'బట్టతలకు దువ్వెనలు అమ్ముతారట' | BJP, AAP politics akin to selling combs to bald: Rahul Gandhi | Sakshi
Sakshi News home page

'బట్టతలకు దువ్వెనలు అమ్ముతారట'

Jan 17 2014 8:47 PM | Updated on Aug 17 2018 6:00 PM

'బట్టతలకు దువ్వెనలు అమ్ముతారట' - Sakshi

'బట్టతలకు దువ్వెనలు అమ్ముతారట'

కాంగ్రెస్ ప్రచార సారధిగా బాధ్యతలు చేపట్టిన ఒకరోజు గడవకముందే రాహుల్ గాంధీ ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రచార సారధిగా బాధ్యతలు చేపట్టిన ఒకరోజు గడవకముందే రాహుల్ గాంధీ ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. విపక్ష బీజేపీ, కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ పార్టీలు బూటకపు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు. బట్టతల ఉన్నవారికి దువ్వెనలు అమ్ముతామని లేదా హెయిర్ కటింగ్ చేస్తామని హామీలు గుప్పిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

వారి మార్కెటింగ్ బాగుందని, ప్రతిదాన్ని తమ అనుకూలంగా వాడుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు కొత్త ఓటర్లపై వల వేస్తున్నారన్నారు. బూటకపు వాగ్దానాలకు మోసపోవద్దని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఏఐసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 45 నిమిషాల పాటు సాగిన రాహుల్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సమీప భవిష్యత్లో పార్టీ, జాతి ఎదుర్కొనే సవాళ్ల గురించి ప్రస్తావించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement