ఆయన కచ్చితంగా గెలుస్తారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. రక్తంతో లేఖ రాసిన కార్యకర్త..

Congress Worker Blood Poster For Jagadish Shettar Victory - Sakshi

బెంగళూరు: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కచ్చితంగా గెలుస్తారని ఓ కార్యకర్త రక్తంతో పోస్టర్ రూపొందించాడు. అలాగే హస్తం పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ పోస్టర్‌ను స్వయంగా తీసుకెళ్లి జగదీశ్‌ శెట్టర్‌కు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో చర్చనీయాంశమైంది.

దశాబ్దాల పాటు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్‌ శెట్టర్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన హస్తం గూటికి చేరుకున్నారు. అయితే హుబ్బళ్లి ధర్వాడ్‌ నిజయోజకవర్గంలో రెండో రోజుల క్రితం సమావేశం నిర్వహించిన మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప శెట్టర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఆయన పార్టీకి, కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారని విమర్శించారు. ఆయన ఎలా గెలుస్తారో చూస్తామన్నారు. శెట్టర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో ఇదే నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త శెట్టర్ గెలుపు ఖాయమని రక్తంతో పోస్టర్‌ రూపొందించాడు . బీఎస్‌ యడియూరప్ప వ్యాఖ్యలకు ప్రతి సవాల్‌గా ఈ పోస్టర్లను గోడలపై అంటించాడు.
చదవండి: ఆ హీరోలు ప్రచారం చేసినా బీజేపీకి ఒరిగేదేంలేదు.. డీకే శివకుమార్‌ సెటైర్లు..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top