breaking news
Immigration service
-
స్వదేశానికి వెళ్లక్కర్లేదు
వాషింగ్టన్: గ్రీన్‌కార్డు దరఖాస్తుల విషయంలో కొత్త నిబంధనల పట్ల తీవ్ర విమర్శలు రావడం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. శాశ్వత నివాసిత హోదా(గ్రీన్‌కార్డు) కోసం చేసుకున్న దరఖాస్తు సమీక్ష దశలో ఉన్నప్పుడు.. దరఖాస్తుదారులు అమెరికాను విడిచిపెట్టి వెళ్లాల్సిన అవసరం లేదని యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) విభాగం వెల్లడించింది. గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే తప్పనిసరిగా స్వదేశానికి తిరిగివెళ్లాలని యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అసాధారణ పరిస్థితుల్లో మినహా.. అమెరికాలో శాశ్వత నివాసిత హోదా కోరుకునే విదేశీయులు దరఖాస్తు, ప్రాసెసింగ్ సమయంలో స్వదేశాల్లోనే ఉండాలని ఆదేశిస్తూ మే 21వ తేదీన ప్రకటన జారీ చేసింది. దీనిపై వలసదార్లు, అమెరికా కంపెనీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తంచేశాయి. గ్రీన్‌కార్డు జారీ విధానంలో ఎలాంటి సమూల మార్పు జరగలేదని డీహెచ్ఎస్ ప్రకటించింది. ఒక దరఖాస్తుదారుడు అమెరికా వెలుపల నుండి గ్రీన్‌కార్డు ప్రక్రియను పూర్తి చేయాలా? లేక అమెరికాలోనే ఉండాలా? అనే విషయాన్ని కేసుల వారీగా పరిశీలించి నిర్ణయించే విచక్షణాధికారం ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఎప్పటినుంచో ఉందని గుర్తుచేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థ ప్రకారం.. అర్హులైన వలసదారులు ‘అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్’అనే ప్రక్రియ ద్వారా శాశ్వత నివాసిత హోదా కోసం అమెరికాలో ఉంటూనే దరఖాస్తు చేసుకోవచ్చు. వారి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నప్పుడు అమెరికాలోనే నివసించవచ్చు. స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. వలసలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగా, గ్రీన్‌కార్డు కోరుకునే వ్యక్తులు దరఖాస్తు, ఆమోద ప్రక్రియ సమయంలో స్వదేశాలకు తిరిగి వెళ్లవలసి ఉంటుందని యూఎస్సీఐఎస్ ప్రతినిధి జాక్ కాహ్లర్ చెప్పడంతో ఈ వివాదం మొదలైంది ‘‘తాత్కాలికంగా అమెరికాలో ఉంటూ గ్రీన్‌కార్డు కోరుకునే విదేశీయులు దరఖాస్తు చేసుకోవడానికి ఇకపై స్వదేశానికి తిరిగి వెళ్లాలి’’అని ఆయన స్పష్టంచేశారు. వలసదార్లు వారి స్వదేశం నుంచే దరఖాస్తు చేసుకున్నప్పుడు, అది తిరస్కరణకు గురైతే వారికి ఇబ్బందులు తప్పుతాయని అన్నారు. ఒకవేళ అమెరికాలో ఉండి దరఖాస్తు చేసినప్పుడు అది తిరస్కరణకు గురైతే వారు చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లుగా గుర్తించాల్సి వస్తుందని తెలిపారు. వారిని వెతికిపట్టుకొని బయటకు పంపించే ప్రయాస కూడా తమకు తప్పుతుందని స్పష్టంచేశారు. ఈ ప్రకటనను వలసదార్లు తప్పుపట్టారు. విదేశీ కారి్మకులపై ఆధారపడిన అమెరికా కంపెనీలు కూడా మండిపడ్డాయి. దీంతో ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. -
స్వదేశం నుంచే గ్రీన్‌కార్డు దరఖాస్తులు
వాషింగ్టన్: విదేశీ పౌరులు అమెరికాలో నివసిస్తూ అమెరికాలో శాశ్వత నివాసిత హోదా లేదా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలంటే స్వదేశానికి తిరిగి వెళ్లక తప్పదు. అమెరికా నుంచే దరఖాస్తు చేసుకోవడం కుదరదు. సొంత దేశం నుంచి చేసుకోవాల్సిందే. ఈ విషయాన్ని యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసు(యూఎస్సీఐఎస్) తాజాగా వెల్లడించింది. తాత్కాలికంగా అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ కోరుకునే విదేశీయులు అసాధారణ పరిస్థితులు మినహా, దరఖాస్తు చేసుకోవడానికి తప్పనిసరిగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలని యూఎస్సీఐఎస్ ప్రతినిధి జాక్ కాహ్లర్ ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. విదేశీయులు అమెరికా వలస విధానాన్ని సరిగ్గా పాటించాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. అమెరికా చట్టాల అసలు లక్ష్యం ఇదేనని ఇన్నారు. విదేశీయులు తమ స్వదేశం నుంచే దరఖాస్తు చేసుకుంటే వారికి ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైతే అజ్ఞాతంలోకి జారుకొని అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉండిపోవాలనే అవసరం ఉండదన్నారు. వారిని వెతికి పట్టుకొని, బయటకు పంపే అగత్యం కూడా తొలగిపోతుందని వివరించారు. విద్యార్థులు, తాత్కాలిక కార్మికులు లేదా పర్యాటక వీసాలపై వచ్చిన వారు కాకుండా ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం కొద్దికాలం పాటు అమెరికాకు వచ్చినవారు పని పూర్తయ్యాక కచ్చితంగా తిరిగి వెళ్లిపోయేలా తమ వ్యవస్థను రూపొందించినట్లు యూఎస్సీఐఎస్ తెలియజేసింది. వారి ఆగమనం గ్రీన్ కార్డ్ ప్రక్రియలో మొదటి అడుగుగా ఉండకూడదని అభిప్రాయపడింది. -
హెచ్–1బీ, పౌరసత్వం గగన కుసుమమే!
