breaking news
high-level committee
-
ప్రొఫెసర్‌ను సెలవుపై పంపిన ఐఐటీ బాంబే
ముంబై/న్యూఢిల్లీ: ఐఐటీ బాంబేలో రెండో ఏడాది బీ.టెక్ విద్యార్థి సాహిల్ వాకోడే బలవన్మరణ ఉదంతంలో ఇప్పటికే ముంబై నేరవిభాగ పోలీసులు దర్యాప్తు ఆరంభించగా కళాశాలలో అంతర్గతంగా ఈ ఘటన పూర్వపరాలను నిగ్గుతేల్చేందుకు ఐఐటీ బాంబే సిద్ధమైంది. విద్యార్థి ఆత్మహత్యకు దారితీసిన కారణాలను వెలికితీసేందుకు పది మంది సభ్యులతో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు కాలేజీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. సాహిల్‌ను ఆత్మహత్యకు పురిగొల్పినట్లు, కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణను కాలేజీ యాజమాన్యం బుధవారం సెలవుపై పంపింది. పరిపాలనా వ్యవహారాల డీన్ పోస్ట్ నుంచి తొలగించినా ఆయన ఇంకా ప్రొఫెసర్ పోస్ట్‌లో కొనసాగడంపై విద్యార్థి సంఘాల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో కాలేజీ ఈ నిర్ణయం తీసుకుంది. కాలేజీలో అంతర్గతంగా జరిగే విచారణ పారదర్శకంగా కొనసాగాలనే ఉద్దేశంతోనే ఆయనను సెలవు పంపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఉన్నతస్థాయి కమిటీ త్వరలోనే ప్రొఫెసర్ సూర్యనారాయణను ప్రశ్నించనుంది. అయితే విద్యార్థి మరణానికి కులం రంగు పులమడంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్‌సేన(ఎంఎన్ఎస్) పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అభ్యంతరం వ్యక్తంచేశారు. అధికారం కోసం రాజకీయాలుచేసే వాళ్లకు కులం అనేది ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశంగా కన్పిస్తుంది. ఈ కులం వలలో అమాయ విద్యార్థులు చిక్కుకోవద్దు. ఉద్యమాల పేరిట చదువులు, భవిష్యత్తు నాశనంచేసుకోవద్దు’’అని ఆయన హితవు పలికారు. దర్యాప్తు తర్వాత ఎవరు దోషులుగా తేలినా సరే చట్టప్రకారం శిక్షించాల్సిందేనని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీరేంద్రసింగ్ సోలంకీ డిమాండ్‌చేశారు. అయితే పుకార్లను వ్యాప్తిచేయొద్దని అధికారిక ప్రకటనలకు మాత్రమే మీడియా, విద్యార్థులు, నేతలు, కాలేజీ కట్టుబడి ఉండాలని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ విభాగం స్పష్టంచేసింది. ఆత్మహత్య ఘటన దర్యాప్తు, సాక్ష్యాధారాలపై పుకార్లు పుట్టిస్తే ఐటీ చట్టం కింద కేసులు నమోదుచేస్తామని హెచ్చరించింది. మరోవైపు క్యాంపస్ బయట వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ) నేత, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ మునిమనవడు సుజత్ అంబేడ్కర్ సారథ్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. క్యాంపస్‌లోకి వచ్చేందుకు ప్రయతి్నంచిన వీళ్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. పలువురిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఐదేళ్ల బీటెక్ బెటర్: మాజీ ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ భారీ సిలబస్ ఒత్తిడితోనూ ఐఐటీల్లో విద్యార్థులు చదువును ఒత్తిడిగా భావించే ఆస్కారముందని, ఇందుకు పరిష్కారంగా ఐదేళ్ల బీ.టెక్ కోర్సును ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చని మాజీ ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్, బిట్స్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వి.రామ్‌గోపాల్ రావు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ నాకు వ్యక్తిగతంగా తెలుసు. అత్యుత్తమ అధ్యాపకుల్లో ఆయన ఒకరు’’అని అన్నారు. ‘‘ఐదేళ్ల బీ.టెక్ ఉత్తమం. కోచింగ్ సెంటర్లలో ఒకేతరహా ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడంలో రాటుదేలిన విద్యార్థులు తీరా ఐఐటీల్లో చేరాక సొంతంగా సిలబస్ ప్రిపరేషన్, ఎగ్జామ్‌కు సంసిద్ధతలో కొంతవరకు నిజంగానే తడబడతారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అద్భుత ర్యాంక్‌లతో ఐఐటీల్లో చేరిన వాళ్లు సైతం నా క్లాస్‌లో తడబడిన సందర్భాలున్నాయి. అందుకే ఐదేళ్ల బీ.టెక్ తెస్తే నెమ్మదిగా నేర్చుకునే వాళ్లకు ఇదెంతో సాయంగా ఉంటుంది’’అని ఆయన అన్నారు. -
