breaking news
Germany team
-
ఈక్వెడార్ గెలుపు ఈల
న్యూయార్క్: ఈక్వెడార్ ఫుట్‌బాల్ జట్టు అసాధారణ ప్రదర్శన కనబరిచింది. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌గా... నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచిన జర్మనీ జట్టుపై ఊహించని విజయాన్ని సాధించింది. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ టోర్నమెంట్లో నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా జరిగిన చివరిదైన మూడో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో ఈక్వెడార్ 2–1తో జర్మనీ జట్టును బోల్తా కొట్టించింది.ఐవరీకోస్ట్ చేతిలో తొలి మ్యాచ్‌లో ఓటమి చెందడం... రెండో మ్యాచ్‌లో కురసావ్ లాంటి అనామక జట్టుతో ‘డ్రా’ చేసుకోవడం... వెరసి జర్మనీతో మ్యాచ్‌కు ముందు ఒక్క పాయింట్‌తో ఈక్వెడార్ టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితిలో నిలిచింది. కానీ ఈక్వెడార్ జట్టు సమష్టి ఆటతీరుతో సత్తా చాటుకొని గెలుపు ఈల వేసింది. గ్రూప్ ‘ఇ’లో నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. 12 గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లతోపాటు మూడో స్థానంలో నిలిచిన 8 అత్యుత్తమ జట్లకు కూడా నాకౌట్ బెర్త్‌లు లభిస్తాయి. మూడో స్థానంలో నిలిచే 8 అత్యుత్తమ జట్లలో ఈక్వెడార్ ఉండటం ఖాయం కావడంతో ఆ జట్టుకు నాకౌట్ బెర్త్ లభించింది. 0–1తో వెనుకబడి... మ్యాచ్ మొదలైన 2వ నిమిషంలోనే లెరాయ్ సెన్ గోల్‌తో జర్మనీ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆరంభంలోనే వెనుకబడ్డా... ఆందోళన చెందకుండా ఈక్వెడార్ ఆటగాళ్లు అవకాశం ఉన్నపుడల్లా జర్మనీ గోల్‌పోస్ట్‌పై దాడులు నిర్వహించారు. ఫలితంగా 9వ నిమిషంలోనే నిల్సన్ అంగులో గోల్‌తో ఈక్వెడార్ 1–1తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత జర్మనీ వ్యూహాలు మార్చి ఈక్వెడార్ జోరుకు బ్రేక్ వేసింది. ఒకదశలో మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయమనిపించినా... 77వ నిమిషంలో ‘డి’ ఏరియాలో గోల్‌పోస్ట్ ముందు లభించిన అవకాశాన్ని ఈక్వెడార్ ప్లేయర్ గొంజాలో ప్లాటా వదులుకోలేదు. కెవిన్ రోడ్రిగెజ్ హెడర్ షాట్‌ను గోల్‌పోస్ట్ ముందున్న ప్లాటా లక్ష్యానికి చేర్చడంతో ఈక్వెడార్ 2–1తో ముందంజ వేసింది. ఆ తర్వాత మ్యాచ్ ముగిసేవరకు ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని ఈక్వెడార్ ఈ టోర్నీలో తొలి విజయం అందుకోవడంతోపాటు నాకౌట్ బెర్త్‌ను దక్కించుకుంది. ఐవరీకోస్ట్ తొలిసారి... నాలుగో ప్రయత్నంలో ఐవరీకోస్ట్ జట్టు ప్రపంచకప్‌లో తొలిసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా కురసావ్ జట్టుతో ఫిలడెల్ఫియాలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఐవరీకోస్ట్ 2–0తో గెలిచింది. నికోలస్ పెపె (7వ, 64వ నిమిషంలో) రెండు గోల్స్ చేసి ఐవరీకోస్ట్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. గ్రూప్ ‘ఇ’లో జర్మనీ, ఐవరీకోస్ట్ ఆరు పాయింట్లతో సమంగా నిలిచినా... గోల్స్ అంతరం కారణంగా జర్మనీ గ్రూప్ విజేతగా నిలువగా.. ఐవరీకోస్ట్ రెండో స్థానంతో ముందంజ వేసింది. 2006, 2010, 2014 ప్రపంచకప్‌లలో ఐవరీకోస్ట్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. 12వసారి నెదర్లాండ్స్ ముందుకు...కాన్సస్ సిటీలో జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ ఆఖరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3–1తో గెలిచింది. ఏడు పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచిన నెదర్లాండ్స్ ఈ మెగా ఈవెంట్లో పాల్గొన్న 12వసారీ నాకౌట్ దశకు చేరుకుంది. గ్రూప్ ‘ఎఫ్’లోని మరో మ్యాచ్‌లో జపాన్ 1–1తో స్వీడన్‌ను నిలువరించింది. ఐదు పాయింట్లతో జపాన్ గ్రూప్ ‘ఎఫ్’లో రెండో స్థానంలో నిలిచి నాకౌట్ బెర్త్‌ను దక్కించుకుంది. టోర్నీ నుంచి నిష్క్రమించిన టర్కీ గ్రూప్ ‘డి’ చివరి మ్యాచ్‌లో 3–2తో అమెరికాపై నెగ్గింది. శాన్ఫ్రాన్సిస్కోలో పరాగ్వేతో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌ను ఆ్రస్టేలియా 0–0తో ‘డ్రా’గా ముగించి నాకౌట్ దశకు చేరింది. -
జయహో జర్మనీ
హ్యూస్టన్: గత రెండు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిన నాలుగుసార్లు చాంపియన్ జర్మనీ జట్టు తాజా ప్రపంచకప్‌ను ఘనవిజయంతో ప్రారంభించింది. తొలిసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆడుతున్న కురసావ్ జట్టుతో ఆదివారం జరిగిన ‘ఇ’ లీగ్ మ్యాచ్‌లో జర్మనీ 7–1 గోల్స్ తేడాతో గెలుపొందింది. జర్మనీ తరఫున ఫెలిక్స్ నెమాచా (6వ నిమిషంలో), నికో ష్కాల్టెర్బెక్ (38వ నిమిషంలో), జమాల్ ముసియాలా (47వ నిమిషంలో), నథానియల్ బ్రౌన్ (68వ నిమిషంలో), డెనిజ్ ఉండావ్ (78వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... కాయ్ హావెట్జ్ (45+5వ నిమిషంలో, 88వ నిమిషంలో) రెండు గోల్స్ సాధించాడు. కురసావ్ జట్టుకు లివానో కొమెన్సియా (21వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ‘డ్రా’తో గట్టెక్కిన బ్రెజిల్... గత ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరిన ఆఫ్రికా జట్టు మొరాకోతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్ ఓటమి తప్పించుకొని 1–1తో గట్టెక్కింది. మొరాకో తరఫున ఇస్మాయిల్ సైబారి (21వ నిమిషంలో) గోల్ చేయగా... బ్రెజిల్ జట్టుకు వినిసియస్ జూనియర్ (32వ నిమిషంలో) గోల్ అందించాడు. పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెమార్ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. 1938 ప్రపంచకప్ నుంచి బ్రెజిల్ జట్టు ఈ మెగా ఈవెంట్లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోలేదు. ఈసారి తమ అజేయ రికార్డును కొనసాగించింది. గ్రూప్ ‘బి’లో ఖతర్, స్విట్జర్లాండ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. 90+4వ నిమిషంలో స్విట్జర్లాండ్ ప్లేయర్ మిరో ముహీమ్ ‘సెల్ఫ్ గోల్’ చేసి తమ జట్టుకు విజయాన్ని దూరం చేశాడు. గ్రూప్ ‘సి’లోని మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్ 1–0తో హైతీ జట్టును ఓడించి 36 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని అందుకుంది. గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 2–0తో టర్కీ జట్టుపై గెలిచింది. -
పూర్వ వైభవం కోసం!
ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో అత్యంత నిలకడగా రాణిస్తున జట్లలో జర్మనీ జట్టు కచ్చితంగా ఉంటుంది. ఇప్పటి వరకు 22 సార్లు ప్రపంచకప్ జరగ్గా... అత్యధికసార్లు ఫైనల్ చేరుకున్న జట్టుగా జర్మనీకి పేరుంది. నాలుగుసార్లు (1954, 1974, 1990, 2014) విశ్వవిజేతగా నిలిచిన జర్మనీ జట్టు... మరో నాలుగుసార్లు ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా (1966, 1982, 1986, 2002) నిలిచింది. మరో నాలుగుసార్లు మూడో స్థానం (1934, 1970, 2006, 2010) సంపాదించింది. 2014లో బ్రెజిల్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచిన జర్మనీ... ఆ తర్వాత అనూహ్యంగా వెనుకబడిపోయింది. పలువురు స్టార్ ఆటగాళ్లు రిటైర్ కావడం... వారి స్థానాలను భర్తీ చేసేవాళ్లు ఇంకా తయారు కాకపోవడం... వెరసి జర్మనీ జట్టు తొలిసారి వరుసగా రెండు ప్రపంచకప్‌లలో (2018, 2022) గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. రెండేళ్ల క్రితం స్వదేశంలో జరిగిన ‘యూరో’ టోర్నీలో జర్మనీ క్వార్టర్ ఫైనల్లో చాంపియన్ స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఇక ప్రపంచకప్ క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘ఎ’లో ఉన్న జర్మనీ 15 పాయింట్లతో టాపర్‌గా నిలిచి మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది. పూర్వ వైభవం కోసం తాపత్రయపడుతున్న జర్మనీ ఈసారి గ్రూప్ దశ సులువుగానే దాటే అవకాశం ఉంది. గ్రూప్ ‘ఇ’లో కురసావ్, ఐవరీకోస్ట్, ఈక్వెడార్ జట్లతో జర్మనీకి చోటు కల్పించారు. జర్మనీ తొలి మ్యాచ్‌ను జూన్ 14న కురసావ్తో, రెండో మ్యాచ్‌ను జూన్ 20న ఐవరీకోస్ట్‌తో, జూన్ 25న ఈక్వెడార్‌తో ఆడుతుంది. మిడ్‌ఫీల్డర్లు జమాల్ ముసియాలా, ఫ్లోరియన్ విట్జ్, లెనార్ట్ కార్ల్, కాయ్ హావెట్జ్లతోపాటు వెటరన్ గోల్‌కీపర్ మాన్యుయెల్ న్యూయెర్ ప్రదర్శనపై జర్మనీ ముందంజ వేసే ఆశలు ఆధారపడి ఉన్నాయి. జర్మనీ జట్టుకు నాకౌట్ దశ ప్రిక్వార్టర్ ఫైనల్లో గత ప్రపంచకప్ రన్నరప్ ఫ్రాన్స్ ఎదురయ్యే అవకాశముంది. ఫ్రాన్స్ అడ్డంకిని అధిగమిస్తే జర్మనీ నుంచి అద్భుత ఫలితం ఆశించవచ్చు. – సాక్షి క్రీడావిభాగం -
చేజేతులా ఓడిన భారత్
న్యూఢిల్లీ: అందివచ్చిన అవకాశాలను వృథా చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టు మూల్యం చెల్లించుకుంది. ప్రపంచ చాంపియన్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జర్మనీ జట్టుపై విజయం సాధించడంలో టీమిండియా విఫలమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 0–2 గోల్స్ తేడాతో జర్మనీ జట్టు చేతిలో ఓడిపోయింది. జర్మనీ తరఫున మెర్ట్జెన్స్ (4వ నిమిషంలో), విండ్‌ఫెడర్ (30వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. సిరీస్‌లో చివరిదైన రెండో మ్యాచ్ నేడు జరుగుతుంది. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఏకంగా ఏడు పెనాల్టీ కార్నర్లు, ఒక పెనాల్టీ స్ట్రోక్ కూడా వచ్చాయి. కానీ వీటిని భారత జట్టు గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. మరోవైపు జర్మనీ జట్టుకు మూడు పెనాల్టీ కార్నర్లు రాగా, ఒక దానిని గోల్‌గా మలిచింది. -
ఏపీలో మహిళలకు ప్రాధాన్యంపై జర్మనీ ప్రశంస
