breaking news
Indian Mujahideen (IM)
-
అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్
ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మారిన ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్‌సీఎఫ్) కో–ఫౌండర్ సాదిక్ ఇష్రార్ షేక్– భత్కల్‌లో తన పరిచయాలను వాడుకుని అక్కడి వారినీ ఐఎంలో చేర్చుకున్నాడు. 2005 నుంచి విధ్వంసాలు ప్రారంభించిన ఐఎం పేరు 2007లో బయటకు పడింది. ఈ ఉగ్రవాదుల గుట్టు 2008లో వీడింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన సాదిక్ ఇష్రార్ షేక్ మాదిరిగానే కర్ణాటకలోని భత్కల్‌కు చెందిన అన్నదమ్ములు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌లకూ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్‌తో (సిమి) సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ముగ్గురికీ పరిచయం ఏర్పడింది. రియాజ్, ఇక్బాల్‌లు ముంబైలో ఉంటూ గ్యాంగ్‌స్టర్స్‌గా మారారు. అక్కడే ‘ఆర్ఏఎన్ గ్యాంగ్’ పేరుతో ఓ ముఠా ఏర్పాటు చేసి, నేరాలు చేసేవారు. ఓ హత్య కేసులో ముంబై పోలీసుల నుంచి ఒత్తిడి పెరగటంతో భత్కల్‌కు వెళ్లి కొన్నాళ్లు షెల్టర్ తీసుకున్నారు. తర్వాత ఈ ఇద్దరూ కూడా సాదిక్ బాటలోనే ఐఎంలో చేరారు. భత్కల్ సోదరులు, సాదిక్ కలిసి ఐఎంలోకి అటు ఆజంగఢ్, ఇటు భత్కల్ ప్రాంతాలకు చెందిన పలువురు యువకుల్ని చేర్చారు. వీరిలో కొందరు అక్రమంగా సరిహద్దులు దాటి వెళ్లి పాక్‌లో శిక్షణ పొంది వచ్చారు. పాకిస్తాన్ ప్రమేయం లేకుండా కార్యకలాపాలు సాగించాలని నిర్ణయించిన ఈ దేశవాళీ ఉగ్రవాద సంస్థ పేలుడు పదార్థాలనూ స్థానికంగానే సమకూర్చుకుంది. వారణాసిలోని దశాశ్వమేధఘాట్‌లో 2005 ఫిబ్రవరి 23న తొలి పేలుడుకు పాల్పడింది. అదే ఏడాది జూలై 29న యూపీలో శ్రమ్‌జీవి ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 29న ఢిల్లీలోని సరోజినీ మార్కెట్, 2006 మార్చి 7న వారణాసిలోని సంకట్ మోచన్ ఆలయం, అదే ఏడాది జూలై 11న ముంబై లోకల్ రైళ్లు, 2007 మే 22న గోరఖ్‌పూర్‌లో, అదే ఏడాది ఆగస్టు 25న హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ లేజేరియంల్లో పేలుళ్లకు పాల్పడి అనేక మందిని పొట్టనపెట్టుకుంది. అయినా ఇదంతా చేస్తున్నదెవరో ఏ ఒక్క నిఘా సంస్థకూ తెలియలేదు. 2007 నవంబర్ 23న లక్నో, ఫరీదాబాద్, వారణాసిల్లో వరుస పేలుళ్లు జరిగాయి. దీనికి కొన్ని నిమిషాల ముందు వివిధ మీడియా సంస్థలకు ఓ ఈ–మెయిల్ వచ్చింది. దీని ద్వారానే తొలిసారిగా ఇండియన్ ముజాహిదీన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ ఉగ్రవాద సంస్థ పేరు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా నిఘా సంస్థలు చాన్నాళ్ల వరకు ఏమీ చేయలేకపోయాయి. ఫలితంగా 2008 మేలో జైపూర్ పేలుళ్లు జరిగాయి. తర్వాత ఐఎం ఉగ్రవాదులు ఆ ఏడాది జూలైలో గుజరాత్‌ను టార్గెట్ చేశారు. అహ్మదాబాద్‌లో భారీ విధ్వంసానికి కుట్రపన్నారు. ఈ ఆపరేషన్‌కు ‘ది పూల్ ఆఫ్ ఆల్ టెర్రరిస్టు’ అని పేరుపెట్టి, ఐఎం 2008 జూలై 26న అహ్మదాబాద్‌లో 17 పేళ్లకు పాల్పడ్డారు. సూరత్‌లోనూ కొన్ని పేలని బాంబులు పోలీసులకు దొరికాయి. ఈ బాంబుల్లో కొన్నింటిని ఉగ్రవాదులు వాహనాల్లో అమర్చారు. అక్కడే ఐఎం గుట్టు వీడటానికి అవసరమైన తొలి ఆధారం దొరికింది. రియాజ్ భత్కల్ కుర్లాలో ఉండగా బాంద్రాలో యాద్గార్ ఫ్యామిలీ రెస్టరెంట్ నిర్వహించే అఫ్జల్ ఉస్మానీతో పరిచయం ఏర్పడింది. ఒకప్పుడు వాహన చోరీలకు పాల్పడిన ఇతడికి ముంబైలో ఉన్న అనేక మంది దొంగలతో పరిచయాలు ఉన్నాయి. అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్లకు పథకం వేసిన సాదిక్, రియాజ్‌లు అందుకు అవసరమైన వాహనాల సరఫరా బాధ్యతల్ని అఫ్జల్ ఉస్మానీకి అప్పగించారు. ఉస్మానీ ముంబైలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాహన చోరులతో కార్లను దొంగతనం చేయించి; వాటిని అహ్మదాబాద్, సూరత్‌లకు చేర్చాడు. ఈ పేలుళ్లకు కొన్ని రోజుల ముందు రియాజ్ ఆదేశాల మేరకు ఆతిఫ్ అమీన్ అనే ఐఎం ఉగ్రవాది ముంబై వెళ్లి అఫ్జల్‌ను కలిశాడు. పేలుళ్లు జరిగిన వెంటనే వారిద్దరూ అక్కడి నుంచి రైలులో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి జామియానగర్‌లోని బాట్లా హౌస్ అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో కొన్నాళ్లు ఉండి వచ్చేశారు. అహ్మదాబాద్ పేలుళ్ల కేసు దర్యాప్తు చేసిన ఆ రాష్ట్ర ఏటీఎస్ అధికారులు వాహనాల నంబర్ల ఆధారంగా ముంబైలో చోరీ అయినట్లు గుర్తించారు.దీంతో మహారాష్ట్ర ఏటీఎస్, క్రైమ్‌బ్రాంచ్‌లు రంగంలోకి దిగి, నలుగురు వాహనచోరుల్ని పట్టుకుని విచారించాయి. అఫ్జల్ ఉస్మానీ ఆదేశాల మేరకు పని చేశామని వారు వెల్లడించారు. అహ్మదాబాద్ పేలుళ్ల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఉస్మానీ 2008 ఆగస్టు 21న ఉత్తరప్రదేశ్‌లో చిక్కాడు. ఇతడి ఇంటరాగేషన్‌లోనే రియాజ్ పేరు, ఇతర వివరాలు బయటపడ్డాయి. తనకు వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియదని చెప్పిన ఉస్మానీ– ఓసారి మాత్రం బాట్లా హౌస్‌కు వెళ్లానని, అక్కడి ఎల్–18 ఫ్లాట్‌లో డెన్ ఉందని బయటపెట్టాడు. ఆ అపార్ట్‌మెంట్‌పై నిఘా పెట్టిన అహ్మదాబాద్, ముంబై పోలీసులు అక్కడ ఉగ్రవాదులు ఉన్నారని, వారి వద్ద ఆయుధాలు ఉన్నాయని గుర్తించారు. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులను అప్రమత్తం చేశారు. 2008 సెప్టెంబర్ 19న ఇన్స్పెక్టర్ మోహన్‌చంద్ శర్మ నేతృత్వంలోని బృందం ఆ ఫ్లాట్‌పై దాడి చేసింది. అక్కడ జరిగిన ఎన్కౌంటర్లో ఇన్స్పెక్టర్ శర్మతో పాటు ఉగ్రవాదులు ఆతిఫ్ అమీన్, మహ్మద్ సాజిద్ చనిపోయారు. ఆ ఎన్కౌంటర్లో సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది ఆరిజ్ ఖాన్ విచారణలో ఐఎం గుట్టు వీడి, ఉగ్రవాదుల అరెస్టులు ప్రారంభమై దుశ్చర్యలకు బ్రేక్ పడింది.(బాట్లా హౌస్ ఎన్కౌంటర్ తర్వాత దేశ వ్యాప్తంగా అరెస్టులు జరిగాయి. వీటిని తప్పించుకోవడానికి రియాజ్, ఇక్బాల్, సాదిక్ సహా అనేక మంది గజ ఉగ్రవాదులు హైదరాబాద్ బాటపట్టారు. ఇక్కడికే ఎందుకు వచ్చారు? ఎవరి వద్ద షెల్టర్ పొందారు..? తదితర వివరాలతో తుది భాగం ‘చలో హైదరాబాద్!’ వచ్చే వారం)-శ్రీరంగం కామేష్ -
ఐఎంగా ఏఆర్‌సీఎఫ్!
ఢిల్లీలోని తీహార్ జైలులో మసూద్ అజర్, ఒమర్ షేక్, అహ్మద్ జర్గర్లతో ఏర్పడిన పరిచయం అఫ్తాబ్ అన్సారీ, ఆసిఫ్ రజాలను ఉగ్రవాదం వైపు మళ్లించింది. ఖాదిమ్స్ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ సహా పలువురిని కిడ్నాప్ చేసి, భారీ వసూళ్లకు పాల్పడింది. బర్మన్ కుటుంబం నుంచి తీసుకున్న మొత్తంలో రూ.కోటి హైదరాబాద్ మీదుగా అమెరికాలో జరిగిన 9/11 దాడులకు ఫండ్‌గా చేరింది. 2001లో ఆసిఫ్ రజా ఎన్కౌంటర్ తర్వాత తెరపైకి వచ్చిన అతడి సోదరుడు అమీర్ రజా ఖాన్... ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్‌సీఎఫ్) ఏర్పాటు చేశాడు. తర్వాత ఇదే ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మారింది. ఈ ఐఎం ఉగ్రవాదులే 2007, 2013ల్లో హైదరాబాద్‌పై విరుచుకుపడి 61 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఏఆర్‌సీఎఫ్... ఐఎంగా ఎలా మారిందంటే..!కోల్‌కతాకు చెందిన కన్స్ట్రక్షన్ వ్యాపారి ఇషాఖీ అలీ ఖాన్ పెద్ద కొడుకు ఆసిఫ్ రజా ఖాన్ కోల్‌కతాలోని మౌలానా ఆజాద్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటికే అతడికి నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాతో (సిమి) సంబంధాలు ఉన్నాయి. ఆపై ఆఫ్తాబ్ అన్సారీతో కలిసి 1997 నుంచి అనేక నేరాలు చేస్తూ, దేశవ్యాప్తంగా జరిగే ‘సిమి’ కార్యక్రమాలకు వెళ్లేవాడు. హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన ముజాహిద్ సలీం (2004లో డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో మరణించాడు) కూడా వీటికి వెళ్లేవాడు. అలా ఇద్దరూ స్నేహితులయ్యారు. ముజాహిద్ సోదరికి ముంబై శివార్లలోని చీతాక్యాంప్‌కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. 2001 ఏప్రిల్‌లో తన సోదరి ఇంట్లో జరిగిన శుభ కార్యానికి ముజాహిద్ సలీం కూడా హాజరయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లో ఆజమ్గఢ్ నుంచి ముంబైలోని అంధేరీకి వలస వచ్చిన మహ్మద్ సాదిక్ ఇష్రార్ షేక్ (2007 నాటి హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో దోషి) అక్కడి ఓ కంప్యూటర్స్‌లో డెస్క్‌టాప్ ఇంజనీర్‌గా పని చేసేవాడు. ముజాహిద్ సలీం బావకు ఇతడు సమీప బంధువు కావడంతో ఇతడు కూడా ఆ శుభకార్యానికి వెళ్లాడు. అక్కడే ముజాహిద్ సలీంతో సాదిక్ ఇష్రార్ షేక్‌కు పరిచయం ఏర్పడగా, కేవలం రెండు రోజుల్లోనే సాదిక్‌ను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. సాదిక్‌ను చితాక్యాంప్‌లోని ఓ సైబర్‌కేఫ్‌కు తీసుకువెళ్లిన సలీం అతడికి ఈ–మెయిల్ ఐడీ రూపొందించి ఇచ్చాడు. దాన్ని క్రమం తప్పకుండా ఓపెన్ చేసి చూస్తుండాలని, ఈ–మెయిల్ ద్వారానే ఓ వ్యక్తి పరిచయం అవుతాడని చెప్పాడు. మరోపక్క సాదిక్ మెయిల్ ఐడీని ఆసిఫ్ రజా ఖాన్‌కు అందించిన సలీం అతడిని ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుకోవచ్చని చెప్పాడు. దీంతో 2001 జూలైలో సాదిక్‌కు తొలి మెయిల్ పంపిన ఆసిఫ్– అప్పటి నుంచి క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపేవాడు. చీతా క్యాంప్‌లోని మదీనా హోటల్ వద్ద ఈ ద్వయం కలుసుకున్నాక సాదిక్... ఆసిఫ్‌తో కలిసి పని చేయడం ప్రారంభించాడు ఐసీ 814 ఉదంతం తర్వాత జైలు నుంచి విడుదలై పాకిస్థాన్ చేరిన మసూద్ అజర్ జైష్ ఏ మహ్మద్ (జేఈఎం) స్థాపించాక అందులో చేరతాడు. కిడ్నాప్‌లు, బెదిరింపు వసూళ్లకు పాల్పడే ఆసిఫ్ ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు అందించేవాడు. ఇలా వివిధ రాష్ట్రాలతో పాటు సీబీఐకి ఆసిఫ్ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్‌గా మారింది. 2001 అక్టోబర్ 29న ఢిల్లీ స్పెషల్ సెల్‌తో కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించే సీబీఐ ఢిల్లీ, గుర్గావ్, గుజరాత్‌ల్లో పలువురిని అరెస్టు చేసింది. అలా చిక్కిన వారిలో ఆసిఫ్ రజా ఖాన్ కూడా ఉన్నాడు. అప్పటికే అఫ్తాబ్, ఆసిఫ్‌పై నమోదై ఉన్న కేసుల్లో భాస్కర్ పరేఖ్, పరేష్ షా కిడ్నాప్ ఒకటి. 2000 నవంబర్‌లో 11 గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో సిమ్లా మిర్చి రెస్టారెంట్ వద్ద ఈ ఇద్దరు వస్త్ర వ్యాపారుల్నీ వీరి గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అప్పటికి ఇది కేవలం గ్యాంగ్‌స్టర్ ముఠానే. ఈ కేసులో జైలుకు వెళిన్ల ఆసిఫ్ రజా ఖాన్ బెయిల్‌పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు గైర్హాజరవడంతో ఇతడిపై రాజ్‌కోట్ కోర్టు నాన్–బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఆసిఫ్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న రాజ్‌కోట్ పోలీసులు తమ వద్ద ఉన్న వారంట్ అమలుకు ఉపక్రమించారు. 2001 డిసెంబర్ 7న ఢిల్లీ వెళ్లే రాజ్‌కోట్ పోలీసులు ఆసిఫ్‌ను తీసుకుని తిరిగి వస్తుండగా, వీరి వాహనం సర్దార్ ఔట్ పోస్టు వద్దకు చేరుకునే సమయానికి ఆసిఫ్ రజా ఖాన్ కాలకృత్యాలు తీర్చుకోవాలని పోలీసుల్ని కోరాడు. దీంతో వాహనాన్ని ఆపే పోలీసులు అతడి సంకెళ్లు తీయగా, ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వద్ద నుంచి ఏకే–47 లాక్కుని పోలీసులపై కాల్పులకు ప్రయత్నించాడు. ఈ సందర్భంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆసిఫ్ మరణించాడు.ఆసిఫ్ మృతితో అతడి సోదరుడు అమీర్ రజా ఖాన్... ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్‌సీఎఫ్) ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి సాదిక్ అతడితో కలిసి పని చేయడం ప్రారంభించాడు. 2002 జనవరిలో ఏఆర్‌సీఏఫ్ కోల్‌కతాలోని అమెరికన్ కాన్సులేట్ సమీపంలోని యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌పై (యూఎస్ఐఎస్) దాడికి కుట్రపన్నింది. రెండు రోజుల పాటు దాని వద్ద రెక్కీ చేసే సాదిక్ అందించిన కీలక సమాచారంతోనే ఆ దాడి జరిగింది. ఇలాంటి దాడులతో మోస్ట్ వాంటెడ్‌గా మారిన అమీర్ రజా ఖాన్ పాకిస్తాన్‌కు చేరుకున్నాడు. అక్కడే ఐఎస్ఐ అతడిని తనకు అనువుగా మార్చకుని, భారత్‌లో ఉగ్రవాద దాడుల కోసం దేశవాళీ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో తన ఏఆర్‌సీఎఫ్‌ను అమీర్ రజా ఖాన్ 2003లో ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మార్చాడు. దీనికి సాదిక్ ఇష్రార్ షేక్ కో–ఫౌండర్‌గా వ్యవహరించాడు. అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్!2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించిన ఇండియన్ ముజాహిదీన్ పేరు 2007లో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్–లుంబినీ పార్క్ సహా అనేక విధ్వంసాలకు పాల్పడిన ఈ ముష్కరులు చాలాకాలం చిక్కలేదు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో పట్టుబడిన వాహనచోరుడు ఇచ్చిన ఢిల్లీ చిరునామాతో దీని గుట్టు వీడింది. ఈ పూర్వాపరాలతో పార్ట్–4 ‘అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్!’ వచ్చేవారం. -
దర్బాంగా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసులో ఉగ్రకుట్ర
-
దర్భంగా పేలుడు కేసులో ఉగ్ర కుట్ర..!
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుడు కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఈనెల 17న బీహార్‌లోని దర్భంగా రైల్వేస్టేషన్లో పార్సిల్ పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనక ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇప్పటికే హైదరాబాద్‌లో ఉంటున్న ఇద్దరిని అరెస్ట్ చేసింది. నిందితులైన అన్నదమ్ములు ఇమ్రాన్, నాసిర్ బిహార్ నుంచి కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పెద్దమొత్తంలో పేలుడు పదార్ధాలు తరలించారు. ఈ క్రమంలో అధికారులు సికింద్రబాద్ స్టేషన్లో అన్నదమ్ముల సీసీఫుటేజ్‌ని సేకరించారు. వీరు ఈ నెల 15న సోఫియాన్ పేరు మీద పార్శిల్ బుక్ చేశారు. ఇక నిందితులు దర్భంగా రైలును పేల్చేయాలని కుట్ర పన్నారని.. తద్వారా భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం కలిగించాలని భావించినట్లు అధికారులు తెలిపారు. అర్షద్ కోసం ఎన్ఐఏ అధికారులు గాలింపు చర్యలు ప్రారంభిచారు. అతడు దర్భంగా రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 17న బిహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్లో పార్సిళ్లు దింపుతుండగా పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. దుస్తుల మధ్యలో ఉంచిన చిన్న సీసా నుంచి తొలుత పొగలు వచ్చి తర్వాత పేలుడు జరిగింది. దర్యాప్తులో ఈ దుస్తుల పార్సిల్ సికింద్రాబాద్‌లో బుక్ చేసినట్లు గుర్తించి ఇక్కడి నుంచీ దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో ఉగ్రకుట్ర ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఢిల్లీ ఎన్ఐఏకు కేసు బదిలీ చేశారు. తెలంగాణ పోలీసులు, బిహార్, యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) సిబ్బంది వీరికి సహకరిస్తున్నారు. ఈ కేసులో రెండు రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు శామిలీ జిల్లాలోని ఖైరానా అనే ఊర్లో మహ్మద్ హజీ సలీమ్ ఖాసీం, మహ్మద్ కాఫిల్ అనే తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో ఇమ్రాన్, నాసిర్ అనే ఇద్దరు అన్నదమ్ముల్ని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు విచారణ కోసం ఢిల్లీ తీసుకెళ్లారు. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారేనని, చాలాకాలంగా హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో అద్దెకు ఉంటూ రెడీమేడ్ దుస్తులు విక్రయిస్తున్నారని తేలింది. చదవండి: ముంబై నుంచి తీసుకెళ్తేనే.. స్టేట్మెంట్ ఇస్తా -
ముంబై నుంచి తీసుకెళ్తేనే.. స్టేట్మెంట్ ఇస్తా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్–లుంబినీ పార్క్‌ల్లో 2007 ఆగస్టు 25న చోటు చేసుకున్న జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న అనీఖ్ షఫీఖ్ సయీద్ ‘మారా’ చేస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలోని తలోజ జైల్లో ఉన్న ఇతడిపై అహ్మదాబాద్ కోర్టులో విచారణ సాగుతోంది. అయితే తనను ముంబై నుంచి తీసుకెళ్తేనే వాంగ్మూలం ఇస్తానంటూ తన లాయర్ ద్వారా అహ్మదాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయించాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)కు చెందిన ఈ ఉగ్రవాదికి హైదరాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం 2018లో ఉరి శిక్ష విధించింది. అనీఖ్ స్వస్థలం మహారాష్ట్రలోని పుణె. ఇతగాడికి ఖలీద్ అనే మారు పేరు కూడా ఉంది. పుణెలో కంప్యూటర్లు, మొబైల్స్ దుకాణం నిర్వహించేవాడు. ఐఎంలో కీలక ఉగ్రవాది అయిన రియాజ్ భత్కల్ ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. గోకుల్‌చాట్–లుంబినీ పార్క్ పేలుళ్ల కోసం సిటీకి వచ్చినప్పుడు తన పేరును సతీష్‌గా మార్చుకున్నాడు. రియాజ్ ఆదేశాల మేరకు మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరితో కలిసి 2007 జూలైలో హైదరాబాద్ వచ్చారు. అదే ఏడాది ఆగస్టు 25న రియాజ్ భత్కల్ గోకుల్ ఛాట్‌లో, అనీఖ్ షఫీఖ్ లుంబినీపార్క్‌లో బాంబులు అమర్చగా... మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి దిల్‌షుక్‌నగర్‌లో బాంబు పెట్టాడు. మొదటి రెండూ పేలగా, మూడోదానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులతో పాటు అనీఖ్ కూడా అరెస్టయ్యాడు. ఈ కేసుల విచారణ 2018లో పూర్తికావడంతో న్యాయస్థానం అనీఖ్‌కు ఉరి శిక్ష విధించింది. అయితే మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో ఐఎం సృష్టించిన వరుస పేలుళ్లలోనూ అనీఖ్ కీలక పాత్ర పోషించాడు. దీంతో మహారాష్ట్ర పోలీసులు తమ కేసుల విచారణ కోసం ముంబైకి తరలించారు. ప్రస్తుతం తలోజ జైల్లో ఉన్న ఇతడిపై అహ్మదాబాద్ కోర్టులోనూ విచారణ జరుగుతోంది. దీంతో లాక్డౌన్ మొదలయ్యే వరకు అనీఖ్‌కు అవసరమైన ప్రతి సందర్భంలోనూ ముంబై నుంచి అహ్మదాబాద్‌కు తీసుకువెళ్లేవారు. కరోనా నేపథ్యంలో అహ్మదాబాద్ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ ప్రారంభించడంతో అతను అప్పటి నుంచి జైలుకే పరిమితమయ్యాడు. అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో ఇతడి నుంచి అక్కడి కోర్టు అదనపు వాంగ్మూలం నమోదు చేయాలని భావించింది. దీంతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తలోజ జైలులో ఉన్న అనీఖ్ వాంగ్మూలం రికార్డుకు ఆదేశాలు ఇచ్చింది. అయితే తాను అలా స్టేట్మెంట్ ఇవ్వనంటూ ఈ ఉగ్రవాది స్పష్టం చేశాడు. తనను తలోజ జైలు నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలుకు తరలిస్తేనే వాంగ్మూలం ఇస్తానంటూ అందులో పేర్కొన్నాడు. తలోజ జైలు అధికారులు తనకు అహ్మదాబాద్ కేసుకు సంబంధించిన రికార్డులు ఇవ్వలేదని తన పిటిషన్లో వివరించాడు. లాక్‌డౌన్‌కు ముందే తనను సబర్మతి జైలుకు తరలించేందుకు కోర్టు వారెంట్ ఇచ్చిందని, దీనిని పట్టించుకోని తలోజ జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నాడు. కేసుల విచారణకు అడ్డంకులు సృష్టించి, జాప్యం చేయడానికే ఇతగాడు ఇలా వ్యవహరిస్తున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అనీఖ్‌కు ఇప్పటికే హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడింది. మిగిలిన కేసుల విచారణ పూర్తయిన తర్వాతే దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కేసుల విచారణకు పొడిగిస్తే శిక్ష అమలు కూడా మరింత ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో అనీఖ్ ఇలా చేస్తున్నాడని పేర్కొంటున్నారు. -
‘కొత్త’ వాళ్ల లెక్క ఇక పక్కా!
2007లో గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో బాంబు దాడికి పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు హబ్సిగూడలోని బంజారా నిలయం అపార్ట్మెంట్లో విద్యార్థుల ముసుగులో అద్దెకు దిగారు. ఈ ఘటన తర్వాత అద్దెకు ఉండే వారి వివరాలు పక్కాగా తెలుసుకోవాలని పోలీసు విభాగం సూచించినా అమలుకు నోచుకోలేదు. అనంతరం 2013లో ముష్కరులు అబ్దుల్లాపూర్‌మెట్‌లో షెల్టర్ తీసుకున్నారు. అక్కడి నుంచే దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు పాల్పడి వెళ్లిపోయారు. ఇలా నగరంతో పాటు శివార్లలో ఆశ్రయం పొందుతూ అక్రమంగా గుర్తింపు కార్డులు పొందుతున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు తరచూ పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న పోలీసు విభాగం చక్కదిద్దే చర్యలు చేపట్టింది. – సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో ఇలా... విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్న హైదరాబాద్, ఇతర జిల్లాలకు నిత్యం వందల మంది వలసలు వస్తున్నారు. ఇలా వచ్చిన వారు అద్దెకు ఇళ్లు తీసుకుని నివసించడంతో పాటు చిన్న చిన్న పనులు చేయడం, ఉద్యోగాలు నిర్వర్తించడం జరుగుతోంది. ఇలా అన్ని రాష్ట్రాలకూ చెందిన వారు వచ్చి ఉంటున్నప్పటికీ వారికి సంబంధించిన వివరాలు ఎక్కడా అందుబాటులో ఉండట్లేదు. ఈ పరిస్థితులు కొన్ని సందర్భాల్లో అసాంఘిక శక్తులకు కలసి వస్తున్నాయి. ప్రత్యేక ‘ఆపరేషన్స్’పై వస్తున్న ముష్కరమూకలు షెల్టర్ ఏర్పాటు చేసుకుని మరీ తమ ‘పని’పూర్తి చేసి వెళ్లిపోతున్నాయి. ఈ అసాంఘిక శక్తులు చిక్కిన తర్వాత జరిగే విచారణలోనే మకాంకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. గోవాలో అలా.. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే గోవాలో ఈ తనిఖీ పక్కాగా జరుగుతోంది. అక్క డ ఎవరైనా బయటి రాష్ట్రాల వారు వచ్చి అద్దెకు దిగితే యజమాని వారి వివరాలను సమీప పోలీసుస్టేషన్లో అందిస్తారు. ఠాణాల్లో ప్రత్యేకంగా టెనింట్స్ రిజిస్టర్ నిర్వహించే పోలీసులు ఆయా ఇళ్ల వద్దకు వెళ్లి అద్దెకు దిగిన వారిని పరిశీలిస్తారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వారు అందించిన గుర్తింపు కార్డు ఆధారంగా స్వస్థలాల్లో తనిఖీలు చేస్తుంటారు. ఈ విధానం అక్కడి అసాంఘిక శక్తులకు చెక్ చెప్పడానికి ఉపకరించింది. ఇప్పుడేం చేస్తారు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివసించే, ఉద్యోగం చేసే వారి వివరా లు పక్కాగా నమోదు చేయించేలా పోలీసు విభాగం ఏర్పాట్లు చేయనుంది. ప్రజా భద్రతా చట్టంలో మార్పుచేర్పుల ద్వారా ప్రత్యేక పోర్టల్ అమలు చేయాలని యోచి స్తోంది. శీతాకాల లేదా వర్షాకాల శాసనసభ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టించాలని భావిస్తోంది. టెనింట్స్, ఎం ప్లాయీ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. పోర్టల్ పని చేస్తాదిలా.. ఇతర రాష్ట్రాల వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా యజమానులు/సంస్థలు వారి ఫొటోతో సహా గుర్తింపు కార్డులు, ఇతర వివరాలను ఈ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. స్పెషల్ బ్రాంచ్ అధీనంలో ఏర్పడే ప్రత్యేక విభాగం వీటిని పరిశీలిస్తుంది. అనుమానం వచ్చిన వారి వివ రాలను క్రాస్ చెక్ చేస్తుంటుంది. ఈ విధానం కచ్చితంగా అమలు చేయడంలో భాగంగా 2014లో అమల్లోకి వచ్చిన ప్రజా భద్రతా చట్టంలో కొన్ని మార్పుచేర్పులు చేయనుంది. వీటి ప్రకారం వివరాలు అప్లోడ్ చేయడంలో విఫలమైన, నిర్లక్ష్యం వహించిన యజమాని బాధ్యుడవుతాడు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం పోలీసు విభాగానికి ఉండనుంది. -
మోస్ట్ వాంటెడ్ ఐఎం ఉగ్రవాది
న్యూఢిల్లీ: దేశరాజధానిలో 2008లో వరుస బాంబుపేలుళ్ల కేసులో కీలక సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)కు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఆరిజ్‌ఖాన్ అలియాస్ జునైద్(32)ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బాంబు పేలుళ్ల తర్వాత ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో జరిగిన ఎన్కౌంటర్లో తప్పించుకున్న ఆరిజ్‌ఖాన్.. పదేళ్ల తర్వాత ఇండో–నేపాల్ సరిహద్దులో పోలీసులకు చిక్కాడు. ఢిల్లీ పేలుళ్లు సహా 165 మంది ప్రజల మృతికి ఆరిజ్ కారకుడని స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ సింగ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఇంజనీర్ అయిన ఆరిజ్.. బాంబులు తయారుచేయడం, దాడికి ప్రణాళికలు రచించడం, వాటిని అమలు పర్చడంలో సిద్ధహస్తుడని వెల్లడించారు. పాఠశాలలో ఉన్నప్పుడే ఆరిజ్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితుడయ్యారన్నారు. ఐఎం, సిమీ నేతలు అరెస్ట్ కావడంతో భారత్‌లో ఈ సంస్థల కార్యకలాపాలను పునరుద్ధరించడానికి నిందితుడు యత్నించాడన్నారు. నేపాల్‌లోని ఓ పాఠశాలలో ఆరిజ్ టీచర్‌గా చేసేవాడన్నారు. 2007లో యూపీ పేలుళ్లు, 2008లో జైపూర్, అహ్మదాబాద్ పేలుళ్ల కేసుల్లో కూడా ఆరిజ్ నిందితుడిగా ఉన్నాడు. ఆరిజ్ ఆచూకీ తెలిపినవారికి ఎన్ఐఏ రూ.10లక్షలు, ఢిల్లీ పోలీసులు రూ.5 లక్షల రివార్డుల్ని గతంలోనే ప్రకటించారు. -
పాకిస్తాన్లో ‘టెర్రర్ బ్రదర్స్’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ‘జంట పేలుళ్ల’ కేసుల్లో నిందితులుగా ఉన్న, దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు వాంటెడ్‌గా మారిన ‘టెర్రర్ బ్రదర్స్’ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నారని రూఢీ అయింది. వారిద్దరూ అక్కడే ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలనూ నిఘావర్గాలు సేకరించాయి. గత నెల్లో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పట్టుకున్న ఉగ్రవాది అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్ విచారణతో ఇది నిర్థారణైంది. 2008 నుంచి పాక్‌లోనే ఉంటూ భారత్‌లో పేలుళ్లకు కుట్రలు చేస్తున్న ఈ ద్వయానికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ భద్రత కల్పిస్తోందని బయటపెట్టాడు. ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఏర్పాటులో ఈ బ్రదర్స్ కీలకపాత్ర పోషించారు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్ జంట పేలుళ్లతో దద్దరిల్లింది. ఆ రోజు గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో చోటు చేసు కున్న పేలుళ్లు 42 మంది ప్రాణాలు తీశాయి. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ ప్రాంతంలోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల్లో పేలుళ్లు జరిగాయి. గోకుల్‌చాట్ వద్ద బాంబు పెట్టింది రియాజ్ కాగా.. కుట్రలో ఇక్బాల్ ఉన్నాడు. 2013 పేలుళ్ల నాటికి రియాజ్ దేశం దాటేసినా కుట్రలో కీలకంగా వ్యవహరించాడు. 9 రాష్ట్రాల్లో వాంటెడ్..: కోల్‌కతాలో ఆసిఫ్రజా కమాండో ఫోర్స్(ఏఆర్డీఎఫ్) పేరుతో విధ్వంసాలు సృష్టించి కరాచీకి మకాం మార్చిన అమీర్ రజా ఖాన్ ప్రోద్భలంతో ఏర్పాటైన ఐఎంలో భత్కల్ సోదరులు కీలకపాత్ర పోషించారు. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన ఈ ద్వయం అమీర్ ఆదేశాల మేరకు స్థానిక యువతను ఆకర్షించి విధ్వంసాలు సృష్టించింది. రియాజ్ ఐఎంకు సదర్ రీజియన్ కమాండర్‌గా వ్యవహరించాడు. రియాజ్, అతని సోదరుడైన ఇక్బాల్ 2005 నుంచి దేశవ్యాప్తంగా 11 పేలుళ్లకు పాల్పడ్డారు. యూపీలోని లక్నో, ఫరీదాబాద్, వారణాసి కోర్టుల్లో, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ పేలుళ్లతో పాటు రామ్‌పూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడి, సూరత్‌లో పేలుళ్లకు కుట్రల్లోనూ వీరు వాంటెడ్. 2008 సెప్టెంబర్‌లో బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌తో ఢిల్లీ పోలీసులకు ఐఎం మూలాలు తెలిశాయి. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ‘టెర్రర్ బ్రదర్స్’ సరిహద్దులు దాటి అమీర్రజా దగ్గర షెల్టర్ తీసుకుంటున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఐఎస్ఐ రక్షణలో కరాచీలోని డిఫెన్స్ కాలనీలో వీరు స్థిరపడ్డారని తౌఖీర్ విచారణలో తేలింది. -
సిటీ పేలుళ్లలో ఐఎం ఉగ్రవాది హస్తం?
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రసంస్థ నగరంలో 2007, 2013ల్లో పాల్పడిన జంట పేలుళ్ల కేసులో ఈ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్ పాత్రపై రాష్ట్ర నిఘా విభాగం లోతుగా ఆరా తీస్తోంది. దశాబ్దకాలంగా పరారీలో ఉన్న ఈ ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు అక్కడి ఘాజీపురలో శనివారం అరెస్టు చేసిన నేపథ్యంలో అతడిని విచారించేందుకు రాష్ట్రంలోని నిఘా విభాగానికి చెందిన ఓ ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్లింది. సిమిలో ఉండగా సిటీకి మధ్యప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన తౌఖీర్ కంప్యూటర్ కోర్సు కోసం ముంబై వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఆలిండియా చీఫ్ సఫ్దర్ నఘోరీ పరిచయంతో ఓ సంస్థలో ఉన్నతోద్యోగానికి 2001లో రాజీనామా చేశాడు. సిమి వెలువరిస్తున్న ‘ఇస్లామిక్ మూవ్మెంట్’ పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరించాడు. ఈ సమయంలోనే నఘోరీతో కలసి హైదరాబాద్ వచ్చి సిమి సానుభూతిపరుల్ని కలిశాడు. వీరికి గుజరాత్ అల్లర్లు, రెచ్చగొట్టే ప్రసంగాలతో కూడిన వీడియోలు ఉన్న హార్డ్‌డిస్క్‌ను ఓ వ్యక్తి ఇచ్చినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ ఒక్క ‘పర్యటనే’రికార్డుల్లోకి ఎక్కినప్పటికీ వీరు పలుమార్లు నగరానికి వచ్చినట్లు అనుమానాలున్నాయి. ఐఎం ఏర్పాటులో కీలకంగా బండ్లగూడలోని ఓ విద్యాసంస్థలో పని చేసి, అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో అరెస్టయిన ముఫ్తీ అబు బషర్‌ను తౌఖీర్ కలసినట్లు అనుమానిస్తున్నాయి. 2001 సెప్టెంబర్‌లో కేంద్రం సిమిపై నిషేధం విధించడంతో అతడితోపాటు మరికొందరు అప్పట్లో ముంబైలో ఉంటున్న రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌లను కలసి ఐఎంను స్థాపించారు. బాంబుల తయారీలో నిష్ణాతుడిగా పేరున్న తౌఖీర్ పేరు అహ్మదాబాద్, ముంబై పేలుళ్లలో నేరుగా వెలుగులోకి వచ్చింది. అప్పట్నుంచి పరారీలో ఉన్న అతడు కొన్నాళ్ల పాటు పాక్, దుబాయ్‌ల్లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆ రెండు పేలుళ్ల వెనుక ఐఎం గోకుల్‌చాట్, లుంబినీపార్క్ (2007), దిల్సుఖ్నగర్ (2013)లో జంట పేలుళ్లకు పాల్పడింది. ఈ రెండు కేసుల్లోనూ రియాజ్ భత్కల్, ఒకదాంట్లో ఇక్బాల్ భత్కల్, అమీర్ రజా ఖాన్ నిందితులుగా ఉన్నారు. వీటికి సంబంధించిన సమావేశాల్లో భత్కల్ సోదరులతో పాటు తౌఖీర్ కూడా పాల్గొని ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది రూఢీ అయితే నగరంలోని జంటపేలుళ్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో ఇతడు వాంటెడ్‌గా మారతాడు. -
నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్
-
నలుగురు తీవ్రవాదుల అరెస్ట్
జైపూర్: ఎన్నికల్లో బాంబు పేలుళ్లు సృష్టించాలనుకున్న తీవ్రవాదుల కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) తీవ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురిని అరెస్ట్ రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పాకిస్థాన్ తీవ్రవాది టెర్రరిస్ట్ ఖ్వాస్ అలియాస్ మోనూ ఉన్నట్టు తెలుస్తోంది. జైపూర్‌లో ముగ్గురు, జోథ్‌పూర్‌లో ఒకరిని ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి భారీగా డిటోనేటర్లు, బాంబు తయారీ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై, పాట్నా, బుద్ధగయ పేలుళ్లతో మోనూకు సంబంధం ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కడెక్కడ బాంబు పేలుళ్లకు కుట్రలు పన్నారనే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
'ఐ యామ్ ఖాన్.. టెర్రిరిస్ట్ ను కాను'
'మై నేమ్ ఈజ్ షాహీద్ ఆలీ ఖాన్.. ఐ యామ్ నాట్ ఏ టెర్రరిస్ట్' అంటూ మైనారిటీ వెల్ఫేర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి షాహీద్ ఆలీ ఖాన్ అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. టెర్రరిస్టులతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ మంత్రి రాజీనామా చేయాలంటూ అసెంబ్లీలో బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో టెర్రిరిస్ట్ ను కాదు అంటూ వివరణ ఇచ్చారు. పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చినా.. ఓట్ల కోసం బీజేపీ తన రాజీనామాకు డిమాండ్ చేయడం అత్యంత దురదృష్టకరం అని ఆయన అన్నారు. అయితే ఆలీ ఖాన్ కు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాసటగా నిలవడం కొంత ఊరట లభించింది. మోతిహరి, సితామర్హి జిల్లాల ఎస్పీలు విచారణ జరిపారని, టెర్రిరిస్టులతో ఆలీ ఖాన్ కు ఎలాంటి సంబంధాలు లేవని విచారణలో వెల్లడైందని నితీష్ అన్నారు. ఇండియన్ ముజాహిద్దీన్, పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధాలున్నట్టు గతవారం టెలివిజన్ చానెల్స్ లో వార్తా కథనాలు వెలువడ్డాయి. దాంతో మంత్రి ఆలీ ఖాన్ రాజీనామాకు బీజేపీలు అసెంబ్లీలో పట్టుపట్టాయి. మంత్రి చేసిన వ్యాఖ్యలు మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రంలో 'మై నేమ్ ఈజ్ ఖాన్.. ఐ యామ్ నాట్ ఏ టెర్రరిస్ట్' అంటూ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కొట్టిన డైలాగ్స్ మరోసారి గుర్తుకు వచ్చాయి.


