breaking news
KP oli
-
నేపాల్‌లో ఎన్నికల సందడి.. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
నేపాల్ రాజకీయాలలో ఒక కొత్త శకానికి నాంది పలికేందుకు రంగం సిద్దమైంది. ఆ దేశ సార్వత్రిక ఎన్నికలు మార్చి 5న జరగనున్నాయి. అయితే ఈ సాధారణ ఎన్నికల కోసం మంగళవారం(జనవరి 20)తో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.ప్రత్యక్ష ఎన్నికల విధానం (FPTP) కింద ఉన్న 165 సీట్ల కోసం 3,500 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇందులో సుమారు 400 మంది మహిళా అభ్యర్థులు ఉండడం గమనార్హం. కాగా నేపాల్ ప్రతినిధుల సభలో మొత్తం 275 సీట్లు ఉంటాయి. ఇందులో 165 సీట్లకు ప్రత్యక్షంగా, మిగిలిన 110 సీట్లకు దామాషా పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. గగన్ థాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్, రబీ లామిచానే నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశముంది. గత సెప్టెంబర్‌లో జెన్ జెడ్ యువత నిరసనల తర్వాత నేపాల్ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నేపాలీ కాంగ్రెస్ వంటి పార్టీలు ఈసారి పెద్ద సంఖ్యలో కొత్తవారికి అవకాశమిచ్చాయి. నేపాలీ కాంగ్రెస్ తన 165 స్థానాల్లో 106 స్థానాలను కొత్తవారికే కేటాయించింది. మాజీ ప్రధానులు కె.పి. శర్మ ఓలీ, పుష్ప కమల్ దహల్ 'ప్రచండ', మాధవ్ కుమార్ వంటి వారు పోటీలో ఉన్నారు. ముఖ్యంగా ఈసారి ఖట్మండు మాజీ మేయర్ బాలేంద్ర షాపై అందరి కళ్లు ఉన్నాయి.కె.పి. శర్మ ఓలీకి వ్యతిరేకంగా ఝాపా-5 నియోజకవర్గం నుండి బాలేంద్ర షా పోటీచేయనున్నాడు. నేపాల్‌లో అతడికి మంచి ఫాలోయింగ్ ఉంది. అందరూ అతడిని ముద్దుగా 'బాలెన్ షా' పిలుచుకుంటారు. 2022లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలెన్ షా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఖట్మండు మహానగరానికి మేయర్‌గా ఎన్నికై సంచలనం సృష్టించాడు. ఇప్పుడు తన పదవికి రాజీనామా చేసి పార్లమెంట్ ఎన్నికలలో బరిలోకి దిగాడు. కాగా ఈ ఎన్నికలలో సుమారు 1.9 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
సంక్షోభంలో నేపాల్ పార్టీలు
జెన్–జీ అనూహ్యమైన తిరుగుబాటు ఉధృతితో నేపాల్ రాజకీయ పార్టీలు అన్నీ సంక్షోభంలో చిక్కుకున్నాయంటే అతిశ యోక్తి కాదు. పార్టీల నాయకత్వం, సిద్ధాంతాలు, జెన్–జీ రేకెత్తించిన ప్రశ్నలు, వారంటే ఇంకా కొనసాగుతున్న భయం – ఇట్లా అనేక విషయాలు ఒక్కుమ్మడిగా తుఫాను వలె కమ్ముకు రావటంతో పార్టీ అగ్రస్థాయి నాయకత్వాలు, ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి సాధారణ కార్యకర్తల వరకు ఏమి చేయాలనే స్పష్టత లేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జెన్–జీ ఆందోళన సెప్టెంబర్ ఆరంభంలో జరిగి, మార్చిలో పార్లమెంటు ఎన్నికలకు మరో మూడు నెలలే మిగిలి ఉండగా ఇదీ పరిస్థితి.