breaking news
false promises
-
ప్రజలకే వెన్నుపోటు
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిగా ఆ హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. ఇందులో భాగంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు (జూన్ 4)ను ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో వెన్నుపోటు దినంగా పాటిస్తూ.. అన్ని వర్గాల ప్రజలతో కలిసి భారీగా నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గాల కేంద్రాల్లోని ఉన్నతాధికారులకు వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ పత్రాలు అందించనున్నారు. పోలీసుల వేధింపులు, నిర్బంధాలను వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు లెక్క చేయకుండా ప్రజల పక్షాన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కదంతొక్కుతున్నాయి. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు. ఆ హామీలపై ప్రజలను నమ్మించేందుకు ఆ పథకాల వల్ల ఆ కుటుంబానికి ఒనగూరే ప్రయోజనంపై టీడీపీ నేతలు, కార్యకర్తల ద్వారా ఇంటింటా.. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో బాండ్లు పంపిణీ చేశారు. సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల్లో 143 హామీలు ఇస్తూ మేనిఫెస్టో విడుదల చేశారు. మోసపు హామీలతో ప్రజలను నమ్మించి, గోబెల్స్ సిగ్గుతో చచ్చిపోయేలా అబద్ధాలు వల్లె వేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.1,51,604 కోట్లు అప్పు చేసి టీడీపీ కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ‘నది దాటే వరకు ఓడ మల్లన్న.. నది దాటాక బోడి మల్లన్న’ సామెతను అవపోసన పట్టిన సీఎం చంద్రబాబు.. అప్పుల్లో రికార్డులు సృష్టించినా ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా తన నైజాన్ని చాటుకున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే.. మద్యపాన నిషేధం హామీకి తిలోదకాలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. 1999, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అదే రీతిలో తుంగలో తొక్కి ప్రజల చెవిలో పువ్వు పెట్టారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలదీ అదే పరిస్థితి. బాబు ష్యూరిటీ అంటే.. మోసం గ్యారంటీ అన్నది ప్రజలకు అర్థమైంది. వెన్నుపోటుకు అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్ తానేనని చంద్రబాబు ఎప్పటికప్పుడు చాటిచెప్పుకుంటూనే ఉన్నారు.తల్లికి వందనం పేరుతో అమ్మలకు మోసం స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఆ తల్లి ఖాతాలో జమ చేస్తామని సూపర్ సిక్స్ హామీల్లో చంద్రబాబు నమ్మబలికారు. కానీ.. ఇప్పటిదాకా ఈ పథకం కింద ఏ ఒక్కరికీ రూ.15 వేలు ఇచ్చిన పాపాన పోలేదు. తల్లికి వందనం పేరుతో అమ్మలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.మహిళలకు ద్రోహం ⇒ ఆడబిడ్డ నిధి కింద 19 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందిస్తామని సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా చెప్పారు. కానీ.. ఇప్పటిదాకా ఆడబిడ్డ నిధి ఊసే లేదు.. ⇒ మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఏడాది అయినా ఉచిత బస్సు జాడే లేదు. ⇒ ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని నమ్మబలికారు. గతేడాది కొందరికి ఉచితంగా ఒక సిలిండర్‌తో సరిపెట్టి, మహిళలకు సీఎం చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు. పెన్షన్ మాటే లేదు..అన్నదాతకు వెన్నుపోటు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సూపర్ సిక్స్ హామీల్లో చంద్రబాబు ప్రకటించారు. కానీ.. ఇప్పటిదాకా ఏ ఒక్క రైతుకూ రూ.20 వేలు అందించలేదు. తొలి ఏడాది రూ.20 వేల చొప్పున ఇవ్వాల్సిన రూ.10,718 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. రెండో ఏడాది సీజన్ ప్రారంభమైనా పైసా పెట్టుబడి సాయం అందించకుండా నిలువునా ముంచేశారు. ఐదేళ్లుగా పైసా భారం లేకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి వారిపై బీమా భారం మోపారు.ఖరీఫ్ 23 సీజన్‌కు సంబంధించి ప్రీమియం బకాయిలు చెల్లించక పోవడంతో రూ.1,385 కోట్ల మేర పంటల బీమా పరిహారం రైతులకు దక్కకుండా చేశారు. కరువు బకాయిలతో సహా గడిచిన ఏడాదిలో వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న 8.94 లక్షల మంది రైతులకు రూ.554 కోట్ల పంట నష్టపరిహారం ఎగ్గొట్టారు. ప్రభుత్వ నిర్వాకంతో దాదాపు 150 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఏ ఒక్కరికి పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర కల్పించకుండా రైతులను నట్టేట ముంచారు. ఆక్వా రైతులకు వెన్నుపోటు పొడిచారు. ఐదేళ్ల పాటు పాడి రైతులకు అండగా నిలిచిన అమూల్ ప్రాజెక్టును అటకెక్కించి.. కార్పొరేట్, ప్రైవేటు డెయిరీల దోపిడీ బారిన పడేలా చేశారు.