‘చలో సంసద్’ హింసపై ఐదుగురితో హైపవర్ కమిటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ‘చలో సంసద్’ర్యాలీ చేపట్టిన విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి, తీవ్ర అణచివేతకు పాల్పడ్డారనే ఆరోపణలు, పోలీసు సిబ్బందిపై దౌర్జన్యం జరిగినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి(హైపవర్డ్) కమిటీని ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి నేతృత్వం వహిస్తారు. పంజాబ్–హరియాణా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శైలేందర్ కౌర్, సీబీఐ మాజీ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా, మేఘాలయ మాజీ డీజీపీ ఎల్.ఆర్.బిష్ణోయ్ ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. గత నెలలో ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ‘చలో సంసద్’ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం హైపవర్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి నేతృత్వంలో గురువారం హైపవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. నైపుణ్యం, అనుభవం ప్రాతిపదికగా.. నైపుణ్యం, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. నిరసన సమయంలో జరిగిన సంఘటనలను సమగ్రంగా అంచనా వేయడంలో కమిటీ సిఫార్సులు కోర్టుకు సహాయపడతాయని విశ్వాసం వ్యక్తం చేసింది. కమిటీ అన్ని అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేసి, కోర్టుకు మధ్యంతర నివేదికలను సమర్పిస్తుందని వెల్లడించింది. జస్టిస్ సుభాష్ రెడ్డికి విశేష అనుభవం న్యాయ రంగంలో జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డికి విశేషమైన అనుభవం ఉంది. జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ, ప్రాథమిక హక్కులపై వచ్చిన అనురాధ భాసిన్ కేసుతోపాటు కీలక రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా వ్యవహరించారు. తెలంగాణలోని మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కామారం ఆయన స్వస్థలం. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1980లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్న ఆయన రాజ్యాంగం, సివిల్, క్రిమినల్ వ్యవహారాల్లో పలు కేసులు వాదించారు. 2002 డిసెంబర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2004 జూన్‌లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరిలో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2018న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన తొలి తెలంగాణ వ్యక్తి జస్టిస్ సుభాష్రెడ్డే కావడం విశేషం. 2022 జనవరి 4న పదవీ విరమణ పొందారు.హైపవర్ కమిటీ దర్యాప్తు చేసే అంశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజు జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ‘చల్ సంసద్’ర్యాలీ సందర్భంగా తీవ్ర హింస చెలరేగింది. శాంతియుతంగా ప్రారంభమైన నిరసన రణరంగంగా మారింది. విద్యార్థులు బారికేడ్లను బద్దలుకొట్టి పార్లమెంట్ వైపు దూసుకెళ్లారు. వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడమేగాక బాష్పవాయువు గోళాలను, పెల్లెట్ గన్లను ప్రయోగించినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ హింసకు సంబంధించి పార్లమెంట్ స్ట్రీట్, కన్నాట్ ప్లేస్ పోలీసుస్టేషన్లలో పలు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి అభియోగాలపై పలువురు నిరసనకారులపై కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో హైపవర్ కమిటీ పలు అంశాలపై దర్యాప్తు చేయనుంది. → మహిళా నిరసనకారుల భద్రత: మహిళా నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని జరిగిన హింస, వేధింపులు, అసభ్యకర ప్రవర్తన ఆరోపణలపై అధ్యయనానికి కమిటీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. → పోలీసుల అతి బలప్రయోగం: పోలీసులు, భద్రతా సిబ్బంది అతి బలప్రయోగం వల్ల నిరసనకారులకు తీవ్ర గాయాలు కావడం, ఆ చర్యలకు దారితీసిన వరుస ఘటనలు, వాటికి బాధ్యులు ఎవరు, బలప్రయోగంలో చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించారా? అనే కోణంలో కమిటీ పరిశీలిస్తుంది. → ఆయుధాల వాడకం: ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా పెల్లెట్ గన్లు ప్రయోగం, ఎలక్ట్రిక్ లాఠీలు ఉపయోగించడం, లాఠీచార్జీలు, బాష్పవాయువు ప్రయోగంపై కమిటీ విచారణ జరుపుతుంది. → యూనిఫాం నిబంధనలు: నిరసనకారులను అరెస్టులు చేసేటప్పుడు లేదా బలప్రయోగం చేసేటప్పుడు పోలీసులు, భద్రతా సిబ్బంది సరైన యూనిఫాం, దానిపై కనిపించే విధంగా నేమ్ప్లేట్లు ధరించారా లేదా అనేది పరిశీలిస్తుంది.→ బాధితులకు పరిహారం: గాయపడిన విద్యార్థులకు, పోలీసు సిబ్బందికి మధ్యంతర పరిహారం అందించే అంశాన్ని కూడా కమిటీ పరిశీలిస్తుంది. -
వికసిత్ భారత్ కోసం బ్యాంకింగ్‌పై ప్రత్యేక కమిటీ
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడంపై బ్యాంకింగ్ రంగానికి మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్రం త్వరలో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం తెలిపారు. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో, ప్రతిపాదిత కమిటీ పరిశీలించతగిన అంశాల గురించి సమాలోచనలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీలు అత్యంత కనిష్ట స్థాయికి దిగివచ్చాయని, సంస్కరణలను చేపట్టేందుకు ఇదే సరైన తరుణం కాగలదని ఆమె చెప్పారు. ఆర్థిక స్థిరత్వం, సమ్మిళితత్వం, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ భారతదేశపు తదుపరి దశ వృద్ధికి ఊతమిచ్చేలా బ్యాంకింగ్ రంగాన్ని సమగ్రంగా సమీక్షించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నట్లు ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్ : ఉన్నత స్థాయి విచారణ
ఇండిగో సంక్షోభం కేంద్రం సీరియస్‌గా స్పందించింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ నిమిత్తం ఉన్నత స్థాయి కమిటినీ నియమించింది. శనివారం నాటికి విమాన షెడ్యూల్ సరి అవుతుందని, మూడు రోజుల్లో సోమవారం నాటికి సాధారణ స్థితికి తిరిగి వచ్చే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. రద్దయిన విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులకు పూర్తి రీఫండ్ చేయాలని ఇండిగో సంస్థను ఆదేశించింది. ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేయాలని సూచించింది.వరుసగా ఇండిగో విమానల రద్దు, ప్రయాణీకుల ఆందోళన సందర్భంగా, పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని విమానయాన మంత్రి తెలిపారు. దీనిపై తక్షణమే స్పందించిన విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ జాప్యాలు, విమానాల రద్దులకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేసేందుకు నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ ప్యానెల్లో సంజయ్ కె బ్రహ్మణే (జాయింట్ డైరెక్టర్ జనరల్), అమిత్ గుప్తా (డిప్యూటీ డైరెక్టర్ జనరల్), కెప్టెన్ కపిల్ మాంగ్లిక్ (SFOI), మరియు కెప్టెన్ లోకేష్ రాంపాల్ (FOI) ఉంటారు.ఎఫ్డీటీఎల్ నిబంధనలను డీజీసీఏ సవరించడం సరికాదని కేంద్రం అభిప్రాయపడింది పైలట్లు, సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా చూడటం లక్ష్యంగా విమాన విధి సమయ పరిమితులపై కొన్నినిబంధనలను నిలిపివేయడాన్నిసమర్థిస్తూ, ఈ చర్య ప్రయాణీకుల ప్రయోజనాల కోసమేననీ, భద్రతలో రాజీ పడేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇండిగో వైఫల్యం నేపథ్యంలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది.ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వారికి లాంజ్ యాక్సెస్, వారి ప్రయాణ అనుభవం సౌకర్యవంతంగా ఉండేలా అన్ని సాధ్యమైన సహాయం అందించాలని పేర్కొంది. అంతేకాకుండా, విమానాలు ఆలస్యం కావడం వల్ల ప్రభావితమైన అన్ని ప్రయాణీకులకు రిఫ్రెష్మెంట్లు , అవసరమైన సేవలు అందించాలని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. సాధారణ విమానయాన సేవలు వీలైనంత త్వరగా పునరుద్ధరించబడటానికి,ప్రయాణికులకుకలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి కార్యాచరణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం : తండ్రి చితాభస్మం కలశంతో కుమార్తె నమిత ఆవేదనకమిటీ విచారణఇండిగోలో ఎక్కడ తప్పు జరిగింది అనేది విచారణ కమిటీ పరిశీలిస్తుంది, తగిన చర్యలకు అవసరమైన చోట జవాబుదారీతనాన్ని నిర్ణయిస్తుంది .భవిష్యత్తులో ప్రయాణీకులు మళ్లీ అలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండేలా ఇలాంటి అంతరాయాలను నివారించడానికి చర్యలను సిఫార్సు చేస్తుంది. విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఉత్తర్వుల్లో సవరించిన విమాన విధి సమయ పరిమితులను (FDTL) పాటించడానికి విమానయాన సంస్థలకు తగినంత సమయంఇచ్చినట్టు డీజీసీఏ పేర్కొంది. 15 రోజుల్లోపు కమిటీ నివేదికను డీజీసీఏకు సమర్పిస్తుంది. -
Delhi Stampede: రెండు రైళ్లు.. ఒకే పేరు
న్యూఢిల్లీ: రెండు రైళ్లకు ఒకేలాంటి పేరు. ఇరుకైన ఓవర్ బ్రిడ్జి. సమాచార లోపం. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటకు ఇవే ప్రధాన కారణాలని తేలింది. మహా కుంభమేళాకు బయల్దేరిన ప్రయాణికుల్లో చాలామంది 14వ నంబర్ ప్లాట్‌ఫాంపై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ కోసం భారీ సంఖ్యలో వేచి ఉన్నారు. ‘ప్రయాగ్‌రాజ్ స్పెషల్’ రైలు 12వ ప్లాట్‌ఫాంపైకి వచ్చినట్లు ప్రకటన రావడంతో తమ రైలే ఫ్లాట్‌ఫాం మారిందని భావించారు. భారీ జనసందోహం నడుమ ఏమాత్రం ఆలస్యమైనా రైలు అందదేమోనని భయపడ్డారు. 12వ ప్లాట్‌ఫాంకు చేరేందుకు ఉన్నపళంగా పరుగులు తీశారు. ఓవర్ బ్రిడ్జిపైకి దారితీసే మెట్ల మార్గంపైకి వేలాదిగా ఎగబడ్డారు. దానికి తోడు ఓవర్ బ్రిడ్జి కూడా సన్నగా ఉంది. వాటిపై ప్రయాణికులు పరస్పరం నెట్టేసుకుంటూ దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోయారు. చాలామంది ఊపిరాడక కన్నుమూశారు. పోలీసులు హెచ్చరిస్తున్నా అరుపులు కేకలతో ఏమీ విన్పించలేదు. ఈ దారుణంలో మృతుల సంఖ్య ఆదివారం 18కి పెరిగింది. వారిలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. 30 మంది గాయపడ్డారు. తొక్కిసలాట తర్వాత మెట్ల మార్గం, ఓవర్ బ్రిడ్జిపై ఎక్కడ చూసినా చెప్పులు, చిరిగిన బ్యాగులే కనిపించాయి. రెండు రైళ్లకు ప్రయాగ్‌రాజ్ పేరుండడం అయోమయానికి దారి తీసిందని పోలీసులు ఆదివారం ధ్రువీకరించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే శాఖ కూడా విచారణకు ఆదేశించింది. వాస్తవానికి న్యూఢిల్లీ స్టేషన్ నుంచి శనివారం నాలుగు రైళ్లు ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరాల్సి ఉంది. వాటిలో మూడు ఆలస్యమయ్యాయి. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కూడా ఆలస్యమయ్యాయి. దాంతో ఆ ఐదు రైళ్లలో వెళ్లాల్సిన వారంతా ప్లాట్‌ఫాంలపైనే ఉండిపోవడంతో స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఆదివారమూ అదే రద్దీ దుర్ఘటన జరిగినా న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఆదివారం కూడా ప్రయాణికుల రద్దీ విపరీతంగా కొనసాగింది. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడానికి వేలాది మంది తరలివచ్చారు. రైళ్లు ఎక్కడానికి పడరాని పాట్లు పడ్డారు. అధికారులు సైతం నియంత్రించలేని పరిస్థితి నెలకొంది.సమాచార లోపానికి తోడు ప్రయాణికులు గందరగోళానికి గురికావడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. విచారణకు కమిటీ తొక్కిసలాటపై దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రిన్సిపల్ స్టేషన్‌లోని వీడియో ఫుటేజీ అందజేయాలని అధికారులను ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు,తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.లక్ష పరిహారం ప్రకటించింది. వైష్ణవ్ రాజీనామా చేయాలితొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ ఆదివారం డిమాండ్ చేశారు. లేదంటే కేంద్రమే ఆయన్ను తొలగించాలన్నారు. రైల్వేస్టేషన్‌కు వేలాది మంది జనం తరలివచ్చినా భద్రతా ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. ‘‘దేశంలో ఇప్పుడు రెండు హిందూస్తాన్లు ఉన్నాయి. ఒక హిందూస్తాన్లో పాలకులు తమ మిత్రులకు స్వయంగా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయిస్తున్నారు. మరో హిందూస్తాన్లో సామాన్యులు ఇలా రైల్వేస్టేషన్లలో బలైపోతున్నారు. కుంభమేళాలో వీఐపీ సంస్కృతి నడుస్తోంది’’ అని ఆక్షేపించారు.రాష్ట్రపతి, ప్రధాని సంతాపం ఢిల్లీ రైల్వేస్టేషన్ ఘటనపై పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ప్రధాని మోదీ తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. -
భరోసానిచ్చేలా..
మూడు రోజులు.. 72 గంటలు.. గడియారంలోని ముల్లుల కంటే వేగంగా స్పందిస్తూ.. విశాఖలో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపుతూ.. విషాద ఘటన నుంచి నగరాన్ని కోలుకునేలా చేశారు. మరో 24 గంటల్లో పూర్తిగా సాధారణ పరిస్థితులను నెలకొల్పే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇదిలావుంటే.. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిపుణుల కమిటీలు క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరీన్ మోనోమర్ వాయువు లీకైన మూడు రోజుల్లోనే పరిస్థితి దాదాపు అదుపులోకి వచ్చింది. ఘటన జరిగినప్పటి నుంచీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతర పర్యవేక్షణలో.. ఏడుగురు మంత్రులు విశాఖలోనే మకాం వేసి స్టైరీన్ ప్రభావానికి గురైన ఐదు గ్రామాలపైనే దృష్టి కేంద్రీకరించారు. ఓ వైపు బాధితుల ఆరోగ్యాన్ని సంరక్షించే చర్యలు తీసుకుంటూనే.. గ్రామాల్లో పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గాలిలో స్టైరీన్ వాయువు మోతాదు దాదాపు సున్నా స్థాయికి వచ్చినప్పటికీ.. ఆ గ్రామాల్లో పకడ్బందీగా పారిశుధ్య చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రజలు నిశ్చింతగా నివాసం ఉండేందుకు వీలుగా తీర్చిదిద్దిన తర్వాతే గ్రామాల్లోకి అనుమతించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు అటు అధికారులు.. ఇటు మంత్రులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇదిలావుండగా.. అత్యుత్తమ వైద్య సేవలందిస్తుండటంతో బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటి వరకూ 190 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అధ్యయనం మొదలైంది ► ప్రమాదం ఎలా జరిగిందనే విషయంతోపాటు ప్రమాద తీవ్రత వల్ల అక్కడి వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు సంభవించాయనే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన ఉన్నతస్థాయి కమిటీలు, నిపుణుల బృందాలు అధ్యయనం చేస్తున్నాయి. ► ఎన్డీఆర్ఎఫ్కు చెందిన కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ అండ్ న్యూక్లియర్ (సీబీఆర్ఎన్)కు సంబంధించిన నలుగురు శాస్త్రవేత్తలు ఎల్జీ పాలిమర్స్‌లో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ► నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (నీరి)కు