breaking news
Fishing families
-
ఒక్కొక్కరిని ఓదారుస్తూ.. ధైర్యం చెబుతూ..
సాక్షి, విశాఖపట్నం : బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను, మృత్యువుతో పోరాడి ప్రాణాలు దక్కించుకున్న కారి చిన్నాను మంగళవారం జబ్బర్‌తోటలోని వారి నివాసంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ‘నేనున్నాను.. అధైర్య పడకండి‘ అంటూ కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. ప్రమాదం జరిగి 10 రోజులు అయినా ప్రభుత్వం నుంచి ఏ మంత్రి కూడా ఓదార్చే ప్రయత్నం చేయలేదంటూ బాధిత మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించిన రూ.10 లక్షల (రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు) అరకొర సాయంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు మరింత సాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ ప్రభుత్వం స్పందించకుంటే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. అలాగే, చిన్నాకు కొత్త బోటును సమకూర్చడంతో పాటు, బాధిత కుటుంబాల పిల్లల చదువు బాధ్యతను తామే స్వీకరిస్తామని జగన్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం బాధితులకు వైఎస్సార్సీపీ నుంచి కూడా ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత మత్స్యకార కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ సంభాషణ ఇలా సాగింది.వైఎస్ జగన్: ఆరోగ్యం ఎలా ఉంది? ప్రమాదం జరిగినప్పటి నుంచి వైద్యసేవలు సక్రమంగా అందాయా అన్నా..? మత్స్యకార బాధితుడు కారి చిన్నా : ఆరోగ్యం బాగానే ఉందన్నా. వైద్యసేవలు బాగానే అందాయన్నా.. వైఎస్ జగన్: బోటు ప్రమాదం ఎలా జరిగింది? కారి చిన్నా: మేము జూలై 1వ తేదీన హార్బర్ నుంచి 30 నుంచి 35 నాటికల్ మైళ్ల దూరం వేటకు వెళ్లాం. రెండు రోజుల పాటు వేట బాగానే సాగింది. ఇంటికి తిరుగు ప్రయాణంలో తీరానికి మరో 10 నాటికల్ మైళ్ల దూరం ఉందనగా తుపాను గాలులు, రాకాసి అలల ప్రభావంతో బోటు బోల్తా పడింది. మా అన్నయ్య కొడుకు నీటిలో పడిపోయాడు. మా అన్నయ్య చిన్నయ్య ఏడుస్తూ వాడిని కాపాడటానికి వెంటనే నీళ్లలోకి దూకాడు. అలా వాళ్లిద్దరూ మా కళ్లముందే సముద్రంలో కలిసిపోయారు. బోటు మునుగుతోంది.. రాత్రి 9 గంటల ప్రాంతంలో మునుగుతున్న బోటుపై రెండు లైఫ్ బాయ్ ఫోర్సులను (రక్షణ వలయాలు) పట్టుకుని గడిపాం. కానీ, తెల్లవారే సరికి చీకట్లో అలలు ధాటికి ఒకరు కొట్టుకుపోయారు. చాలా దూరంలో చైనా వాణిజ్య నౌక (షిప్) వెళ్లడం చూసి మిగిలిన నలుగురం ఈదుకుంటూ వెళ్తున్నాం. ఒకరు అలల తాకిడికి మిగతా వారు సముద్రంలో కలిసిపోయారు. 15 కిలోమీటర్ల దూరం మృత్యువుతో పోరాడుతూ వెళ్లి నేను ఆ చైనా షిప్ ‘లంగర్’ (యాంకర్) పట్టుకున్నాను. నా కేకలు విని షిప్ పైనున్న చైనా సిబ్బంది కాపాడారు. వైఎస్ జగన్: ప్రభుత్వం సహాయక చర్యలు అందలేదా? కారి చిన్నా: జూలై 4వ తేదీ రాత్రంతా బోటును పట్టుకునే ఉన్నామన్నా. ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు చేపడతారనే మరుసటి రోజు ఉదయం వరకూ ఉన్నాం. కనీసం మా మత్స్యకార బోటు అసోíసియేషన్ వారికి చెప్పినా వచ్చేవారన్నా.. నలుగురైదుగురం బతికేవాళ్లం.వైఎస్ జగన్: బాధపడకు అన్నా.. ప్రభుత్వం నుంచి నీకు సాయం అందిందా?