నిరుద్యోగ భృతి పేరుతో యువతకు టోపీ సూపర్ సిక్స్ హామీల్లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని– ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందిస్తామన్న హామీ ఒకటి. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలో నిరుద్యోగుల సంక్షేమం కోసం ఒక్కపైసా కూడా విదిల్చలేదు. ఏపీలో గతేడాది 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి ఒకరిని గుర్తించినా, నెలకు రూ.3 వేల చొప్పున రూ.4,800 కోట్లు అయితే ఏడాదికి రూ.57,600 కోట్లు కేటాయించాల్సి ఉండగా మొండి చెయ్యి చూపించింది. 2025–26 బడ్జెట్‌కు వచ్చే సరికి కుటుంబాల సంఖ్య 1.70 కోట్లకు చేరింది. ఈ లెక్కన నెలకు రూ.5,100 కోట్లు చొప్పున ఏడాదికి రూ.61,200 కోట్లు నిరుద్యోగుల సంక్షేమానికి వ్యయం అవుతుంది. ఇచ్చిన హామీలో భాగంగా ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్లు నిరుద్యోగుల కోసమే వెచ్చించాలి. కానీ, చంద్రబాబు చాణిక్యంతో నిరుద్యోగులు ఏళ్ల తరబడి మోసపోతూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలోనూ దగాకు గురయ్యారు.జాబ్ క్యాలెండర్ హుష్‌కాకి..వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. 2019 అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అప్పటి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగులను నియమించారు. 2019–24 మధ్య శాశ్వత, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో 6,38,621 మందికి కొలువులిచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ద్వారా 30.99 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇదిలా ఉంటే.. ‘ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం.రికార్డు చేసుకో.. డేటు, టైము రాసుకో.. జగన్‌లా పారిపోయే బ్యాచ్ కాదు మేము’ అని చంద్రబాబు, లోకేష్ బీరాలు పోయారు. జనవరి పోయి 5 నెలలు దాటినా జాబ్ కేలండర్ దేవుడెరుగు.. ఒక్క ఉద్యోగం భర్తీ చేసింది లేదు. ఏపీపీఎస్సీ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. పైగా గత ప్రభుత్వంలో ఇచి్చన గ్రూప్–1, 2 మెయిన్స్‌ను పలుసార్లు వాయిదా వేసి, అభ్యర్థులను నిలువునా మోసం చేసి గ్రూప్–2 మెయిన్స్ నిర్వహించారు. సంస్కరణల పేరుతో గ్రూప్–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో కలిపే నిర్ణయం తీసుకుని గ్రామీణ నిరుద్యోగులకు అన్యాయం చేసేందుకు ప్రణాళిక వేశారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ దాదాపు వెయ్యి పోస్టుల భర్తీకి అనుమతించింది. వాటికి నోటిఫికేçÙన్లు ఇచ్చేందుకు కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. బాబొచ్చారు.. జాబేదీ? బాబు వస్తే.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కలి్పస్తామని కల్లబొల్లి మాటలు చెప్పారు. ఏడాదయినా ఒక్కరికీ ఉద్యోగం వచి్చంది లేదు. ఉద్యోగం ఇచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని సైతం గాలికి వదిలేశారు.బట్టబయలైన దుష్ప్రచారంగుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో 2019 ఆగస్టు 15న నాటి సీఎం వైఎస్ జగన్ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2.60 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారకముందే తలుపుతట్టి వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు పెన్షన్ అందించడం దగ్గరనుంచి అన్ని ప్రభుత్వ సేవలను వాలంటీర్ల ద్వారా సమకూర్చారు.పరిపాలన సంస్కరణల్లో ఇదో విప్లవమనే ప్రశంసలు పొందారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండడంతో ఆ వ్యవస్థపై అప్పట్లో చంద్రబాబు, పవన్ విషం చిమ్మారు. 2023 అక్టోబరు 7న రెండో విడత వారాహి యాత్రలో భాగంగా ఏలూరు రోడ్ షోలో.. 33 వేల మంది మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమంటూ పవన్ హేయంగా మాట్లాడారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 నవంబరు 16న అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు 2019–24 మధ్య మహిళల అక్రమ రవాణా కేసులు కేవలం 34 మాత్రమేనని.. 46 మంది బాధితులని వెల్లడించడం గమనార్హం. ఇసుక దోపిడీ.. అడ్డగోలు తవ్వకాలువైఎస్సార్సీపీ ప్రభుత్వం తక్కువ ధరలకు ఇసుక సరఫరా చేసింది. దీంతో రూ.750 కోట్ల ఆదాయం వచి్చంది. 2024 అవసరాల కోసం 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ పెట్టింది. కూటమి ప్రభుత్వం వచి్చన కొద్ది రోజుల్లోనే 80 లక్షల టన్నుల ఇసుకను పచ్చ మాఫియా దోచేసి, జేబులు నింపుకొంది. ఉచిత ఇసుక ముసుగులో నదులు, వాగులు, వంకలను చెరబట్టిన ఇసుక మాఫియా పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా తవ్వేసి.. అధిక ధరలకు అమ్ముకుంటూ భారీఎత్తున దోచేస్తోంది. లిక్కర్ నుంచి సిలికా, క్వార్ట్జ్ వరకు వ్యవస్థీకృతమైన పచ్చ మాఫియా ఆకాశమే హద్దుగా దోపిడీకి పాల్పడుతూ రాష్ట్ర ఆదాయానికి గండికొడుతోంది.