breaking news
Industrial lands
-
జీవోలో ఒకలా.. చెప్పింది మరోలా..!
సాక్షి, హైదరాబాద్: హిల్ట్–పి విధానం కింద వేల ఎకరాల పారిశ్రామిక భూములను బహుళ వినియోగం కోసం మార్పిడి చేసుకునేలా ఎవరి సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి ఈ నెల 22న విడుదల చేసిన జీవో నం.27లో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ) వీసీఎండీ చేసిన ప్రతిపాదన ఆధారంగా హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. టీజీఐఐసీ ప్రతిపాదన మేరకే ప్రభుత్వం ముందుకెళ్లిందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న దాన్ని బట్టి అర్థమవుతోంది.కానీ మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదాయ వనరుల పెంపు కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడారు. హిల్ట్–పి విధానంపై ఆదాయ వనరుల పెంపు కేబినెట్ సబ్–కమిటీలో ఏడాదిన్నరపాటు చర్చించామని.. దీని గురించి భాగస్వామ్య పక్షాలతో చర్చించడంతోపాటు నిపుణులతో మాట్లాడి అన్నీ తెలుసుకున్నాకే హైదరాబాద్ ప్రజల మేలు కోసం సరైన నిర్ణయం తీసుకున్నామని ఉపసంఘం సభ్యులైన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు వివరణ ఇచ్చారు.ఎస్ఆర్వో ధరల్లో 30–50 శాతం తీసుకునే నిర్ణయం కూడా తమదేనని.. పారిశ్రామిక వర్గాలు ఇంకా తక్కువ ధరకు కావాలని అడిగాయని చెప్పారు. ఉచితంగా భూముల మార్పిడి చేయాలని ఒత్తిడి తెచ్చాయని.. కానీ రాష్ట్ర ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఖజానాకు డబ్బులు కావాలనే ఆలోచనతో తాము రెండు శ్లాబుల్లో ఫీజులు నిర్ధారించామని వివరించారు. కేబినెట్ సబ్‌కమిటీ సభ్యుల హోదాలో మంత్రులు ఘంటాపథంగా చెప్పిన ఈ విషయాన్ని మాత్రం హిల్టప్ జీవోలో ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదు. కనీసం ఉపసంఘం ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం గమనార్హం. కేవలం టీజీఐఐసీ గురించే పేర్కొన్న ఈ జీవోలో కనీసం సబ్–కమిటీ సిఫారసు గురించి ఎందుకు ప్రస్తావించలేదన్నది ఆసక్తిగా మారింది.సీఎస్ పేరుకు బదులు..ప్రభుత్వ ఉత్తర్వుల విడుదలలో పాటించే విధానాన్ని కూడా హిల్ట్–పి జీవో జారీ విషయంలో ప్రభుత్వం విస్మరించడం అధికార వర్గాల్లోనూ చర్చకు దారితీస్తోంది. అటు పరిశ్రమల శాఖ, ఇటు మున్సిపల్ శాఖ (హెచ్ఎండీఏ)లతో సంబంధముండే ఈ ప్రక్రియ అమలుకు సంబంధించిన జీవోను కేవలం పరిశ్రమల శాఖ నుంచి ఇవ్వడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఒకటి కంటే ఎక్కువ శాఖలతో సంబంధముంటే జీవోలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పేరిట ఇవ్వడం ఆనవా యితీగా వస్తోంది. కానీ ఆ ఆనవాయితీని కాదని కేవలం పరిశ్రమల శాఖ కార్యదర్శి ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేయించడం వెనుక మర్మం ఏమిటనే చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. -
సబ్ కమిటీ నిర్ణయంతోనే ‘హిల్ట్ పి’
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక వనరుల సమీకరణ కోసం ఏర్పా టైన మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకే పరిశ్రమల భూముల బదలాయింపు విధానం (హిల్ట్ పాలసీ) రూపొందించామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కొందరు పారిశ్రామికవేత్తలకే లబ్ధి చేకూర్చకుండా అందరికీ లబ్ధి చేకూరేలా తెచ్చిన ఏకీకృత విధానాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. హైదరాబాద్‌లోని కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్డు వెలుపలికి తరలించడాన్ని వేగవంతం చేసేందుకే కొత్త పాలసీ తెచ్చినట్లు చెప్పారు. మంగళవారం కేబినెట్ సమావేశం అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతోపాటు ఇతర మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘హైదరాబాద్ విస్తరణతో 50 ఏళ్ల క్రితం శివారులోని పారిశ్రామికవాడల చుట్టూ ప్రస్తుతం జనావా సాలు ఏర్పడ్డాయి. దీంతో ఢిల్లీ తరహాలో కాలుష్య సమస్య తో సతమతం కారాదనే ఉద్దేశంతో కాలుష్యకారక పరిశ్రమ లను ఓఆర్ఆర్ వెలుపలికి తరలించాలని దశాబ్దాలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ వస్తున్నాయి.ఈ ప్రయత్నాల కొనసాగింపులో భాగంగానే కొత్త పాలసీ తెచ్చాం. తద్వారా సమకూరే ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తాం. ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ అంశంపై ఉన్నతాధికారులతో లోతుగా విశ్లేషించాం. పారిశ్రామికవర్గాలతోనూ మాట్లాడటంతోపాటు కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించాం. బీఆర్ఎస్ నేతల మాదిరిగా కొందరి కోసం ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ చేయట్లేదు’ అని భట్టి స్పష్టం చేశారు. భూ బదలాయింపునకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.బీఆర్ఎస్ హయాంలో కేటాయింపులపై విచారణ: శ్రీధర్బాబుబీఆర్ఎస్ హయాంలో ఇతర అవసరాల కోసం మార్పిడి చేసిన పారిశ్రామిక భూ బదలాయింపులపై విచారణ జరుపు తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. ‘గతంలో పారిశ్రామిక భూముల బదలాయింపు కోసం బీఆర్ఎస్ ఇచ్చిన జీవోల్లోనూ దరఖాస్తుకు 3 రోజు ల గడువు విధించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రూ. 40 వేల కోట్లను ఈ విధానంతో సమీకరిస్తామని చెప్పింది. ప్రభుత్వానికి వనరులు సమకూరవద్దనేది బీఆర్ఎస్ ఉద్దేశం. కేబినెట్ సబ్ కమిటీ సభ్యుడైన నాకు పాలసీ గురించి తెలియదనడం సరికాదు’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయమే: ఉత్తమ్‘సుమారు ఏడాదిన్నరపాటు చర్చించి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన ప్రతిపాదనల మేరకే హిల్ట్ పాలసీని కేబినెట్లో చర్చించి ఆమోదించాం. పారిశ్రామికవర్గాలతో చర్చించాక ఖజానాకు ఆదాయం సమకూరేలా 30 శాతం, 50 శాతం పేరిట రెండు శ్లాబ్‌లు నిర్ణయించాం. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం మేరకే కొత్త పాలసీ తెచ్చినా బీఆర్ఎస్ నేతలు మాపై బట్టకాల్చి మీద వేస్తున్నారు’ అని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం చేస్తున్న ప్రయత్నాలను సీఎం, ఆయన సోదరులకు అంటగట్టడం సరికాదన్నారు. -
ప్రజల్లో బహిరంగ చర్చ జరగాలి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి విధానం (హిల్ట్ పి)– 2025పై పర్యావరణవేత్తలు, నిపుణుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఈ విధానం తీరుతెన్నులు, అమలు ప్రణాళికలపై వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీని అమలు, భవిష్యత్తులో తలెత్తే పెనుసవాళ్లు, సమస్యల గురించి ప్రభుత్వానికి ఓ అంచనా, అవగాహన ఉందా అని ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా భూగర్భ జలాలు కలుషితమై ఉండటాన్ని గుర్తు చేస్తున్నారు.ఇప్పటికే ప్రజా, ప్రభుత్వ అవసరాలకు హైదరాబాద్‌లో భూమి అందుబాటులో లేదని, కనీసం సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) పెట్టడానికి కూడా భూమి లేదంటూ.. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో ఎస్టీపీల ప్రాధాన్యతను గుర్తు చేస్తున్నారు. ప్రజలు సురక్షితంగా జీవించడానికి అనుమైన పరిస్థితులు ఉండాలి కదా.. అంటున్నారు. ఒక అవసరం నుంచి మరో అవసరానికి బదలాయించడానికి భూమి అందుబాటులో ఉంటే అది ప్రస్తుత పరిస్థితులను మెరుగు పరచడానికి ఉపయోగపడుతుందా లేదా చూడాలి.. కానీ ఎలాంటి అంచనాలు, సమీక్ష లేకుండా అమలు చేయడం మంచిది కాదు.భూమి బదలాయింపు అంటే అది ప్రైవేటీకరణ కిందకు వస్తుంది. ఈ భూముల్లో రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ కాంప్లెక్స్‌లు వెలుస్తాయి. ఇందుకోసం కొంత ఫీజు వసూలు చేస్తారు. కానీ హైదరాబాద్ మహానగరానికి మాత్రం తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉంది..’అని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ‘హిల్ట్ పి’పై పర్యావరణవేత్తలు, ప్రభుత్వ విధానాలు, నీటి వనరుల నిపుణులు తమ అభిప్రాయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు.ఓవరాల్ ప్లానింగ్ లేకుండా ఎలా? పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను వేలం వేసినా, మార్పిడి చేసినా బ్రౌన్ డెవలప్‌మెంట్‌గా పరిగణిస్తారు. అసలు మాస్టర్‌ప్లాన్‌తో సంబంధం లేకుండా, మొత్తం ప్రాంతానికి ఓవరాల్ ప్లానింగ్ లేకుండా, డిజైన్ విత్ నేచర్ లేకుండా ఎలా చేస్తారు? సస్టెయినబులిటీ (సుస్థిరత), అఫర్డబిలిటీ (కొనుగోలు శక్తి)ని దృష్టిలో పెట్టుకుని గ్రీన్ డెవలప్మెంట్ జరగాలి. ఆయా ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా జీవించగలిగే పరిస్థితులు ఉండాలి. హైదరాబాద్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేదు. అధికారులు మారినప్పుడల్లా విధానాలు మారుతున్నాయి.గతంలో తీసుకున్న నిర్ణయాలు అమలు కావడం లేదు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పట్టణీకరణ విపరీతంగా పెరిగిపోనున్న నేపథ్యంలో..రాష్ట్ర ప్రభుత్వం అర్బనైజేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లోనూ రియల్గుడ్ ల్యాండ్ స్కేప్ డిజైనింగ్ చేయాలి. భవిష్యత్ సవాళ్లు, సమస్యలను అంచనావేసి వాటిని అధిగమించేలా చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ చేస్తున్నది అసలు మాస్టర్‌ప్లానే కాదు. ఇవన్నీ సస్టెయినబుల్ బ్లూప్రింట్ పరిధిలోకి రావడం లేదు. – ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్తప్రజల ఆరోగ్యం మాటేమిటి? పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యం ఉంది కాబట్టి జనావాసాలకు దూరంగా నగరం బయటకు తరలిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అంటే హైదరాబాద్ మహానగరం నలుమూలల కాలుష్యం ఉందని అంగీకరించినట్టే కదా. అలాంటి ప్రాంతాల్లో నివాస సముదాయాలకు అనుమతినిస్తే అక్కడి ప్రజల ఆరోగ్యం ఏమి కావాలి? అసలు ఆయా ప్రదేశాల్లో కాలుష్యం అనేది ఏయే రూపాల్లో విస్తరించింది? ప్రభావమెంత? రాబోయే రోజుల్లో ఎదురయ్యే దుష్పరిణామాలు ఏమిటి? తదితరాలపై పర్యావరణ ప్రభావ అంచనా (ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్) లాంటిది ఏదైనా చేశారా? దీనికి సంబంధించి శాస్త్రీయపరమైన అంచనాలు ఏమైనా ప్రభుత్వం వద్ద ఉన్నాయా? ఒక ప్రాంతంలో అకస్మాత్తుగా భూమి వినియోగం మారి రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై ఎన్నో రెట్లు ఒత్తిడి పెరిగితే ఆ సమస్యను ఎలా అధిగమిస్తారు? సవివరమైన ప్రణాళిక, అంచనాలు లేకుండా హడావుడిగా భూమి మార్పిడి చేయడం సరికాదు. ఈ నిర్ణయంతో సమస్యలు మరిన్ని రెట్లు పెరుగుతాయే తప్ప ప్రజలకు సౌలభ్యం ఉండదు. – డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, పబ్లిక్ పాలసీ నిపుణులుప్రత్యేక విధానం తేవాలి భూమి, భూవనరుల వినియోగం, మార్పిడిపై తెలంగాణ ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. భూ వినియోగాన్ని మార్చడం కాకుండా ఈ భూమిని ముందుగా ప్రభుత్వం తీసుకోవాలి. అసలు ఈ మార్పిడి వలన ఎవరు ప్రయోజనం పొందుతున్నారనేది ప్రశ్న. పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్షిప్ (పీపీపీ) పేరిట ఎవరు ప్రయోజనం పొందుతున్నారనేది చర్చకు రావాలి.ఇప్పుడు మార్పిడి చేస్తున్న ప్రాంతాలు కాలుష్యంతో కూడుకున్నవి. వాయు కాలుష్యాన్ని ఏదోరకంగా చక్కదిద్దవచ్చునేమో కానీ దశాబ్దాలుగా పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమై పోయిన భూగర్భ జలాలను ఎలా శుద్ధి చేస్తారు? నా అంచనా మేరకు మరో 50 ఏళ్ల దాకా ఎంత శ్రమ పడినా ఈ భూగర్భ జలాలు శుభ్రం కావు. ఈ విధంగా కలుషితమైన భూగర్భ జలాల్లో వేసే పునాదులు ఎన్నిరోజులు ఉంటాయో పరీక్షించిన రికార్డు ఏదైనా ఉందా? అసలు పరిశీలించారా? అవన్నీ కొన్నేళ్ల తర్వాత కుప్పకూలిపోతే పరిస్థితి ఏమిటీ? డిజాస్టర్ రిస్క్ అసెస్మెంట్ ఏమైనా చేశారా? – బీవీ సుబ్బారావు, వాటర్ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఇన్ వాటర్ రిసోర్సెస్ అండ్ క్లైమేట్ ఛేంజ్ -
ఎవరికీ తెలియకుండానే మంత్రాంగం?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదిలీ విధానం (హిల్ట్ పి) ఒక పక్క రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంటే మరోపక్క సంబంధిత పరిశ్రమల శాఖకు కూడా తెలియకుండానే కొత్త పాలసీ కేబినెట్లో చర్చకు వచ్చిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. లోతైన కసరత్తు లేకుండా కేవలం పరిశ్రమల శాఖ అధీనంలోని టీజీఐఐసీ రాసిన లేఖ ఆధారంగా పాలసీ తయారైనట్లు సమాచారం. కేబినెట్ నోట్లో ఈ అంశం గమనించే వరకు సదరు మంత్రికి కూడా అందుకు సంబంధించిన సమాచారం లేదని అధికార వర్గాలు చెబుతుండటం గమనార్హం.అత్యంత ముఖ్యమైన పాలసీ కేబినెట్లో ఆమోదం పొందినా.. మీడియాకు వివరాల వెల్లడికి పరిశ్రమల మంత్రి దూరంగా ఉన్నారని అంటున్నారు. మరోవైపు టీజీఐఐసీ నుంచి పరిశ్రమల వివరాల తీసుకుని ‘మల్టీ యూజ్ జోన్లు’గా మార్చే బాధ్యతను అప్పగించిన హెచ్ఎండీఏతో పాటు పురపాలక, రెవెన్యూ శాఖలతో కూడా పాలసీ రూపకల్పనపై సంప్రదింపులు జరపలేదని తెలుస్తోంది. ఇంకోవైపు ‘హిల్ట్ పి’ హడావుడిగా రూపొందించడం, ఆమోదించడం వెనుక జరిగిన తతంగం అనుమానాలు తావిచ్చేలా ఉందన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది.సంబంధిత శాఖ మంత్రి ప్రమేయం లేకుండానే పాలసీకి తుది రూపం ఇవ్వడమే దీని వెనుక భారీ భూ కుంభకోణం దాగి ఉందనడానికి నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ విలువలో (ఎస్ఆర్ఓ రేటు) కేవలం 30 శాతానికే భూములు బదలాయించడాన్ని బీఆర్ఎస్, బీజేపీలు తప్పుబడుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వ ఖజానాకు భారీగా కన్నం పెడుతున్నారని ఆరోపిస్తున్నాయి. ఇంకోవైపు పాలసీలోని నియమ నిబంధనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వ పరంగా సరైన స్పందన లేదనే చర్చా జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం.. ‘హిల్ట్ పి’ పేరిట జరుగుతున్న తతంగానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. టీజీఐఐసీ లేఖ ఆధారంగానే పాలసీ!ఔటర్ రింగు రోడ్డు లోపల, సమీప ప్రాంతాల్లో 9,292.53 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 22 పారిశ్రామిక వాడల్లోని 4,740.14 ఎకరాల భూమిని ఇతర అవసరాలకు వినియోగించేలా అనుమతించాలని కోరుతూ తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) రాష్ట ప్రభుత్వానికి లేఖ రాసింది. దాని ఆధారంగానే ‘హిల్ట్ పి’కి రూపకల్పన జరిగింది. ఈ నెల 17న జరిగిన కేబినెట్ భేటీ దానికి ఆమోదం తెలిపింది.అయితే ఈ పాలసీ రూపకల్పనలో గతంలో పరిశ్రమల శాఖలో ఏళ్ల తరబడి చక్రం తిప్పిన ఓ కీలక అధికారి పాత్ర ఉన్నట్లు సమాచారం. కాగా పాలసీ రూపకల్పనకు సంబంధించి సంబంధిత శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు ఎవరూ కూడా సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఈ కారణంగానే పాలసీలో శాస్త్రీయత లేకపోవడంతో పాటు ‘హిల్ట్ పి’ లోపాల పుట్టగా తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హడావుడిగా ఎందుకు? ‘హిల్ట్ పి’ కింద.. పారిశ్రామిక భూములను ‘మల్టీ యూజ్ జోన్’గా మార్చి అందులో నివాస, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు, పార్కులు, కల్చరల్ సెంటర్లు వంటివి నిర్మించేలా అనుమతులు ఇస్తారు. అయితే ఈ భూ బదలాయింపు ప్రక్రియను హడావుడిగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తామని ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది.దరఖాస్తు పరిశీలన, ఆమోదం అందుకు అయ్యే డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు వసూలు వంటి ప్రక్రియ అంతా కేవలం 66 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు హిల్ట్ పీ మార్గదర్శకాలు విడుదల చేసిన ఆరు నెలల వరకే దరఖాస్తులు తీసుకుంటామని తెలిపింది. అయితే వేలాది ఎకరాల భూమిని మల్టీ యూజ్ జోన్‌గా మార్చేందుకు సంబంధించిన దరఖాస్తుల గడువును కేవలం ఆరు నెలలుగా నిర్దేశించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ ధరతో ఖజానాకు కన్నంగతంలో (2023) మూడు పారిశ్రామిక వాడల్లోని భూములపై పూర్తి యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్ రైట్స్) కల్పిచేందుకు జారీ చేసిన ఉత్తర్వుల్లో రిజిస్ట్రేషన్ విలువ (ఎస్ఆర్ఓ)పై 100 నుంచి 200 శాతం అదనంగా చెల్లించాలని పేర్కొన్నారు. ఇలా ఫ్రీ హోల్డ్ రైట్స్ దక్కించుకున్న యజమానులు హెచ్ఎండీఏ లేదా పురపాలక శాఖకు ‘ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్’ కోసం అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ‘హిల్ట్ పి’లో మల్టీ యూజ్ జోన్‌గా మార్చుకునేందుకు పరిశ్రమల యజమాన్యాలు ఎస్ఆర్ఓ విలువలో కేవలం 30 నుంచి 50 శాతం చెల్లిస్తే సరిపోతుందని పేర్కొనడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కాగా ఇలా వసూలయ్యే మొత్తంలో నుంచే హెచ్ఎండీఏ లేదా పురపాలక శాఖకు ‘ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్’ చార్జీలు చెల్లిస్తామని పేర్కొన్నారు. పారిశ్రామిక వాడల్లోని భూములకు టీజీఐఐసీ ధరతో పోలిస్తే ఎస్ఆర్ఓ విలువ తక్కువగా ఉంటుంది. కాబట్టి ‘మల్టీ యూజ్ జోన్’గా మార్చుకునేందుకు ఎస్ఆర్ఓ రేటు వసూలు చేస్తేనే ప్రభుత్వ ఖజానాకు గండిపడి, పరిశ్రమల యాజమాన్యాలకు భారీగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అలాంటిది ప్రస్తుతం ఎస్ఆర్ఓ విలువలో కేవలం 30 శాతం మాత్రమే చెల్లిస్తే చాలనడంపై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.పరిశ్రమల్లోని భూములపై స్పష్టత లేకుండానే..ఏళ్ల క్రితం ఏర్పాటైన పారిశ్రామిక వాడల్లో కొన్ని పరిశ్రమలు మూతపడగా, మరికొన్ని పరిశ్రమలు అనధికారికంగా చేతులు మారాయి. కొన్నిచోట్ల ప్రభుత్వం ఇచి్చన లీజు గడువు కూడా ముగిసినట్లు సమాచారం. ఈ అంశాలపై లోతైన కసరత్తు లేకుండా పాలసీని తెచ్చి బదలాయింపునకు పూనుకోవడం వెనుక కొందరు ప్రభుత్వ పెద్దలు, బడా రియల్టర్ల హస్తం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. వీటన్నిటిపై వివరణ ఇవ్వాల్సిన పరిశ్రమల శాఖ మంత్రి.. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోలను ప్రస్తావిస్తూ ఆరోపణలను ఖండించడమే తప్ప..‘హిల్ట్ పి’కి సంబంధించి సరైన వివరణ ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. -
TG: ‘హిల్ట్ పి’కి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘హిల్ట్ పి’ రాజకీయంగా హీట్ పెంచుతున్నా.. ఈ విషయంలో ముందుకే వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగురోడ్డు లోపల, సమీప ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో వినియోగంలో లేని, నిరుపయోగంగా ఉన్న స్థలాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి విధానం–2025 (హిల్ట్ పి)లో భాగంగా పారిశ్రామిక వాడల్లోని భూములను బహుళ వినియోగ జోన్ల కిందకు మారుస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ జీఓ 27 జారీ చేశారు.దీంతో ఈ పారిశ్రామిక వాడల్లో వినియోగానికి అనుకూలమైన భూములను బహుళ ప్రయోజనాలకు అంటే..రెసిడెన్షియల్, కమర్షియల్, ఇన్స్టిట్యూషన్ తదితర కేటగిరీల కింద ఉపయోగించుకునేందుకు అవకాశం ఏర్పడింది. అయితే ఇది రూ.5 లక్షల కోట్ల స్కామ్ అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా ఉన్న భూముల అభివృద్ధి పేరిట సీఎం రేవంత్‌రెడ్డి దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.టీజీఐఐసీ ధరల కంటే సబ్ రిజి్రస్టార్ ఆఫీస్ (ఎస్ఆర్ఓ) రేట్లు తక్కువగా ఉంటాయంటూ, ఆ ఎస్ఆర్ఓ రేటు కంటే తక్కువ విలువకే భూ మారి్పడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని వారు తప్పు పడుతున్నారు. గతంలో తమ ప్రభుత్వం ఎస్ఆర్ఓ విలువ కంటే 100, 200 శాతం అదనంగా వసూలు చేసిందంటూ, ఆ మేరకు ఇచ్చిన జీవోలను ప్రస్తావిస్తున్నారు. బీఆర్ఎస్ ఆరోపణలను పరిశ్రమల మంత్రి డి.శ్రీధర్‌బాబు ఎప్పటికప్పుడు దీటుగా తిప్పికొడుతున్నారు.గతంలో ఆజామాబాద్, బాలానగర్, హఫీజ్‌పేట.. మూడు పారిశ్రామిక వాడల్లోని భూములపై లీజుదారులకు పూర్తి యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్ రైట్స్) ఇచ్చేందుకు 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు వేర్వేరు జీవోలు ఇవ్వడాన్ని ఆయన ప్రశి్నస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ విధంగా ‘హిల్ట్ పి’ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్న సమయంలోనే..ఆ పాలసీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం గమనార్హం. అందుబాటులో 4,740.14 ఎకాల భూమిప్రస్తుతం ఔటర్ రింగురోడ్డు పరిధిలో, దానికి సమీపంలో దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల క్రితం ఏర్పాటైన 22 పారిశ్రామిక వాడలు ఉన్నాయి. వీటికి అప్పట్లో 9,292.53 ఎకరాల భూమి కేటాయించగా.. ప్రస్తుతం అందులో 4,740.14 ఎకాల భూమి వినియోగానికి అందుబాటులో ఉంది. ఈ పారిశ్రామికవాడలన్నీ ఒకప్పుడు నగర శివారు ప్రాంతాలు కాగా.. ఇప్పుడు జనసాంద్రత పెరగడంతో కీలక నగరంలో భాగమయ్యాయి.దీంతో వివిధ కారణాలతో కొంతకాలంగా పలు పరిశ్రమల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ భూములను బహుళ వినియోగ (మల్టీ యూజ్) జోన్లుగా మార్చి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తున్నట్లు పరిశ్రమల శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు పారిశ్రామిక వాడల వారీగా కేటాయించిన భూ విస్తీర్ణం, ప్రస్తుతం మారి్పడికి అనువైన భూ విస్తీర్ణం, వాటికి టీజీఐఐసీ విలువను చదరపు గజాల్లో వెల్లడించగా.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు (ఎస్ఆర్ఓ) విలువను చదరపు మీటర్లలో వెల్లడిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. హిల్ట్ పి అమలవుతుందిలా...! హిల్ట్ పి–2025 ప్రకారం ఈ పారిశ్రామిక వాడల్లోని వినియోగానికి అనుకూలమైన భూములను బహుళ ప్రయోజనాలకు ఉపయోగించుకోవచ్చు. రెసిడెన్షియల్ కేటగిరీలో అపార్ట్మెంట్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్íÙప్లు.. వాణిజ్య కేటగిరీలో ఆఫీసులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, హోటళ్లు.. ఇన్స్టిట్యూషన్ కేటగిరీలో పాఠశాలలు, ఆసుపత్రులు, రీసెర్చ్ సెంటర్లు..రెక్రియేషనల్ కేటగిరీలో పార్కులు, క్రీడా వేదికలు.. ఐటీ/ఐటీఈఎస్ పార్కుల కేటగిరీలో గ్రిడ్ పాలసీకి అనుగుణంగా టెక్ క్యాంపస్‌లకు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ భూ వినియోగ మార్పు ప్రక్రియను హెచ్ఎండీఏ, ఎంఏయూడీ విభాగాలు సమన్వయం చేస్తాయి. ఈ పాలసీ అమలుకు నోడల్ ఏజెన్సీగా తెలంగాణ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) వ్యవహరిస్తుంది. ధరలు ఇలా.. ఈ భూమి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ధరను నిర్దేశించింది. 80 అడుగుల కంటే తక్కువ రోడ్లు ఉన్న ప్లాట్లకు ఎస్ఆర్ఓ రేటులో 30 శాతం, 80 అడుగుల కంటే పెద్ద రోడ్లు ఉంటే 50 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజులోనే భూ వినియోగ చార్జీలు (సీఎల్‌యూ) ఉంటాయి. ఈ చెల్లింపులన్నీ సింగిల్ విండో విధానంలో ఉంటాయి. టీజీఐపాస్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తారు. పారదర్శకత కోసం ఈ ప్రక్రియ అంతా టీజీఐపాస్ పోర్టల్ ద్వారానే సాగుతుంది. దరఖాస్తు సమయంలో 20 శాతం ఫీజు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.దరఖాస్తు అందిన వారం రోజుల్లో టీజీఐఐసీ/ఐలా ప్రాథమిక పరిశీలన పూర్తి చేయాలి. ఆ తర్వాత పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ వారం రోజుల్లో అనుమతులు జారీ చేస్తుంది. తదుపరి వారం రోజుల్లో డిమాండ్ నోటీసులు జారీ చేస్తారు. ఆ తర్వాత 45 రోజుల గడువులో మిగిలిన 80 శాతం రుసుమును రెండు విడతల్లో చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. చెల్లింపుల్లో విఫలమైతే నెలరోజుల్లో ప్రతి స్టేజిలో ఒక శాతం చొప్పున పెనాల్టీ విధిస్తారు.నిర్దిష్ట గడువులోగా చెల్లింపులు చేయడంలో విఫలమైతే దరఖాస్తుదారుడు ఏ విధంగానూ రీఫండ్‌కు అర్హత సాధించరు. హిల్ట్ పి విధానంతో ప్రభుత్వానికి భారీగా పన్నేతర ఆదాయం సమకూరనుంది. హెచ్ఎండీఏ, ఎంఏయూడీలకు చార్జీల రూపంలో ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంలో 25 శాతం టీజీఐఐసీ ప్రత్యేక ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుత ఉత్తర్వులకు హిల్ట్ పి అమలు మార్గదర్శకాలను రూపొందించాలని టీజీఐఐసీని ప్రభుత్వం ఆదేశించింది. -
ఖజానాకు భూమ్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యధికంగా పారిశ్రామిక ల్యాండ్ బ్యాంక్‌ను కలిగిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ).. రాష్ట్ర ఖజానాకు బంగారు బాతులా మారింది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధుల సేకరణలో సర్కారుకు కల్పతరువులా ఉపయోగపడుతోంది. ఎఫ్ఆర్బీఎం వంటి రిజర్వు బ్యాంకు నిబంధనల పరిధిలోకి రాకుండా రాష్ట్ర ఖజానాకు పన్నేతర ఆదాయాన్ని సమకూర్చడంలో టీజీఐఐసీ భూములు అత్యంత కీలకంగా మారుతున్నాయి.నిధులు అవసరమైనప్పుడల్లా పారిశ్రామిక అభివృద్ధి పేరిట టీజీఐఐసీ భూముల వేలం వైపు ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తాకట్టుతో టీజీఐఐసీ ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల రుణం సమకూర్చినట్లు అధికార వర్గాల సమాచారం. అంతకుముందు కూడా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇటీవలి కాలం వరకు టీజీఐఐసీ భూముల ద్వారా రూ. వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వాలు సమకూర్చుకోవడం గమనార్హం. సొంతగా, హెచ్ఎండీఏతో కలిసి..: తెలంగాణ ఆవిర్భావం మొదలుకుని 2023 వరకు టీజీఐఐసీ భూముల వేలం ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.21 వేల కోట్లు ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. టీజీఐఐసీ కొన్నిసార్లు సొంతగా, మరికొన్ని సందర్భాల్లో హెచ్ఎండీఏతో కలిసి భూములు వేలం వేయడంతో పాటు పరిశ్రమలకు భూముల కేటాయింపులు జరిపింది. 2014 నుంచి 2023 మధ్యకాలంలో హెచ్ఎండీఏ, టీజీఐఐసీ ద్వారా వివిధ సందర్భాల్లో 811 ఎకరాలను వేలం వేయడం లేదా కేటాయింపుల ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. తద్వారా రూ.21 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. వాణిజ్యం, రియల్ ఎస్టేట్ అభివృద్ధి పేరిట.. హైదరాబాద్ పరిసరాల్లోని కోకాపేట, ఖానామెట్ భూములు వేలం వేయడం ద్వారా రూ.10 వేలు కోట్లు సమీకరణ లక్ష్యంగా 2019లో సన్నాహాలు ప్రారంభించారు. ఈ మేరకు 2023లోనే జరిగిన భూముల వేలం ద్వారా రూ.2,729 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో వాణిజ్యం, రియల్ ఎస్టేట్ రంగాల అభివృద్ధి కోసం ఈ భూములను వేలం వేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. వేలం ద్వారా సమకూరిన నిధులను రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి, హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు కోసం వెచ్చించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. 400 ఎకరాల తనఖాతో.