ఒక్కో పార్టీ... ఒక్కో సమస్యఅన్నింటికన్న పెద్దది అయిన నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా తొలగిపోవాలంటూ జాతీయ కౌన్సిల్ సభ్యు లలో 54 శాతం మంది నోటీసు ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి గగన్ థాపా అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తూ, దేవుబా తప్పుకోనట్లయితే పార్టీని చీల్చగలమని హెచ్చరించారు. రెండవ పెద్దది అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ ఎంఎల్) అధ్యక్షుడు, ఉద్యమ కారణంగా పదవీభ్రష్టుడైన ప్రధానమంత్రి కె.పి. ఓలీ రాజీ నామా చేయాలని పట్టుబడుతున్న అసమ్మతి వర్గం, పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి తీరాలని ఒత్తిడి చేసి ఒప్పించింది. మూడవ పెద్దది అయిన మావోయిస్ట్ సెంటర్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్ ఉరఫ్ ప్రచండ, తనంతట తానే రాజీనామా చేసి, పార్టీని సైతం రద్దుపరచి, కొన్ని ఇతర వామ పక్షాలతో ఐక్యమై, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్‌ను ప్రారంభించారు. దానికి ఆయన సమన్వయకర్త మాత్రమే! ఆ తర్వాతది అయిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) అధ్య క్షుడు, ప్రచండ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉండిన రాబీ లమీ ఛానే, ఒక కుంభకోణం కేసులో కోర్టు ఆదేశాలపై అరెస్టయి ఇటీవలే జైలుకు వెళ్లారు. తన పార్టీ స్తబ్ధతలో ఉంది. ప్రచండ తర్వాతి స్థానంలో ఉండి ప్రధానిగా కూడా పనిచేసి, తర్వాత నయాశక్తి పార్టీ ప్రారంభించిన జెఎన్యూ (ఢిల్లీ) పూర్వ విద్యార్థి, రాచరికం పతనం తర్వాత ప్రజాస్వామిక రాజ్యాంగ రచనకు ఆధ్వర్యం వహించిన డా‘‘ బాబూరాం భట్టరాయ్, తమ పార్టీని రద్దు చేసి, మరికొందరితో కలిసి ప్రగతిశీల్ లోక్ తాంత్రిక్ పార్టీని నెలకొల్పారు. దానికి ఆయన ‘పార్టీ పేట్రన్’ మాత్రమే! రాచరికం తిరిగి రావాలి, లేదా కానిస్టిట్యూషనల్ మోనార్కీ కావాలనే హిందూవాద రాష్ట్రీయ ప్రజా తంత్ర పార్టీ (ఆర్పీపీ)లో నాయకత్వ సమస్యలైతే తలెత్తలేదుగానీ, జెన్–జీ ఉద్యమ కారణంగా తెలిసీ తెలియని సవాళ్లు ఏవి ఎదురు కాగలవోనన్న అయోమయం వారిని ఆవరించింది.జెన్–జీ నేర్పిన పాఠాలేమిటి?ఇదంతా నాయకత్వాలు, పార్టీ నిర్మాణాల పరిస్థితి కాగా, ఎన్నికల సమయానికి మరిన్ని పార్టీలు, లేదా ఇప్పటికే గల పార్టీలలో మరిన్ని చీలికలు, పునరేకీకరణలు, ఐక్య సంఘటనల ఆవిర్భావం జరిగినా ఆశ్చర్యపడనక్కర లేదు. వాస్తవానికి ఎన్నికలలో పోటీ చేయదలచుకునే పార్టీల రిజిస్ట్రేషన్ తొలి గడువు ముగిసినప్పటికీ, ఎన్నికల కమిషన్ ఆ గడువును పొడిగిస్తున్నది. ఇందుకు సంబంధించి ముఖ్యమైన విషయం, జెన్–జీ గ్రూపులు కొన్నికొన్ని కలిసి ఇప్పటికే మూడు పార్టీలను ప్రారంభించాయి. మరి రెండింటి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. జెన్–జీలంతా కలిసి ఒకే పార్టీగా ఏర్పడక పోవటం పట్ల ప్రజలలో తగినంత నిరాశ కనిపిస్తున్నది.ఆందోళన నేపథ్యాన్ని బట్టి చూసినప్పుడు అన్నింటికన్న ముఖ్య మైన విషయాలు కొన్నున్నాయి. యువతరం ఆగ్రహం, ఆందోళన రాజకీయ పార్టీలకు ఇచ్చిన షాక్ ఎంత తీవ్రమైనది? దానినిబట్టి వారు తమ సిద్ధాంతాలు, విధానాలు, వ్యక్తిగత వ్యవహరణలలోని లోపాలను చిత్తశుద్ధితో గుర్తించి సమీక్షించుకున్నారా? లేక కొంత కాలానికి అంతా సమసిపోయి పాత పద్ధతులలో వ్యవహారాలు సాగించవచ్చుననుకుంటున్నారా? ఇటువంటి ప్రశ్నలు తటస్థులైన పరిశీలకులకు తోచటం అట్లుంచి, నేపాల్ సామాజికుల నుంచి కూడా విన్న నేను, వివిధ పార్టీల నాయకులను కలిసినపుడు, ప్రశ్నలు వేసి వారి ఆలోచనలను గ్రహించేందుకు ప్రయత్నించాను.వారి సమాధానాలను బట్టి, మిశ్రమాభిప్రాయాలు కలిగాయి. వాస్తవానికి యువతరం లేవనెత్తిన విషయాల తీవ్రత, రెండు రోజుల పాటు అగ్నిపర్వతం వలె బద్దలైన నిరసనల తీవ్రతలను బట్టి పార్టీ లలో మిశ్రమాభిప్రాయాలకు ఆస్కారం ఉండకూడదు. కానీ, కనిపించిందేమిటి? కొందరు నిజంగానే తమ వైఫల్యాలను గుర్తించారు. మావోయిస్టుల సాయుధ ఉద్యమం ఫలితంగా రాచరిక వ్యవస్థ 2008లో రద్దయి, పూర్తి స్థాయిలో ఆధునిక పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థ, కొత్త రాజ్యాంగం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి గత 17 సంవత్సరాలుగా పరిపాలనలు సవ్యంగా సాగి ఉంటే, ఈ రోజున జెన్–జీకి గానీ, ప్రజలకు గానీ ఇంతటి అసంతృప్తికి అవ కాశం ఉండేది కాదని ఈ వర్గం అరమరికలు లేకుండా అంగీకరించింది. అవినీతి పోవటం, సమర్థమైన పారదర్శక పాలన, సామాజిక న్యాయంతో కూడిన వేగవంతమైన అభివృద్ధి అనే మూడు తప్పని సరి అనీ, అది జరగాలన్నదే జెన్–జీ తమకు నేర్పిన పాఠమనీ ఈ వర్గం అభిప్రాయపడుతున్నది. వేర్వేరు పార్టీలకు చెందిన వేర్వేరు నాయకుల మాటలు వేరైనా, వారి నుంచి సారాంశం ఇదే!అదే మొండి ధోరణిఇందుకు భిన్నమైన పరిస్థితి కూడా మరొకవైపు గమనించాను. వారు, 2008 నుంచి అభివృద్ధి తగినంత చేశామని లెక్కలు చెప్తు న్నారు. ఆ లెక్కలు నిజమే అయినా సమస్య ఏమంటే, 2008 తర్వాత ప్రజల ఆకాంక్షలకు, చదువులూ, నైపుణ్యాలూ గణనీయంగా పెరుగు తున్న యువతరం అవసరాలకు, నిజాయితీగా పరిపాలిస్తే సాధించ గలిగిన వాటికి పొంతన కుదరటం లేదు. ఇది చాలదన్నట్లు మావోయిస్టులు, ఇతర కమ్యూనిస్టులు సహా అన్ని పార్టీల విచ్చలవిడి అవి నీతి! ఈ రెండవ వర్గం ప్రచారం, జెన్–జీ ఆందోళన వెనుక విదేశీ ఎన్జీఓలు ఉన్నాయని! తమకు గల పార్టీ యంత్రాంగం, డబ్బు బలంతో తిరిగి అధికారానికి రాగలమన్నది వీరి నమ్మకం. ఆందోళ నల వల్ల అధికారం కోల్పోయిన మాజీ ప్రధాని ఓలీ ఈ ధోరణికి ప్రతినిధి కావటం విశేషం. ఆయన నేర రికార్డు గల వ్యక్తి ఆధ్వర్యాన ప్రైవేట్ సైన్యం ఒకటి తయారు చేసి పెట్టుకున్నారు. ప్రజల వైపు నుంచి చూసినపుడు, ఇటీవల జరిగిన ఒక ఒపీనియన్ పోల్‌లో ఏ ఒక్క నాయకునికీ 10 శాతానికి మించిన ఓట్లు రాలేదు. మార్చి ఎన్నికలలో ఏమయేదీ ఎవరికీ అర్థం కాకుండా ఉంది. 2008 నుంచి 17 సంవత్సరాలలో 14 ప్రభుత్వాలు మారిన తీవ్ర అస్థిరతల రికార్డు ఇప్పటికే ఉండగా, రాగల కాలంలో ఏమి జరగవచ్చునో ఊహించటం కూడా కష్టమే.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నేపాల్‌లో భయానకం.. మంత్రులు, కుటుంబాలే టార్గెట్
ఖాట్మాండు: నేపాల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాల్‌లో ‘జన్ జి’ పేరుతో యువతరం చేపట్టిన ఆందోళనలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. యువత ఆందోళనలు చివరకు హింసకు దారితీశాయి. సహనం కోల్పోయిన నిరసనకారులు, పాలకులను తరిమి తరిమికొట్టారు. ఈ క్రమంలో నేపాల్‌కు చెందిన ఓ మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు.. తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని హెలికాప్టర్లో తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. నేపాల్‌లో సోషల్ మీడియాపై బ్యాన్ అనంతరం దారుణ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. నేపాల్ రాజధాని ఖాట్మాండులో నిరసనకారులు రెచ్చిపోయారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన యువత.. మంత్రులు, ప్రభుత్వ అధికారుల ఇళ్లను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా నేపాల్ పార్లమెంట్ భవనానికి నిప్పంటించారు. డిప్యూటీ పీఎం ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్ నివాసంపై రాళ్లు రువ్వారు. నేపాల్ ఆర్థిక మంత్రిని వీధిలో నిరసనకారులు వెంబడిస్తుంటే.. ఎదురుగా వచ్చిన ఓ యువకుడు ఆయనను ఎగిరి తన్నుతున్న దృశ్యాలు, విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్బా, ఆమె భర్త, మాజీ ప్రధాని, నేపాలి కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్బాలను ఇంట్లోనే దాడి చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.Parliment in Nepal. Better than voting. pic.twitter.com/NtFehqsycr— ADAM (@AdameMedia) September 10, 2025మరోవైపు..మాజీ ప్రధాని దేవ్బా ముఖానికి రక్తమోడుతూ నిస్సహాయంగా కూర్చున్న దృశ్యం కనిపించింది. తరువాత అధికారులు అక్కడకు చేరుకొని ఆయనను రక్షించారు. ఖాట్మాండు హోటల్‌పై ఎగురుతున్న హెలికాప్టర్లో అధికారులను తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సైన్యానికి చెందిన హెలికాప్టర్లు కొంతమంది మంత్రులు, వారి కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలించగలిగాయి. పలువురు మంత్రులు హెలికాప్టర్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.Politicians escaping the wrath of the people in Nepal pic.twitter.com/tia5JjkqmL— jim Njue (@jimNjue_) September 10, 2025ఇదిలా ఉండగా.. నేపాల్‌లో ఆందోళనలు, అల్లర్లు జైళ్లకు సైతం వ్యాపించాయి. జైళ్లలో నిప్పుపెట్టి, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి దేశవ్యాప్తంగా ఆయా జైళ్ల నుంచి దాదాపు 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. హోం మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ బజార్ జైలు నుంచి 1,100 మంది, చిత్వన్-700, నక్కు-1,200, సున్సారి జిల్లా జుంప్కా జైలు-1,575.. కంచన్‌పూర్-450, కైలాలి-612, జలేశ్వర్-576, కాస్కి-773, డాంగ్-124, జుమ్లా-36, సొలుఖుంబు-86, గౌర్-260, బజ్హాంగ్ జైలు నుంచి 65 తప్పించుకున్నారు. మరోవైపు.. నేపాల్‌లో కల్లోల పరిస్థితులను చక్కదిద్దడానికి సైన్యం రంగంలోకి దిగింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సైన్యం ఆదేశించింది. అల్లర్లతో అస్తవ్యస్తమైన నగరంలో శాంతి నెలకొల్పేందుకు సైన్యం కృషి చేస్తోంది.🚨 BREAKING: In response to growing unrest in Nepal, the Nepalese Army deployed a Hindustan ALH Dhruv NA-054 helicopter to transport members of parliament to a safer location. The move comes amid rising tensions and concerns over security. 🇳🇵 #NepalUpdate pic.twitter.com/TuKEoKupn2— Fahad Naim (@Fahadnaimb) September 9, 2025 -
నేపాల్ ప్రధాని కేపీ ఓలి కుటుంబ సభ్యులపై రాళ్లదాడి.. హోం మంత్రి రాజీనామా
కాఠ్మాండూ: నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై విధించిన బ్యాన్‌ను ఎత్తివేయాలంటూ అక్కడి యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళన కారుల్ని నిలువరించేందుకు పోలీసులు, ఆర్మీ బలగాలు చేసిన ప్రయత్నాల కారణంగా సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు.అయినప్పటికీ నేపాల్ రాజధాని కాఠ్మాండూలో జెడ్ జనరేషన్ మొదలు పెట్టిన ఉద్యమం తారాస్థాయికి చేరింది. ఆందోళన కారులు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి పూర్వీకుల ఇంటిపై రాళ్లు విసిరారు. రాజధాని కాఠ్‌మాండూతో పాటు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాని ఓలి స్వస్థలమైన దమక్ వరకు ఈ ఉద్యమం విస్తరించింది. కోశీ ప్రావిన్స్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.నేపాల్‌లో రోజురోజుకీ పెరిగిపోతున్న అవినీతిని అంతమొందించేందుకు యువత సోషల్ మీడియాను విపరీతంగా వినియోగిస్తోంది. ఎక్కడ అవినీతి జరిగినా క్షణాల్లో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో యువతకు భయపడిన నేపాల్ ప్రభుత్వం గత గురువారం(సెప్టెంబరు 4) మెటా,యూట్యూబ్,ఎక్స్.కామ్ ఇలా మొత్తం 26 సోషల్ మీడియా ఛానెల్స్‌ను బ్యాన్ చేసింది. దీంతో నేపాల్ యువత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెదవి విరిచింది. ఆ దేశ సుప్రీంకోర్టు సైతం సోషల్ మీడియాపై ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఆ ఆదేశాల్ని నేపాల్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.ఈ నేపథ్యంలో గత గురువారం నుంచి, యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. జెనరేషన్జెడ్ యువత రాజధాని కాఠ్మాండూ నగర వీధుల్లో ఉద్యమాన్ని సోమవారం ముమ్మరం చేసింది. దేశంలో పెరిగిపోతున్న అవినీతి పారద్రోలడం,సోషల్ మీడియా బ్యాన్ ఎత్తివేయడంతో పాటు ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేపాల్ హోం మంత్రి రాజీనామానేపాల్ హోం మంత్రి రమేశ్ లేఖక్ రాజీనామా చేశారు. అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకొన్నారు. తన రాజీనామా లేఖను ప్రధాని కేపీ ఓలికి అందజేశారు. -
నేపాల్ పార్లమెంట్ రద్దు..
ఖాట్మాండు:నేపాల్ పార్లమెంట్‌ను ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి రద్దు చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికల తేదీలను ప్రకటించారు. నవంబర్ 12, 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి ముందు శుక్రవారం సాయంత్రంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలికి, ప్రతిపక్షాలకు ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి గడువు ఇచ్చారు. ఇరు పక్షాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు విద్యాదేవి భండారి శనివారం ప్రకటించారు. దీంతో మొదటి దశ ఎన్నికలు నవంబర్ 12న, రెండో దశ ఎన్నికలు 19 జరగనున్నాయి. తనకు 153 మంది సభ్యలు మద్దతు ఉందంటూ ప్రధాని మంత్రి కేపీ శర్మ ఓలి ప్రకటించారు.తనకు 121 మంది సభ్యులతో పాటు, జేఎస్‌పీఎన్‌కు చెందిన మరో 32 మంది సభ్యుల మద్దతు ఉందని పేర్కొన్నారు. బలాన్ని సభలో రుజువు చేసుకోలేకపోవడంతో ఈ సంక్షోభం ప్రారంభమైంది.అయితే కేపీ శర్మ ఓలి బలాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడంతో ప్రతిపక్షాలను ప్రభుత్వం ఏర్పా టు చేయాల్సిందిగా అధ్యక్షురాలు పిలుపునిచ్చారు.అయితే ప్రతిపక్షాలు సంకీర్ణ కూటమి ఏర్పాటు చేయడంలో విఫలం చెందాయి . నేపాల్ పార్లమెంట్లో 275 సీట్లు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 136 మంది మద్దతు అవసరం. -
నేపాల్ ప్రధాని ఓలి బహిష్కరణ
కఠ్మాండూ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలిని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరిస్తూ మాజీ ప్రధాని ప్రచండ(పుష్ప కమల్ దహల్) నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం ఆదివారం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో, పార్టీలో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరింది. ఓలిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పార్టీ సీనియర్ నేత గణేశ్ షా వెల్లడించారు. ఓలిని పార్టీ సహ అధ్యక్ష పదవి నుంచి కూడా డిసెంబర్ నెలలో తొలగిం చిన విషయం తెలిసిందే. ప్రచండతో పాటు, ఆయనకు సన్నిహితుడైన మాధవ్ నేపాల్‌ను ఆ స్థానంలో నియమించారు. ప్రచండ వర్గం ఆధిపత్యం ఉన్న స్టాండింగ్ కమిటీ జనవరి 15న పార్టీ వ్యతిరేక కార్యకలాపాల విషయంపై ఓలిని వివరణ కోరింది. ఆయన నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో తాజా నిర్ణయం తీసుకున్నామని గణేశ్ షా తెలిపారు. -
చిక్కుల్లో ఓలీ.. ప్రధాని పదవికి ఎసరు!
కఠ్మాండు: నేపాల్ ప్రధాని ఖడ్గ ప్రసాద్ ఓలీకి అన్ని దారులూ మూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఆయన పనితీరును సమీక్షించడానికి శనివారం మధ్యాహ్నం నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్సీపీ) తొమ్మిది మంది సభ్యుల కార్యవర్గం సమావేశం కానుంది. (హెచ్1బీ వీసా: వారికి భారీ ఊరట) శుక్రవారం జరిగిన ఎన్సీపీ మీటింగ్‌లో ఓలీ కూడా పాల్గొన్నారు. తన వ్యాఖ్యలను, చర్యలను మీటింగ్‌లో సమర్ధించుకున్న ఆయన కార్యవర్గానికి తనపై కరుణ కలిగేలా ప్రవర్తించినట్లు సమాచారం. దీనివల్ల మరికొంత కాలం ప్రధానిగా కొనసాగొచ్చని ఆయన భావించారు. (ట్రంప్ సర్కార్‌పై ఫేస్బుక్ సీఈఓ ఆరోపణలు) శనివారం జరగనున్న సమావేశంలో ఆయనపై వేటు పడకపోయినా, ఆదివారం జరగనున్న స్టాండింగ్ కమిటీ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. చైనాతో సంబంధాల కోసం ఇండియాతో ఉన్న అనుబంధాన్ని బద్దలు కొట్టిన ఓలీని పార్టీ అధ్యక్ష పదవికి పరిమితం చేయాలని, లేకపోతే దానికీ అవకాశం ఇవ్వకూడదని స్టాండింగ్ కమిటీ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎన్సీపీ కార్గవర్గం, స్టాండింగ్, సెంట్రల్ కమిటీల్లో ఓలీ మద్దతుదారుల సంఖ్య తక్కువగా ఉంది. -
నేపాల్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం
-
నేపాల్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం
అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి ముందే ప్రధాని పదవికి కేపీ ఓలి రాజీనామా.. కొత్త ప్రధానిగా ప్రచండ! కఠ్మాండు : నేపాల్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం నెలకొంది. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి ముందే ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రి కేపీ ఓలి(64) తన పదవికి రాజీనామా చేశారు. ఓలి గత ఏడాది అక్టోబర్‌లో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. గత పదేళ్లలో ఓలి ప్రభుత్వం ఎనిమిదోది. సంకీర్ణ ప్రభుత్వానికి మావోయిస్టులు మద్దతు ఉపసంహరించడంతో ఓలి అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కూటమిలోని మధేసి పీపుల్స్ రైట్స్ ఫోరమ్, డెమోక్రటిక్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలు ఓలి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ నేపాలీ కాంగ్రెస్(ఎన్సీ), మావోయిస్ట్ సెంటర్(సీపీఎన్) ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతివ్వడంతో ఓలి ప్రభుత్వం మైనారిటీలో పడింది. దీంతో ఓలి తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం పార్లమెంటులో ఓలి ప్రసంగిస్తూ ‘‘పార్లమెంట్ కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు అవకాశం ఇవ్వాలనుకున్నాను. రాజీనామాను అధ్యక్షుడికి అందజేశాన’ని తెలిపారు. దేశాన్ని ప్రయోగశాలగా మార్చేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయని ఆరోపించారు. కొత్త రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే తన ప్రభుత్వాన్ని కూలదోశారని, దీనికి దేశం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. గత ఏడాది సంభవించిన భూకంపం.. ఇతర ఇబ్బందుల నుంచి దేశం కుదుటపడుతున్న సమయంలో పదవి నుంచి వైదొలగాల్సి రావడం బాధ కలిగిస్తోందని చెప్పారు. మంచి పనులు చేస్తున్నందునేఈ విధంగా శిక్షించారని ఆరోపించారు. తాను బాధ్యతలు స్వీకరించే సమయానికి భారత్‌తో నేపాల్ సంబంధాలు బలహీనంగా ఉన్నాయని, వాటిని పునరుద్ధరించి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేశానని చెప్పారు. తన చర్యల కారణంగా ఏదో ఒక దేశంపై నేపాల్ ఆర్థికంగా ఆధారపడకుండా పరిస్థితులు మారాయని, దేశం, ప్రజల శ్రేయస్సు కోసమే పొరుగుదేశాలతో సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేశానని చెప్పారు. అవిశ్వాస తీర్మానం అనేది చూసేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో కనిపిస్తున్నా.. దాని సారం మాత్రం కుట్రపూరితమైనదని ఆరోపించారు. కాగా, ఓలి స్థానంలో మావోయిస్టు చీఫ్ ప్రచండ ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. -
నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ


