బిగ్‌బాస్ 14: క‌ంటెస్టెంట్లు వీరే..

Bigg Boss 14 Hindi: Here Is The Viral List Of Contestants - Sakshi

క‌రోనా వార్త‌ల‌తో జ‌డిసిపోతున్న జ‌నాలు కూసింత‌ వినోదాన్ని అందించే ప్రోగ్రాములవైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో వారికి కావాల్సినంత స‌రుకు అందించేందుకు బిగ్‌బాస్ సిద్ధ‌మ‌వుతోంది. కొట్లాట‌లు, అల‌క‌లు, ఆట‌లు, సాహ‌సాలు, సీక్రెట్‌లు, పాట‌లు, డ్యాన్సులు ఒక‌టేమిటి.. న‌వ‌ర‌సాల‌ను ఒలికిస్తూ ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకునేందుకు బిగ్‌బాస్ హిందీ 14వ సీజ‌న్‌ రంగంలోకి దిగుతోంది. క‌రోనా టైంలో అస‌లు ఈ షో వ‌స్తుందో లేదో అనుకునే స‌మ‌యంలో టీజ‌ర్‌ వ‌దిలి హైప్ క్రియేట్ చేశారు. ఈసారి కూడా స‌ల్మాన్ ఖాన్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా ఆయ‌న‌పై ముంబైలోని మెహ‌బూబ్ స్టూడియోలో ఇదివ‌ర‌కే  ప్రోమో చిత్రీక‌రించారు. దీన్ని ఆగ‌స్టు 15న రిలీజ్ చేయ‌నున్నారు.  సెప్టెంబ‌ర్‌లో మొద‌లు కానున్న ఈ షోలో ఈసారి ఎవ‌రెవ‌రు పాల్గొంటార‌నేదానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. (బిగ్‌బాస్ హౌస్‌లో 'ఓ బేబీ' న‌టి?)

అయితే ఎప్ప‌టిలాగానే ఈసారి కూడా టీవీ న‌టుల‌పైనే ప్ర‌ధానంగా ఫోక‌స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈసారి  బిగ్‌బాస్ షోలో వివియాన్ సేన‌, సంగీతా ఘోష్‌, అలీషా ప‌న్వార్‌, జై సోని, షాగున్ పాండే, విశాల్ ర‌హేజా, డోనాల్ బిష్త్‌, షలీన్ భ‌నోత్‌, షిరాన్ మిర్జా, నియా శ‌ర్మ‌, జాస్మిన్ భాసిన్ పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం. వీరితో పాటు "ఉల్లాసంగా ఉత్సాహంగా" హీరోయిన్ స్నేహా ఉల్లాల్ కూడా బిగ్‌బాస్‌లో అడుగు పెట్ట‌నున్న‌ట్లు వినికిడి. అయితే ఇదే కంటెస్టెంట్ల లిస్టు చివ‌రి నిమిషం వ‌ర‌కూ కొన‌సాగుతుందో లేదా అనేది స‌స్పెన్స్‌గా మారింది. ఇక‌ ఎన్నో వివాదాలు రాజుకుని ర‌క్తి క‌ట్టిన‌ బిగ్‌బాస్ 13 సీజ‌న్‌లో అంతిమంగా సిద్ధార్థ్ శుక్లా విజేత‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. (నీకు తోడుగా ఉంటా: బిగ్‌బాస్‌ రన్నరప్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top