సాక్షి, అమరావతి: ఏపీలో మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాల అమలు, ఉపాధి అవకాశాల కల్పనపై జర్మనీ ప్రభుత్వ ప్రతినిధులు ప్రశంసించారు. నగరాలు, పట్టణాల పరిశుభ్రతకు ఈ–ఆటోలు అందించడం, వాటికి డ్రైవర్లుగా మహిళలనే నియమించడంపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సైతం అభినందనలు తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఇటీవల ‘హై లెవెల్ పొలిటికల్ ఫోరం’ పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి స్పెషల్ కన్సల్టెన్టివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్ రాష్ట్రం తరఫున ఒక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ‘నాడు–నేడు’ కింద అమలు చేస్తున్న పలు పథకాలు, మహిళల కోసం ప్రత్యేక పథకాలు, సస్టెయినబుల్ గ్రీన్ సిటీస్ నిర్మాణం గురించి వివరిస్తూ ఫొటోలను ప్రదర్శించారు. వీటిలో ముఖ్యంగా మున్సిపల్ శాఖ చెత్త సేకరణ కోసం ఈ–ఆటోలు అందించడంతోపాటు డ్రైవర్లుగా మహిళలనే నియమించడం, పట్టణ పేద మహిళలకు రూపాయికే ఇల్లు అందించడం వంటి అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంటింటి చెత్త సేకరణ, పట్టణాల్లో సామాజిక అడవులు, రహదారుల వెంబడి మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నట్లు షకిన్‌కుమార్ తెలిపారు. ఈ–ఆటోల ద్వారా చెత్త సేకరించడం, తడి, పొడి చెత్తను వేరుగా సేకరించడాన్ని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు అభినందించారని, క్లీన్ అండ్ గ్రీన్ సిటీల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. రూపాయికే ఇల్లు ఇవ్వడాన్ని యూఎన్‌ఓలోని అమెరికా ప్రతినిధి బిల్గ్రాహం మెచ్చుకున్నారని తెలిపారు. -
జర్మనీ జయకేతనం
చాంపియన్స్ ట్రోఫీ కైవసం ఫైనల్లో పాక్‌పై గెలుపు భువనేశ్వర్: టోర్నీ మొత్తం నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్న ఒలింపిక్ చాంపియన్ జర్మనీ జట్టు... చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. ఆదివారం కలింగ మైదానంలో జరిగిన ఫైనల్లో 2-1తో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. 2007 తర్వాత మరోసారి టైటిల్‌ను సాధించిన జర్మనీకి ఓవరాల్‌గా ఇది పదో ట్రోఫీ. వెస్లీ (18వ ని.), ఫ్లోరియన్ ఫుచ్స్ (57వ ని.) జర్మనీకి గోల్స్ అం దించారు. తొలి నిమిషంలోనే పెనాల్టీని సాధిం చిన జర్మనీ మ్యాచ్ మొత్తం దూకుడును ప్రదర్శించింది. ప్రథమార్ధం ముగిసేసరికి 1-0 ఆధిక్యాన్ని సాధించింది. అయితే రెండో అర్ధభాగంలో పాక్ కాస్త పోరాడినా గోల్స్ చేయలేకపోయింది. భారత్‌కు నాలుగో స్థానం 32 ఏళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో పతకం గెలుచుకునే మంచి అవకాశాన్ని భారత హాకీ జట్టు జారవిడుచుకుంది. ఆదివారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో 1-2తో ఆస్ట్రేలియా చేతిలో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 1982లో కాంస్యం సాధించిన భారత్... కనీసం ఈసారి కూడా దాన్ని పునరావృతం చేస్తే బాగుంటుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. లలిత్ ఉపాధ్యాయ (42వ ని.) భారత్‌కు ఏకైక గోల్ అందిస్తే... ఎడి ఒకెన్డెన్ (18వ ని.), మాట్ గోడెస్ (52వ ని.)లు ఆసీస్ తరఫున చెరో ఫీల్డ్ గోల్ సాధించారు. నెదర్లాండ్స్, అర్జెంటీనా, ఇంగ్లండ్, బెల్జియం వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. ఇద్దరు పాక్ ఆటగాళ్లపై వేటు సెమీస్‌లో భారత్‌పై గెలిచాక ప్రేక్షకులకు అసభ్య కరంగా సంజ్ఞలు చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లపై అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఒక మ్యాచ్ నిషేధం విధించింది. ఆ ఘటనలో దోషులుగా తేలిన అంజద్ అలీ, మొహమ్మద్ తౌసీఖ్లను జర్మనీతో ఫైనల్ ఆడకుండా నిషేధించింది. తొలుత వీరిని హెచ్చరించి వదిలేసినా... వాళ్లపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో భారత్‌లో అం తర్జాతీయ టోర్నీలు నిర్వహించబోమని హాకీ ఇండియా హెచ్చరించింది. దీంతో ఎఫ్ఐహెచ్ చర్యలు తీసుకుంది. సెమీస్ తమ ప్రవర్తన పట్ల ఫైనల్ అనంతరం పాక్ కోచ్, కెప్టెన్ గులాబీలు ప్రదర్శిస్తూ క్షమాపణలు కోరారు.