వాషింగ్టన్: నిపుణులైన విదేశీ ఉద్యోగుల కోసం ఉద్దేశించిన హెచ్–1బీ వీసాల జారీ ప్రక్రియను ట్రంప్ సర్కారు సమూలంగా ప్రక్షాళన చేయనుంది. అమెరికా పౌరసత్వ పరీక్షలను అత్యంత కఠినతరం చేయనుంది. న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్∙డైరెక్టర్ జోసెఫ్ పలు అంశాలపై మాట్లాడారు. ఇకపై దేశీ ఉద్యోగులకు అత్యధిక వేతానాలిచ్చే అమెరికా కంపెనీలను మాత్రమే పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తామన్నారు. పలు అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులను హెచ్–1బీ వీసాలపై రప్పించుకుని అల్ప వేతనాలకు నియమించుకుంటూ స్థానికుల ఉపాధికి గండి కొడుతున్నాయంటూ అధికార రిపబ్లికన్ పార్టీ ప్రజాప్రతినిధులు చాలాకాలంగా గగ్గోలు పెడుతుండటం తెలిసిందే. ఈ ఆందోళనలకు ట్రంప్ సర్కారు తాజా నిర్ణయాలు చెక్ పెడతాయని భావిస్తున్నారు. అయితే వ్యాపార వర్గాలు, కంపెనీలకు మాత్రం ఇది మింగుడు పడకపోవచ్చని అమెరికా మీడియా కోడై కూస్తోంది. విదేశీయుల కోసం అనుసరిస్తున్న పౌరసత్వ పరీక్ష మరీ సులభతరంగా ఉందని జోసెఫ్ ఆక్షేపించారు. ‘‘పరీక్షలో తేలికపాటి ప్రశ్నలున్నాయి. ఇది చట్టస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇకపై కఠిన ప్రశ్నలతో పరీక్షను మరింత పకడ్బందీగా మారుస్తాం’’అని స్పష్టం చేశారు. -
అమెరికాలో మనోళ్ల వాటా పెరిగింది
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. అదే సమయంలో చైనా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. 2021లో భారతీయ విద్యార్థుల సంఖ్య ఏకంగా 12 శాతం పెరిగింది, చైనా విద్యార్థుల సంఖ్య 8 శాతానికి పైగా పడిపోయింది. ఈ విషయాన్ని యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తాజాగా తన వార్షిక నివేదికలో వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి గతేడాది విదేశీ విద్యార్థుల చేరికపై ప్రభావం చూపిందని తెలిపింది. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో ఇప్పటికీ చైనా జాతీయులదే మెజారిటీ వాటా కాగా భారతీయ విద్యార్థులు రెండో స్థానంలో ఉన్నారు. స్టూడెంట్స్, ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సెవిస్) ప్రకారం.. నాన్–ఇమ్మిగ్రెంట్ స్టూడెంట్ వీసాలైన ఎఫ్–1, ఎం–1 ద్వారా 2021లో 12,36,748 మంది అమెరికాలో ఉన్నారు. 2020తో పోలిస్తే ఇది 1.2% తక్కువ. 2021లో చైనా నుంచి 3,48,992 మంది, భారత్ నుంచి 2,32,851 మంది అమెరికాకు వచ్చారు. 2020తో పోలిస్తే చైనా విద్యార్థులు 33,569 మంది తగ్గిపోయారు. ఇక భారత్ నుంచి 25,391 మంది అదనంగా వచ్చారు. విదేశీయులు విద్యాభ్యాసం కోసం అమెరికాలోని ఇతర రాష్ట్రాల కంటే కాలిఫోర్నియాకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2021లో 2,08,257 మంది (16.8 శాతం) విదేశీయులు కాలిఫోర్నియా విద్యాసంస్థల్లో చేరారు. 2021లో యూఎస్‌లో 11,42,352 మంది విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యలో డిగ్రీలు పొందారు. -
హెచ్–1బీ వీసాలకు దరఖాస్తుల వెల్లువ
వాషింగ్టన్: హెచ్–1బీ.. విదేశీ నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే ఈ వీసాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, హెచ్–1బీ వీసాలకు పరిమితి ఉంటుంది. ప్రతిఏటా కేవలం 65 వేల హెచ్–1బీ వీసాలను మాత్రమే యూఎస్ సిటిజెన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) జారీ చేస్తుంది. అలాగే అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించిన 20 వేల మంది విదేశీ విద్యార్థులకు ఈ వీసాలను అందజేస్తోంది. 2021 ఆర్థిక సంవత్సరానికి గాను వీసా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే, ఇప్పటికే లెక్కలు మిక్కిలి దరఖాస్తులు వచ్చాయని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. త్వరలో కంప్యూటర్ ఆధారిత డ్రా ద్వారా హెచ్–1బీ వీసాలు జారీ చేస్తామని ప్రకటించింది. మరోవైపు అమెరికా పౌరసత్వ చట్టం–2021ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. ఈ చట్టం కింద గ్రీన్ కార్డుల జారీపై ప్రస్తుతం ఉన్న పరిమితిని రద్దు చేయనున్నారు. దీంతో ఇండియన్ ఐటీ నిపుణులు భారీగా లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే అమెరికాలో వేలాది మంది భారతీయులు గ్రీన్ కార్డుల కోసం పెట్టుకున్న పిటిషన్లు గత పదేళ్లుగా పెండింగ్‌లోనే పడి ఉన్నాయి. -
బ్రిటన్ వీసా ఫీజుల పెంపు
లండన్: బ్రిటన్‌కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇది చేదువార్తే. ఎందుకంటే వీసా ఫీజులతోపాటు తప్పనిసరిగా చెల్లించాల్సిన ఆరోగ్య సేవల సర్‌చార్జి భారీగా పెరగనుంది. ఈ మేరకు బ్రిటన్ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ తన బడ్జెట్లో ప్రకటించారు. ఇప్పటివరకూ ఈ ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జి (ఐహెచ్ఎస్) ఏడాదికి 400 పౌండ్లు (రూ.38 వేలు) మాత్రమే ఉండగా.. తాజా బడ్జెట్ ప్రకారం ఇది 624 పౌండ్లు (సుమారు రూ.60 వేలు)కు చేరుకోనుంది. వలసదారులందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకే రుసుము పెంచుతున్నట్లు రిషి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. బుధవారం బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం 18 ఏళ్లలోపు వారికి ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్ 470 (రూ.45 వేలు) పౌండ్లుగా ఉండనుంది. -
3 నుంచి హెచ్1బీ దరఖాస్తుల స్వీకరణ
వాషింగ్టన్: భారత ఐటీ నిపుణులు, కంపెనీలు ఎదురుచూసే హెచ్1బీ వర్క్ వీసా దరఖాస్తులను ఏప్రిల్ 3 నుంచి స్వీకరించనున్నట్లు అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సర్వీసుల సంస్థ(యూఎస్సీఐఎస్) తెలిపింది. అయితే దరఖాస్తులను ఎప్పటివరకు స్వీకరిస్తారో చెప్పలేదు. గత సంవత్సరాల్లో యూఎస్సీఐఎస్ ఈ గడువును పేర్కొనేది. సాధారణంగా దరఖాస్తుల స్వీకరణ మొదలైన తేదీ నుంచి ఐదు పనిదినాల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. 2017 ఆక్టోబర్ 1తో మొదలయ్యే 2018 ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానించారు. అమెరికా కాంగ్రెస్ విధించిన 85 వేల హెచ్1బీ వీసాల మంజూరుకు తగినన్ని దరఖాస్తులు గత సంవత్సరాల్లో వచ్చాయి. 85 వేల వీసాల్లో 65 వేలు జనరల్ కేటగిరీ వారికి, 20 వేలు అమెరికా విద్యాసంస్థల్లో పీజీ లేదా ఉన్నత విద్య చదివిన విదేశీయులకు ఇవ్వాలనేది నిబంధన. పరిశోధన కోసం అమెరికాకు వచ్చేవారికి ఇచ్చే వీసాలు ఈ పరిమితిలోకి రావు. అయితే త్వరగా వీసా ఇచ్చేందుకు సంబంధించిన ప్రీమియం వీసా ప్రక్రియను ఆరు నెలలు రద్దు చేయడంతో వీరి వీసా ప్రక్రియకు విఘాతం కలిగింది. దరఖాస్తు(ఫామ్ ఐ–129) ఫీజును కూడా 460 డాలర్లకు పెంచారు.


