'ఐ యామ్ ఖాన్.. టెర్రిరిస్ట్ ను కాను' | I am Khan but not a terrorist, says Bihar minister Shahid Ali Khan | Sakshi
Sakshi News home page

'ఐ యామ్ ఖాన్.. టెర్రిరిస్ట్ ను కాను'

Feb 18 2014 1:57 AM | Updated on Mar 29 2019 9:18 PM

'ఐ యామ్ ఖాన్.. టెర్రిరిస్ట్ ను కాను' - Sakshi

'ఐ యామ్ ఖాన్.. టెర్రిరిస్ట్ ను కాను'

టెర్రరిస్టులతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ మంత్రి రాజీనామా చేయాలంటూ అసెంబ్లీలో బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో టెర్రిరిస్ట్ ను కాదు అంటూ వివరణ ఇచ్చారు

 'మై నేమ్ ఈజ్ షాహీద్ ఆలీ ఖాన్.. ఐ యామ్ నాట్ ఏ టెర్రరిస్ట్' అంటూ మైనారిటీ వెల్ఫేర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి షాహీద్ ఆలీ ఖాన్ అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. టెర్రరిస్టులతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ మంత్రి రాజీనామా చేయాలంటూ అసెంబ్లీలో బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో టెర్రిరిస్ట్ ను కాదు అంటూ వివరణ ఇచ్చారు. పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చినా.. ఓట్ల కోసం బీజేపీ తన రాజీనామాకు డిమాండ్ చేయడం అత్యంత దురదృష్టకరం అని ఆయన అన్నారు. అయితే ఆలీ ఖాన్ కు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాసటగా నిలవడం కొంత ఊరట లభించింది. 
 
మోతిహరి, సితామర్హి జిల్లాల ఎస్పీలు విచారణ జరిపారని, టెర్రిరిస్టులతో ఆలీ ఖాన్ కు ఎలాంటి సంబంధాలు లేవని విచారణలో వెల్లడైందని నితీష్ అన్నారు. ఇండియన్ ముజాహిద్దీన్, పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధాలున్నట్టు గతవారం టెలివిజన్ చానెల్స్ లో వార్తా కథనాలు వెలువడ్డాయి. 
 
దాంతో మంత్రి ఆలీ ఖాన్ రాజీనామాకు బీజేపీలు అసెంబ్లీలో పట్టుపట్టాయి. మంత్రి చేసిన వ్యాఖ్యలు మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రంలో 'మై నేమ్ ఈజ్ ఖాన్.. ఐ యామ్ నాట్ ఏ టెర్రరిస్ట్' అంటూ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కొట్టిన డైలాగ్స్ మరోసారి గుర్తుకు వచ్చాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement