karoline leavitt
-
లెవిట్ చెప్పినట్టే పేలిన ‘తూటాలు’!
వాషింగ్టన్: హిల్టన్ హోటల్లో కాల్పుల నేపథ్యంలో ఆ ఉదంతానికి కొద్దిసేపటి ముందు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలీన్ లెవిట్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘ఈరాత్రి జరగబోయే కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ అద్భుతంగా ప్రసంగించనున్నారు. ఆ సందర్భంగా మాటల తూటాలు పేలనున్నాయి. ఆ తూటా శబ్దాలను అందరూ విని తీరాల్సిందే’’ అని లెవిట్ చెప్పుకొచ్చారు. ట్రంప్ పదునైన పదజాలంతో, వాగ్ధాటితో ప్రసంగిస్తారనే ఉద్దేశంలో ఆమె మాట్లాడినా, కొద్దిసేపటికే కార్యక్రమంలో నిజంగా తూటాలు పేలడం సరదా వ్యాఖ్యలకు తావిచ్చింది. ‘‘తూటా పేలుళ్లను లీవిట్ ముందే పసిగట్టారు. ఇలా జరగబోతోందని ఆమెకు ముందే తెలుసేమో’’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘ఇదంతా రాజకీయ ఎత్తుగడ కాదు కదా!!’’ అని మరొకరు వ్యాఖ్యానించారు.బాటిళ్లు తీసుకెళ్లారు!ఓవైపు కాల్పుల మోత మోగుతుంటే కొందరు జర్నలిస్టులు మాత్రం మద్యం బాటిళ్లపై దృష్టిపెట్టారు! ఖరీదైన వైన్, షాంపేన్ బాటిళ్లతో సెలీ్ఫలు దిగారు. మరికొందరు వాటిని చెరోటి చంకలో పెట్టుకుని మరీ వెంట తీసుకెళ్లారు. మహిళా జర్నలిస్టులు వైన్ బాటిళ్లను వెంట తీసుకెళ్తున్న వీడియో వైరలైంది. అయితే ఈ సందర్భంగా పలువురు అగ్రనేతలు ప్రాణభయంతో పరుగెత్తుతుంటే, అది చూసి అక్కడే ఉన్న కొందరు మీడియా ప్రతినిధులు బిగ్గరగా నవ్వడం వివాదాస్పదమైంది. మరోవైపు, అంతటి గందరగోళంలోనూ ఒక పెద్దాయన నింపాదిగా కూర్చుని హాయిగా మద్యం సేవిస్తూ స్టఫ్ తింటూ కన్పించారు! -
ఇరాన్‌పై అమెరికా మరో ట్విస్ట్..
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల విరమణ గడువు పొడిగింపు, హార్మూజ్ జలసంధి దిగ్బంధంపై అమెరికా భారీ ట్విస్ట్ ఇచ్చింది. ఇరాన్‌తో కాల్పుల విరమణకు సంబంధించి ఐదు రోజుల గడువు ఉందన్న వార్తలు, నిరవధిక గడువు ఉందన్న సమాచారం నిజం కాదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ ఎటువంటి నిర్దిష్ట గడువును ఇంకా విధించలేదని ఆమె తేల్చిచెప్పారు.వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హార్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న దిగ్బంధం పట్ల ట్రంప్ సంతృప్తిగా ఉన్నారు. ఇరాన్‌తో కాల్పుల విరమణకు సంబంధించి 3 నుంచి 5 రోజుల గడువు ఉందన్న వార్తలు నిజం కాదు. చర్చల సమయం, తదుపరి చర్యల గడువును అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే నిర్ణయిస్తారు. ఇక, ఇరాన్ ప్రస్తుతం చాలా బలహీనంగా ఉంది. చర్చలకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు ఇప్పుడు ట్రంప్ చేతిలోనే ఉన్నాయి.ఇరాన్‌కు ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులను అమెరికా అడ్డుకుంది. ఖర్గ్ ద్వీపం చమురు నిల్వలతో నిండిపోయింది. ఖర్గ్ ద్వీపం నుంచి చమురును బయటకు పంపే అవకాశం లేకుండా అమెరికా దిగ్బంధించింది. దీనివల్ల ఇరాన్ ప్రతిరోజూ సుమారు 500 మిలియన్ల ఆదాయాన్ని కోల్పోతోంది. కనీసం తన సొంత ప్రజలకు వేతనాలు కూడా చెల్లించలేని స్థితికి ఇరాన్ చేరుకుంది. ట్రంప్ ప్రయోగించిన ఈ ఆర్థిక ఒత్తిడి సత్ఫలితాలను ఇస్తోంది అని చెప్పుకొచ్చారు.White House press secretary Karoline Leavitt said Wednesday that President Trump “has not set a firm deadline to receive an Iranian proposal" following another extension to the ceasefire."There's obviously a lot of internal division," Leavitt said, referring to Iran's… pic.twitter.com/zHXmKkdhrB— CBS News (@CBSNews) April 22, 2026 ఇరాన్ కౌంటర్.. మరోవైపు.. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో శాంతి చర్చలకు అసలైన అడ్డంకులు ఎక్కడ ఉన్నాయో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియాలో వివరించారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను అమెరికా గౌరవించక పోవడం ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఓడరేవులపై, ఆర్థిక వ్యవస్థపై కొనసాగుతున్న ఆంక్షలు, దిగ్బంధం మరో కారణమని చెప్పారు. అమెరికా నుంచి వస్తున్న సైనిక, రాజకీయ బెదిరింపులు శాంతి చర్చలకు అడ్డంకులని తెలిపారు. అమెరికా మాటలకు, చేతలకు మధ్య ఉన్న తేడాను ప్రపంచం మొత్తం చూస్తోందని విమర్శించారు. ఇరాన్ ఎప్పుడూ చర్చలకు, ఒప్పందాలకు సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో హార్మూజ్‌ను తెరిచే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. -
ట్రంప్ ఎనర్జీ లెవల్స్ ఏమాత్రం తగ్గలేదా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేయడం సాధారణంగా మారిపోయింది. ఆయన మునుపటిలా లేరని.. ఎనర్జీ లెవల్ దారుణంగా పడిపోయిందని.. బహుశా వయోభారమే అందుకు కారణమై ఉండొచ్చని తాజాగా న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఇది సాధారణంగానే ఆయనకు కోపం తెప్పించింది.ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న కథనాలను వైట్‌హౌజ్ కొట్టిపారేసింది. తాజాగా ఆయన తీయించుకున్న ఎమ్మారై స్కాన్‌తో ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ మీడియా ముందుకు వచ్చారు. సాధారణంగా ఆయన వయసు ఉన్నవాళ్లకు ఇమేజింగ్ పరీక్షలు చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. అలా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి ఆందోళనకరమైన అంశాలు కనిపించలేవు. ఆయన గుండె సాధారణంగానే ఉంది. రక్తనాళాల్లో ఎలాంటి బ్లాకులు లేవు. రక్తప్రవాహానికి ఆటంకం.. గుండె, ప్రధాన రక్తనాళాల్లో ఎలాంటి అసాధారణతలు కనిపించలేదు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు’’ అని మీడియా కథనాలను ఖండించారామె. మరోవైపు న్యూయార్క్ టైమ్స్ కథనం మీద ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.🇺🇸 WHITE HOUSE: TRUMP’S MRI SHOWS “EXCELLENT OVERALL HEALTH”The White House released Trump’s MRI today, confirming everything came back normal. His physician, Capt. Sean Barbarella of the U.S. Navy, said the MRI showed no heart or abdominal issues, with “all major organs… pic.twitter.com/FWHpfHMSoQ— Mario Nawfal (@MarioNawfal) December 2, 2025‘‘ఇప్పటిదాకా నా జీవితంలో ఏనాడూ ఇంతలా కష్టపడలేదు. అంతగా పని చేస్తూ.. పర్ఫెక్ట్గా ఫలితాలు రాబట్టగలుగుతున్నా. శారీరకంగా, మానసికంగా నేను ఫిట్‌గా ఉన్నా. నా స్టామినా విషయంలో సందేహమే అక్కర్లేదు’’ అని మొన్నీమధ్యే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. న్యూయార్క్ టైమ్స్‌ను తిట్టిపోసిన ఆయన.. ఆ కథనం వెనుక రాజకీయాల ప్రభావం ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే.. ఎప్పటిలాగే దానిని అమెరికన్ల శత్రువుగా అభివర్ణించారు. అలాగే ఆ కథనం రాసిన కేటీ రోగర్స్కు నానాశాపనార్థాలు పెట్టారు.28 ఏళ్ల కరోలైన్ లెవిట్ అమెరికా చరిత్రలో అత్యంత యువ ప్రెస్ సెక్రటరీ ఘనత దక్కించుకుంది. 2022లో న్యూ హాంప్‌షైర్ 1వ కాంగ్రెస్ జిల్లా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చాక ఆమెకు వైట్‌హౌజ్‌లో బాధ్యతలు అప్పగించారు. అందగత్తె మాత్రమే కాదు.. తెలివైంది కూడా అంటూ ఆయన తరచూ ఆమెపై ప్రశంసలు గుప్పిస్తుంటారు. ఈ ఏడాదిలోనే ఆమె వివాహం జరిగింది కూడా.


