంటున్నారు. రైతుల ప్రయోజనం కోసం రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం నేడు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు ఉపయోగపడుతుందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. కోడూరు మండలం దింటిమెరక నుంచి ఊటగుండం వరకు 14, 14బీ కాలువకు 8కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉండగా రెండేళ్ల క్రితం దింటిమెరక మొదట్లో రెండు కిలోమీటర్లు లైనింగ్ పనులుచేసి తర్వాత రెండు కిలోమీటర్లు వదిలేశారు. దీని తర్వాత రామకృష్ణాపురంలో 14వ నెంబరు బీ కాలువలో మొదట్లో రెండు కిలోమీటర్లు లైనింగ్ పనులుచేసి తర్వాత రెండు కిలోమీటర్లు వదిలేశారు. ఇలా పూర్తిస్థాయిలో లైనింగ్ పనులు చేయకపోవడం వల్ల ఈ ప్రాంత పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో గతంలో రైతులు పలుసార్లు ఆందోళన చేశారు. గతంలో ఈ ప్రాంత రైతులు ఆందోళన చేసినప్పుడు అప్పటి కలెక్టర్ పీయూష్‌కుమార్ త్వరితగతిన లైనింగ్ పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ రెండేళ్ల నుంచి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. మేటవేసిన పంట కాలువలు ... ఆధునికీకరణలో భాగంగా తొలుత లైనింగ్ పనులు చేస్తామని చెప్పి తర్వాత వీటిని రిటైనింగ్‌వాల్‌గా మార్చటం వల్ల రైతులకు భవిష్యత్తులో సాగునీటి ఇబ్బందులు తప్పెటట్లు లేవు. పంటకాలువలు మట్టి మేటవేసి పూడుకుపోయాయి. ఈ విషయమై ఇరిగేషన్ డీఈ భానుబాబును వివరణ కోరగా నాలుగు అంగుళాలోపు మాత్రమే లైనింగ్ పనులకు అనుమతులివ్వడం వల్ల నల్లమట్టికి ఇవి అనుకూలంగా లేకపోవడంతో ఈ నిధులను రిటైనింగ్‌వాల్‌కు మార్చినట్లు చెప్పారు. దింటిమెరక, రామకృష్ణాపురంలో మిగిలిపోయిన లైనింగ్ పనులు ఈ ఏడాది చేపట్టలేమని తెలిపారు. -
ఎలా సాగుదాం?
పూడుకుపూయిన కాలువలు చివరి భూములకు అందని నీరు రైవాడ, పెద్దేరు కాలువకుపూర్తికాని లైనింగ్ పనులు ఆందోళన చెందుతున్న రైతులు ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. ఏడాదిలో మొదటి పంట, అదీ పెద్ద పంట వేసేందుకు రైతులంతా సిద్ధమవుతున్నారు. వరి, చెరకుతోపాటు అపరాలు, వేరుశనగ, ఇతర వాణిజ్య పంటలు సైతం వేసేందుకు ఇదే అదును. సాగునీటికి ఇటు రిజర్వాయర్లు, అటు కొండగెడ్డలు, నదులతో అనుసంధానంగా వందలాది పంటకాలువలు ఎన్నో ఉన్నాయి...అయితే వీటిలో సగానికి పైగా కాలువలు పూడుకుపోయాయి...మరికొన్ని ఆక్రణమలకు గురయ్యాయి... స్లూయీస్‌లు, ఇతర గేట్లు మరమ్మతులకు నోచుకోలేదు. కాల్వల లైనింగ్ పనులు అసంపూర్తిగానే ఉండిపోయాయి...ఇక పొలాలకు నీరందేదెలా?...నిధులున్నా ఏటా పనుల సా...గతీత కారణంగా వేలాది ఎకరాలకు నీరందడం లేదు... చోడవరం,న్యూస్‌లైన్: ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. జిల్లాలో వరి, చెరకుతోపాటు అపరాలు, వేరుశనగ, ఇతర వాణిజ్య పంటలు సైతం వేసేందుకు ఇదే అదును. అయితే నీటి వనరులు అంతంతమాత్రమే ఉన్న ఈ ప్రాంతంలో వ్యవసాయానికి పంటకాలువలే కీలకం. ఇటు రిజర్వాయర్లు, అటు కొండగెడ్డలు, నదులతో అనుసంధానంగా వందలాది పంటకాలువలు ఉన్నాయి. అయితే వీటిలో సగానికి పైగా కాలువలు పూడుకుపోయి, ఆక్రణమలకు గురై ఉండగా, కొన్ని చెరువులు పూడికలు తీసినా స్లూయీస్‌లు, ఇతర గేట్లు మరమ్మతులకు నోచుకోలేదు. పెద్దేరు రిజర్వాయరు సంబంధించి కుడికాలువ పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. మా డుగుల నుంచి బుచ్చెయ్యపేట ఎర్రవా యు ప్రాంతానికి వచ్చే కుడికాలువకు సుమారె 15 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు జరగలేదు. దీనివల్ల దిగువన ఉన్న సుమారు ఐదువేల ఎకరాలకు సాగునీటి సమస్యగా ఉంది. రైవాడ జలాశయం కుడికాలువ లక్కవరం ఛానల్ కాలువ పనులు ఐదేళ్లుగా వివిధ కారణాల వల్ల ఆదునీకరణకు నోచుకోలేదు. దీంతో ఈ కాలువ కింద ఆరువేల ఎకరాలకు సాగునీరందలేదు. నిధులిచ్చినా ఖర్చు చేయని వైనం : గతంలో మంజూరైన నిధులు సకాలంలో ఖర్చుచేయకపోవడంతో అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు పెట్టినా అవి మంజూరు కాలేదు. గత నాలుగేళ్లలో శారద, బొడ్డేరు పెద్దేరు, తాచేరు నదులతోపాటు పలు కొండగెడ్డలు గట్లు దెబ్బతిన్నాయి. వీటినుంచి పంట భూములకు వెళ్లే పిల్లకాలువలు సుమారు వందకు పైగా కోతకు గురికాగా మరికొన్ని చోట్ల స్లూయీస్‌లు, దెబ్బతిన్నాయి. 1500ఎకరాలకు సాగునీరందిస్తున్న లక్ష్మీపురం పెద్ద చెరువుకు సరైన కాలువలు లేక నీరు వృథాగా పోతోంది. గొర్రెగెడ్డ, పాలగెడ్డ, తారకరామ మినీ రిజర్వాయర్లకు సాగునీటి కాలువలు పూర్తిచేయకపోవడంతో ఆ రిజర్వాయర్ల నీరు సాగుకు పూర్తిస్థాయిలో ఉపయోగపడటంలేదు. మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాం: డీఈఈ మాధవి చోడవరం సబ్‌డివిజన్ పరిదిలో అవసరమైన సాగునీటి కాలువల మరమ్మతుల కోసం గత ఏడేది ప్రతిపాదనలు పంపాం.ఇంకా నిధులు రాలేదు. గత తుఫాన్లకు దెబ్బతిన్న గట్లు పునర్నిర్మించి కాలువల్లో పూడిక తీతక నిధులు మంజూరయ్యాయి. టెండర్లు ఖరారుచేసి పనులు ప్రారంభిస్తాం. మైనర్ ఇరిగేషన్లో కాలువల పూడిక తీతకు, స్లూయీస్, సర్ప్లస్ గేట్లు నిర్మాణాలకు కూడా ప్రతిపాదనలు పంపాం. ఏటా ఇదే సమస్య రైవాడ కుడికాలువ నుంచి లక్కవరం ఛానల్ వచ్చే కాలువ ఆధునీకరణ పనులు జరగకపోవడంతో ఏటా ఖరీఫ్‌లో సాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది. పక్కనుంచే కాలువ వెళుతున్నా చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. పోరాటం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఖరీఫ్‌కు కూడా సాగునీటి కష్టాలు తప్పేలా లేదు. నిధులు మంజూరైనందున పను లు వెంటనే ప్రారంభించి ఖరీఫ్ మధ్యలోనైనా నీరందించాలి. - కర్రి ముత్యాలనాయుడు, లక్కవరం