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంచ గచ్చిబౌలి సర్వే నంబరు 25(పి)లోని 400 ఎకరాలను ఐసీఐసీఐ బ్యాంకుకు తనఖా పెట్టి రూ.10 వేల కోట్ల రుణ సమీకరణ చేసింది. రైతు భరోసా ఇచ్చేందుకు ఈ నిధులు వెచ్చిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత తాకట్టులో ఉన్న ఇవే భూములను అభివృద్ధి చేసి వేలం వేయడం ద్వారా రూ.20 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల మేర నిధులు సమీకరించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలే తాజాగా పెద్దయెత్తున వివాదానికి కారణమయ్యాయి. టాప్‌లో టీజీఐఐసీ పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోని అనేక రాష్ట్రాలు మౌలిక సదుపాయాల సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇదే తరహాలో రాష్ట్రంలో టీజీఐఐసీ ఏర్పాటైంది. అయితే దేశంలోని ఇతర సంస్థలతో పోల్చుకుంటే టీజీఐఐసీ వద్ద అత్యధికంగా సుమారు లక్షన్నర ఎకరాల ల్యాండ్ బ్యాంకు ఉన్నట్టు సమాచారం. ల్యాండ్ బ్యాంకు పరంగా చూస్తే తెలంగాణ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (ఎంఐడీసీ– 48,437 ఎకరాలు), తమిళనాడు (సిప్కాట్– 48,198 ఎకరాలు) ఉన్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హరియాణా రాష్ట్రాల పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థలు గణనీయంగా ల్యాండ్ బ్యాంక్‌లను కలిగి ఉన్నాయి. మేడ్చల్ –సిద్దిపేట జోన్లో ఏకంగా 42,431 ఎకరాలు టీజీఐఐసీ పరిధిలో సైబరాబాద్, మేడ్చల్–సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, పటాన్చెరు, శంషాబాద్, యాదాద్రి, ఖమ్మం, వరంగల్..ఇలా తొమ్మిది పారిశ్రామిక జోన్లు ఉన్నాయి. అయితే ఒక్క మేడ్చల్– సిద్దిపేట జోన్లోనే ఏకంగా 42,431 ఎకరాలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ లెక్కల ప్రకారం తెలంగాణలో 71,613 ఎకరాల్లో ఐటీ, పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటిలో 53,550 ఎకరాల్లో ఐటీ, ఐటీ అనుబంధ సేవలకు చెందిన సంస్థలు ఉన్నాయి. 2,634 ఎకరాల్లో ఎల్రక్టానిక్స్, హార్డ్‌వేర్ సంస్థలు, మరో 10,039 ఎకరాల్లో రక్షణ, ఏరోస్పేస్, ఆహార ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్ రంగాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి. -
భూముల తాకట్టుకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల భూములను తాకట్టు పెట్టి మూలధనం, ఇతర అవసరాల కోసం రూ.10వేల కోట్ల రుణ సేకరణ చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఇకపై వేగం పుంజుకోనున్నాయి. ఫైనాన్స్ సంస్థల నుంచి పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ తీసుకునే రూ.10వేల కోట్ల రుణాలకు గ్యారంటీ ఇచ్చింది. గ్యారంటీ ఇవ్వాలన్న నిర్ణయానికి ప్రభుత్వం శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో ఆమోదం (ర్యాటిఫై) తెలిపింది. రుణ మార్కెట్ నుంచి రూ.10వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు ఆర్బీఐ నిబంధనలు అడ్డుపడుతుండటంతో ప్రభు త్వం కొంతకాలంగా తర్జనభర్జన పడుతోంది.అప్పుల కోసం ప్రభుత్వం తరఫున ఫైనాన్స్ సంస్థల వద్దకు వెళ్లిన మర్చంట్ బ్యాంకర్లు, సవాలక్ష ప్రశ్నలు ఎదుర్కొన్నారు. రూ.10వేల కోట్ల రుణం కోసం రూ.20వేల కోట్ల విలువ చేసే భూములను తాకట్టు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనా రా ష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే రుణం ఇస్తామని ఫైనాన్స్ సంస్థలు మెలిక పెట్టాయి. ప్రభుత్వం గ్యా రంటీ ఇస్తే భూములు తాకట్టు పెట్టి తీసుకునే రుణా లకు కూడా ‘ద్రవ్య బాధ్యత బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్ఆర్బీఎం) నిబంధన వర్తిస్తుందని ఆర్బీఐ వర్గాలు చెప్పినట్లు సమాచారం. దీంతో ఎఫ్ఆర్బీ ఎం పరిధికి లోబడే పరిశ్రమల భూములను తాకట్టు పెట్టి తీసుకుంటున్న రుణాలకు గ్యారంటీ ఇవ్వాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.400 ఎకరాల తాకట్టు..హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన కోకాపేట, రాయదుర్గంలోని రూ.20వేల కోట్ల విలువ చేసే సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భూములను తనఖా పెట్టి రుణం తీసుకున్న అనుభవం ప్రభుత్వ శాఖలకు లేకపోవడంతో మర్చంట్ బ్యాంకర్లకు రుణ సేకరణ బాధ్యత అప్పగించారు. రుణం ఇప్పించే మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం ఒక శాతం చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీషన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. రుణమార్కెట్ నుంచి అప్పులు తేవడంలో అనుభవం కలిగిన మర్చంట్ బ్యాంకర్లను ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం ఎంపిక చేసింది. తాజాగా గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా మర్చంట్ బ్యాంకర్లు రుణ సేకరణ చేయాల్సి ఉంటుంది. -
పారిశ్రామిక భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పారిశ్రామిక భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణ, అభివృద్ధి నేపథ్యంలో టీఎస్ఐఐసీ విభాగపు అధికారులతో మంత్రి శ్రీధర్‌బాబు బషీర్‌బాగ్‌లోని సంస్థ కార్యాలయంలో శనివారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంస్థ కార్యకలాపాలు, విభాగాల పనితీరు, ల్యాండ్ బ్యాంకు, భూ కేటాయింపులు, వాటి వినియోగం తదితర అంశాలపై పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, సంస్థ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, అధికారులతో కలిసి సమీక్షించారు. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత జరిగిన కేటాయింపులపై మంత్రి దృష్టిసారించారు. 2014 తర్వాత జరిగిన భూ కేటాయింపులు, ఏయే కంపెనీలు ఎంత మేర, ఏ అవసరాల కోసం భూమి పొందిందీ.. ప్రస్తుత వినియోగం ఎంత, నిరుపయోగంగా ఉన్న భూముల వ్యవహారాలపై మంత్రి ఆరా తీశారు. ఏళ్లు గడిచినా సంబంధిత కంపెనీలు భూములు వినియోగించుకోకపోవడం.. భూములు పొందిన సంస్థలు వారి ప్రయోజనాలకు కాకుండా థర్డ్ పారీ్టలకు లీజుకు ఇచ్చిన అంశాలపై అధికారుల ద్వారా ఆరా తీశారు, అలా థర్డ్ పారీ్టలకు జరిగిన లీజు అగ్రిమెంట్లు, పొందుతున్న ఆదాయం అంశాలపై నివేదిక సమర్పించాలని సంస్థ ఉన్నతాధికారులను ఆదేశించారు. గతంలో భూములు పొంది, ఈడీ , సీబీఐ లాంటి సంస్థలు జప్తు చేసిన భూములపై హక్కు తిరిగి పొందేలా న్యాయస్థానాల్లో పోరాటం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. జాయింట్ వెంచర్లో భాగంగా పలు సంస్థలు, కంపెనీలు డివిడెండ్, షేర్ హోల్డ్ అమౌంట్ చెల్లించని అంశాలపై నివేదిక అందించాలని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమల శాఖ అధికారుల కృషి చాలా ఉందని, మరింతగా సంస్థ అభివృద్ధి కోసం సూచనలు, సలహాలతో పాటు సమస్యలు కూడా లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఉద్యోగులకు మంత్రి చెప్పారు. ప్రతి అధికారి ఫీల్డ్ విజిట్ చేసి సంబంధిత కంపెనీలకు సంబంధించిన భూములపై అన్ని వివరాలతో త్వరితగతిన నివేదిక అందించాలని సంస్థ ఎండీని మంత్రి ఆదేశించారు. -
పరిశ్రమల భూములు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు తీసుకుని నిర్ణీత గడువులోగా కార్య కలాపాలు ప్రారంభించని వ్యక్తులు, సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. పరిశ్రమల కోసం ప్రభుత్వం భూములు కేటా యించినా అందులో ఎలాంటి కార్యకలాపాలు లేకుండా నిరుపయోగంగా ఉన్న వాటిపైనా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం పరిశ్రమల శాఖ కార్యకలాపాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. భూ కేటాయింపులు పొందిన కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. ‘చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్’పేరిట మార్పిడి చేసుకుని సంబంధిత భూముల్లో ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారి వివరాలను కూడా సేకరించాలని మంత్రి ఆదేశించారు. అన్ని రకాల పరిశ్రమల సమగ్ర సమాచారాన్ని సేకరించి ‘బ్లూ బుక్’ తయారు చేయాలని అధికారులకు సూచించారు. అన్ని రంగాలకు చెందిన సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమల వివరాలు సమగ్రంగా ఉండేలా చూడాలని, తద్వారా రాష్ట్ర పారిశ్రామిక సమ్మిళిత స్ఫూర్తి ఇతర కార్యక్రమాలకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎస్ఎఫ్సీ విస్తరణకు ప్రణాళిక.. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్సీ) కార్యకలాపాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని, దీనికి అవసరమైన సాయాన్ని అందిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఎస్ఎఫ్సీ విభజనకు సంబంధించి మంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా టీఎస్ఎఫ్సీ ‘ఈ–ఎస్ఎఫ్సీ డిజిటల్ ప్లాట్‌ఫాం’ను మంత్రి ఆవిష్కరించారు. -
నాయకుల డైరెక్షన్లో రాజీకి యత్నం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: షాబాద్ మండలం చందనవెళ్లి పారిశ్రామికవాడ భూ పరిహారం పంపిణీలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు రాజకీయ నేతలు యత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మధ్య రాజీ కుదిర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా.. పెద్దల డైరెక్షన్లోనే స్థానిక పోలీసులు మధ్యవర్తిత్వం నెరుపుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పోలీసుల తీరు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల వ్యవహారశైలి ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. పారిశ్రామికవాడ కోసం చేపట్టిన భూసేకరణలో రైతులకు పరిహారం పంపిణీలో దాదాపు రూ.2.6 కోట్ల మేర అక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. రాజకీయ పలుకుబడి, అధికారుల అండతో అనర్హులు పరిహారాన్ని అందిన కాడికి మెక్కేశారు. స్థానిక సర్పంచ్, ఆయన కుటుంబ సభ్యులు, తన సన్నిహితులే అక్రమంగా లబ్ధిపొందారని జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా గుర్తించి 15 మంది జాబితా విడుదల చేసింది. అయితే, వీరు తమను బెదిరించి పరిహారం తీసుకుని అన్యాయం చేశారని ఐదుగురు బాధితులు ఈనెల 24న షాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఐదుగురి వ్యక్తుల పేర్లను పేర్కొంటూ సీఐ నర్సయ్యకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే, రెండు రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శని, ఆదివారం సెలవులని, సోమవారం తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు ఫిర్యాదు చేసిన రోజు బాధితులకు నచ్చజెప్పి ఇంటికి పంపించారు. ఇంకా కేసు నమోదు చేయకపోవడంపై వారి వ్యవహారశైలిపై పలు విమర్శలు వస్తున్నాయి. నేతల అక్షింతలు అక్రమంగా పరిహారం కొట్టేసిన వ్యవహారంలో రాజకీయ పెద్దల హస్తం ఉందని పేర్కొంటూ ‘పెద్దలే.. గద్దలై’ శీర్షికన ఈనెల 25న ‘సాక్షి’ ప్రచురించిన కథనం కలకలం రేపింది. దీంతో జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. షాబాద్ మండలంలో అధికార పార్టీ నేతలపై ఈమేరకు వారు సీరియస్ అయినట్లు వినికిడి. మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నా.. కనీసం ఖండించడం లేదని, ఫలితంగా పరిహారాన్ని నిజంగా నొక్కేశారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి అక్షింతలు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాయకులంతా ఒక్కటై సోమవారం ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలను ఖండించారు. తాము న్యాయబద్ధంగానే పరిహారం తీసుకున్నామని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. నేడు కలెక్టర్‌కు వివరణ.. పరిహారాన్ని అక్రమంగా నొక్కేశారని కలెక్టర్ లోకేశ్‌కుమార్ చేపట్టిన ప్రాథమిక విచారణలో తేలిన విషయం తెలిసిందే. ఎలాంటి అర్హత లేకున్నా మొత్తం 15 మంది రూ.2.6 కోట్లు కాజేశారని పేర్కొంటూ వారికి ఈనెల 23న నోటీసులు జారీ చేశారు. ఈనెల 27 లోపు దీనిపై వివరణ ఇవ్వాలని సూచించారు. లేదంటే రికవరీ యాక్ట్ అమలు చేసి సొమ్మును వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. ఈక్రమంలో తమ వద్ద ఉన్న ఆధారాలతో మంగళవారం కలెక్టర్‌కు వివరణ ఇచ్చేందుకు 15 మంది సిద్ధమైనట్లు తెలిసింది. అనంతరం ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజీ కోసం కబురు.. రాజకీయ నేతల డైరెక్షన్లో స్థానిక పోలీసులు రాజీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన బాధితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి షాబాద్ పోలీసులు సోమవారం ఫోన్ చేసి ఠాణాకు రావాలని చెప్పినట్లు తెలిసింది. మంగళవారం ఇరు పక్షాలు తమ వద్ద ఉన్న ఆధారాలతో హాజరుకావాలని సూచించినట్లు సమాచారం. ఆధారాలను బట్టి తదుపరి చర్యల కోసం ఆలోచిస్తామన్నారని వినికిడి. చదవండి: రాజకీయ అండతో పెద్దలే.. గద్దలై! -
రాజకీయ అండతో పెద్దలే.. గద్దలై!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: షాబాద్ మండలం చందనవెల్లి పారిశ్రామికవాడలో భూములు కోల్పోయిన రైతులకు అందాల్సిన పరిహారాన్ని రాజకీయ పెద్దలే గద్దలుగా భోంచేశారు. 170 మంది రైతులకు రూ.60.20 కోట్ల పరిహారం అందజేయగా.. ఇందులో సుమారు రూ.4 కోట్ల వరకు అనర్హుల పేర్లతో మెక్కేశారు. ఇప్పటికే 15 మంది రూ.2.6 కోట్లు అక్రమంగా నొక్కినట్లు యంత్రాంగం గుర్తించి వివరణ కోసం నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఇదిగాక మరో రూ.2 కోట్ల వరకు పక్కదారి పట్టినట్లు సమాచారం. ఈ మొత్తంలో ఎవరెవరికి.. ఎంత దక్కిందనేది విచారణలో తేలనుంది. స్థానిక సర్పంచ్ కొలాన్ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అతని సన్నిహితులు, మాజీ సర్పంచ్‌లు జట్టుగా ఏర్పడి కొల్లగొట్టినట్లు విచారణలో వెల్లడవుతున్నట్లు సమాచారం. మరణించిన మాజీ సైనికుడి పేరు మీద ఉన్న ఐదెకరాల భూమిని సర్పంచ్ సోదరుడు కొలాన్ సుధాకర్‌రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తద్వారా రూ.45 లక్షల పరిహారాన్ని కాజేశారని ప్రచారం జరుగుతోంది. సైనికులకు ప్రభుత్వం పంపిణీ చేసిన పదేళ్ల తర్వాత సదరు భూమిని విక్రయించుకునే వీలుంది. అయితే ఇందుకు తప్పనిసరిగా యంత్రాంగం జారీచేసిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఉండాలి. ఎన్ఓసీ లేకుండానే ఎలా కొనుగోలు చేశారన్నది, రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందన్న అంశంపై యంత్రాంగం విచారణ జరుపుతోంది. అంతేగాక అసలు భూమి లేకున్నా చాలా మంది పేర్లు డిక్లరేషన్ జాబితాలో చేర్చి పరిహారం పొందారు. కాగా, తమకు న్యాయం జరిగేంతవరకు దీక్షను కొనసాగిస్తామని బాధితులు స్పష్టం చేస్తున్నారు. బాధితుల రిలే నిరాహార దీక్ష శనివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. శిబిరంలో అర్ధనగ్న ప్రదర్శన చేయడంతోపాటు నోటికి నల్లరిబ్బన్ ధరించి మౌనప్రదర్శన చేశారు. పోలీసులకు బాధితుల ఫిర్యాదు.. షాబాద్ (చేవెళ్ల): చందనవెళ్లి భూముల పరిహారంలో అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై బాధిత రైతులు షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను బెదిరించి పరిహారాన్ని దౌర్జన్యంగా తీసుకున్నారని వివరించారు. చందనవెల్లి ప్రస్తుత సర్పంచ్ కొలాన్ ప్రభాకర్‌రెడ్డి, కొలన్ సుధాకర్‌రెడ్డి, శ్రీలత, బషీర్, వెంకటయ్యలపై సీఐ నర్సయ్యకు బాధిత రైతులు ఎం.సత్యనారాయణ, ఎం.రాజు, జరినాబేగం, ఎ.సత్తమ్మ, అజహర్ ఫిర్యాదు చేశారు. తమ భూములకు సంబంధించిన నష్టపరిహారాన్ని తమకు తెలియకుండా సర్పంచ్ కుటుంబీకులు పొందారని తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తమకు న్యాయం చేయాలని గత 26 రోజులుగా రిలే నిరహార దీక్ష చేపడుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. బాధితులకు తెలియకుండానే వారి చెక్కులను మద్యవర్తులు మార్చుకుని తమ ఖాతాల్లో వేసుకున్నట్లు చెప్పారు. తనకు వచ్చిన రూ.12లక్షలను మాజీ సర్పంచ్ కుమారుడు వెంకటయ్య తన ఖాతాలో వేసుకుని డబ్బులు ఇవ్వనని బెదిరించాడని జరినాబేగం ఫిర్యాదులో పేర్కొంది. చందనవెల్లి భూముల పరిహారంలో జరిగిన అక్రమాలపై సరైన విచారణ జరిపించి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న సీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కలెక్టర్, తన పైఅధికారు దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. -
పరిశ్రమల భూములు తనఖాకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటునకు కేటాయించే ప్రభుత్వ భూములను ఆ సంస్థలు తనఖా పెట్టుకోవడానికి అనుమతించడం తదితర అంశాలపైన, అలాగే గతంలో ఏ రంగం పరిశ్రమలకు ఎంత భూమి కేటాయించాలనే దానిపై ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో సవరణలకు ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఏ రంగానికి చెందిన పరిశ్రమలకు ఎంత భూమి కేటాయించాలి, అలాగే ప్రభుత్వ భూములను నిధుల కోసం విక్రయించరాదని, అసైన్డ్ భూములను ఎవరైనా అనధికారికంగా కొనుగోలుచేస్తే అలాంటి భూములను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడం తదితర అంశాలతో జీవోలు 571, 607లను జారీ చేసింది. ఇప్పుడు ఆ జీవోలను పూర్తి స్థాయిలో సమీక్షించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆ జీవోల్లో సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ శాఖ) కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడులతో కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు సోమవారం జీవో జారీ చేశారు.


