breaking news
Heart health
-
కళ్లలోంచి తొంగిచూస్తే గుండె కనిపిస్తుందా?
గుండెల్లో ఏముందో కళ్లలో తెలుస్తుంది.... అంటూ ఏదో తెలుగు సినిమా పాట ఉంది. కవుల ఊహలు ఎలా నిజమవుతాయో ఈ పాట పల్లవితో తెలుస్తుంది. ఎందుకంటే... కళ్లతో అన్నీ చూడవచ్చు. అంతేకాదు... కళ్ల సహాయంతో గుండెనీ చూడవచ్చని కొన్ని తాజా పరిశోధన ఫలితాలూ చెబుతున్నాయి.అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)కు చెందిన నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ (ఎన్హెచ్ఎల్బీఐ) వర్క్‌షాప్‌కు చెందిన ‘నేచర్ రివ్యూస్ కార్డియాలజీ రోడ్‌మ్యాప్’ ప్రకారం రెటీనాలో కనిపించే బయోమార్కర్స్ సహాయంతో కరోనరీ హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్స్ వంటి పరిస్థితులు, స్ట్రోక్ వంటి వాటి విషయంలో ఒక అంచనాకు రావడం సాధ్యమని తెలుస్తోంది. కానీ ఈ ప్రక్రియ ఇంకా పూర్తిగా గుండె పరీక్షలకు ఓ రొటీన్ ప్రత్యామ్నాయంగా మాత్రం లేదు. అయితే భవిష్యత్తులో కంటి సహాయంతో గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి కన్ను ఓ గవాక్షంగా మరే అవకాశం ఉంటుందంటున్నారు పరిశోధకులు.ఒక్కసారి ఓ సీన్ ఊహిద్దాం. ఒక వ్యక్తి తన గుండె పరీక్ష కోసం గుండె వైద్య నిపుణుడి (కార్డియాలజిస్ట్) దగ్గరికి వెళ్తాడు. ఆ కార్డియాలజిస్ట్ మాత్రం ముందుగా ఒకసారి కంటివైద్య నిపుణుడి (ఆఫ్తాల్మాలజిస్ట్) దగ్గరికి వెళ్లి సంప్రదించమని అంటాడు. అలాగే ఒక వ్యక్తి కంటి పరీక్ష కోసం ఆఫ్తాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్లినప్పుడు... రెటీనాలోని రక్తనాళాల్లో కొన్ని మార్పులు చూసి ఆ కంటి వైద్యనిపుణుడు కూడా ఒకసారి కార్డియాలజిస్ట్‌ను కలవమంటూ సూచించవచ్చు కూడా. ఊహకు అందే విషయమేనా? ఎందుకంటే... కంటి పరీక్ష కూడా గుండె ఆరోగ్య అంచనాల్లో ఒక భాగమయ్యే రోజు రావచ్చంటూ చెబుతున్నాయి వైద్య వర్గాలు. అది ఎందుకు, ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.కంటి వెనుక భాగంలో ఉండే రెటీనా మన శరీరంలోని అత్యంత సూక్ష్మమైన రక్తనాళాలను ప్రత్యక్షంగా చూడగలిగే కీలకమైన ప్రదేశం. అదీ పెద్ద కోత లేకుండా, ఇంజెక్షన్ వంటి పరికరాలతో రక్తాన్ని లాగకుండా, దేహంలోకి ఎలాంటి పరికరాన్నీ పంపకుండానే ఈ పరీక్షలు సాధ్యం. అందుకే రెటీనాను కొందరు పరిశోధకులు ‘గుండె తాలూకు కిటికీ’గా చూస్తున్నారు. ఇంగ్లిష్‌లో చె΄్పాలంటే ‘ఎ విండో టు ద బాడీస్ వాస్క్యులార్ హెల్త్’ అంటూ చెబుతున్నారు.కంట్లో డాక్టర్ ఏం చూస్తారంటే...రెటీనాను పరిశీలించే డాక్టర్లు కేవలం ‘చూపు బాగుందా?’ అని మాత్రమే కాకుండా చాలా అంశాలు పరిశీలిస్తారు. ఉదాహరణకు... రక్తనాళాలకు సంబంధించి...- వాటి వెడల్పు / వ్యాసం- ఏ మేరకు సన్నబడ్డాయి- మెలికలు- శాఖలుగా విడిపోయిన తీరు (బ్రాచింగ్ ప్యాటర్న్)- ధమని – సిరల (ఆర్టరీ వీన్) సంబంధం- కనీకనిపంచకుండా సూక్ష్మస్థాయిలో అయ్యే రక్తస్రావాలు- రెటీనాకు సంబంధించిన ఇతర మార్పులేవైనా ఉన్నాయా... లాంటి అనేక విషయాలను పరిశీలిస్తారు. ప్రస్తుతం జరిగిన పరిశోధనల్లో బాధితుల్లో అంటే... డయాబెటిస్, హైబీపీ, కరొనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, పక్షవాతం వంటి జబ్బులు వచ్చినవారిలో రెటినాకు సంబంధించిన రక్తనాళాల్లోనూ మార్పులు కనిపించాయి. అంటే... దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... కంటి వెనకాల ఉండే అతి చిన్న రక్తనాళాలు దేహంలో ఉన్న గుండె తదితర రక్తనాళాల్లో వచ్చిన మార్పులను సూచిస్తూ ఒక ‘రివ్యూ’ లాంటివి ఇవ్వగలవని తెలుస్తోంది.అసలు కంటికీ గుండెకీ సంబంధం ఏమిటి?గుండె రక్తాన్ని పంపుతుంది. ఆ రక్తం శరీరమంతా ప్రయాణిస్తుంది. మెదడు, మూత్రపిండాలు, గుండె, కాళ్లు... ఇలా దేహంలోని అన్ని చోట్లా రక్తనాళాలు ఓ నెట్వర్క్లా అల్లుకుపోయి ఉంటాయి. అలాగే కంటి వెనుక ఉండే రెటీనాలోనూ కూడా అతి సూక్ష్మమైన ధమనులూ, సిరలూ, వెంట్రుకలంత సన్నగా ఉండే క్యాపిల్లరీస్ ఉంటాయి. దేహంలోని రక్తనాళ వ్యవస్థలో జరిగే కొన్ని మార్పుల ప్రభావం రెటీనాలోని అతి సన్నటి రక్తనాళాల్లో ప్రతిబింబించే అవకాశముందన్నది పరిశీలకుల భావన.అంటే... బ్రాడ్‌గా చె΄్పాలంటే... గుండెలోని పెద్ద రక్తనాళాల్లో ఏం జరుగుతుందనేది... రెటీనాలో ఉండే అతి సన్నటి ధమనులూ, సిరలూ, క్యాపిల్లరీలలో తెలియవచ్చన్నది వైద్యపరిశోధకుల మాట. గుండె పెద్ద రక్తనాళాల్లో ఏం జరుగుతుందన్న విషయాలు కంట్లోని చిన్న రక్తనాళాల్లో ఓ మినియేచర్‌లా కనిపించే అవకాశముంటుందన్నమాట. మరీ ముఖ్యంగా డయాబెటిస్, హైపర్‌టెన్షన్ లాంటి వ్యాధులున్నవాళ్లలో గుండెకు జరిగే నష్టాలూ, ఒనగూరే అనర్థాలను వైద్యపరిశోధకులు చాలాకాలంగానే గమనిస్తున్నారు.మరి... అధిక రక్తపోటు కంట్లో ఎలా కనిపిస్తుంది?ఓ వ్యక్తిలో రక్తపోటు (బీపీ) చాలా ఎక్కువగా ఉందని అనుకుందాం. దాంతో అతడి రక్తనాళాల గోడలపై నిరంతరం ఎక్కువ ఒత్తిడి పడుతుంటుంది. ఫలితంగా అతడి రెటీనాకు సంబంధించిన రక్తనాళాల్లో (రెటినల్ వెసెల్స్‌లో) మార్పులు రావచ్చు. ఇలా జరగడంతో వచ్చిన మార్పుల తాలూకు దుష్ప్రభావాలను ‘హైపర్టెన్సివ్ రెటినోపతి’ అంటారు. అందుకే కొన్నిసార్లు కంటి పరీక్షలో కనిపించే రెటినల్ మార్పుల ద్వారా ఒక వ్యక్తికి హైబీపీ ఉండవచ్చనే ఆధారం దొరకవచ్చు.ఇక్కడ బాగా నైపుణ్యం ఉన్న ఓ కంటి డాక్టర్... తన పేషెంట్‌కు హైబీపీ ఉందనే విషయాన్ని కంట్లోకి చూసి చెప్పగలడు. అంటే... ‘బీపీ మెషిన్‌ను చేతికి కడితేగానీ బీపీ తెలియదు... కానీ... ఏ మెషిన్‌నూ కట్టకుండానే... కంట్లోకి తొంగిచూసేసి డాక్టర్లు బీపీని కనిపెట్టవచ్చు’. కాకపోతే... ఇలా చూసినంతమాత్రానే ఓ పేషెంట్‌కు హైబీపీ ఉందని కంటి డాక్టర్ నిర్ధారణ చేయడు. ఆ అంశాన్ని ఒక క్లూ గా పరిగణించి, మళ్లీ తగిన పరీక్షలు చేశాకే పేషెంట్‌కు హైబీపీ ఉందని డాక్టర్లు నిర్ధారణ చేస్తారు.గుండె జబ్బు ఉన్నవాళ్ల కంట్లో ఏమి కనిపించవచ్చు?ఇప్పటికి కంట్లోకి చూడటం ద్వారా...- రెటినల్ వాస్క్యులార్ మార్పులతో – హైబీపీ నీ - డయాబెటిక్ రెటినల్ మార్పులతో – డయాబెటిస్‌నూ - కొన్ని రెటినల్ మైక్రో వ్యాస్క్యులార్ ప్యాటర్న్స్‌తో – కరోనరీ ఆర్టరీ డిసీజ్నూ- రెటినల్ వాస్క్యులార్ మార్పులతో – హార్ట్ ఫెయిల్యూర్‌నూ- రెటినల్ మైక్రో వాస్క్యులార్ అబ్నార్మాలిటీస్తో – పక్షవాతం (స్ట్రోక్)... వంటి అంశాలను గుర్తుపట్టినంత మాత్రాన ‘మీ కంట్లో ఈ తరహా మార్పు ఉంటే మీకు గుండెజబ్బు ఉన్నట్టే’ అని చెప్పడం మాత్రం సరికాదు. కాకపోతే ‘కొన్ని రకాల రెటినల్ మార్పులు కొన్ని అంశాలను సూచిస్తాయి’ అనే క్లూస్ ఆధారంగా భవిష్యత్తులో రాబోయే అనేక గుండె తాలూకు ముప్పులను ముందుగానే పసిగట్టడానికీ లేదా అంచనా వేయడానికి కన్ను ఓ హై–వే అవుతుందని మాత్రం చెప్పవచ్చు.మరి డయాబెటిస్ విషయమో...?మధుమేహం (డయాబెటిస్) విషయంలో కన్ను చెప్పే కథ ఇంకా ఆసక్తికరంగా, బలంగానూ ఉంటుంది. మధుమేహం వల్ల రెటీనాలోని అతి సూక్ష్మమైన రక్తనాళాలు దెబ్బతినడం వల్ల ‘డయాబెటిక్ రెటినోపతి’ అనే వైద్యసమస్య వస్తుందన్న విషయం కొంతమందికి తెలిసినప్పటికీ... చాలామందికి... ముఖ్యంగా పెద్దగా చదువుకోని పల్లెవాసులకూ, అంతగా వైద్యపరిజ్ఞానం లేనివారికి తెలియదు. కాబట్టి ఇలాంటి డయాబెటిస్ బాధితులకు చేసే కంటి పరీక్షల్లో కేవలం ‘కంటి చూపు ఎంత ఉంది?’ అని కాకుండా రక్తనాళాల్లో దీర్ఘకాలంగా ఉన్న అధిక చక్కెర స్థాయులు... కంటిలోని అతి చిన్న సూక్ష్మమైన రక్తనాళాలపై ఏ మేరకు దుష్ప్రభావం చూపాయి అన్న పరీక్ష కూడా! అలా డయాబెటిస్ ప్రభావాన్నీ కంటిలోకి చూసి అంచనా వేస్తారు.శరీరంలో ఎక్కువకాలంగా ఉన్న అధిక రక్తచక్కెర చిన్న రక్తనాళాలను ఎంత ప్రభావితం చేసిందో తెలుసుకునే ఒక ముఖ్యమైన మార్గం కూడా. డయాబెటిస్ అన్నది అతి చిన్న రక్తనాళాలపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసుకోవడం ద్వారా దేహంలోని పెద్ద రక్తనాళాల ఆరోగ్యం గురించి కూడా మనకు కొన్ని సంకేతాలు ఇస్తుందంటూ గ్రహించగలరు. అందుకే ‘డయాబెటిక్ రెటినోపతీ తాలూకు తీవ్రతకూ... కార్డియోవాస్క్యులార్ సమస్యల తీవ్రతకూ ఉన్న సంబంధంపై కూడా కొందరు అధ్యయనవేత్తలు సునిశితంగా పరిశోధనలు చేస్తున్నారు.ఇప్పుడు... కృత్రిమ మేధ తోడ్పాటు కూడా... ఇప్పటివరకూ రెటీనా తాలూకు రక్తనాళాల చిత్రాలను చూసి డాక్టర్లు విశ్లేషిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కృత్రిమ మేధ (ఏఐ) రంగంలోకి వచ్చాక.. అవే ఫోటోలను ఏఐ చేత కూడా విశ్లేషణ చేయిస్తున్నారు. సాధారణ మనుషులుగా డాక్టర్లు కొంత ఓ మేరకు విశ్లేషించగలిగితే... ఏఐకి అప్పటికే లక్షల సంఖ్యలో ఇచ్చిన డేటా అధారంగా అది... వేలాది అతి చిన్న ప్యాటర్న్‌లను కూడా విశ్లేషించగలదు. ఉదాహరణకు ఏఐ ఆధారంగా...రక్తనాళాలు ఏ మేరకు వెడల్పు అయ్యాయి.అవి ఎంతగా శాఖోపశాఖలుగా విస్తరించాయి (బ్రాంచింగ్ జరిగింది)ఎంతగా మెలికలు /ముడతలు/ఒంపులు తిరిగాయి (టార్టస్ అయ్యాయి)రక్తనాళాల్లోని ఏ ్రపాంతంలో వాటి మందం బాగా పలుచబడింది (వెసెల్ డెన్సిటీ తగ్గింది)... ఇలాంటి అనేక ఫీచర్లను ఏఐ తాలూకు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా అవి విశ్లేషించడం మొదలు పెట్టేలా అనేక ఏఐ మోడల్స్‌ను అభివృద్ధిపరచే పనుల్లో ఇప్పుడు పరిశోధకులు ఉన్నారు.అబ్బురపరిచే విషయాలు అనేకం...2025లో ప్రచురితమైన ఒక వైద్యపరమైన సమీక్ష (స్కోపింగ్ రివ్యూ)లో 21 రెటినల్ అధ్యయనాలను పరిశోధకులు పరిశీలించారు. ఆ పరిశోధనల్లో కొన్ని ఏఐ తాలూకు అధ్యయనాలు చెప్పిన అంశాలివి...పదేళ్లలో ‘అథెరో స్కి›్లరోటిక్ కార్డియోవాస్క్యులార్ డిసీజ్’ అనే గుండెజబ్బు ముప్పు ఎంత ఉండవచ్చో తెలుసుకోవడం.కరొనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ) అనే గుండెజబ్బును కనిపెట్టడంభవిష్యత్తులో రాబోయే పెద్ద పెద్ద గుండెజబ్బులను (మేజర్ కార్డియోవాస్క్యులార్)ను ముందుగానే పసిగట్టడం వంటి అంశాలు చాలా ఆశాజనకమైన ఫలితాలు ఇచ్చాయి.ఈ పనిలో చాలా మెరుగైన ఖచ్చితత్వాన్ని చూపించాయి. దాంతో మున్ముందు గుండెజబ్బులను ఇంకా త్వరగా, ఇంకా సమర్థంగా, చాలా ముందుగానే పసిగట్టవచ్చనే ఆశాభావం పెరుగుతోంది. ఈ మేరకు ఇంకా క్లినికల్ ట్రయల్స్, ప్రమాణికాల రూపకల్పన అవసరం. అయితే ఇప్పటికి మాత్రం డాక్టర్లు.. ఆ ఏఐ విశ్లేషణను పూర్తిగా నమ్మకుండా, వాటిపైనే పూర్తిగా ఆధారపడకుండా... మళ్లీ తమవైన పరీక్షలూ, విశ్లేషణల ఆధారంగా అప్పుడు మాత్రమే తుది నిర్ధారణకు వస్తారు/వస్తున్నారు. ఓసీటీఏ అనేది మరో అద్భుతమైన సాంకేతికత...ఓసీటీఏ అనేది... ‘ఆప్టికల్ కొహెరెన్స్ టోమోగ్రఫీ యాంజియోగ్రపీ’ అనే ఇంగ్లిష్ పదాల తాలూకు సంక్షిప్త రూపం. సాధారణంగా ఫండస్ అనే కంటి పరీక్షలో వచ్చే ఫండస్ ఫొటోగ్రాఫ్‌లో రెటీనా కనిపిస్తుంది. ‘ఆప్టికల కొహెరెన్స్ టోమోగ్రఫీ’లో రెటీనా తాలూకు ΄÷రలను చాలా సూక్ష్మస్థాయిలో చూడటం సాధ్యమవుతుంది. అయితే ‘ఓసీటీఏ’లో రెటీనాలోని అత్యంత సన్నటి రక్తనాళాల్లో జరిగే రక్తప్రసరణ గురించి చాలా సునిశితమైన వివరాలు ఉంటాయి. 2025లోని ఓ అధ్యయనంలో రెటీనాలోని అత్యంత సూక్ష్మ రక్తనాళాలకూ, గుండెజబ్బులకూ (కార్డియో వాస్క్యులార్ డిసీజ్)కూ ఉన్న సంబంధాలను విశ్లేషించడం, సమీక్షించడం చేశారు. ఆ సమీక్షలో తెలిసినదేమిటంటే... భవిష్యత్తులో కంట్లోని అతి సూక్ష్మ రక్తనాళాల మ్యాపింగ్‌ను బట్టి అవి దేహంలోని గుండె ఆరోగ్యానికి క్లూస్ ఇస్తాయనే కాన్సెప్ట్‌కు మరింత బలం చేకూరుతుందని అధ్యయనవేత్తలు అంచనా వేస్తున్నారు.గుండె పరీక్షలు వర్సెస్ కంటి సూక్ష్మరక్తనాళాల పరిశీలన...- ఈసీజీ - ఎకో కార్డియోగ్రామ్ - టీఎమ్‌టీ - సీటీ కరోనరీ యాంజియోగ్రఫీ - కార్డియాక్ ఎమ్మారై - కొన్ని రకాల రక్త పరీక్షలు...ఇలాంటి గుండె తాలూకు వైద్యపరీక్షలన్నీ గుండెను లేదా కార్డియోవాస్క్యులార్ సిస్టమ్‌ను వేర్వేరు కోణాల్లో పరిశీలించి వేర్వేరు అంశాలను తెలుసుకుంటాయి లేదా గుండె ఆరోగ్యాన్ని అంచనా వేస్తాయి. అయితే రెటీనా మాత్రం తనలోని అత్యంత సూక్ష్మమైన రక్తనాళాల్లో జరిగే రక్తప్రసరణ (మైక్రోసర్క్యులేషన్) ఆధారంగా గుండె తాలూకు అనేక అంశాలను డాక్టర్లకు తెలియపరుస్తుందని చెప్పవచ్చు.దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... భవిష్యత్తులో ఎవరైనా ఓ పేషెంట్ తన కళ్లను పరీక్షించుకోడానికి ఓ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే... ఆయన కంటిని పరీక్షించి, దానికి తగిన చికిత్స ఇవ్వడంతో పాటు... ఆ డాక్టర్ మరో అదనపు సేవనూ అందించడానికి అవకాశముంది. అదేమిటంటే... ‘మీరొకసారి కార్డియాలజిస్ట్‌ను కలిసి... ఆయన సూచనల మేరకు కొన్ని గుండె పరీక్షలూ చేయించుకొని కార్డియాక్ ఎవాల్యూయేషన్ చేయించుకోండి’’ అని సూచించవచ్చు.చివరగా... ఇప్పటికి ఈ కంటి పరీక్షలన్నవి గుండె పరీక్షకు ప్రత్యామ్నాయం కాదు గానీ... మన కన్ను అనేది గుండె–రక్తనాళా వ్యవస్థలో దాగి ఉన్న కొన్ని సంకేతాలను ముందుగానే చూపించే ‘కిటికీ’ అని మాత్రం చెప్పవచ్చు. అంటే ఒకనాటికి కంటి పరీక్ష అంటే కేవలం చూపును పరీక్షించడం మాత్రమే కాకుండా... మన మొత్తం రక్తనాళాలతో పాటు గుండెనూ, దాన్ని ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకూ ఉపయోగపడే అంశమని మాత్రం చెప్పవచ్చు.- డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్నిర్వహణ: యాసీన్ -
ఆంథోసయనిన్ గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందంటే..!
ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందని పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అందుకు సంబంధించిన కొత్త అధ్యయనం 'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైంది.ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.కలిగే లాభాలు..సాధారణంగా తక్కువ ఆంథోసయనిన్ తీసుకునేవారితో పోలిస్తే, దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ క్రింది ప్రయోజనాలు కనిపించాయి:గుండె జబ్బుల ప్రమాదం 26% తగ్గింది.సాధారణంగా గుండెపోటు అని పిలిచే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ప్రమాదం 18% తక్కువగా వుంది.టైప్ 2 మధుమేహం ప్రమాదం 11% తక్కువగా కనిపించింది.గుండె సంబంధిత మరణాల ప్రమాదం 9% తక్కువఅధిక రక్తపోటు ప్రమాదం 8% తక్కువరోజుకు 50 మిల్లీగ్రాముల నుంచి ఆహారంలో ఆంథోసయనిన్ తీసుకోవడం ప్రారంభించినప్పుడు, రక్తనాళాల పనితీరు, ఇన్సులిన్ సాంద్రతలలో మెరుగుదలలు కనిపించాయని యాదృచ్ఛిక నియంత్రిత పరీక్షలు నివేదించాయి. ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాల ద్వారా ఈ స్థాయిని సాధించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.రోజువారీ భోజనంలో సహజంగా రంగురంగుల పండ్లు , కూరగాయలను విస్తృత శ్రేణిలో చేర్చడం మొత్తం ఆహార నాణ్యతకు మద్దతు ఇస్తుంది. అమెరికా బ్లూబెర్రీలను తాజాగా, గడ్డకట్టించి లేదా ఎండబెట్టి ఆస్వాదించవచ్చు. వాటిని పెరుగు, ఓట్స్, స్మూతీలు, అల్పాహార వంటకాలు, సలాడ్లు, డెజర్ట్‌లు వంటి వంటకాల్లో సులభంగా చేర్చుకోవచ్చు.అంతేగాదు సులభమైన, ఆచరణీయమైన ఆహారపు మార్పులు గుండె జబ్బులు, అధిక రక్తపోటు మరియు టైప్ 2 మధుమేహం వంటి వాటి దీర్ఘకాలిక ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదపడతాయని ఈ కొత్త పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. -
గుండెకు బ్యాడ్ మార్నింగ్
సాక్షి, హైదరాబాద్: పగటి పూట తీసుకునే ఆహారాలు శక్తి స్థాయిలు, జీవక్రియ, జీవ గడియారం తీరుపై (సర్కాడియన్ రిథమ్)పై తీవ్ర ప్రభావం చూపుతాయా? దీర్ఘకాలంలో ఇవి గుండె ఆరోగ్యంపై ప్రతికూలమైన ప్రభావానికి కారణమవుతాయా? ఈ ప్రశ్నలకు నిపుణుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. గుండె ఆరోగ్యానికి మేలు చేసే అలవాట్ల విషయానికి వస్తే, క్రమంతప్పని వ్యాయామం, ఎక్కువ మోతాదులో కూరగాయలు తినడం, ఏటా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు వంటి సమాధానాలు టక్కు న వస్తాయి. ఇవి ఆరోగ్యపరిరక్షణకు దోహదం చేసినప్పటికీ, గుండె ఆరోగ్యం వీటిపై మాత్రమే ఆధారపడి ఉండదని, మరికొన్ని జాగ్రత్తలు అవసరమని తెలుస్తోంది. మధ్యాహ్నం అధిక మోతాదులో చక్కెరలు ఉన్న స్నాక్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం, నీరు తాగకుండా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం, సాయంత్రం ఆరు గంటల తర్వాత టీ, కాఫీ వంటివి (కెఫిన్ పదార్థాలు) తీసుకోవడం వల్ల నిద్ర ఆలస్యం కావడం వంటివి నిశ్శబ్ద ఆరోగ్య ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయని వైద్యనిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. క్రోనోన్యూట్రిషన్ అంటే ఏమిటి? » క్రోనోన్యూట్రిషన్ అంటే ఆహారపుటలవాట్లలోని సమయం, క్రమబద్ధతలు శరీరం యొక్క అంతర్గత సర్కాడియన్ రిథమ్‌తో సంకర్షణ చెంది జీవక్రియను, ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరించే శాస్త్రం. మీరు