Jasmin Bhasin
-
ఉమెన్ పవర్...పంచ్
‘అమ్మాయిలకు బాక్సింగ్ ఎందుకండీ!’ అనే మాట అప్పుడెప్పుడో కాదు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. లింగ వివక్షతతో కూడిన మాటలను, అడ్డంకులను పట్టించుకోకుండా తమ దారిలో తాము దూసుకుపోతూ సత్తా చాటుతున్నారు యువ మహిళా బాక్సర్లు. తాజాగా... ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్–2026లో మన దేశానికి చెందిన ఆరుగురు మహిళా బాక్సర్లు ఫైనల్లోకి దూసుకొచ్చి స్వర్ణపతక పోరులో స్థానాన్ని ఖరారు చేసుకున్నారు. వారు...మీనాక్షి (48 కేజి), ప్రీతి (54 కేజి), జాస్మిన్ (57 కేజి), ప్రియ (60 కేజీ), అరుంధతి చౌదరి (70 కేజీ), అల్ఫియా పఠాన్ (81 కేజి). కుంచె నుంచి పంచ్ దాకా...చిన్నప్పటి నుంచి ప్రీతి పవార్‌కు బొమ్మలు వేయడం అంటే ఇష్టం. బాక్సర్‌గా తన భవిష్యత్ చిత్రపటాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుకుంది. భారత బాక్సింగ్‌లో అత్యంత ప్రతిభావంతులైన యువతారలలో ఒకరిగా వేగంగా ఎదిగింది. హరియాణాలో భివానీలో జన్మించింది ప్రీతి. బాక్సర్ల ఊరుగా భివానీకి పేరున్నప్పటికీ మొదట్లో బాక్సింగ్‌పై ప్రీతికి పెద్దగా ఆసక్తి లేదు. ఆమె మామ వినోద్ జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న బాక్సర్. ఆయన ప్రోత్సాహంతో పద్నాలుగేళ్ల వయసులో బాక్సింగ్‌లోకి వచ్చింది ప్రీతి పవార్.పానిపట్‌లో జరిగిన ఓపెన్ స్టేట్ టోర్నమెంట్‌తో తన విజయయాత్ర మొదలుపెట్టింది. ఆ టోర్నమెంట్లో స్వర్ణం గెలుచుకుంది. జాతీయ స్థాయికి చేరుకోవడానికి ఆమెకు ఎంతోకాలం పట్టలేదు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన యూత్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో రజత పతకం గెలుచుకుంది. మరుసటి సంవత్సరం సీనియర్ స్థాయిలో ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. 2023 ఆసియా గేమ్స్‌లో మహిళల 54 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడం ప్రీతి కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. 2024లో కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా అండర్–22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణపతకం గెలిచిన ప్రీతి తన అద్భుతమైన ఫామ్ కొనసాగించింది. 2024లో ఒలింపిక్ ఆరంగేట్రం చేసింది.ఎంతోసేపు ఏడ్చిన తరువాత..రాజస్థాన్‌లోని కోటా శిక్షణ సంస్థలకు పెట్టింది పేరు. అలాంటి నగరంలో పెరిగిన అరుంధతి చౌదరి చదువులో ముందుండేది. గణితంలో కూడా అద్భుత ప్రతిభ చూపేది. అదే సమయంలో ఆమెకు ఆటలు అంటే కూడా ఇష్టం. ‘ఆటల్లో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను’ అని తండ్రితో చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యంగా చూసి ‘ఆటలు వద్దు. ఐఐటీ చేయాల్సిందే’ అని ఆదేశించాడు. తండ్రి ఆదేశంతో ఇక ఆటలకు దూరం కావాల్సిందే అనుకున్న సమయంలో తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చిన అరుంధతి తనకు ఆటలు అంటే ప్రాణం అని చెప్పింది. తండ్రిని తల్లి చాలాసేపు బతిమిలాడిన తరువాత ‘చదువుతో పాటు ఆటలు కూడా ఓకే’ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే అరుంధతికి అప్పట్లో బాక్సింగ్‌పై ఆసక్తి లేదు. బాస్కెట్ బాల్ అంటే ఇష్టం. రాష్ట్రస్థాయిలో కూడా ఆడింది. ఇండివిడ్యువల్ గేమ్‌ను ఎంచుకుంటే మంచిది అని చె΄్పాడు తండ్రి. అప్పుడే ‘బాక్సింగ్’ ఆలోచన ఆమె మదిలోకి వచ్చింది.‘బాక్సింగ్‌లో నీ పళ్లు ఊడిపోవచ్చు. ముఖం వికృతంగా మారిపోవచ్చు’ అని హెచ్చరించాడు తండ్రి. ‘నేను కూడా నా ప్రత్యర్థి పళ్లు ఊడగొడతాను. ఆమె ముఖాన్ని వికృతంగా మారుస్తాను’ అని అరుంధతి అన్నప్పుడు తండ్రి పెద్దగా నవ్వాడు. తన కూతురు బాక్సింగ్ ఆటపై సరదా పడుతుంది అనుకున్నాడేగానీ పెద్ద స్థాయికి వెళుతుందని ఆ తండ్రి అనుకోలేదు. కల కనలేదు. అతడు అనుకోక పోయినా, కల కనకపోయినా ప్రపంచ స్థాయిలో బాక్సింగ్‌లో మెరుస్తోంది అరుంధతి చౌదరి.మట్టి కరిపించేలా...మాజీ ప్రపంచ ఛాంపియన్‌ను మట్టి కరిపించి సంచలనం సృష్టించిన ప్రియ ఘంగాస్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బాక్సింగ్‌ను తొలిసారిగా ప్రియకు పరిచయం చేసింది హరియాణా కోచ్ రవి సంగ్వాన్. మాజీ జాతీయ ఛాంపియన్ అయిన రవి దగ్గర ఏడేళ్ల పాటు శిక్షణ తీసుకున్న ప్రియ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తాజాగా... ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో ప్రియ ఫైనల్లోకి అడుగు పెట్టడం గురించి రవి సంతోషంతో పులకించిపోయారు.‘దాద్రీ బాక్సింగ్ అకాడమీ అనే ఒక అకాడమీని ప్రారంభించాను. అప్పుడు ప్రియ ఆరవ తరగతి చదువుతుంది కావచ్చు. తన సోదరుడితో కలిసి అకాడమీకి వచ్చేది. నేర్చుకోవాలి, గెలవాలి అనే తపన ఆ చిన్నారి కళ్లలో కనిపించేది. ఆమెలో అంకితభావంతో పాటు ప్రతిభ కూడా ఉంది’ అంటూ జ్ఞాపకాల్లోకి వెళ్లారు రవి. అప్పట్లో అకాడమీలో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండేవి. అవేమీ పట్టించుకోకుండా పట్దుదలతో కష్టపడి ముందుకు సాగాలనే ఆమె సంకల్పబలం రవికి బాగా గుర్తుండి పోయింది.తాతగారు ససేమిరా అన్నా...జాస్మిన్ కుటుంబ సభ్యులు, బంధువులలో ఎంతోమంది బాక్సర్లు ఉన్నారు. అయినప్పటికీ జాస్మిన్ బాక్సింగ్ రింగ్‌లోకి అడుగు పెట్టడం ఆమె తాతగారికి నచ్చలేదు. అయితే బాక్సర్ అయిన బాబాయ్ ఆమెను ప్రోత్సహించాడు. జాస్మిన్ పతకాలు గెలుచుకున్నప్పుడల్లా ఆయన కళ్లలో వెలుగు కనిపించేది.‘నా కలలను నిజం చేస్తున్నావు’ అనేవాడు ఆనంద బాష్పాలతో. ‘రింగ్‌లోకి అడుగు పెట్టగానే నా మదిలోని ఆలోచనలన్నీ మాయమైపోతాయి. గెలవడం గురించి మాత్రమే ఆలోచిస్తాను’ అని తన సక్సెస్ మంత్రాను చెప్పనే చెప్పింది ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న జాస్మిన్. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో 57 కేజీల విభాగంలో ఉబ్జెకిస్తాన్‌కు చెందిన నిగిన ఉక్తమోనాపై విజయం సాధించింది.కష్టమైనా... ఇష్టంగా!హరియాణాలోని రూర్కికి చెందిన మీనాక్షి హూడా తండ్రి ఆటోడ్రైవర్. ఆరుగురు కుటుంబ సభ్యులలో మీనాక్షి చిన్నది. బాక్సింగ్ అంటే మీనాక్షికి ఇష్టం. ‘ఆడపిల్లకు బాక్సింగ్ ఎందుకు?’ ‘నీకు బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించడానికి నా దగ్గర డబ్బులు లేవు’ అని ఆ తండ్రి అనలేదు. బాక్సింగ్ అంటే కూతురికి ఉన్న ఇష్టానికి ముచ్చటపడి శిక్షణ ఇప్పించాడు. బాక్సింగ్‌లో తన కూతురు పెద్ద పేరు తెచ్చుకుంటుందనే నమ్మకంతో ఆర్థిక కష్టాలు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. 2014లో ‘ఖేల్ ఇండియా’ పోటీలో బంగారు పతకం గెలుచుకుంది మీనాక్షి. తాజాగా... ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో మహిళల 48 కేజీల సెమీ ఫైనల్çలో థాయ్‌లాండ్‌కు చెందిన థిప్సచాపై విజయాన్ని సాదించి స్వర్ణపతక పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది.అనుకోకుండా వచ్చి...అల్ఫియా పఠాన్ సోదరుడు రాష్ట్ర స్థాయి బాక్సర్, నాగ్‌పూర్‌లో తన సోదరుడు శిక్షణ తీసుకుంటున్న సమయంలో హాల్ బయట అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చునేది అల్ఫియా. ఆ తరువాత ఇద్దరూ ఇంటికి బయలుదేరేవారు. ఒకరోజు కోచ్ పురోహిత్ ఆమెతో సరదాగా ‘బాక్సింగ్ చేస్తావా?’ అన్నాడు. ‘ఆ.. ఏముంది గొప్ప. తన్నడం లేదా తన్నులు తినడం’ అన్నది అల్ఫియా. ఆమె చురుకుదనం చూసి ‘నువ్వు రేపటి నుంచి క్లాస్‌లో చేరాల్సిందే’ అంటూ వెళ్లిపోయాడు పురోహిత్. ఆయన యథాలాపంగా అన్నాడో, నిజంగానే అన్నాడో తెలియదుకానీ...ఆ మాటతో ఆల్ఫియా పఠాన్ బాక్సింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టి రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. -
ఇంట్లోంచి బయటకు వచ్చేసినప్పుడే అనుకున్నా.. దత్తత తీసుకోవాలని!
35 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్‌గానే ఉంది బుల్లితెర నటి జాస్మిన్ భాసిన్ (Jasmin Bhasin). పెళ్లి సంగతేమో కానీ కూతురు కావాలంటోందీ ముద్దుగుమ్మ. తప్పకుండా ఓ పాపను దత్తత తీసుకుంటానని గతంలోనే చెప్పింది. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన జాస్మిన్.. మరోసారి ఆ విషయాన్ని ప్రస్తావించింది. అసలు పాపను దత్తత తీసుకోవాలన్న ఆలోచన ఎప్పుడొచ్చింది? అన్న అభిమాని ప్రశ్నకు ఇలా స్పందించింది.అందుకే దత్తత ఆలోచననేను ఇల్లు వదిలి వచ్చేసినప్పుడు చాలా కష్టాలు అనుభవించాను. అప్పుడే అనుకున్నా.. నాకంటూ మంచి జీవితం సంపాదించుకున్నప్పుడు కచ్చితంగా మరొకరికి లైఫ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా.. అందుకే ఓ పాపను దత్తత తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది. హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్లో ఉన్నప్పుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పలేను. అలాంటి పెళ్లయితే చేసుకోనుఒకవేళ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టకపోయినా పర్వాలేదు. మంచి మనిషి దొరికితే పెళ్లి చేసుకుంటా.. లేదంటే ఏదో ఒకర్ని మ్యారేజ్ చేసుకుని తర్వాత విడిపోవాల్సి రావడం నాకైతే ఇష్టం లేదు. ఇకపోతే ఒక చిన్నారిని దత్తత తీసుకుని తనకు మంచి జీవితాన్ని ప్రసాదించాలనుకుంటున్నాను అని తెలిపింది. దిల్సే దిల్ తక్, నాగిన్ 4 వంటి సీరియల్స్‌తో జాస్మిన్‌కు పాపులారిటీ వచ్చింది. అర్ధ సర్బత్ దే భలే దీ, వార్నింగ్ 2, బద్నాం వంటి పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. ద ట్రేటర్స్ అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది.చదవండి: థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు -
డేంజర్ జోన్ నుంచి బయటపడ్డా: బుల్లితెర నటి
బాలీవుడ్ బుల్లితెర నటి జాస్మిన్ భాసిన్ ఇటీవలే తన కళ్లకు ఆపరేషన్ చేయించుకుంది. కార్నియా దెబ్బతినడంతో సర్జరీ చేయించుకున్నట్లు సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించింది. ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్లో ధరించిన కాంటాక్ట్ లెన్స్‌ల కారణంగా కళ్లకు సమస్య వచ్చిందని తెలిపింది. జాస్మిన్ తన కళ్ల చికిత్స కోసం ముంబయి వెళ్లినట్లు చెప్పింది.తాజాగా తాను కళ్ల సమస్య నుంచి బయపడినట్లు జాస్మిన్ భాసిన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం డేంజర్ జోన్ నుంచి బయపడ్డాడని పేర్కొంది. చికిత్స తర్వాత డాక్టర్ సలహాతో రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నట్లు వెల్లడించింది. చివరికి నా కంటి పాచ్‌లను తొలగించారని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తనకు చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. నా ముఖంపై ఈ చిరునవ్వును తిరిగి తెచ్చినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. -
కళ్లకు లెన్స్ వాడుతున్నారా? టాలీవుడ్ హీరోయిన్‌కి ఏం జరిగిందో తెలిస్తే!
చూపు స్పష్టంగా ఉండేందుకు చాలామంది కళ్లద్దాలు ఉపయోగిస్తుంటారు. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే కళ్లాద్దాలు బదులు లెన్స్ ఉపయోగించడం. వీటిని పెట్టుకున్నంత వరకు బాగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు మాత్రం వీటి వల్ల ఏకంగా కంటి చూపు పోయే పరిస్థితి వస్తుంటుంది. తాజాగా ఓ యంగ్ హీరోయిన్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. లెన్స్ వల్ల తనకు కళ్లు కనిపించట్లేదని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్)'జూలై 17న ఈవెంట్ కోసం ఢిల్లీలో ఉన్నాను. రెడీ అవుతున్న టైంలో లెన్స్ పెట్టుకోగానే ఎందుకు నొప్పిగా అనిపించింది. నిమిష నిమిషానికి బాగా ఎక్కువైపోయింది. దీంతో ఈవెంట్లో సన్ గ్లాసెస్ పెట్టుకుని మేనేజ్ చేశారు. ఓ సమయంలో నాకేం కనిపించలేదు. అలా కష్టమ్మీద పని పూర్తిచేసి డాక్టర్ దగ్గరికి వెళ్లాను. కార్నియా డ్యామేజ్ అయిందని చెప్పి కళ్లకు బ్యాండేజ్ వేశారు. అయితే ఈ నొప్పి తగ్గడానికి 4-5 రోజులు పడుతుందని డాక్టర్స్ చెప్పారు. కానీ నొప్పి మాత్రం భరించలేనంతగా ఉంది. దీని వల్ల సరిగా చూడలేకపోతున్నా, నిద్ర కూడా పట్టడం లేదు' అని జాస్మిన్ బాసిన్ చెప్పుకొచ్చింది.ఈమె లెన్స్ సరైన రీతిలో ఉపయోగించకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బంది కలిగి ఉండొచ్చని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దక్షిణాదిలో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన జాస్మిన్.. తెలుగులో 'వేట', 'లేడీస్ & జెంటిల్మన్' మూవీస్ చేసింది. వీటితో పాటు బిగ్ బాస్ 14, ఖత్రోంకి ఖిలాడీ తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!) -
బెస్ట్ ఫ్రెండ్ బర్త్‌డే.. గిఫ్ట్‌తో సర్ప్రైజ్ చేసిన నటి
బెస్ట్ ఫ్రెండ్స్ అంటేనే ఒకరికోసం మరొకరు నిలబడుతారు. సంతోషమొచ్చినా, బాధొచ్చినా అన్నీ పంచుకుంటారు. బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. బుల్లితెర నటి జాస్మిన్ భాసిన్, కమెడియన్ భారతి సింగ్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. భారతి బర్త్‌డే రోజు ఇంటికి జాస్మిన్ తల్లి తమ ఇంటికి రమ్మని ఆహ్వానించింది.నటి జాస్మిన్ భాసిన్సర్ప్రైజ్ గిఫ్ట్రుచికరమైన భోజనం వడ్డించిన తర్వాత స్నేహితురాలికి మంచి బహుమతిచ్చింది జాస్మిన్. భారతి బర్త్‌డే కావడంతో తనకు బంగారు చెవి కమ్మలను గిఫ్టిచ్చింది. అది చూసిన హాస్య నటి తెగ మురిసిపోయింది. గొప్ప బహుమతిచ్చినందుకు జాస్మిన్‌కు, కడుపునిండా భోజనం పెట్టినందుకు ఆమె తల్లికి కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి స్నేహితురాలు ఉన్నందుకు ఎంతో అదృష్టవంతురాలినని పొంగిపోయింది.కమెడియన్ భారతి సింగ్కెరీర్ఇకపోతే జాస్మిన్ బుల్లితెర షోలతో పాటు సీరియల్స్‌లోనూ నటించి పాపులారిటీ సంపాదించుకుంది. భారతి సింగ్ విషయానికి వస్తే కామెడీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుంది. ద కపిల్ శర్మ షో, కామెడీ నైట్స్ బచావో వంటి షోలతో జనాలకు దగ్గరైంది. అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తోంది.చదవండి: 15 ఏళ్లలోనే తొలిసారి.. అత్యంత దారుణమైన కలెక్షన్స్ -
సర్జరీలపై ట్రోలింగ్.. అర్థం చేసుకోకుండా తిడతారేంటి? మీ వల్ల..
ఆడవారు అందానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందులోనూ సెలబ్రిటీలు అందం కోసమే ఖర్చు చేస్తారు.. అందంగా కనిపించేందుకే ఎక్కువ తాపత్రయపడతారు. కొందరైతే ప్లాస్టిక్ సర్జరీల దాకా వెళ్తారు. ముఖంలో, శరీరంలో ఏమాత్రం తేడా కనిపించినా జనాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. పొరపాటున ఫేస్‌లో ఏదైనా మార్పు కన్పిస్తే చాలు నెటిజన్లు సెలబ్రిటీలను తెగ ట్రోల్ చేస్తుంటారు. ఈ వైఖరిపై బిగ్‌బాస్ బ్యూటీ జాస్మిన్ భాసిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.నెగెటివిటీ!'జనాలు ఎంత దారుణంగా ఉన్నారంటే ముఖం పట్టుకుని నానామాటలు అనేస్తున్నారు. నటీనటులుగా, సెలబ్రిటీలుగా మేము జనాల్లోనే ఉండాలి. అది నేను ఒప్పుకుంటాను. కానీ ఎందుకని ఎప్పుడూ నెగెటివిటీ ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. యాక్టర్స్‌గా అందంగా కనిపించడం మా బాధ్యత. అందవిహీనంగా కనిపించాలని ఎవరైనా అనుకుంటారా? మా ప్రొఫెషనల్‌లో అందానికి పెద్ద పీట వేస్తాం. ఎప్పటికప్పుడు అందాన్ని పెంపొందించుకోవాలనే చూస్తాం. అందుకోసం ఎంతగానో కష్టపడతాం.చదవండి: 'డబ్బు కోసమే 46 ఏళ్ల కమెడియన్‌తో పెళ్లి'.. నటి ఏమందంటే?నోటికొచ్చింది అనేస్తున్నారుశరీరంలోని మార్పుల వల్ల, హార్మోన్ల అసమతుల్యత వల్ల మేమెంత ఇబ్బందిపడుతున్నా అవి పైకి కనిపించనీయకుండా ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. అది అర్థం చేసుకోకుండా నోటికొచ్చింది తిడుతున్నారు. అప్పటికే మేమెంతో ఒత్తిడిలో ఉంటాం. దానికి తోడు మీ ట్రోలింగ్ వళ్ల ఇంకెంత హర్ట్ అవుతామో ఆలోచించారా? దీనివల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. ఇంత బాధపెట్టడం మీకు న్యాయమేనా?' అని జాస్మిన్ ప్రశ్నించింది.చదవండి: స్టార్ హీరోయిన్ను పట్టించుకోని డెలివరీ బాయ్.. నెటిజన్ల ప్రశంసలు! -
నా ప్రియురాలి పేరెంట్స్‌ను ఎలాగైనా ఒప్పిస్తా
హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్ గ్రాండ్ ఫినాలే ఆదివారం(ఫిబ్రవరి 21) అంగరంగా వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాహుల్ వైద్యను వెనక్కు నెట్టి రుబీనా దిలైక్ విజేతగా అవతరించింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై అభినందనల వర్షం కురుస్తోంది. తన కలను నిజం చేసిన అభిమానులకు ఆమె వేవేల కృతజ్ఞతలు తెలిపింది. రాఖీ సావంత్, నిక్కీ తంబోళిలతో పాటు టాప్ 5లోకి అడుగుపెట్టిన అలీ గొని మూడో రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అతడికి ఎక్కడికి వెళ్లినా పెళ్లెప్పుడు అన్న ప్రశ్న ఎదురవుతోంది. ఈ క్రమంలో తన పెళ్లి గురించి అలీ స్పందిస్తూ.. "అసలు నేను బిగ్‌బాస్ షోకు వెళ్లిందే నా స్నేహితురాలు జాస్మిన్ను ఎంకరేజ్ చేసేందుకు. కానీ అక్కడకు వెళ్లాక అర్థమైంది ఆమె పూర్తిగా నా మనిషి అని, నా కోసమే పుట్టిందని! ఆ విషయం అర్థమయ్యాక ఆమెతో టైమ్ స్పెండ్ చేసేందుకు మరీమరీ ఎదురు చూస్తున్నా. అంతా కలిసొస్తే తనను తప్పకుండా పెళ్లి చేసుకుంటా. అలా అని ఆమెను ఇప్పుడప్పుడే వివాహానికి తొందర పెట్టను. కానీ భవిష్యత్తులో మాత్రం జాస్మిన్ తల్లిదండ్రులను ఎలాగైనా ఒప్పించి మరీ ఆమెను నాదాన్ని చేసుకుంటాను" అని చెప్పుకొచ్చాడు. మూడేళ్లుగా స్నేహగీతం పాడిన ఈ ఇద్దరూ ఎట్టకేలకు పెళ్లికి రెడీ అవుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బిగ్‌బాస్ విన్నర్‌గా రుబీనా, ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా? -
మేం బెస్ట్ ఫ్రెండ్స్ అంతే: నటి
ముంబై: నటుడు అలీ గోని తనకు స్నేహితుడు మాత్రమే అని, అంతకుమించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని ‘నాగిన్’ సీరియల్ ఫేం జాస్మిన్ భాసిన్ అన్నారు. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉందని, ఒకరి గర్ల్ఫ్రెండ్గానో.. మరొకరి ప్రేయసిగానో పేర్కొంటూ తన గురించి వదంతులు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. కాగా రియాలిటీ షో ఖత్రోంకీ ఖిలాడీలో జాస్మిన్, అలీ జంటగా పాల్గొన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ రూమర్లు వ్యాపించాయి. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటూ వీరిద్దరు ఫొటోలు షేర్ చేయడంతో వీటికి మరింత బలం చేకూరింది. అలీని సోల్‌మేట్ అని జాస్మిన్ సంబోధించడం, జాస్మిన్ లేకుంటే తాను ఏమయ్యేవాడినో అంటూ అలీ పోస్టులు పెట్టడంతో వీరిని లవ్‌బర్డ్స్‌గా పేర్కొంటూ గాసిప్‌రాయుళ్లు ఇష్టం వచ్చినట్లుగా కథనాలు అల్లేశారు.(నా పిల్లలను చూశాకే మార్పు మొదలయ్యింది) ఈ వార్తలపై స్పందించిన జాస్మిన్.. ఇలాంటి అసత్య కథనాలు మొదట్లో నవ్వుకోవడానికి బాగానే ఉండేవని, అయితే ఇప్పుడు అవి మరింతగా శ్రుతిమించడంతో తమ మధ్య స్నేహ బంధం బీటలు వారే అవకాశం ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఆడ, మగ మధ్య స్నేహాన్ని ప్రేమతో ముడిపెట్టడం సరికాదంటూ కౌంటర్ ఇచ్చారు.‘‘మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. కానీ గత రెండేళ్లుగా మా గురించి విపరీతమైన రూమర్లు ప్రచారమవుతున్నాయి. అవి నా వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నాయి. ఒక మహిళగా ఎన్నో కష్టాలకోర్చి నేను ఈరోజు నటిగా గుర్తింపు దక్కించుకున్నాను. (ట్రెండ్ అవుతోన్న సమంత న్యూ ఇయర్ రింగ్స్) కానీ ఎప్పుడూ వేరొకరి పేరుతో నన్ను ముడిపెట్టి చూపించడం అస్పలు బాగాలేదు. మహిళలను కాస్త గౌరవించడం నేర్చుకోండి’’ అని జాస్మిన్ విజ్ఞప్తి చేశారు. నిజం చెప్పాలంటే జీవిత భాగస్వామిలో తను కోరుకునే లక్షణాలు ఒక్కటి కూడా తన స్నేహితుడిలో లేవంటూ చమత్కరించారు. కాగా తషన్-ఏ-ఇష్క్, దిల్ సే దిల్ తక్, కరోడ్ పతి అండ్ వేట అనే హిందీ షోలతో పాటు రెండు దక్షిణాది సినిమాల్లోనూ ఆమె నటించారు. ఇక అలీ యే మొహబ్బతే, బహూ హమారీ రజనీకాంత్ వంటి సీరియళ్లలో నటించాడు. -
బిగ్‌బాస్ గూటికి స్నేహా ఉల్లాల్
కరోనా వార్తలతో జడిసిపోతున్న జనాలు కూసింత వినోదాన్ని అందించే ప్రోగ్రాములవైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో వారికి కావాల్సినంత సరుకు అందించేందుకు బిగ్‌బాస్ సిద్ధమవుతోంది. కొట్లాటలు, అలకలు, ఆటలు, సాహసాలు, సీక్రెట్లు, పాటలు, డ్యాన్సులు ఒకటేమిటి.. నవరసాలను ఒలికిస్తూ ప్రేక్షకుల మనసు దోచుకునేందుకు బిగ్‌బాస్ హిందీ 14వ సీజన్ రంగంలోకి దిగుతోంది. కరోనా టైంలో అసలు ఈ షో వస్తుందో లేదో అనుకునే సమయంలో టీజర్ వదిలి హైప్ క్రియేట్ చేశారు. ఈసారి కూడా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా ఆయనపై ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో ఇదివరకే ప్రోమో చిత్రీకరించారు. దీన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్‌లో మొదలు కానున్న ఈ షోలో ఈసారి ఎవరెవరు పాల్గొంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. (బిగ్‌బాస్ హౌస్‌లో 'ఓ బేబీ' నటి?) అయితే ఎప్పటిలాగానే ఈసారి కూడా టీవీ నటులపైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఈసారి బిగ్‌బాస్ షోలో వివియాన్ సేన, సంగీతా ఘోష్, అలీషా పన్వార్, జై సోని, షాగున్ పాండే, విశాల్ రహేజా, డోనాల్ బిష్త్, షలీన్ భనోత్, షిరాన్ మిర్జా, నియా శర్మ, జాస్మిన్ భాసిన్ పాల్గొననున్నట్లు సమాచారం. వీరితో పాటు "ఉల్లాసంగా ఉత్సాహంగా" హీరోయిన్ స్నేహా ఉల్లాల్ కూడా బిగ్‌బాస్‌లో అడుగు పెట్టనున్నట్లు వినికిడి. అయితే ఇదే కంటెస్టెంట్ల లిస్టు చివరి నిమిషం వరకూ కొనసాగుతుందో లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఇక ఎన్నో వివాదాలు రాజుకుని రక్తి కట్టిన బిగ్‌బాస్ 13 సీజన్లో అంతిమంగా సిద్ధార్థ్ శుక్లా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. (నీకు తోడుగా ఉంటా: బిగ్‌బాస్ రన్నరప్) -
ఆడా, మగ ఫ్రెండ్స్‌గా ఉండకూడదా..?: నటి
ముంబై: సినీ ఇండస్ట్రీలో ఒకరితో కాస్త చనువుగా ఉంటే చాలు డేటింగ్, ప్రేమ అంటూ ఏదో లింకులు పెడతారని మోడల్, టాలీవుడ్ నటి జాస్మిన్ భాషిన్ అంటోంది. కో స్టార్ సిద్ధార్థ శుక్లాతో నటి కొంతకాలం నుంచి డేటింగ్ చేస్తోందన్న వార్తలు గుప్పుమనడంతో ఆమె తీవ్రంగా స్పందించింది. ఆడా, మగ సరదాగా మాట్లాడం కూడా తప్పేనా.. అలా కనిపించడమే పొరపాటు.. వారి మధ్య ఏదో రిలేషన్ ఉందని ప్రచారం చేస్తారని ఈ భామ మండిపడుతోంది. సిద్ధార్థ శుక్లాతో తనకు ఎఫైర్ అంటూ వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. సిద్ధార్థ లాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలని అందరూ కోరుకుంటారు.. ఎందుకంటే అతడు చాలా కూల్‌గా ఉంటాడని చెప్పింది. ''దిల్ సే దిల్ తక్'లో ఇద్దరం కలిసి నటించాం. అతడు ఎప్పుడు జోకులేస్తూ అందరినీ నవ్విస్తుంటాడు. ఎంతో సరదాగా ఉండే అతడిని నేను తపోరి అని పిలుస్తుంటాను. ఆడా, మగవారు స్నేహితులుగా ఉండటం కూడా తప్పేనా. సిద్ధార్థ నాకు బెస్ట్ ఫ్రెండ్. సమయం దొరికినప్పుడు ఫ్రెండ్స్‌తో సమయాన్ని గడపడాలన్నది నా అభిప్రాయం. కెరీర్ మీద దృష్టిపెట్టిన నాకు ప్రేమలో పడే తీరిక లేదు' అని తనపై వచ్చిన వదంతులకు బదులిచ్చింది. హీరో సాయిరామ్ శంకర్ మూవీ 'దిల్లున్నోడు'తో టాలీవుడ్‌కు పరిచయమైన జాస్మిన్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీలు, టీవీ షోలతో బిజీగా ఉంది.