రెడ్‌బుక్‌తో టెర్రర్ సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచి్చన 143 హామీల అమలు.. పరిపాలన వైఫల్యాలపై ప్రశి్నంచే గొంతును నొక్కేందుకు రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణించి వెంటాడి, వేటాడి హత్యలు, హత్యాయత్నాలు, దాడులతో భీతావహ వాతావరణం సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో 390 మందిని చంపేశారు.హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు 766 మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు బనాయించి.. 500 మంది నాయకులు, కార్యకర్తలను జైలుకు పంపారు. సోషల్ మీడియా కార్యకర్తలు 440 మందిపై అక్రమ కేసులు పెట్టి.. 79 మందిని జైలు పాల్జేశారు. 11 మంది జర్నలిస్టులపై దాడి చేశారు. 63 అక్రమ కేసులు నమోదు చేసి.. 8 మందిని జైలుకు పంపారు. ప్రజాసంఘాల నాయకులపై 73 అక్రమ కేసులు పెట్టి.. ఇద్దరిని జైలుపాల్జేశారు. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198 నమోదయ్యాయి.మద్యం మాఫియా బయటకు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాతాళంలో పాతిపెట్టిన ప్రైవేటు మద్యం సిండికేట్ భూతానికి చంద్రబాబు సర్కారు మళ్లీ ఊపిరిపోసి వదిలింది. మద్యం ఏరులై పారించడం ద్వారా భారీ దోపిడీకి టీడీపీ మద్యం సిండికేట్ పన్నాగం పన్నింది. ప్రైవేటు దుకాణాలను తిరిగి తెచి్చంది. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలే ఏకపక్షంగా మొత్తం 3,396 మద్యం షాపులను దక్కించుకున్నారు. ఇతరులు ఎవరూ దరఖాస్తు చేయకుండా టీడీపీ గూండాలతో పాటు పోలీసులతో బెదిరింపులకు పాల్పడ్డారు. 3,396 మద్యం దుకాణాల పరిధిలో దాదాపు 55 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసింది.ఎంఆర్పీ కంటే 20 శాతం నుంచి 30 శాతం వరకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తోంది. అన్ని దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు అనుమతినివ్వాలని నిర్ణయించింది. 2024–25లో మద్యం విధానం ద్వారా ఎక్సైజ్ శాఖకు వచి్చన రూ.24 వేల కోట్ల ఆదాయాన్ని 2025–26లో రూ.35 వేల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏటా కనీసం రూ.10 వేల కోట్లు చొప్పున మద్యం ఆదాయం పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2028–29 నాటికి ఏకంగా రూ.75 వేల కోట్లకు చేరాలన్న ఉద్దేశంలో ఉంది.రాజధాని నిర్మాణంలో అడ్డగోలు దోపిడీ..తాను, తన సన్నిహితులు, బినామీలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి తక్కువ ధరలకే కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో నుంచి అధిక వడ్డీలకు రూ.31 వేల కోట్లు అప్పు తెస్తున్నారు. మరో రూ.21 వేల కోట్లు అప్పునకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారు. రాజధాని తొలి దశ నిర్మాణానికి రూ.77 వేల కోట్లు అవసరమని ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజంటేషన్ ఇచ్చారు.అధిక వడ్డీలకు తెచి్చన నిధులతో.. అంచనా వ్యయాన్ని పెంచేసి.. అధిక ధరలకు సిండికేటు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి నీకింత నాకింత అంటూ పంచుకుంటున్నారు. దేశంలో ఎన్హెచ్ఏఐ కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున జాతీయ రహదారులను నిరి్మస్తుంటే.. రాజధానిలో మాత్రం కి.మీ.కు రూ.66 కోట్లు చొప్పున కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టేశారు. చదరపు అడుగు రూ.1,800 నుంచి రూ.2 వేల లోపు వ్యయంతో భవనాలను నిరి్మంచవచ్చు. కానీ.. ఏకంగా చదరపు అడుగు రూ.పదివేల చొప్పున పనులను కాంట్రాక్టర్లకు అప్పగించేశారు. ఇదంతా చూస్తే.. రాజధాని నిర్మాణ పనుల్లో అధిక వడ్డీలకు తెచి్చన అప్పులను ఏ స్థాయిలో దోచుకుంటున్నారో స్పష్టమవుతోంది. పప్పులు బెల్లాల్లా.. అత్యంత విలువైన భూములను సన్నిహితులు, బినామీలకు పప్పులు, బెల్లాల్లా టీడీపీ కూటమి ప్రభుత్వం పంచిపెడుతోంది. ఊరూపేరూ లేని ఉర్సా అనే సంస్థకు రూపాయికి ఎకరం చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఉర్సా.. మంత్రి నారా లోకేశ్ సన్నిహితుడిది. ఇక లులూ సంస్థకు మాల్ నిర్మాణానికి విశాఖలో రూ.2 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా అప్పగించేస్తుండడం భూదోపిడీకి పరాకాష్ట. మొదటి సంతకమే దగా.. దగాఅధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పిన చంద్రబాబు సీఎం హోదాలో 16,437 పోస్టుల భర్తీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. గత ఏడాది డిసెంబరు నాటికి భర్తీ చేస్తామని హామీ ఇచ్చినా దాదాపు 11 నెలలు కాలయాపన చేసి మార్చి చివరి వారంలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులోనూ అనేక కొర్రీలు పెట్టారు. 50 శాతం అర్హత మార్కుల నిబంధన తెచ్చి అర్హులైన డీఈడీ, బీఈడీ జనరల్ అభ్యర్థులు 3 లక్షల మందిని డీఎస్సీకి దూరం చేశారు. టెట్ ఉత్తీర్ణులైన అందరికీ డీఎస్సీ రాసే అవకాశం ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదు.ఎన్నడూ లేని విధంగా ఎస్జీటీ పోస్టులకు ఇంటరీ్మడియట్‌లో, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి చేశారు. 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ చేసినవారికి ఈ నిబంధన వర్తించదని 2019లో కేంద్రం గెజిట్ విడుదల చేసింది. ఇవేమీ పట్టించుకోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థుల ఉసురు తీసింది.తొలుత ఇంటర్, గ్రాడ్యుయేషన్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, రిజర్వుడ్ అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులు తప్పనిసరి చేసింది. అనంతరం టీచర్ అర్హత పరీక్ష (టెట్)లో రిజర్వుడ్ అభ్యర్థులకు 40 శాతం మార్కులే పేర్కొన్నందున డీఎస్సీ అర్హత మార్కులను 40 శాతానికి తగ్గిస్తూ అనుబంధ జీవోలు ఇచి్చంది. జనరల్ అభ్యర్థులకు మాత్రం అర్హత మార్కులను 50 శాతంగా అలాగే ఉంచింది. జనరల్ అభ్యర్థులకు టెట్‌లో అర్హత మార్కులు 45 శాతం ఉన్నా ఆ మేరకు తగ్గించకపోవడం గమనార్హం.పాలనలో అట్టర్ ప్లాప్.. డైవర్షన్ పాలిటిక్స్ సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచి్చన 143 హామీల అమలు చేయకపోవడం.. పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగుతున్నారు. కూటమి వచి్చన వెంటనే పచ్చమూకలు.. వెంటాడి, వేటాడి 36 మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చంపేశాయి. 300 మంది నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి.ఈ దారుణాన్ని దేశానికి చాటిచెప్పేందుకు జూలై 24న ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నాకు దిగారు. దీన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యులంటూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగారు. కృష్ణా, బుడమేరు వరద నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవడంతో విజయవాడను వరద చుట్టుముట్టి 50 మంది పైగా బలితీసుకుంది. దీన్నుంచి పక్కదారి పట్టించేందుకు ప్రకాశం బ్యారేజీని బద్దలు కొట్టేందుకు వైఎస్సార్సీపీ నేతలు పడవలతో గేట్లను ఢీకొట్టే కుట్ర చేశారని ఆరోపించారు. వంద రోజుల పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి.. తిరుమల లడ్డూ కల్తీ అంటూ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారు. ఇంటింటికీ కరెంట్ షాక్ కరెంటు చార్జీలు పెంచం.. తగ్గిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజలను నమ్మించి.. ఓట్లేయించుకుని గెలిచాక.. కరెంటు చార్జీలను పెంచేసి.. ఇంటింటికీ కరెంట్ షాక్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల భారాన్ని మోపారు. గతేడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని వసూలు చేస్తుండగా, ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. దీంతో ప్రజలకు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి.ఇంటింటికీ రేషన్ రద్దు.. మద్యం సరఫరా ఇంటి వద్దకే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే ఎండీయూ(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వ్యవస్థను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. 9,260 ఎండీయూ యూనిట్లను రద్దు చేయడంతో 20 వేల మంది రోడ్డున పడ్డారు. ఎండీయూ వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రేషన్ బియ్యం, సరుకులు సరఫరా చేసేది. ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేయడంతో మళ్లీ రేషన్ దుకాణం వద్ద గంటల కొద్దీ లబ్ధిదారులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. అయితే బెల్ట్ షాపుల ద్వారా ఇంటింటికీ మద్యం మాత్రం నిరాటంకంగా సరఫరా చేస్తోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.వలంటీర్లపై సమ్మెట దెబ్బ తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు ప్రతి నెల ఇచ్చే గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని.. నెలకు రూ.50 వేలు సంపాదించేలా ఆదాయ మార్గాలు కల్పిస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతి నెలా రూ.పది వేల వేతనం ఇస్తామని పవన్ కళ్యాణ్ సైతం వాగ్దానం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను రద్దు చేసి వారిని నట్టేట ముంచేశారు. అప్పుల్లో చంద్రబాబు రికార్డులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిందని.. శ్రీలంకగా మార్చేసిందంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు తీవ్ర స్థాయిలో దుష్ఫ్రచారం చేశారు. ఈ మేరకు ఎల్లో మీడియా సైతం తప్పుడు కథనాలను వండివార్చింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రంలో రాష్ట్ర అప్పు రూ.9,74,556 కోట్లు అంటూ ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.పది లక్షల కోట్లు అని వెల్లడించారు. 