కారి చిన్నా: మునిగిన బోటు నా సొంతందే అన్నా.. అది మునిగిపోయింది. బోటు పరిహారం గానీ, నాకు ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ప్రభుత్వం అందజేయలేదన్నా..వైఎస్ జగన్: ప్రభుత్వం సాయం అందించేలా ఒత్తిడి తీసుకొస్తా.. నష్ట పరిహారం ఇవ్వకుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే రూ.కోటి పరిహారంతో పాటు కొత్త బోటు కోసం డబ్బులు ఇస్తాం. ధైర్యంగా ఉండు.కారి చిన్నా: ఆ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నన్ను మీరు ఫోన్లో పరామర్శించారు. మూడు రోజుల తర్వాత వస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు. చాలా ధైర్యంగా ఉందన్నా.. మా మత్స్యకారులందరి ధైర్యం మీరేనన్నా.. (మాట నిలుపుకుంటూ మా ఎదుటకు వచ్చారని వైఎస్ జగన్ రాగానే చిన్నా సాష్టాంగ నమస్కారం చేశారు.)వైఎస్ జగన్: స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు మిమ్మల్ని కలిసి ఆర్థిక సాయం అందజేస్తారు. దమయంతి (గల్లంతైన మత్స్యకారుడు కారి గరగయ్య భార్య) : రెండేళ్ల పిల్లోడిని, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడన్నా.. (కన్నీటి పర్యంతమైంది) వైఎస్ జగన్: తల్లీ.. బాధ పడకమ్మా..దమయంతి: మేమెలా బతకాలో తెలియడం లేదన్నా.. నేనే నా కుటుంబాన్ని పోషించుకోవాలన్నా. నా పిల్లోడిని చదివించుకోలేని పరిస్థితి. నా భర్త లేని జీవితం చాలా భయంగా ఉందన్నా.వైఎస్ జగన్ : మిమ్మల్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోకపోతే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మీకు కోటి రూపాయల పరిహారంతో పాటు ఈ పిల్లోడి చదువు బాధ్యతను కూడా తీసుకుంటాం. ఆధైర్య పడకమ్మా. నీకు అన్నివిధాల వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది.దమయంతి : నా భర్త డెత్ సర్టిఫికెట్ త్వరగా వచ్చేలా చూడాలన్నా. అది వస్తే పింఛనుకు దరఖాస్తు చేసుకుంటాను. ప్రభుత్వం ఇచ్చే ఆ డబ్బులతో ఏదో కుటుంబాన్ని పోషించుకుంటానన్నా. నాకు ప్రభుత్వం నుంచి ఏదైనా ఉద్యోగం కల్పించాలని కోరుకుంటున్నానన్నా.వైఎస్ జగన్ : ఇవన్నీ అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ఒక వేళ ఈ ప్రభుత్వం చేయకపోతే మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే మీకు అండగా నిలుస్తుంది. అదేవిధంగా వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు. అధైర్యపడకమ్మా.. మీ అన్నయ్యగా నేనున్నా.నర్సియమ్మ (గల్లంతైన మత్స్యకారుడు కారి సీతోడు భార్య) : జగన్ బాబూ.. ఎవరూ మా బాధలను పట్టించుకోకపోయినా నీవు వచ్చావు. నాకు చాలా ధైర్యంగా ఉంది బాబూ..వైఎస్ జగన్: మీ కోసమే వచ్చాను. మీ కుటుంబాలను ఆదుకుంటాను. నర్సియమ్మ: నా భర్త గల్లంతయ్యి పది రోజులు దాటింది. నా భర్త ఉన్నాట్లా..? లేనట్లా..? ప్రభుత్వం నుంచి అధికారంగా ఏ సమాచారం లేదు. ఒక వేళ చనిపోయి ఉంటే కనీసం పిండ ప్రదానం, దినకార్యం కూడా చేసుకోలేకపోయాం. ప్రభుత్వం నుంచి ఒక్క మంత్రి కూడా మా దగ్గరికి ఇలా భరోసా కల్పించడానికి రాలేదు.వైఎస్ జగన్: మత్స్యకారులంటే ఈ ప్రభుత్వానికే నిర్లక్ష్యం. మీకు అండగా వైఎస్సార్సీపీ, మీ జగన్ ఉంటాడు. నర్సియమ్మ: నాకు ఇద్దరు పిల్లలు. పెద్దోడికి పెళ్లి అయింది. చిన్నోడికి ఇంకా పెళ్లి కాలేదు. అన్ని బాధ్యతలు తానే మోయాలి. ప్రభుత్వం నుంచి నా చిన్న కొడుక్కు ఏదైనా ఉద్యోగం కల్పిస్తే నా కుటుంబాన్ని కాపాడినట్లు అవుతుంది బాబూ..