చెందిన ఐదుగురు శాస్త్రవేత్తలతో కూడిన బృందం బాధిత గ్రామాల్లో పర్యటించింది. ► ఐదు గ్రామాల్లోని మొక్కలు, నీరు, మట్టి నమూనాలు, పండ్ల మొక్కల అవశేషాలు మొదలైనవి సేకరించారు. వీటని ఆదివారం నాగ్‌పూర్‌లోని ల్యాబ్‌కు తరలించారు. సోమవారం కూడా మరోసారి నమూనాలు సేకరిస్తారు. ► రాష్ట్ర ఉన్నతస్థాయి కమిటీ కూడా పరిశ్రమ నుంచి వివరాలు సేకరించింది. ప్రస్తుతం ఆ గ్రామాల్లో కాలుష్య పరిస్థితి ఎలా ఉంది, పరిశ్రమలో కాలుష్యం ఎంత ఉందనే గణాంకాలను నమోదు చేస్తోంది. ► అక్కడ వాతావరణం సాధారణ పరిస్థితికి వచ్చినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సాంకేతిక నిపుణుల పర్యటన ► కేంద్రం నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులు సంతన్ గీతే, వినయ్రే ఆదివారం రెండు దఫాలుగా ఎల్జీ పాలిమర్స్ సంస్థను పరిశీలించి, ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు. ► నీరు, మట్టి, గాలి శాంపిల్స్ సేకరించారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఉన్న ఎల్జీ ప్రధాన కార్యాలయ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ► సాంకేతిక అంశాలు, తప్పిదాలపై ఆరా తీశారు. సోమవారం సాయంత్రానికి ప్రాథమిక నివేదిక సిద్ధం కానుంది. ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న ప్రజలు ► గ్రామాల్లో పారిశుధ్య పనుల్ని జీవీఎంసీ ముమ్మరం చేసింది.పిచ్చి మొక్కలు, మూగజీవాల కళేబరాల్ని తొలగించారు. రహదారులు, వీధుల్ని, మురుగు కాల్వల్ని శుభ్రం చేశారు. ► గ్రామాల్లో ఎయిర్ లెవల్ క్వాలిటీని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు 3 భెల్ మిస్టర్ యంత్రాలతో నీటిని పిచికారీ చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి 200 లీటర్ల సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. బ్లీచింగ్ చల్లి గ్రామాల్లో పారిశుధ్యం మెరుగయ్యేలా చర్యలు తీసుకున్నారు. ► మరోవైపు పరిస్థితులు చక్కబడటంతో ప్రజలు ఒక్కొక్కరుగా గ్రామాల్లోకి వచ్చి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. పీటీబీసీ తీసుకొచ్చేందుకు అనుమతివ్వండి స్టైరీన్ లీకేజీని అరికట్టేందుకు అవసరమైన రసాయనాల్ని తీసుకొచ్చేందుకు అనుమతి కోరుతూ ఎల్జీ పాలిమర్స్ సంస్థ రాష్ట్ర ప్రత్యేక చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. డామన్ విమానాశ్రయం నుంచి వెయ్యి కిలోల పారా టెరిటరీ బ్యూటైల్ కాటేకాల్(పీటీబీసీ)ని, కాండ్లా నుంచి 3,600 కిలోల పాలిమరైజేషన్ ఇన్‌హెబిటర్, 3,600 కిలోల గ్రీన్ రెటార్డర్ను విశాఖ విమానాశ్రయానికి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ప్రస్తుతానికి పరిస్థితి నూరు శాతం అదుపులోకి వచ్చిందని.. వీటిని ముందు జాగ్రత్తగా నిల్వ చేసుకునేందుకు అనుమతివ్వాలని విన్నవించింది. -
వైద్య కళాశాలల సిఫారసుకు ఉన్నతస్థాయి కమిటీ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు రంగంలో వైద్య, దంత కళాశాలల ఏర్పాటు విషయమై సిఫారసు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏ గోపాల్‌రెడ్డి, సభ్యులుగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్, నిమ్స్ డెరైక్టర్, వైద్య విద్యా సంచాలకులు ఉంటారు. ఈ మేరకు కమిటీని పునర్నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ప్రైవేటు రంగంలో వైద్య, దంత, నర్సింగ్, ఎంపీహెచ్‌డబ్ల్యూ శిక్షణ సంస్థలు, పారామెడికల్ సంస్థలు, ఆయుష్ తదితర కళాశాలల ఏర్పాటుకు వచ్చే దరఖాస్తులను ఈ కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం అత్యవసర ధ్రువీకరణ లేదా నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీకి ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది.