2024–25 బడ్జెట్ ప్రవేశపెడితే.. రాష్ట్ర అప్పుపై వాస్తవాలు బహిర్గతమవుతాయనే నెపంతో జాప్యం చేశారు.చివరకు గతేడాది నవంబర్ 11న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లేనని అధికారికంగా అంగీకరించారు. కానీ.. ఆ తర్వాత కూడా అప్పులపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూనే వచ్చారు. మొన్నటికి మొన్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన రాష్ట్ర అప్పు రూ.9.74 లక్షల కోట్లు అంటూ చంద్రబాబు బొంకారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు, గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పు మొత్తం కలిపి 2024 మార్చి నాటికి రూ.7,21,918 కోట్లే. ఈ లెక్కన 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు మాత్రమే. ఇందులో రూ.2.73 లక్షల కోట్లను సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో జమ చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.1,51,604 కోట్లు అప్పు చేసింది. సంపద సృష్టిలో తిరోగమనం సంపద సృష్టించి.. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త సంక్షేమ పథకాలు ఇస్తానని చంద్రబాబు నమ్మలికారు. కానీ.. సంపద సృష్టి మాటలకే పరిమితమైంది. సంక్షేమ పథకాలపై ప్రశ్నించిన ప్రజలనుద్దేశించి.. సంపద సృష్టించడం ఎలాగో తన చెవిలో చెప్పాలంటూ చంద్రబాబు రంకెలేస్తున్నారు. వాస్తవానికి.. రాష్ట్రాన్ని 2019–24 మధ్య సంక్షేమం, అభివృద్ధిని మేళవించి వైఎస్ జగన్ ప్రగతిపథంలో నిలిపారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారు.లోక్‌సభ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో.. కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిరాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. 2023–24లో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించి.. 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. 2024–25లో మరో ఐదు కాలేజీలు ప్రారంభించడానికి సిద్ధం చేశారు. కానీ.. కూటమి సర్కార్ ఒక కాలేజీ మాత్రమే ప్రారంభించి.. 50 సీట్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. మిగతా మెడికల్ కాలేజీల పనులను ఆపేసింది. ప్రైవేటుపరం ముసుగులో సన్నిహితులు, బినామీలకు వాటిని కట్టబెట్టే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై యూటర్న్ ప్రజల భూములు లాక్కునేందుకే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తెచ్చారని, దస్తావేజులు కూడా ప్రభుత్వం వద్దే ఉంటాయని దారుణమైన అబద్ధాలతో కూటమి నేతలు ప్రజలను భయాందోళనలకు గురిచేశారు. 13 వేల గ్రామాలకుగాను 8 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి తెచ్చింది గత ప్రభుత్వం. ప్రతి రైతుకు ఒక యూనిక్ ఐడీ నెంబర్ ఇవ్వడంతోపాటు భూములను జియో ట్యాగింగ్ చేసి సరిహద్దు రాళ్లు పాతారు. డ్రోన్, విమానాలతో కోటి ఎకరాలను కొలిచారు. వివాదాలకు ఆస్కారం లేని రీతిలో టైటిల్ గ్యారంటీ కల్పించేందుకు టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చారు. కానీ చంద్రబాబు రాజకీయ కుట్రలో ఈ చట్టం బలైపోయింది. తాను చెప్పిన అబద్ధాలను నిజమని చెప్పుకునేందుకు అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని రద్దు చేశారు. ఈ చట్టంతో ముడిపడి ఉన్న భూముల రీ సర్వేను కూడా రద్దు చేయాలని ప్రయత్నించారు. కానీ అది విజయవంతమవడం, కేంద్ర ప్రభుత్వం జగన్ హయాంలో చేపట్టిన సర్వేకు ఇప్పుడు రూ.500 కోట్ల వరకు నిధులు విడుదల చేయడంతో యూటర్న్ తీసుకుని కొనసాగిస్తున్నారు. -
అమాయక ప్రజలను బాబు మోసం చేశారు: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, రౌడీలు.. పోలీసుల రాజ్యమే నడుస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సోమవారం వెన్నుపోటు దినం (Vennupotu Dinam) నిరసన పోస్టర్ ఆవిష్కరణ జరిపి ఆయన మాట్లాడారు. ‘‘ప్రజలకు హామీ ఇచ్చి చంద్రబాబు వెన్నుపోటు(Chandrababu Vennupotu) పొడిచారు. అందుకే జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిరసన చేపడతాం. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి నష్టపోయారు. రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన దోపిడీతో మొదలైంది. సూపర్ సిక్స్ రాష్ట్రంలో ఫెయిల్యూర్ అయ్యింది. ఆస్తి పన్ను, కరెంటు చార్జీలు కూటమి ప్రభుత్వం విపరీతంగా పెంచింది.. .. చంద్రబాబు ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత ఒక మాట చెబుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే సచివాలయాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అమలు జరగట్లేదు. రేషన్ డోర్ డెలివరీ(Ration Door Delivery System) విధానాన్ని కూడా చంద్రబాబు తొలగించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం దారుణం. .. ఉచిత బస్సు, అమ్మకి వందనం అంటూ ప్రజలను మోసం చేశారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. రౌడీరాజ్యం , పోలీసు రాజ్యం నడుస్తోంది. విజయవాడలో శాతవాహన కళాశాల 5 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం కబ్జా చేయడానికి చూస్తోంది. శాతవాహన కళాశాల ప్రిన్సిపల్‌ను కిడ్నాప్ చేయడం దారుణం. అసలు బెజవాడ నగరంలో శాంతి భద్రతలు ఉన్నాయా?. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల విజయవాడ నగరంలో బుడమేరు వరదల్లో 12 డివిజన్లు నీట మునిగాయి అని మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి(Vijayawada Deputy Mayor Sailaja Reddy) మాట్లాడుతూ.. ‘‘జగన్‌ను ఒంటరిగా ఢీ కొనలేక మూడు పార్టీలు ముందుకు వచ్చాయి. చంద్రబాబు అమాయక ప్రజలను మోసం చేశారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో ఒక్క హామీ అమలు చేయలేదు. టీడీపీ మహానాడుతో ప్రజలకు ఏం ఉపయోగం లేదు. జగన్‌ను తిట్టేందుకు.. లోకేష్ ను పొగడ్తలతో ముంచేందుకే మహానాడు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తున్నారు అని అన్నారామె. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.ఇదీ చదవండి: అలాంటి వారిని ఇలాగే శిక్షస్తారా?.. మేడమ్! -
విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ
-
ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇస్తామని మోదీలా అబద్దాలు చెప్పం: రాహుల్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. అధికార బీజేపీపై విమర్శల జోరు పెంచింది. ఈ క్రమంలోనే ఉడుపిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీలా తాము అబద్దపు వాగ్ధానాలు చేయబోమని ధ్వజమెత్తారు. 'ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం. నల్లధనంపై పారాటం కోసమే పాత నోట్లు రద్దు చేస్తున్నాం. ఇలా మోదీలా మేము అబద్దాలు చెప్పం' అని రాహుల్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ఎప్పుడైనా చేసేదే చెప్తుందని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తుందని రాహుల్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లో ఇలానే చేశామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 13న ఒకే విడతలో జరగనున్నాయి. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ చెబుతుండగా.. 150 స్థానాలకు పైగా కైవసం చేసుకుని కమలం పార్టీని ఓడిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. చదవండి: ఆయన కచ్చితంగా గెలుస్తారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. రక్తంతో లేఖ రాసిన కార్యకర్త.. -
ఆర్భాటమే.. ఆచరణేదీ?
సాక్షి ప్రతినిధి కడప : ముఖ్యమంత్రి పర్యటనంటే జిల్లా అభివృద్ధికి ఉపయోగమని ప్రజలు భావించడం సర్వసాధారణం. నాలుగున్నరేళ్లుగా తద్భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం రావడం.. హామీల వర్షం కురిపించడం, ఆచరణలో చిత్తశుద్ధి చూపకపోవడం క్రమం తప్పకుండా కొనసాగుతోంది. ఇప్పటికీ దాదాపు 25 పర్యాయాలు పర్యటించారు. హామీల జాబితా పెరిగిపోవడం మినహా నిర్ధిష్టమైన అభివృద్ధి కన్పించలేదని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. జూన్ 30న ఉక్కు పరిశ్రమను రెండునెలల్లో నెలకొల్పుతామని ప్రకటించారు. నాలుగు నెలల తర్వాత అక్టోబర్ 30న నెలలో శంకుస్థాపన చేస్తామని మరోమారు ప్రకటించారు. ఆ గడువు కూడా ముగిసింది. ఇప్పటికీ ఉక్కుఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన దాఖలాలు లేవు. తాజాగా మంగళవారం జ్ఞానభేరి కార్యక్రమానికి యోగివేమన యూనివర్శిటీకి హాజరవుతున్నారు. ఇప్పటికైనా ‘చేసేదే చెప్పాలని, చెప్పింది చేయాలని’ ప్రజానీకం నినదిస్తోంది. కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పనున్నట్లు రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నన్నాళ్లు ఉక్కు పరిశ్రమ ఊసే ఎత్తని రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఎన్నికలు సమీపించేకొద్ది తెలుగుతమ్ముళ్లతో నాటకం రచించారు. ఆమేరకు ‘ఉక్కుదీక్ష’ పేరిట రక్తి కట్టించారు. పార్లమెంటులో ఏనాడు ఉక్కు పరిశ్రమ కోసం కనీసం ప్రశ్నించని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌చే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...‘కడప ఉక్కు ఆంధ్రుల హక్కు. కేంద్ర ప్రభుత్వానికి 2నెలల గడువు ఇస్తున్నాం. రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి. లేదంటే మేము ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి తీరుతాం..అని ’ఈ ఏడాది జూన్ 30న కడప గడపలో ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఆవరణలో ఉక్కుదీక్షకు గుర్తుగా సీఎం చేతుల మీదుగా పైలాన్ కూడా ఆవిష్కరించారు. ఆపై గట్టిగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై పెద్ద స్వరంతో హెచ్చరికలు చేస్తూ మరీ వెల్లడించారు. ఆగస్టు 30నాటికే రెండు నెలల గడువు ముగిసింది. నాలుగునెలల తర్వాత ఆక్టోబర్ 30న ధర్మపోరాటదీక్ష పేరిట ప్రొద్దుటూరుకు హాజరైన సీఎం నెలలోపు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఆ గడువు కూడా ముగిసిపోయింది. తొలుత హామీ ఇచ్చిన తదుపరి 5నెలలు గడిచినా శంకుస్థాపన దిశగా అడుగులు పడడం లేదు. ఉక్కుదీక్ష పైలాన్ దిష్టిబొమ్మలా జిల్లా పరిషత్ ప్రాంగణంలో దర్శమిస్తోండడం విశేషం. ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎదురుచూపులు.. మూడున్నరేళ్లుగా జిల్లాలోని రైతులు ఇన్పుట్ సబ్సిడీ కోసం నిరీక్షిస్తున్నారు. గతంలో రోవాన్ తుపాన్, ఆ వెంటనే మరో తుపాన్ ప్రభావం ధాటికి పంటలు పూర్తిగా కోల్పోయారు. తుపాన్ గాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వేకోడూరులో స్వయంగా పరిశీలించారు. అప్పట్లో వెంటనే పరిహారం అందించి ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి హామీ ఆచరణలో ఇప్పటికీ కన్పించలేదు. వ్యవసాయ పంటలు దాదాపుగా 57,062 హెక్టార్లుల్లో దెబ్బతిన్నాయి. ఇందులో వేరుశనగ, వరి, పత్తి, ఉల్లి, పూలతోటలు ఉన్నాయి. వీటికి ఇన్పుట్ సబ్సిడీ రూ.55.8కోట్లు రావాల్సి ఉంది. ఉద్యాన పంటలు 4,293 హెక్టార్లల్లో దెబ్బతిన్నాయి. వీటికి రూ.10.2కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 2015 నుంచి ఇప్పటివరకూ రైతులు ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎదరుచూడడం మినహా ప్రభుత్వం మంజూరు చేసిన దాఖలాలు లేవు. 2014–18 కాలంలో వడ్డీలేని రుణాలు కింద దాదాపు రూ.10కోట్లు జిల్లాకు రావాల్సి ఉంది. లక్షలోపు రుణం తీసుకున్న తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణం వర్తిస్తుంది. ఈ మొత్తాన్ని కూడా ప్రభుత్వం నుంచి మంజూరు కాలేదు. అలాగే 3వ విడత రుణమాఫీ మొత్తం జిల్లాకు రూ.248.5 కోట్లు రావాల్సి ఉండగా సగం మొత్తంతో సరిపెట్టారు, 4, 5విడతలు పెండింగ్‌లో ఉన్నాయి. పేరుకుపోయిన సీఎం హామీల జాబితా.. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తా. ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతాం, ఇక్కడి పండ్లతోటలను దృష్టిలో ఉంచుకొని మెగా ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేస్తాం. టెర్మినల్ మార్కెట్, రాజంపేటలో హార్టికల్చర్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం. చేనేతల కోసం మైలవరంలో టెక్స్టైల్స్ పార్క్, ప్రొద్దుటూరులో అఫెరల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తర్వాత వాటి ఊసే ఎత్తుకొలేదు. దేవాలయాలను కలుపుతూ ఫిలిగ్రామ్ టూరిస్టు సర్క్యూట్ ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి. కడప–చైన్నై నాలుగు లైన్లు రహదారి విస్తరణ. ఉర్దూ యూనివర్శిటీ ఏర్పాటు, ఏపీఐఐసీ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పుతాం అంటూ సీఎం ఊరించారు. ఇవన్నీ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పర్యటించిన ప్రతి సందర్భంలో ప్రకటించిన హామీలు. ఉర్దూ యూనివర్శిటీ స్థానంలో హాజ్‌హౌస్ మాత్రమే కడపకు పరిమితమైంది. తక్కిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆచరణలో కన్పించలేదని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇప్పటీకే ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లా ప్రజానీకం కోరుతోంది. ఇదే విషయం ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయంతో యోగివేమన యూనివర్శిటీ ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ల బాధ్యులను సభ్యులను పోలీసులచే అరెస్టులు చేయించడం విశేషం. -
ప్రభుత్వ బూటకపు వాగ్దానాలపై ఫేస్బుక్ కీడుస్తా: షబ్బీర్ అలీ
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బూటకపు వాగ్దానాలను ఫేస్బుక్లో పెట్టి ప్రజల్లో ఎండగడతానని శాసనమండలి ఉప పక్షనేత మహ్మద్ అలీ షబ్బీర్ అలీ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరుల మాట్లాడారు. ముఖ్యమంత్రి తనను చెల్లని నోటు గా అభివర్ణించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చేసిన 101 ప్రధాన వాగ్దానాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో తీసుకెళ్తానని పేర్కొన్నారు. కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన ఉండదని, దళితుడికి సీఎం చేసానని పదేపదే ప్రకటించిన కేసీఆర్ చివరకు తనే సీఎం పీఠం కూర్చున్నాడని దుయ్యబట్టారు. -
బూటకపు హామీలివ్వలేదు: జగన్
- అధికారం కోసం బాబు రూ.87 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని అబద్ధాలాడారు - ఆ హామీని ఐదున్నర లక్షల మంది ఎక్కువగా నమ్మడం వల్లే ఆయనకు అధికారం.. - చంద్రబాబు బండారం బయటపడే సమయం దగ్గరపడింది - చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు కార్యకర్తలంతా సిద్ధం కావాలి - ఇందుకోసం రానున్న ఐదేళ్లూ పోరాటాలు చేయాలి... ఈ ఐదేళ్లలో కేసులు పెట్టి వేధింపులకు గురిచేసే అవకాశముంది.. - ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా జిల్లా స్థాయి నాయకులు సైతం వెళ్లి అండగా నిలవాలి సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: ‘‘తెలంగాణ విడిపోక ముందు దేశంలో 28 రాష్ట్రాలున్నాయి. వాటిలో ఏ ఒక్క రాష్ర్టంలోనూ అధికార పార్టీ కానీ, ప్రతిపక్షం కానీ రైతుల రుణ మాఫీ చేస్తానని చెప్పలేదు. ఒక్క మన రాష్ర్టంలోనే అధికారం కోసం చంద్రబాబు నాయుడు నోటికొచ్చిన హామీలల్లా ఇచ్చారు. రూ.87 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేస్తానని అబద్దాలాడారు. రాష్ర్టంలో కోటీ 30 లక్షల మంది మనకు ఓటు వేస్తే.. టీడీపీకి కోటీ ముప్పై ఐదున్నర లక్షల మంది ఓట్లు వేశారు. మనం చెప్పిన మాటల కంటే చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలను కేవలం ఐదున్నర లక్షల మంది ఎక్కువగా నమ్మారు. అందువలనే ఆయన అధికారంలోకి వచ్చాడు. మనం ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘‘సీఎం స్థానంలో ఒకసారి కూర్చుంటే కనీసం 30 ఏళ్ల పాటు ప్రజలకు మేలు చేయాలన్నదే నా తపన. విశ్వసనీయత, విలువలకు కట్టుబడి ఉన్నాను కాబట్టే బాబులా అబద్ధపు హామీలు ఇవ్వలేకపోయాను’’ అని చెప్పారు. రాజమండ్రిలో పార్టీ సమీక్షల సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9తోనూ పోరాటం.. ‘‘రుణ మాఫీ అబద్ధం ఆడి ఉంటే నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే వాడిని. అయితే మూడు నెలల్లోనే రాష్ర్ట ప్రజలే కాదు.. ఆచరణ సాధ్యం కాని ఆ హామీలు ఎందుకిచ్చారంటూ మీరు కూడా నన్ను తిట్టేవారు. ఆ పని చేయలేకనే నేను ఆ హామీ ఇవ్వలేకపోయాను. మనం గత నాలుగున్నరేళ్లుగా పోరాటం చేసింది ఒక్క చంద్రబాబుతోనే కాదు. చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9తోకూడా పోరాటం చేశాం. బాబును సీఎం చేయాలని వీరంతా సర్వశక్తులూ ఒడ్డారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు రైతుల రుణమాఫీ ఒక్క బాబు వల్లే సాధ్యమని ‘ఈనాడు’లో బ్యానర్ కథనం రాస్తారు. ఇప్పుడు అదే ‘ఈనాడు’ పేపర్లో నాలుగు రోజుల క్రితం చూస్తే అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ర్టంలో చంద్రబాబు అధికారం చేపట్టాల్సి వస్తోందని, పైగాా విభజనకు ముందు ఈ హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఏ విధంగా అమలు చేయగలరనే సందేహాలు ప్రజల్లో కలిగేలా కథనాలు రాస్తున్నారు. కార్యకర్తలకు అండగా నిలుద్దాం.. ఈ నెలలోనే చంద్రబాబు బండారం బయట పడుతుంది. ఖరీఫ్ సీజన్ మొదలైంది. రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రుణమాఫీ అమలవుతుందో లేదోననే ఆందోళన వారిలో నెలకొంది. ఒక్క రుణమాఫీయే కాదు.. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ ఏ విధంగా అమలు చేయగలడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు కార్యకర్తలంతా సిద్ధం కావాలి. ఇందుకోసం రానున్న ఐదేళ్లూ పోరాటాలు చేయాలి. ఈ సమయంలో నాయకులపైనే కాదు.. కార్యకర్తలపై కూడా కేసులు పెట్టవచ్చు. వేధింపులకు గురిచేయవచ్చు. ఏ నియోజకవర్గంలో ఏ కార్యకర్తపై ఇటువంటి దాడులు జరిగినా ఆ ఒక్క నియోజకవర్గ పరిధిలోని నాయకులే కాదు.. జిల్లా మొత్తం అక్కడకు వెళ్లి ఆ కార్యకర్తకు అండగా నిలవాలి.. మరోసారి అలాంటి దాడులు చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడాలి. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం.. ఇకపై గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తాం. గ్రామ కమిటీలను వేయడమే కాకుండా నిరంతరం వాటి పనితీరును మెరుగుపర్చేందుకు కృషి చే స్తాం. అధిష్టానం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ గ్రామస్థాయిలో చర్చించి ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా పార్టీని బూత్ స్థాయి వరకు పటిష్టం చేస్తాం.’’ -
'బట్టతలకు దువ్వెనలు అమ్ముతారట'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రచార సారధిగా బాధ్యతలు చేపట్టిన ఒకరోజు గడవకముందే రాహుల్ గాంధీ ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. విపక్ష బీజేపీ, కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ పార్టీలు బూటకపు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు. బట్టతల ఉన్నవారికి దువ్వెనలు అమ్ముతామని లేదా హెయిర్ కటింగ్ చేస్తామని హామీలు గుప్పిస్తున్నాయని ఎద్దేవా చేశారు. వారి మార్కెటింగ్ బాగుందని, ప్రతిదాన్ని తమ అనుకూలంగా వాడుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు కొత్త ఓటర్లపై వల వేస్తున్నారన్నారు. బూటకపు వాగ్దానాలకు మోసపోవద్దని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఏఐసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 45 నిమిషాల పాటు సాగిన రాహుల్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సమీప భవిష్యత్‌లో పార్టీ, జాతి ఎదుర్కొనే సవాళ్ల గురించి ప్రస్తావించారు.