వైఎస్ జగన్ : బాధ పడకమ్మా. ఈ ప్రభుత్వం మొద్దు ప్రభుత్వం. మనం అధికారంలో లేము. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగం కల్పిస్తాం. అప్పటి వరకు మీకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నీ భర్తకు పరిహారంగా రూ.కోటితో పాటు మీ చిన్నకొడుక్కు ఉపాధి కూడా కల్పిస్తాం.వైఎస్ జగన్ : తల్లీ బాధపడకు.. మీ జగనన్న అండగా నిలుస్తాడు..లక్ష్మీ (గల్లంతైన మత్స్యకారుడు రగుతు బండియ్య భార్య): నాకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద పాపకు పెళ్లి చేశాను. మరో ఇద్దరు పిల్లల బాధ్యత మోయాలి. నా భర్త గల్లంతయ్యి ఆచూకీ లేకుండా పోయాడు. ఈ బరువు బాధ్యతలు నాపై పెట్టేశాడు. ప్రభుత్వం నుంచి మా కుటుంబాన్ని ఆదుకునే వారెవ్వరూ లేరు.వైఎస్ జగన్ : అధైర్యపడకమ్మా.. ఈ మొద్దు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాను. మీకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తాం. అప్పటికీ ఈ ప్రభుత్వంలో మార్పు రాకపోతే.. మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నీకు రూ.కోటి పరిహారంతో పాటు అన్ని విధాలా ఆదుకుంటాం.లక్ష్మీ: చాలా సంతోషం అన్నా.. అదేవిధంగా నా భర్త డెత్ సర్టిఫికెట్ త్వరితగతిన వచ్చేలా చేస్తే.. పింఛనుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. బాధలో ఉన్న మమ్మల్ని ఓదార్చిందుకు వచ్చిన నీవు నిండు నూరేళ్లు బాగా ఉండాలన్నా..వైఎస్ జగన్ : మీకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుంది. మీ జగనన్న ఉంటాడమ్మా.. ఇదే రీతిలో వైఎస్ జగన్.. గల్లంతైన మత్స్యకారులు కారి చిన్నయ్య భార్య కె.మౌనిక, మేధా చిన్న అమ్మోరు భార్య మాసినమ్మ, అమర అప్పలరాజు భార్య ఎ.లక్ష్మిలను పరామర్శించి, ధైర్యం చెప్పారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సహాయంచిన్నాకు సహా ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకార కుటుంబాలతో పాటు ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నా కుటుంబానికి కూడా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్థిక సహాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి పార్టీ తరఫున రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందివ్వాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. ఇ చ్చిన మాట మేరకు తమ కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పడమే కాకుండా ఆర్థిక సహాయం సైతం ప్రకటించడంపై బాధిత కుటుంబాలు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపాయి. బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం ప్రకటించడాన్ని మత్స్యకార సంఘాల నాయకులు స్వాగతించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేశ్‌కుమార్, మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలా గురువులు, పార్టీ మత్స్యకార విభాగం జిల్లా అధ్యక్షుడు పేర్ల విజయచందర్, మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకీరామ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ ఆంక్షలు.. వీధుల్లో బారికేడ్లుభద్రత పేరుతో నిర్బంధం.. అయినా పోటెత్తిన జనం వైఎస్ జగన్ పర్యటనలో సర్కారు పెద్దల డైరెక్షన్.. పోలీసుల యాక్షన్ విశాఖ విద్య/డాబాగార్డెన్స్ : బోటు ప్రమాదంలో విశాఖకు చెందిన మత్స్యకారులు గల్లంతై రోజులు గడుస్తున్నా, వారి జాడ తెలీక తల్లడిల్లుతున్న మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పడానికి వ చ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం పోలీసులను ముందు పెట్టి అడ్డుకోజూసింది. ఈ క్రమంలో విశాఖ పోలీసులు ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. జబ్బర్‌తోట పరిసర ప్రాంతాల వీధుల ప్రవేశ మార్గాలను మంగళవారం ఉదయం 7 గంటల నుంచే బారికేడ్లు పెట్టి మూసి వేశారు. సుమారు 500 మంది పోలీసులను ఎక్కడికక్కడ మోహరించారు. ఏవీఎన్ కాలేజీ అప్, రెల్లి వీధి జంక్షన్, సమీప వీధులను బ్లాక్ చేశారు. వీధుల్లో షాపులను మూసి వేయించారు. సున్నితమైన ప్రాంతం కావడంతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశామని పోలీసులు వారి చర్యలను సమర్థించుకోవడం గమనార్హం. ఇన్ని అడ్డంకులు సృష్టించినా పెద్ద సంఖ్యలో ప్రజలు జగన్‌ను చూసేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. కాగా, చంద్రబాబు సర్కారు బాధితులు పలువురు వైఎస్ జగన్‌కు వినతి పత్రాలు అందజేశారు. హెల్ప్ మీ.. జగనన్నా.. విశాఖ జబ్బర్ తోటలో వంకా నరేష్ భార్య అమ్మాజి ఓ చిన్నోడి ఫొటోతో ‘హెల్ప్ మీ’ అని ప్లకార్డు పట్టుకుని ఉండటం చూసి వైఎస్ జగన్ దగ్గరకు రమ్మని పిలిచారు. ‘అన్నా.. నా భర్త ఫిషింగ్ హార్బర్లో కూలీ. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దోడు గగన్ (7) కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. వైద్యులు ఎడమ వైపు కిడ్నీ తీసివేయాలన్నారు. కుడివైపు కిడ్నీకి ఇన్ఫెక్షన్ పట్టిందని చెప్పారు. అన్నం తిన్నా బాబుకు అరగడం లేదు. నా కష్టం మీతో చెప్పుకోవాలని ఇలా బోర్డు పట్టుకున్నాను’ అని చెప్పింది. ఆమె కష్టాన్ని విన్న జగన్.. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుకి ఈ సమస్యను అప్పగించారు.బర్మా కాందిశీకుల భూమిని కబ్జా చేస్తున్నారన్నా.. విశాఖ ఉత్తర నియోజకవర్గం 49 వార్డులోని కప్పరాడలో సర్వే నెంబర్ 13లో బర్మా కాందిశీకుల భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైందని, దీని వెనుక నియోజకవర్గ ఎమ్మెల్యే పాత్ర ఉందని బాధితులు వైఎస్ జగన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రోద్బలంతో కొందరు ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా వేసి విక్రయిస్తున్నారని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించినా ఫలితం లేదని వాపోయారు. 3 ఎకరాల భూమిని ఆక్రమించడానికి ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న ప్రయత్నాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖలో భూ దందాలు పెరిగి పోయాయని వాపోయారు. 49వ వార్డు మాజీ కార్పొరేటర్ అల్లు శంకరరావు, బర్మా కాందిశీకుల ఐక్య వేదిక అధ్యక్షుడు ఎ.నర్సింహులు, ప్రధాన కార్యదర్శి దీపక్, మహిళా ప్రతినిధులు మంగ, ప్రసన్న తదితరులు వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ క్రమంలో యూరియా బస్తా కోసం వెళ్లిన కాంతమ్మ అనే మహిళా రైతు తొక్కిసలాటలో మృతి చెందారని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. ఈ నెల 10వ తేదిన టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలం పెద్దలవునిపల్లి రైతు సేవా కేంద్రం వద్ద ఈ ఘటన జరిగిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం దీనిని సాధారణ మరణంగా చిత్రీకరించి ఆ నిరుపేద మహిళా రైతు కుటుంబానికి అన్యాయం చేసిందని వివరించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తున్నామని చెప్పారు. -
కులాసా.. మత్స్యకార భరోసా
ఆటుపోటుల జీవితం.. సముద్రంలో వేటకు వెళితేగాని పూట గడవని బతుకు సమరం.. వారి జీవితాల్లో మార్పులు వచ్చాయి.. పథకాలు ముంగిటకు వచ్చి చేరుతున్నాయి.. వేట విరామ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న మత్స్యకార భరోసా వారికి కొండంత అండగా నిలుస్తోంది. గంగపుత్రుల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. వరుసగా నాలుగో ఏడాది మత్స్యకార భరోసా సాయం అందించేందుకు ప్రభుత్వం సర్వే చేసింది. వచ్చే నెలలో అర్హుల ఖాతాల్లోకి సొమ్ములను జమచేయనుంది. నరసాపురం : చేపల పునరుత్పత్తి సీజన్లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తుంది. ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 15వ తేదీ వరకు 61 రోజులపాటు మత్స్యకారులు ఖాళీగా ఉంటారు. ఈ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటారు. పడవలు, వలలు మరమ్మతులు చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మత్స్యకార భరో సా పథకాన్ని ప్రవేశపెట్టి కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. గతంలో ఉన్న అర్హుల సంఖ్యను పెంచుతూ మరింత మందికి చేయూతగా నిలుస్తోంది. జిల్లాలో 19 కిలోమీటర్లు మేర తీరం ఉండగా నరసాపురం ప్రాంతంలో దాదాపు 2 వేల మంది వేటపై ఆధారపడి బతుకుతున్నారు. పాదయాత్ర హామీ మేరకు.. పాదయాత్ర చేసిన సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నరసాపురం వేదికగా వేట నిషేధ సా యా న్ని రూ.10 వేలకు పెంచుతానని ప్రకటించారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో మ త్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. అప్పటికి 173 మంది మాత్రమే అర్హులు ఉండగా ఆ సంఖ్యను 1,072కు పెంచి సాయం అందించారు. అలాగే 2020, 2021లో పథకాన్ని సమర్థవంతంగా అమలుచేశారు. ఈ ఏడాది కూడా పథకానికి అర్హులను గుర్తించారు. గతంలో సాయం నామమాత్రంగా ఉండగా ఈ ప్రభుత్వంలో వేలాది మందికి కోట్లాది రూపాయల లబ్ధి చేకూరుతోంది. గతంలో ముప్పుతిప్పలు గతంలో వేట నిషేధ సాయం కోసం మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. నిషేధం ము గిసి వేట ప్రారంభమైన ఐదారు నెలల తర్వాత కొద్దిమందికి మాత్రమే అరకొరగా సాయం అందించేవారు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ, బడా నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. 2014కు ముందు రిలీఫ్ కమ్ సేవింగ్స్ స్కీమ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.600, కేంద్ర ప్రభు త్వం రూ.600 కలిపి రూ.1,200 అందించేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ఎగ్గొట్టారు. 2015లో 52 మందికి రూ.1.04 లక్షలు, 2016లో 46 మందికి 0.92 లక్షలు, 2017లో 104 మందికి రూ.4.16 లక్షలు, 2018లో 173 మందికి రూ.6.92 లక్షలు మా త్రమే నామమాత్రంగా అందించారు. జగన్ వచ్చాకే డబ్బులు వస్తున్నాయి మాకు ఏ పథకాలు ఉన్నాయో తెలిసేది కాదు. వేట విరామ సమయంలో రూపాయి వచ్చేది కాదు. జగన్ ముఖ్య మంత్రి అయిన తర్వాత మూడేళ్ల నుంచి వేట విరామ సమయంలో రూ.10 వేల చొప్పున మా బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. ఈ ఏడాది కూడా నాపేరు ఎంపిక చేశారు. వేట లేని సమయంలో ఇదే మాకు ఆధారం. – పెమ్మాడి గంటయ్య, మత్స్యకారుడు, నరసాపురం చాలా ఆనందంగా ఉంది చిన్నప్పటి నుంచి వేట తప్ప మరేమీ తెలియదు. ఏటా వేసవిలో రెండు నెలలు వేట ఉండదు. ఆ సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. గతంలో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూసేవాళ్లం. ఇప్పుడు అలాకాదు కుటుంబానికి రూ.10 వేలు ఇస్తున్నారు. అదీ నా బ్యాంకు ఖాతాలో వేస్తున్నారు. ఆనందంగా ఉంది. – మైలా రాముడు, పీఎం లంక, మత్స్యకారుడు సర్వే పూర్తయ్యింది నరసాపురం తీరంలో మాత్రమే మత్స్యకార భరోసా లబ్ధిదారులు ఉన్నారు. ఈ ప్రాంతంలో 141 ఇంజిన్ బోట్లు ఉన్నాయి. వీటిపై పనిచేసే మత్స్యకార్మికులు 1,454 మందిని గుర్తించాం. వీరందరికీ మత్స్యకార భరోసా పథకానికి ఎంపిక చేశాం. ఈ మేరకు సర్వే పూర్తయ్యింది. వచ్చేనెలలో వీరందరికీ సొమ్ములు పడతాయి. – వి.ఏడుకొండలు, మత్స్యశాఖ అధికారి, నరసాపురం -
సముద్రం నుంచి సముద్రానికి
చిన్నప్పుడు వేటకు వెళ్లిన తండ్రి ఒక్కోసారి ఖాళీ చేతులతో తిరిగి వచ్చేవాడు. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడేవాడు. పడిన సరుకును సరిగ్గా అమ్ముకోగలిగేవాడు కాదు. ఇవాళ 45 ఏళ్ల వెల్విగి మెరైన్ బయాలజిస్ట్‌గా మారి తమిళనాడు కారైకల్ ప్రాంతంలో మత్స్యకారులకు సురక్షిత చేపల వేటకు సాయం చేస్తోంది. బెస్త స్త్రీల స్వయం సమృద్ధికి మార్గదర్శనం చేస్తోంది. 35 ఏళ్ల క్రితం వెల్విగికి పదేళ్లు. ఇంటికి పెద్ద పిల్ల. తన తర్వాత ముగ్గురు తోబుట్టువులు. తమిళనాడు నాగపట్టణం బెస్తపల్లెలో తండ్రి ఉదయాన్నే నాలుగ్గంటలకు చేపల వేటకు కొయ్య పడవ మీద బయలుదేరుతూ ఉంటే నిద్ర కళ్లతో చూసేది. వేటకు వెళ్లిన తండ్రి రెండు మూడు రోజులు రాడు. ఆ అన్ని రోజులు వెల్విగి దేవుణ్ణి ప్రార్థిస్తూ తండ్రి కోసం ఎదురు చూసేది. తండ్రి తిరిగి వచ్చేంత వరకూ తండ్రికీ ఇంటికీ మధ్య ఏ కమ్యూనికేషనూ ఉండేది కాదు. వాతావరణం మారితే ప్రమాదం. తుఫాను వస్తే ప్రమాదం. లేదా అంతర్జాతీయ జలాల్లోకి పడవ వెళ్లిపోతే ప్రమాదం. ఇన్ని ప్రమాదాలు దాటుకుని తండ్రి ఇల్లు చేరితే అదృష్టం. 35 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు నాగపట్టణం చుట్టుపక్కలే కాదు తమిళనాడు బెస్తపల్లెలన్నింటిలోనూ వెల్విగి తన సాంకేతిక ఆలోచనలతో బెస్తవాళ్లకు ఒక ధైర్యంగా మారింది. దానికి కారణం ఏ బెస్త కుటుంబమూ ఆందోళనగా బతక్కూడదని. ఏ బెస్త ఇంటి పిల్లలు తండ్రి కోసం భయం భయంగా ఎదురు చూడకూడదు అని. అలా వారి సాయం కోసం తాను మారాలంటే మెరైన్ బయాలజీ చదవాలి. కాని బెస్త ఇళ్లల్లో ఆడపిల్లలకు అంత చదువా? ‘మన దేశంలో దాదాపు 3 వేలకు పైగా బెస్త పల్లెలు ఉన్నాయి. దాదాపు 10 లక్షల మంది బెస్త కుటుంబాలు ఉన్నాయి. 