Karnataka Assembly Elections: Congress Don't Lie Like PM Modi Says Rahul - Sakshi
Sakshi News home page

ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇస్తామని మోదీలా అబద్దాలు చెప్పం: రాహుల్ గాంధీ

Published Fri, Apr 28 2023 7:51 PM

Congress Do not Lie Like PM Modi Says Rahul IN Karnataka Rally - Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. అధికార బీజేపీపై విమర్శల జోరు పెంచింది. ఈ క్రమంలోనే ఉడుపిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీలా తాము అబద్దపు వాగ్ధానాలు చేయబోమని ధ్వజమెత్తారు.

'ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం. నల్లధనంపై పారాటం కోసమే పాత నోట్లు రద్దు చేస్తున్నాం. ఇలా మోదీలా మేము అబద్దాలు చెప్పం' అని రాహుల్ సెటైర్లు వేశారు.

కాంగ్రెస్ ఎప్పుడైనా చేసేదే చెప్తుందని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తుందని రాహుల్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‍లో ఇలానే చేశామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 13న ఒకే విడతలో జరగనున్నాయి. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ చెబుతుండగా.. 150 స్థానాలకు పైగా కైవసం చేసుకుని కమలం పార్టీని ఓడిస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది.
చదవండి: ఆయన కచ్చితంగా గెలుస్తారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. రక్తంతో లేఖ రాసిన కార్యకర్త..

Advertisement
Advertisement