ఏమి తింటారనేది ఎంత ముఖ్యమో, ఎప్పుడు తింటారనే విషయం కూడా అంతే ముఖ్యమని ఈ శాస్త్రం చెబుతుంది. సర్కాడియన్ రిథమ్‌ను నియంత్రించేది ఏది? » సర్కాడియన్ రిథమ్ శరీరం లోపల జన్యువులు, హార్మోన్ల ద్వారా నియంత్రితమవుతుంది. శరీరం బయటి నుంచి ప్రభావితం చేసే కూడా కారకాలున్నాయి. వాటిని జైట్ గేబర్స్ అంటారు. సూర్యరశ్మి, వ్యాయమం, ఆహారం వంటివి. మన వెంట ఉన్న ప్రమాదాలివి.. » క్యాండీలు, పేస్ట్రీలు, చక్కెర వేసిన కాఫీల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి, అంతే వేగంగా పడిపోతాయి. ఇది హృదయనాళ వ్యవస్థపై భారాన్ని, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. » సాయంత్రం తర్వాత కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల ‘అడెనోసిన్ రిసెప్టర్లు’ప్రేరేపితమై మనిషిని మెలకువగా ఉంచుతూ, సహజ నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తాయి. » మధ్యాహ్న భోజనం చేయకపోతే సాయంత్రానికి అతిగా ఆకలి వేస్తుంది. ఇది ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తినేటట్లు ప్రేరేపించడంతోపాటు మనసును అనారోగ్యకరమైన ఆహారం మీదకు మళ్లిస్తుంది. » పనిలో పడి పగలంతా నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇది మతిమరుపుకు, అతిగా తినడానికి, అనారోగ్యకరమైన చక్కెర పానీయాలను తాగేలా ప్రభావితం చేస్తుంది. ఆహారపు అలవాట్లు ఇకపై ఇలా » ప్రోటీన్, ఫైబర్‌పై దృష్టి పెట్టాలి. గ్రీక్ యోగర్ట్, నట్స్, పండ్లు, కూరగాయలతో కూడిన హమ్మస్ వంటి సమతుల ఆహారం తీసుకోవాలి. ఇవి కడుపు నిండిన అనుభూతినివ్వడంతోపాటు నీరసం రానివ్వకుండా ఎక్కువ సేపు శక్తిని అందిస్తాయి. » గంటకొకసారి 5 నిమిషాలపాటు దేహానికి కదలిక కోసం నడవాలి. మధ్యాహ్న భోజనం తర్వాత తేలికపాటి నడక వల్ల చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగకుండా నిలువరించవచ్చు. » రాత్రి భోజనం ఎనిమిది గంటలకు ముగిస్తే శరీర సహజ జీవప్రక్రియలు సజావుగా సాగుతాయి. ఈ అలవాటు కేలరీలను మెరుగ్గా దహించడానికి వీలు కల్పిస్తుంది. » పగలంతా నీటిని కొద్దికొద్దిగా తాగడాన్ని అలవాటుగా పాటించాలి. శరీరంలో నీటిశాతం తగినంత ఉంటే కెఫిన్ డ్రింక్స్ తీసుకోవాలనే కోరిక కలగదు. -
మీ కళ్లు చెబుతాయిక... మీ జబ్బులేమిటో!
ముఖం చూసి ఆ మనిషి మూడ్ ఏంటో చెప్పేస్తాం. అలాగే కళ్లు కూడా మన గురించి ఎన్నో విషయాలు చెబుతాయి. కళ్లు నవ రసాలను పలికించటమే కాదు.. మన దేహంలో సూక్ష్మ స్థాయిలో దాగున్న జబ్బుల జాడల్ని కూడా సూక్ష్మంగా అందించగలవట. మన కళ్లలోకి చూసి మన గుండె ఆరోగ్యాన్ని చెప్పేయొచ్చు. అలాగే మన వయసు ఎంత వేగంగా అయిపోతోంది లేదా వృద్ధాప్యంలోకి ఎంత వేగంగా వెళ్లిపోతున్నాం అనేది కూడా కచ్చితంగా చెప్పవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కంటిలోని చిన్న రక్తనాళాలను లోతుగా పరిశీలిస్తే.. ఆ వ్యక్తికి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఎంత మేరకు ఉందో తెలిసిపోతుంది. అంతేకాదు.. ఒకరి హృదయ నాళాల ఆరోగ్యం, జీవసంబంధమైన వృద్ధాప్య స్థితిని కూడా కళ్లు చెప్పేస్తాయని ఓ తాజా పరిశోధనలో వెల్లడైంది. ఎంతమందిపై చేశారు?కెనడాలోని మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయం, పాపులేషన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు 74 వేల మందిపై సంయుక్త పరిశోధనలు చేశారు. వీరి రెటీనా స్కాన్లు, జన్యు డేటా, రక్త నమూనా విశ్లేషణలను నాలుగు వేర్వేరు సంస్థల నుంచి సేకరించి పరిశోధించారు. కళ్ల ద్వారా తెలుసుకోగలిగే ఆరోగ్య స్థితిగతులపై అత్యంత ఆసక్తికర విషయాలు తెలిశాయి. సైన్సెస్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ఇటీవల ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఎలా చేశారు? ‘కంటిలో ముఖ్యమైన భాగం రెటీనా. రెటీనా స్కాన్ నివేదికల సమాచారంతో జన్యుశాస్త్రం, రక్తపు బయోమార్కర్లను అనుసంధానం చేయటం ద్వారా వృద్ధాప్యం హదృయనాళ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తోందో కనుక్కోవటంలో విజయం సాధించాం. రెటీనా రక్తనాళాల్లో మార్పులు తరచుగా శరీరంలోని చిన్న నాళాల్లో జరిగే మార్పులకు అద్దం పడతాయి’ అన్నారు ఈ అ«ధ్యయన రచయిత ప్రొఫెసర్ మేరీ పిగేయ్రే.ఏంటి ప్రాధాన్యత? గుండెకు రక్తాన్ని అందించే నాళాలకు ఎన్ని తక్కువ ఉప నాళాలు ఉంటే గుండె జబ్బుల ముప్పు అంత ఎక్కువగా ఉందని గుర్తించారు. శరీరంలో అధిక వాపు, తక్కువ ఆయుర్దాయం వంటి జీవసంబంధమైన వృద్ధాప్య సంకేతాలను కూడా రెటీనా స్కాన్లు చూపగలుగుతున్నాయని కనుగొన్నారు. రోగ నిర్ధారణ, చికిత్సల్లో దీని ప్రాధాన్యం ఏమిటంటే.. శరీరం లోపలికి ఏ పరికరాన్నీ చొప్పించకుండానే వ్యాధులను ముందుగానే సూక్ష్మంగా గుర్తించడానికి, చికిత్స చెయ్యటానికి రెటీనా స్కాన్ల సమాచారం కీలకం కాబోతోంది. ఏంటా ప్రోటీన్లు?ఈ అధ్యయనంలో మరో ముఖ్యమైన అంశం రక్తపు బయోమార్కర్లు, జన్యు డేటాను సమీక్షించటం. దీని ద్వారా, పరిశోధకులు కంటి రక్త నాళాల్లో మార్పుల వెనుక గల జీవసంబంధమైన కారణాలు కనుగొనగలిగారు. రక్తనాళాలలో వచ్చే మార్పులకు కారణమవుతున్న రెండు ముఖ్యమైన ప్రోటీన్లను ఈ పరిశోధనలో కనిపెట్టారు. వృద్ధాప్యం వేగాన్ని నెమ్మదింపజేయటానికి, గుండె జబ్బుల భారాన్ని తగ్గించడానికి.. భవిష్యత్తులో ఔషధాల తయారీకి, చివరికి జీవితకాలం మెరుగుపరచడానికి.. ఈ ప్రొటీన్లు ఉపయోగపడతాయని ప్రొఫెసర్ మేరీ పిగేయ్రే వివరించారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ -
గుండె ఆరోగ్యం కోసం బ్రిస్క్ వాకింగ్..! ఎలా చేయాలంటే..
బ్రిస్క్ వాకింగ్ గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. బ్రిస్క్ వాకింగ్ అంటే మీ సాధారణ నడక కంటే వేగంగా నడవడం. అంటే హృదయ స్పందన రేటును పెంచే వేగంతో నడవాలి. ఇది మితమైన తీవ్రత కలిగిన వ్యాయామం, అంటే నడుస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడతారు, కానీ మాట్లాడగలరు. బ్రిస్క్ వాకింగ్ ప్రయోజనాలుబ్రిస్క్ వాకింగ్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది ∙బ్రిస్క్ వాకింగ్ కేలరీలను కరిగించడానికి ఉపకరిస్తుంది. దీనిద్వారా ఇది బరువు తగ్గడానికి లేదా బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. ∙మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది బ్రిస్క్ వాకింగ్ ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడానికి సహాయపడుతుంది. ∙ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తుంది. బ్రిస్క్ వాకింగ్ ఎముకలు, కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది, ఇది ఎముకల సాంద్రతను పెంచడం ద్వారా బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.∙శక్తి స్థాయులను పెంచడానికి, అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది. జ్ఞాపకశక్తిని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. బ్రిస్క్‌వాకింగ్ ఎలా చేయాలి?మీ సాధారణ నడక వేగాన్ని పెంచండి.మీ చేతులను మీ వైపులా వదిలివేయండి, లేదా వాటిని కొద్దిగా వంచి, ముందుకు వెనుకకు ఊపండి. మీ నడకలో వేగం, దూరాన్ని పెంచండి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల బ్రిస్క్ వాకింగ్ చేయడానికి లక్ష్యంగా పెట్టుకోండి. బ్రిస్క్‌వాకింగ్ ప్రారంభించడానికి చిట్కాలు. ∙మీకు నడవడం అలవాటు లేక΄ోతే, నెమ్మదిగా ప్రారంభించండి.క్రమంగా వేగాన్ని, దూరాన్ని పెంచండి. ∙మీకు నచ్చిన ప్రదేశంలో నడవండి ఉదాహరణకు తోటల్లో లేదా బీచ్ వంటి ప్రదేశాలలో అన్నమాట.. దీనిని ఒక సామాజిక కార్యకలాపంగా మార్చడానికి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి నడవండి. -
గుండె ఆరోగ్యాన్ని తెలిపే ‘లెక్క’!
ఫిట్నెస్ బ్యాండ్లు లేదా స్మార్ట్ వాచీలు మన హృదయ స్పందనల్లో తేడాలను గుర్తించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుండటం తెలిసిందే. అయితే ఓ చిన్న ‘లెక్క’సాయంతో అంతకన్నా మరింత కచ్చితత్వంతో గుండె ఆరోగ్యాన్ని గుర్తించే విధానాన్ని పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఇటీవల జరిగిన అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ (ఏసీసీ–2025) సమావేశంలో ఆ సరికొత్త ‘పారామీటర్’ను ప్రకటించారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ఏమిటా పారామీటర్?ఒక రోజులో ఒక వ్యక్తి వేసిన అడుగుల సంఖ్యను ఆ రోజు అతడి హృదయ స్పందనల సగటు రేటుతో భాగించడమే ఆ పారామీటర్ (చిన్న లెక్క). అలా వచ్చిన ఆ విలువను ‘డైలీ హార్ట్ రేట్ పర్ స్టెప్ (డీహెచ్‌ఆర్‌పీఎస్)గా పేర్కొంటున్నారు. ఒక వ్యక్తి గుండె ఆరోగ్య స్థితిని కచ్చితంగా అంచనా వేసేందుకు ఈ పారామీటర్ దోహదపడుతుందంటున్నారు పరిశోధకులు. ఒకవేళ ఈ విలువ ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తిలో గుండె జబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుందంటున్నారు. డీహెచ్‌ఆర్‌పీఎస్ ఉండాల్సిన దానికంటే గుండె స్పందనలు ఎక్కువగా ఉన్నా లేదా మరీ తక్కువగా ఉన్నా కూడా గుండె ఆరోగ్యం బాగోలేదనడానికి సూచిక అని చెబుతున్నారు. సుమారు 7 వేల మందికి సంబంధించిన 58 లక్షల పర్సన్–డేస్, వారు నడిచిన 5,100 కోట్ల అడుగులను విశ్లేషించి ఈ విషయాన్ని వారు చెప్పారు. అయితే ఇవి కేవలం మొదట చేసిన ఓ అధ్యయన ఫలితాలతో వెల్లడైన అంశాలేనని.. వాటిని పూర్తి రోగ నిర్ధారణగా చెప్పడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే వాటన్నింటిలోనూ ఇదే విషయం నిర్ధారణ అయితే భవిష్యత్తులో గుండె పరీక్షలకు దీన్నే ఓ ప్రామాణిక పారామీటర్‌గా తీసుకొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. డీహెచ్‌ఆర్‌పీఎస్ ఎక్కువగా ఉంటే రాబోయే అనారోగ్య సమస్యలు ఇలా..⇒ టైప్–2 డయాబెటిస్ ముప్పు 2 రెట్లు ఎక్కువ ⇒ గుండె వైఫల్యం ముప్పు 1.7 రెట్లు ఎక్కువ ⇒ అధిక రక్తపోటు ముప్పు 1.6 రెట్లు ఎక్కువ ళీ కరొనరీ ఆర్టరీ డీసీజ్ ముప్పు 1.4 రెట్లు ఎక్కువ -
వైన్‌తో గుండె పదిలం
వైన్ చరిత్ర ఇప్పటిది కాదు. ప్రాచీన కాలంలోనే పులిసిన ద్రాక్ష రసాన్ని సేవించేవారని చెప్పడానికి ఆధారాలున్నాయి. వైన్ మంచిదా, కాదా అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. దీనిపై రకరకాల అధ్యయనాలు, పరిశోధనలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. వైన్ ఆరోగ్యానికి మంచిదని కొన్ని , నష్టమేనని మరికొన్ని చెబుతుంటాయి. అయితే మితంగా సేవిస్తే గుండె భద్రంగా ఉంటుందని స్పెయిన్‌లో జరిగిన తాజా పరిశోధన వెల్లడించింది. రోజూ చిన్న గ్లాస్ పరిమాణంలో వైన్ తీసుకుంటే హృదయం పదిలమని సైంటిస్టులు గుర్తించారు.అంతేకాదు, వైన్ సేవించాక మాంసాహారం కాకుండా శాకాహారం తీసుకుంటే మరింత చక్కటి ఫలితాలుంటాయని వారు పేర్కొనడం విశేషం! 60 ఏళ్లు దాటాక గుండె జబ్బుల ముప్పు అధికంగా ఉంటుంది. ఇలాంటి వారిపైనే పరిశోధన చేశారు. 1,232 మందిని అధ్యయనం కోసం ఎంచుకున్నారు. వీరంతా టైప్ 2 డయాబెటీస్ లేదా అధిక కొలె్రస్టాల్, రక్తపోటు, అధిక బరువు, స్థూలకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నవారే. గుండె జబ్బుల బాధితుల కుటుంబాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు. వారికి నిత్యం సగం, లేదా గ్లాసు వైన్ ఇచ్చారు. వైన్ సేవించని వారితో పోలిస్తే వీరిలో హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ ముప్పు 50 శాతం తగ్గినట్లు తేల్చారు. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. ⇒ పరిమితంగా వైన్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు. కానీ రోజుకు గ్లాసు కంటే అధికంగా సేవిస్తే కొత్త రోగాలు కొని తెచ్చుకున్నట్లేనని అధ్యయన సారథి, యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనాకు చెందిన డాక్టర్ రమోన్ ఈస్ట్రచ్ చెప్పారు. ⇒ చక్కటి ఆహారానికి తోడు ఒక గ్లాసు వైన్‌తో మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని సూచించారు. ⇒ ఈ పరిశోధన ఫలితాలపై నిపుణులు అభ్యంతరం వెలిబుచ్చుతున్నారు. గుండెకు సంబంధించే పరిశోధన సాగింది తప్ప అల్కహాల్‌తో తలెత్తే ఇతర అనారోగ్యాలను పరిగణనలోకి తీసుకోలేదంటున్నారు. ⇒ వైన్ కూడా మద్యమే. తక్కువ మోతాదులో సేవించే వైన్‌తో కార్డియోవాస్క్యులర్ డిసీజ్ (సీవీడీ) రిస్క్ తగ్గుతుందని స్పెయిన్ పరిశోధన తేలి్చంది. కానీ ఇతర అవయవాల సంగతి ఏమిటన్నది గుర్తించలేదని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌కు చెందిన సీనియర్ డైటీషియన్ ట్రాసీ పార్కర్ చెప్పారు. ‘‘వైన్‌తో సహా ఏ రకమైన మద్యమైనా ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. గుండెతో పాటు లివర్ దెబ్బతింటుంది. అధిక రక్తపోటు, కొన్ని రకాల క్యాన్సర్ల బారిన కూడా పడతారు’’ అన్నారు. ⇒ గుండె ఆరోగ్యానికి వైన్ మంచిదన్నది చాలామందిలో ఉన్న అభిప్రాయమేనని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన ప్రొఫెసర్ పాల్ లీసన్ అన్నారు. ‘‘ఇతర అవయవాల పరిస్థితినీ దృష్టిలో పెట్టుకోవాలి. మోతాదు మించితే గుండెతోపాటు కీలకావయవాలు దెబ్బతింటాయి’’ అని చెప్పుకొచ్చారు. ⇒ వైన్‌తో గుండె భద్రంగా ఉంటుంది కదా అని అదే ఏకైక మార్గం అనుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ‘‘గుండెను కాపాడుకోవాలంటే మరెన్నో ఆరోగ్యకరమైన మార్గాలున్నాయి. సమతుల ఆహారం, క్రమంతప్పకుండా వ్యాయామం. బరువు పెరగకుండా జాగ్రత్తపడడం, పొగ మానేయడం వంటివి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి’’ అని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Health: రోజూ స్కిప్పింగ్ చేసే అలవాటుందా? ఈ విషయాలు తెలిస్తే
Skipping- Health Benefits: వర్కవుట్స్ మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవే మనల్ని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుతాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించగలవు. అయితే అందరూ వర్కవుట్స్ చేయలేరు. అలాగని వర్కవుట్స్ చేయకుంటే స్థూలకాయంతో సహా రకరకాల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది. ఈ తలనొప్పంతా మాకెందుకులే అనుకుంటే మాత్రం రోజూ చిన్నవో పెద్దవో వ్యాయామాలు చేయాల్సిందేనంటున్నారు నిపుణులు. అలాంటి వ్యాయామాలలో స్కిప్పింగ్ ఒకటి. దీనినే ఒకప్పుడు తాడాట అనేవాళ్లు. ఇప్పుడు స్కిప్పింగ్ అంటున్నారు. స్కిప్ చేయకుండా స్కిప్పింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం. కొంతమంది జిమ్ములకు వెళ్లి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే సమయం లేక కొంతమంది అవి కూడా చేయకుండా స్కిప్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వారు ఎంచక్కా స్కిప్పింగ్‌ను చేయొచ్చు. చిన్న తాడుతో చేసే ఈ వ్యాయామం వల్ల మాకేంటి ప్రయోజనాలు అనేవారు... అనుకునేవారు కాస్త ఆగండి.. జిమ్ముల్లో చేసే వర్కవుట్స్‌లో కష్టపడి చెమటలు చిందించే వారు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో.. స్కిప్పింగ్ వల్ల కూడా అన్ని ప్రయోజనాలను పొందుతారని ఫిట్నెస్ నిపుణులంటున్నారు. స్కిప్పింగ్‌ను ఎంచక్కా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఇంట్లో చేసే స్కిప్పింగ్ వల్ల ఏం లాభాలుంటాయని తేలిగ్గా తీసిపారేయకండి.. ఇది ఎన్నో రోగాలను ఇట్టే తగ్గించేయగలదు.. సులువుగా బరువు తగ్గచ్చు స్కిప్పింగ్ బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో ఉన్న అదనపు కేలరీలు కరిగిపోతాయి. స్కిప్పింగ్ కూడా ఒక లాంటి వ్యాయామమే. స్కిప్పింగ్ వల్ల నిమిషాలను 15 నుంచి 20 కేలరీలను బర్న్ చేస్తారు. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు స్కిప్పింగ్ ను చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. గుండె బాగుంటుంది స్కిప్పింగ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్కిప్పింగ్ వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. తద్వారా గుండె ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు పనితీరు మెరుగు స్కిప్పింగ్ మెదడుపై అనుకూల ప్రభావాన్ని చూపెడుతుంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా జంప్ చేసేలా మెదడు సంకేతాలను పంపిస్తుంది. ఈ శ్రద్ధ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బద్దకాన్ని వదిలిస్తుంది స్పిప్పింగ్ చేసే మొదట్లో బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం హుషారుగా మారుతుంది. ఇది మీ అలసటను పోగొట్టడమే కాదు.. మిమ్మల్ని రీఫ్రెష్ గా ఉంచుతుంది. అందుకు బద్దకంగా, ఎప్పుడూ విసుగ్గా ఉండేవారు స్కిప్పింగ్ ను రోజూ చేయండి. స్ట్రెస్‌ను తగ్గిస్తుంది ఈ రోజుల్లో ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయ్యాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో స్కిప్పింగ్ ముందుంటుంది. ఎందుకంటే ఇది మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్ఫిన్ల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.. స్కిప్పింగ్ చేసే అలవాటు మీకు లేకపోతే వెంటనే అలవాటు చేసుకోండి. మీ పిల్లలకు కూడా స్కిప్పింగ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేయించండి. వారితోపాటు మీరు కూడా పోటీ పడి స్కిప్పింగ్ చేస్తూ ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండండి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యం మీద అవగాహన కోసం మాత్రమే! చదవండి: Health Tips: నీరసం.. నిస్సత్తువా? వీటిని ఆహారంలో చేర్చుకున్నారంటే.. రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే -
Health: ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు తింటే.. ఈ ప్రమాదం పొంచిఉన్నట్లే!
ఇటీవల కాలంలో చిన్న వయసులో కూడా గుండెపోటుతో అకస్మాత్తుగా మృత్యువాత పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తగిన స్థాయిలో నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలతో కూడిన ఆహారంన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో.. కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తగ్గించాలి 👉🏾జంక్ ఫుడ్ తినడాన్ని పూర్తిగా తగ్గించి విటమిన్స్,న్యూట్రియెంట్స్‌తో సమృద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 👉🏾ఎక్కువ మంది ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తింటుంటారు. ఇవి గుండె ఆరోగ్యానికి కీడు చేస్తాయి. 👉🏾వీటిలో ఆహారాన్ని ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. 👉🏾ఇవి గుండెకి మంచివి కావు. వీటివల్ల గుండె జబ్బులు వస్తాయి. 👉🏾కనుక ఈ ఆహారాలకు బదులుగా ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను ఇంట్లోనే తయారు చేసుకుని తినాలి. 👉🏾ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. ఉప్పులో ఉండే సోడియం శరీరానికి మంచిది కాదు. దీనివల్ల హైపర్ టెన్షన్ వస్తుంది. 👉🏾అంతేకాకుండా చివరకు అది గుండె జబ్బులకు దారితీస్తుంది. 👉🏾అదే క్రమంలో చక్కెర వల్ల అధికంగా బరువు పెరుగుతారు. అది కూడా గుండె జబ్బులు వచ్చేందుకు దారి తీస్తుంది. 👉🏾కనుక ఈ రెండు పదార్థాలను నిత్యం తక్కువగా తీసుకోవాలి. లేదా పూర్తిగా మానేయాలి. 👉🏾వీటితో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చదవండి👇 Healthy Heart Diet: 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు, బచ్చలి కూర తిన్నారంటే! Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తింటే మేలు! -
Health Tips: ఇవి తింటే బీపీ అదుపులో ఉంటుంది!
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది అధిక బీపీతో బాధపడుతున్నారు. దీనిని ఆహారంతోనే అదుపు చేయవచ్చు. గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. చేపలలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన హృదయాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. మీకు తెలుసా? తల తిరగడం కూడా గుండె వైఫల్యానికి సంకేతం. డీ హైడ్రేషన్ వల్ల మైకం వచ్చి గుండె పనిచేయదు. గొంతు లేదా దవడలో నొప్పి కూడా గుండెపోటుకు సంకేతం. అయితే అన్ని నొప్పులు గుండెనొప్పులకి కారణమని చెప్పలేం. కొన్నిసార్లు ఇది జలుబు లేదా సైనస్ కారణంగా వస్తుంది. కానీ కొన్నిసార్లు ఛాతీ నొప్పి గొంతు నుంచి దవడకు వ్యాపిస్తుంది. ఇది చాలా ప్రమాదం. మీరు చాలా త్వరగా అలసిపోయినట్లనిపిస్తే బలహీనతగా భావించకండి. ఎందుకంటే ఇది కూడా గుండెపోటుకు కారణమయ్యే లక్షణాలలో ఒకటని గుర్తుంచుకోండి. చదవండి: చెమట కాయలా? చందనం పొడి, వట్టివేళ్ల పొడిని రోజ్‌వాటర్‌లో కలిపి.. -
ఎలాంటి వ్యాయామాలు గుండెకు మేలు ??
-
మల్టీ విటమిన్స్ పనితీరుపై సంచలన సర్వే
న్యూఢిల్లీ : సంపూర్ణ ఆరోగ్యం కోసం విటమిన్, మినరల్స్ వంటి డైటరీ సప్లిమెంట్స్ తీసుకుంటే మేలు కంటే కొన్ని సందర్భాల్లో కీడే అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. డైటరీ సప్లిమెంట్స్ గుండెకు సహా శరీరానికి మేలు చేయకపోగా కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమని అనాల్స్ ఆఫ్ ఇంటర్నర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన అథ్యయనం స్పష్టం చేసింది. కాల్షియం, విటమిన్ డీతో కూడిన సప్లిమెంట్లు స్ర్టోక్ ముప్పును పెంచుతాయని ఈ అథ్యయనం బాంబు పేల్చింది. కాల్షియం, విటమిన్ డీలతో నేరుగా ఎదురయ్యే అనారోగ్య ముప్పులు, ప్రయోజనాలపై ఇంతవరకూ సాధికారిక ఆధారాలు ఏమీ లభ్యం కాలేదని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బుల ప్రభావాన్ని నిరోధించడంలో మల్టీవిటమన్లు, మినరల్స్, ఇతర హెల్త్ సప్లిమెంట్లు నిర్థిష్టంగా దోహదపడ్డాయనేందుకు తమకు ఎలాంటి కొలమానాలు లభించలేదని వెల్లడైందని అథ్యయన రచయిత వెస్ట్ వర్జీనియా వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సఫీ యూ ఖాన్ పేర్కొన్నారు. -
వెయిట్ లిఫ్టింగ్‌తో గుండెకు మేలు
లండన్ : హృదయనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కార్డియో వ్యాయామాలతో పోలిస్తే వెయిట్ లిఫ్టింగ్ మేలని తాజా అథ్యయనం వెల్లడించింది. స్థూలకాయుల్లో గుండెలో పేరుకుపోయిన కొవ్వు ప్రమాదకరమని దీన్ని తగ్గించడంలో బరువులు ఎత్తడం, డంబెల్స్,పుషప్స్ వంటివి మెరుగైన వ్యాయామంగా ఉపకరిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. కార్డియో వ్యాయామాల జోలికి వెళ్లకుండా మూడు నెలల పాటు కేవలం వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ తీసుకున్న స్థూలకాయుల్లో మూడింట ఒక వంతు హృదయనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు తగ్గుముఖం పట్టిందని శాస్త్రవేత్తల అథ్యయనంలో వెల్లడైంది. సరైన ఆహారం, వ్యాయామం ద్వారా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి హృద్రోగాలకు దారితీసే పరిస్థితిని నివారించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. కోపెన్హాగన్ యూనివర్సిటీ ఆస్పత్రికి చెందిన శాస్త్రవేత్తలు ఈ అథ్యయనం నిర్వహించారు. -
వేగంగా నడిస్తే..
సిడ్నీ : వేగంగా నడవడం గుండెకు మేలు చేస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. 30 సంవత్సరాల వయసు పైబడిన వారు గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో నడిస్తే గుండెపోటు, స్ర్టోక్ ముప్పు మెల్లిగా నడిచేవారితో పోలిస్తే సగం తక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అన్ని వయసుల వారూ వేగంగా నడిస్తే ఎలాంటి కారణంతోనైనా మరణించే ముప్పు 20 శాతం తక్కువగా ఉంటుందని, జీవనకాలం 15 సంవత్సరాలు పెరుగుతుందని పేర్కొన్నారు. వేగంగా నడవడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అథ్యయనం పేర్కొంది. గంటకు అయిదు నుంచి ఏడు కిలోమీటర్లు నడవడం వేగవంతమైన నడకగా గుర్తిస్తామని, అయితే ఇది నడిచేవారి ఫిట్నెస్ స్ధాయిలపై ఆధారపడిఉంటుందని అథ్యయన రచయిత, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన ప్రొఫెసర్ ఇమ్మానుయేల్ స్టమటకిస్ తెలిపారు. వేగవంతమైన నడకకు మరో సంకేతంగా చిరు చెమట పట్టడాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చన్నారు. 1994 నుంచి 2008 వరకూ 11 జనాభా లెక్కల ప్రామాణికంగా 50,000 మంది ఆరోగ్య రికార్డులను అథ్యయనంలో భాగంగా పరిశోధకులు పరిశీలించారు. నడక వేగాన్ని పెంచడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం, అకాల మరణం ముప్పును నివారించవచ్చని తమ ఫలితాలు సూకచిస్తున్నాయని ప్రొఫెసర్ స్టమటకిస్ చెప్పారు. -
తేలికపాటి వ్యాయామం చేసినా..
లండన్ : మెరుగైన ఆరోగ్యం కోసం జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు, ఎక్కువసేపు నడవడం, యోగా, ధ్యానం అంటూ భారీ సమయం వెచ్చిస్తుంటారు. అయితే రోజూ కొద్దిసేపు తేలికపాటి వ్యాయామం, శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని తాజా అథ్యయనం తేల్చింది. తేలికపాటి వ్యాయామం, చిన్నపాటి శారీరక కదలికలతో గుండె ఆరోగ్యం పదిలపరుచుకోవచ్చని, నూతన కణాల పరిమాణం వీటితో పెరుగుతున్నట్టు తేలిందని పరిశోధకులు ఎలుకలపై నిర్వహించిన ప్రయోగంలో వెల్లడైంది. చిన్నపాటి వ్యాయామమైనా రోజువారీ దినచర్యలో భాగంగా నిత్యం చేస్తే గుండె ఆరోగ్యం మెరుగవుతుందని హార్వర్డ్ అథ్యయనం పేర్కొంది. రోజూ వ్యాయామం, శారీరక కదలికలతో కణాల పునరుజ్జీవం పెరుగుతుందని, ఇది శరీరంలో వాపు ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడి నిస్సత్తువ, గుండె జబ్బులను దరిచేర్చకుండా కాపాడుతుందని పరిశోధనలో గుర్తించారు. రోజూ వ్యాయామం చేసే ఎలుకలో కొత్త గుండె కణాలను నాలుగు రెట్లు అధికంగా గుర్తించారు. గుండె పోటుకు గురైన వారు, వృద్ధుల గుండెను పరిరక్షించుకునేందుకు తేలికపాటి వ్యాయామాలూ మెరుగ్గా ఉపకరిస్తాయని తేలినట్టు పరిశోధకులు వెల్లడించారు. గాయం లేదా వయసు మళ్లిన కారణంగా కుచించుకుపోయే గుండె కణజాలం నూతన కణజాలంతో పునరుజ్జీవం కావడం ద్వారా సమతుల్యతను కాపాడుకోవచ్చని హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్, పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ ఆంథోని పేర్కొన్నారు. -
గుండెజబ్బులకు కొత్త చికిత్స...?
గుండెలోని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతే... అది రక్తప్రసారాన్ని పూర్తిగా అడ్డుకునే స్థాయికి చేరితే గుండెపోటు వస్తుందని అందరికీ తెలుసు. మరి అవసరానికి తగ్గట్టుగా రక్తనాళాలు విశాలమైతే? కొవ్వు పేరుకునే అవకాశమే ఉండదు. గుండెపోటు, జబ్బులు రానేరావు. బాగానే ఉందిగానీ.. ఇదెలా సాధ్యం అంటున్నారా? స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ పనిచేయగల ఓ ప్రొటీన్‌ను గుర్తించారు. జీపీఆర్ 68 అని పిలుస్తున్న ఈ ప్రొటీన్ రక్తప్రవాహాన్ని గుర్తించి.. అందుకు తగ్గట్టుగా డైలేట్ (విశాలంగా మారడం) కావాలని ఆర్టీరియోల్స్ అనే చిన్నస్థాయి రక్తనాళాలకు సందేశాలు పంపుతాయని వీరు గుర్తించారు. రక్తప్రసరణ వేగంలో వచ్చే మార్పులను రక్తనాళాలు గుర్తించగలవని దశాబ్దాలుగా తెలుసునని, అయితే అదెలా జరుగుతోందన్న విషయం ఇప్పటివరకూ తెలియలేదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఆర్డెన్ పటపౌటియన్ తెలిపారు. రక్తనాళాలను తలపించే ఓ యంత్రాన్ని తయారుచేసి.. అందులో ద్రవాలు ప్రవహించేటప్పుడు గోడల్లో లాంటి మార్పులు వస్తున్నాయేమోనని గుర్తించడం ద్వారా తాము జీపీఆర్ 68 గురించి తెలుసుకున్నామని చెప్పారు. తదుపరి పరిశోధనల్లోనూ జీపీఆర్ 68 ప్రొటీన్ మన రక్తనాళ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుందని తెలిసిందని వివరించారు. ఈ నేపథ్యంలో జీపీఆర్ 68ను ప్రేరేపించగల మందులను తయారు చేయగలిగితే, భవిష్యత్తులో గుండెజబ్బులను నియంత్రించేందుకు అవకాశముంటుందని చెప్పారు. -
రోజూ మూడు సార్లు కాఫీ తీసుకుంటే..
లండన్ : రోజుకు మూడు కప్పుల కాఫీ తీసుకుంటే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలని పరిశోధకులు తేల్చారు. రోజుకు ఎక్కువ సార్లు కాఫీ తాగే వారి గుండె ధమనుల్లో కాల్షియం నిల్వలు తక్కువగా పేరుకుపోయినట్టు యూనివర్సిటీ ఆఫ్ సాపౌలో చేపట్టిన తాజా అథ్యయనంలో వెల్లడైంది. రోజుకు మూడు కప్పులు పైగా కాఫీ తాగే వారిలో గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే కాల్షియం నిల్వలు తక్కువగా పేరుకుపోయినట్టు తమ పరిశోధనలో గుర్తించామని అథ్యయన రచయిత ఆండ్రియా మిరండా వెల్లడించారు. రోజుకు మూడు సార్లు కన్నా కాఫీ తాగితే ఇంకా మేలని..అయితే అతిగా తాగడం మాత్రం అనారోగ్యకరమని చెప్పారు. కాఫీలో ఉండే కేఫిన్ లేక ఇతర యాంటీఆక్సిడెంట్స్ వేటి వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందని మాత్రం పరిశోధన స్పష్టత ఇవ్వలేదు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ఈ అథ్యయనం ప్రచురితమైంది. -
వీటితో గుండె పదిలం
సాక్షి, న్యూఢిల్లీ: అధిక కొవ్వుతో గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని నివారించేందుకు ఆహారంలో సోయా, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.మాంసం, కొవ్వు శాతం అధికంగా ఉండే పాలు వంటి పదార్ధాల స్ధానంలో ఆరోగ్యకర ఆహారంతో మెరుగైన మార్పులు చోటుచేసుకుంటాయని ఓ అథ్యయనం వెల్లడించింది. రోజూ రెండు కప్పుల సోయా, తృణధాన్యాలు, గింజలను తీసుకుంటే హానికర ఎల్డీఎల్ కొవ్వులను 5 శాతం మేర తగ్గించవచ్చని తేలింది.ఈ ఆహారంపై తాము విస్తృతంగా జరిపిన పరిశోధనలో ఇవి గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయని స్పష్టంగా వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన జాన్ సెన్పైపర్ చెప్పారు. కెనడాలోని ఒంటారియో నగరంలోని సెంట్ మైఖేల్ హాస్పిటల్లో జాన్ సేవలందిస్తున్నారు. ప్లాంట్ ప్రొటీన్లతో పాటు కొవ్వును తగ్గించే ఓట్స్, బార్లీ వంటి ఆహారంతో వీటిని కలిపితీసుకుంటే ఆరోగ్యకరంగా మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని అథ్యయనంలో తేలింది. -
గుండెకు ‘ప్రాణం'
గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి, హృద్రోగ సమస్యలు పరిష్కరించడానికి ప్రాణాయామము, యోగాసనాలు, ధ్యానసాధన అత్యుత్తమ మార్గం. అయితే గుండె శక్తివంతంగా మారాలని చేస్తున్నామా? గుండె సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి చేస్తున్నామా? అనేది గమనించాలి. తదనుగుణంగా సాధన ఎంచుకోవాలి. సాధన చేసే పద్ధతి మీడియం నుంచి స్పీడ్‌గా ఉంటే...దానిని శక్తి క్రమ అంటారు. అదే నిదానంగా శ్వాసకు అనుగుణంగా చేసే సాధన చికిత్సా క్రమ పద్ధతి అంటారు. నిలబడి చేసే ఆసనాలన్నీ కూడా వెన్నెముకను సాగదీయడానికి, రిలాక్స్ చేయడానికే. నడుం పైభాగాన ఉండే సోవాస్ మజిల్స్ రిలాక్స్ కావడం వల్ల గుండెకు ఒత్తిడి తగ్గుతుంది. అదే విధంగా నిలబడి చేసే యోగాసనాల్లో వృక్షాసనం, ఉత్కటాసనం, త్రికోణాసనం,, వీరభధ్రాసనం... వంటివి గుండె పనితీరును మెరుగు పరిచేందుకు ఉపకరిస్తాయి. మరిన్ని ఉపయుక్తమైన ఆసనాల్లో... అధోముఖ శ్వానాసనం, చతురంగ దండాసనం, భుజంగాసనం, పర్వతాసనం, పాదహస్తాసనం... వంటి వాటి వల్ల దిగువ అబ్డామిన్ ఆబ్లిక్ మజిల్ చురుకుగా మారి, తద్వారా గుండె కండరాలు శక్తివంతం అవుతాయి. బాలాసనం, నిరాలంబాసనం, సేతు బంధాసనం వల్ల లోయర్ అబ్డామిన్, ఆబ్లిక్ మజిల్స్ మీద ఒత్తిడి తగ్గుతుంది. మెటబాలిక్ రేట్ తగ్గుతుంది. డయాఫ్రమ్ రిలాక్స్ అవుతుంది. తేలికపాటి ప్రాణయామాలు ఎక్కువ సేపు ధ్యానం చేయడం గుండెకు ఆరోగ్యం. సూక్ష్మ ప్రాణయామాలైన సూర్యవేది, చంద్రవేది అనులోమ విలోమ ప్రాణయామాలు, అంగన్యాస, అధంగన్యాస, అరణ్యాస వంటి విభాగ ప్రాణయామాలు (సెక్షనల్ బ్రీతింగ్ టెక్నిక్స్) చేయడం ద్వారా గుండె సమస్యలున్నవారికి రిలీఫ్ కలుగుంది. హార్ట్‌రేట్ క్రమబద్ధీకరిస్తాయి. (సేకరణ : సత్యబాబు)