40 లక్షల బెస్తలు సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. వీరిలో 90 శాతం మంది సంప్రదాయ మత్స్యవేట చేస్తారు. వీరిలో ఇప్పటికి మూడు వంతుల మంది దారిద్య్రరేఖకు దిగువన ఉంటే ఇక ఆడపిల్లలకు చదువు ఎక్కడ?’ అంటుంది వెల్విగి. బిఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ మెరైన్ బయాలజీలను వెల్విగి తన మేనమామ సాయంతో చదువుకుంది. ‘ఆ చదువులో కూడా వివక్ష ఎదుర్కొన్నాను. బెస్త అమ్మాయి ఇలాంటి చదువు చదవడం కొందరి దృష్టిలో వింతగా ఉండేది’ అంటుంది వెల్విగి. ఇక తన కాళ్ల మీద తాను నిలబడక తప్పలేదు. పూంపుహార్‌లోని ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ‘ఫిష్ ఫర్ ఆల్ రీసెర్చ్ అండ్ ట్రయినింగ్ సెంటర్’ పేరుతో ఒక ప్రోగ్రామ్ని తీసుకుంటే అందులో పని చేయడానికి రామేశ్వరం వెళ్లింది వెల్విగి. అది తన ఊరికి 265 కిలోమీటర్ల దూరం. ‘కాని నాకు తప్పలేదు. డబ్బులు కావాలి’ అంది వెల్విగి. పదేళ్లు ఆ సంస్థలో పని చేశాక తిరిగి పిహెచ్డి పనిని స్వీకరించి అన్నామలై యూనివర్సిటీ నుంచి పూర్తి చేసింది. అక్కడి బెస్త సమూహంలో పిహెచ్డి చేసిన తొలి మహిళ వెల్విగి. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థలో ప్రస్తుతం సీనియర్ సైంటిస్ట్‌గా పని చేస్తున్న వెల్విగి బెస్తవారి కోసమే ప్రత్యేకంగా ‘మీనవా నన్బన్’ (బెస్తవారికి మిత్రుడు) యాప్‌ను డెవలప్ చేయడంలో సాయపడింది. ఇప్పుడు తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో కనీసం 50 వేల మంది ఈ యాప్ వాడుతున్నారు. మత్స్య పడవల నేవిగేషన్లో ఇది సాయపడుతోంది. అంతేకాదు తీరంతో కమ్యూనికేషన్‌ను కూడా సులభం చేస్తుంది. ‘బెస్తవారి సంప్రదాయ చేపల వేట ప్రకృతి సహజమైనది. అయినప్పటికీ వలకు పడాల్సిన చేపలతో పాటు అనవసరపు సముద్ర జీవులు (బైక్యాచ్) కూడా పడుతూ ఉంటాయి. వాటిని కాకుండా కేవలం చేపలు మాత్రమే పడాలంటే ఏం చేయాలో నేను గైడ్ చేస్తూ ఉంటాను. అలాగే వలలో తాబేళ్లు చిక్కకుండా చిక్కిన తాబేళ్లు ప్రాణాలు కోల్పోకుండా ఉండేలా వాటిని తిరిగి సముద్రంలో వదిలేలా బెస్తవారికి ట్రైనింగ్ ఇస్తుంటాను’ అంటుంది వెల్విగి. ఆమె ఊరికే బోర్డు మీద పాఠాలు చెప్పే రకం కాదు. ఇప్పటికి చేపల వేటకు వెళ్లే పడవల్లో కనీసం 150 సార్లు సముద్రం మీదకు వెళ్లింది. వారితోనే ఉంటూ మెళకువలు చెబుతుంది. ఏ సమయంలో ఏ ప్రాంతంలో చేపలు పడతాయో వారికి బోధ పరుస్తుంది. ‘ఇదంతా నా చదువు వల్ల మాత్రమే కాదు. మా నాన్న నుంచి తీసుకున్న అనుభవం కూడా’ అంటుంది వెల్విగి. మత్స్స సంపద నుంచి స్త్రీలు ఆదాయం గడించేలాగా వారికి ఫుడ్‌కోర్టులు నడపడం ఎలాగో, నిల్వ ఆహారం చేయడం ఎలాగో, ఎండు చేపల మార్కెట్... వీటన్నింటి గురించి కూడా ఆమె తర్ఫీదు ఇస్తోంది. దాదాపు 17 వేల మంది మహిళలు ఆమె వల్ల లబ్ది పొందారు. ‘మత్స్యకారుల్లో వయసుకు వచ్చిన అబ్బాయిలు వేటలో పడకుండా, అమ్మాయిలు పెళ్లిలోకి వెళ్లకుండా చదువుకోవాలంటే ప్రభుత్వ పరంగా చాలా చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారి జీవితాల్లో వెలుగు’ అంటుంది వెల్విగి. సముద్రంలో మత్స్యకారులతో వెల్విగి బెస్త మహిళలు, మత్స్యకారులతో వెల్విగి -
మాటంటే.. మాటే...
కాకినాడ రూరల్ : ‘సముద్రంలో వేటకు వెళ్లి మరణించిన మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటాం’ ఇటీవల కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని పగడాలపేట, ఉప్పలంక గ్రామాల్లోని మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ఇది... ఆయన మాట ప్రకారం ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు, కాకినాడ పార్లమెంటు పార్టీ నాయకులు చలమలశెట్టి సునీల్‌లు మత్స్యకార కుటుంబాలను కలసి పార్టీపరంగా రూ.50వేల నగదును బాధితకుటుంబాలకు అందజేశారు. పార్టీ పరంగా ఇచ్చే సాయంతో పాటు ప్రభుత్వపరంగా రావల్సిన ఆర్థికసాయం అందేలా చూస్తామని నాయకులు స్పష్టం చేశారు. ‘ప్రభుత్వపరంగా తమకు ఇప్పటి వరకు ఎటువంటి సాయం అందలేదని, మీరు చేసిన సాయం ఎన్నటికీ మరువలేమని బాధిత కుటుంబాలు వైఎస్సార్సీపీ నాయకుల వద్ద వాపోయాయి. జననేత జగన్ చల్లగా ఉండాలని పలువురు మత్స్యకార కుటుంబాలు ఆశీర్వదించాయి. నెహ్రూ, వేణు, సునీల్‌లు కరప మండలం ఉప్పులంకలో బొమ్మిడి పెదకామేశ్వరరావు కుటుంబానికి, పగడాలపేటలో కామాడి నూకరాజు, చెక్కా బుజ్జిబాబు, కర్రి రాజు, దరిపల్లి సింహాద్రిలకు ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి రూ. 50వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. తుపానులో బోటు తిరగబడిన సంఘటనలో ఏడుగురు మత్స్యకారులు చనిపోగా, మృత్యుంజయుడిగా తిరిగి వచ్చిన వాడముదుల పెదకోటయ్యకు పరామర్శించి అతడికి రూ.పది వేలు ఆర్థికసాయాన్ని అందజేశారు. అనంతరం వైఎస్సార్ విగ్రహం సమీపంలో ఉన్న కుదులు బుజ్జి కుమారుడికి రెండు కళ్లు లేకపోవడంతో ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం రూ.ఐదు వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో యువత రాష్ట్ర కార్యదర్శి లింగం రవి, ముత్యాల సతీష్, రాష్ట్రవాణిజ్య విభాగం కార్యదర్శి ఆనంద్న్యూటన్, గట్టి రవి, రామదేవు సూర్యప్రకాశరావు, పార్టీ నాయకులు గరికిన అప్పన్న, కర్రి గంగాచలం, వాసంశెట్టి త్రిమూర్తులు, దాట్ల సత్యనారాయణరాజు, జగడం అప్పారావు, జగడం శ్రీహరి, తోట శ్రీధర్, పులగల శ్రీనుబాబు, దాసరి గంగాధర్ పాల్గొన్నారు. -
శ్రద్ధాంజలి
చెన్నై, సాక్షి ప్రతినిధి :సముద్రం 2004 డిసెంబరు 26వ తేదీన ఒక్కసారిగా ఉప్పొంగింది. అలలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నంతగా ఎగసిపడ్డాయి. లక్షలాది మందిని ఒక్క ఉదుటున తమలో కలుపుకున్నాయి. సముద్ర తీరంలో నివసించే వేల మత్స్యకార కుటుంబాలు జలసమాధి అయ్యాయి. మరెన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. భారత్, శ్రీలంక, ఇండోనేషియాలోని పలు ప్రాంతాలు ఎక్కువగా సునామీ ధాటికి దెబ్బతినగా 2.30 లక్షల మంది మృత్యువాతపడ్డారు. తమిళనాడు సముద్రతీర జిల్లాలైన చెన్నై, కడలూరు, నాగపట్నం, రామనాథపురం, కన్యాకుమారిలోని పలు ప్రాంతాలు సునామీ బారినపడ్డాయి. రాష్ట్రంలో సుమారు పది వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నాగపట్నం జిల్లాలో అత్యధికంగా 6065 మంది ప్రాణాలు విడిచారు. చెన్నైలో 300 మంది మృత్యువాతపడ్డారు. సముద్రంలో ఎగసి పడుతున్న అలలను తిలకించేందుకు వెళ్లిన వందలాది మంది చిన్నారులను సైతం అలలు తమలోకి లాక్కెళ్లడం కళ్లారా చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సునామీ దాడికి గురైన మత్స్యకార గ్రామాల ప్రజలు అనాటి దుర్దినాన్ని తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చెన్నై మెరీనా తీరం వద్ద అన్నాడీఎంకే, డీఎంకే నేతలు, మత్స్యకార సంఘాల నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సముద్రంలో పాలు పోశారు. సముద్ర తీరంలో కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. ‘సముద్రపు తల్లీ.. సముద్రపు తల్లీ.. మరోసారి మాతో కన్నీళ్లు పెట్టించకు’ అంటూ ప్రార్థించారు. నాగపట్నం జిల్లా కలెక్టరేట్లోని సునామీ స్మారక పార్కులో మత్స్యశాఖ మంత్రి జయపాల్, జిల్లా కలెక్టర్ మునుస్వామి శ్రద్ధాంజలి ఘటించారు. కన్యాకుమారి జిల్లాలో 199 మందిని బలి తీసుకున్న కొట్టిల్పోలు గ్రామంలో మౌనంగా ర్యాలీ చేపట్టారు.


