breaking news
Fake liquor Mafia
-
‘పెద్దల’ దన్నుతోనే నకిలీ మద్యం రాకెట్
సాక్షి ప్రతినిధి, కడప: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మండల కేంద్రం ములకలచెరువుకు సమీపంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బట్టబయలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కనీ వినీ ఎరుగని రీతిలో ఇంత భారీగా యంత్రాల సాయంతో వివిధ బ్రాండ్లను పోలిన నకిలీ మద్యం ములకలచెరువు వద్ద తయారవుతోందని తెలిసి ఉమ్మడి చిత్తూరు, అనంతపురం వాసులు విస్తుపోయారు. ఇన్నాళ్లూ తాము తాగిన మద్యం నకిలీదేనని తెలుసుకుని స్థానికంగా ఉన్న వారు బెంబేలెత్తుతున్నారు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు, బెల్ట్ షాపులకు ప్రధానంగా ఇక్కడి నుంచి నకిలీ మద్యం సరఫరా అయ్యేదని శుక్రవారం నాటి ఎక్సైజ్ దాడుల్లో స్పష్టమైంది.ఇంత భారీ రీతిలో నకిలీ మద్యం దందా సాగించడానికి ప్రభుత్వంలోని టీడీపీ ముఖ్య నేతల అండ ఉందని తెలుస్తోంది. ప్రతి నెలా కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిగేవని తేలింది. ఇందులో కొంత సొమ్ము ముఖ్య నేతలకు ప్రతి నెలా చేరేదని సమాచారం. ఏడాదికి పైగా విచ్చలవిడిగా, నిర్భీతిగా యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేసి.. జనంతో తాగించి వారి ప్రాణాలతో చలగాటం ఆడిన టీడీపీ నేతలు.. వారికి అన్ని విధాలా అండగా నిలిచిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా నోరెత్తడం లేదు. పైగా అసలు సూత్రధారులను తప్పిస్తూ.. పాత్రధారుల్లో అనామకులైన కొంత మందిపై మాత్రమే కేసులు నమోదు చేయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.అన్నమయ్య జిల్లా స్థాయిలో ముఖ్యనేత, తంబళ్లపల్లి ఇన్చార్జ్ కనుసన్నల్లో ఈ నకిలీ మద్యం ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగాయని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. ఇక్కడి కూలీలను పనిలో పెట్టుకుంటే బండారం బయట పడుతుందని భావించి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. ఈ విషయమై స్థానికులకు ఇదివరకే అనుమానాలు వచ్చినా, టీడీపీ నేతలకు జడిసి నోరు విప్పలేదు. శుక్రవారం నాటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో అందరూ ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. వారి పేర్లు ఎక్కడా రాకూడదునకిలీ మద్యం రాకెట్‌ను నడిపిస్తున్న టీడీపీ ముఖ్య నేతల పేర్లు ఎక్కడా రాకూడదని, కేసులో వారి పేర్లు ఉండకూడదని ఉన్నతాధికారులకు అమరావతి నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. శుక్రవారం నాటి నాటకీయ పరిణామాలు, శనివారం సాయంత్రం ములకలచెరువులో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన ప్రెస్మీట్లో వెల్లడించిన అంశాలు పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టం అవుతోంది. అసలు వాస్తవాల జోలికి వెళ్లకుండా, సూత్రధారులెవరో చెప్పకుండా, కేవలం పాత్రధారుల వివరాలను మాత్రమే వెల్లడించి చేతులు దులుపుకున్నారు. నకిలీ మద్యం కేసులో అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఎక్సైజ్ అధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్తం ఆవుతున్నాయి. ముఖ్యులను తప్పించేసినట్టేములకలచెరువు నకిలీ మద్యం వెలుగులోకి రాగానే ప్రభుత్వ నిఘా, ఎక్సైజ్ వర్గాలు తమ నివేదికలను సీఎంఓకు నివేదించాయని సమాచారం. మొదట టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడును అదుపులోకి తీసుకున్నాక.. అక్కడి పరిస్థితి ఉన్నత స్థాయి వ్యక్తుల దృష్టికి వెళ్లింది. మొదట దీనిపై కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయంతో సురేంద్ర నాయుడును అరెస్ట్ చేసినట్టు ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. శనివారం అసలు సూత్రధారుల వివరాలను వెల్లడిస్తారని భావించగా, పైస్థాయిలో జరిగిన పరిణామాలతో తంబళ్లపల్లె టీడీపీ ముఖ్యల పేర్లు బయటకు రాకుండా తొక్కిపెట్టినట్టు తెలిసింది.దీంతో ఇప్పటికే కేసులో నమోదు చేసిన నిందితుల పేర్లను మరోమారు వెల్లడించి సరిపెట్టుకున్నారు. నిజానికి తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి పాత్ర ఉందని ఈ ప్రాంతంలో అందరికీ తెలిసినా, ఆయనను తప్పిస్తూ ఆయనæ పీఏ రాజేష్‌పై మాత్రమే తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. అయితే ఇతని అరెస్ట్‌పై కూడా అధికారులు ఆసక్తి చూపేలా కనిపించడం లేదు. పైగా రాజేష్‌కు చెందిన మద్యం దుకాణం వైపు శనివారం ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ దుకాణాన్ని సీజ్ చేస్తామని, లైసెన్స్ కూడా రద్దు చేస్తామని శుక్రవారం చెప్పిన అధికారులు పై నుంచి ఒత్తిడి రావడంతో ఆ దిశగా చర్యలు తీసుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది.ఈ కేసులో నిందితులుగా ఉన్న జనార్దనరావు, కట్టా రాజులు దొరికితే కానీ వాస్తవాలు తెలియవని ఎక్సైజ్ అధికారులు తప్పించుకునే ధోరణితో ముందుకెళ్తున్నారు. విజయవాడకు చెందిన జనార్దన్‌రావు ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నట్టు సమాచారం. ఇదే నిజమైతే అయన్ను ఇక్కడికి ఎప్పుడు రప్పిస్తారు.. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు.. నిజాలు ఎప్పుడు వెలికితీస్తారనే దానికి సంబంధించి అధికారుల నుంచి స్పందనే లేదు. ఈ నకిలీ మద్యం ఏడాది క్రితం నుంచి నడుస్తుండగా.. గత నెలలోనే పెట్టారంటూ అధికారులు తేల్చేయడం గమనార్హం.ఈ ప్రశ్నలకు బదులేదీ?⇒ ఈ కేంద్రానికి పెట్టుబడి పెట్టింది ఎవరు? ⇒ నగదు లావాదేవీల మాటేంటి? ఏయే అకౌంట్ల ద్వారా లావాదేవీలు నడిచాయి?⇒ ఒక్క రోజే రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యం దొరికిందంటే ఇన్నాళ్లూ సరఫరా చేసిన మద్యం విలువ ఎంత?⇒ ఏయే ఊళ్లలోని ఏయే దుకాణాలకు నకిలీ మద్యం సరఫరా చేశారు?⇒ ప్రముఖ బ్రాండ్లకు సంబంధించి నకిలీ మద్యం ఆర్డర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి?⇒ నకిలీ మద్యం తయారీకి సంబంధించి ముడి సరుకులు ఎక్కడి నుంచి తెచ్చారు?⇒ లేబుళ్లు, సీసాలు, మూతలు, స్పిరిట్, ఫ్లేవర్లు, భారీ యంత్రాలతో కూడిన ప్లాంట్‌ను నడపడం కేసులో చూపుతున్న నిందితులకు సాధ్యమా?⇒ చిన్న చిన్న బడ్డీ కొట్లను సైతం వదలకుండా మామూళ్లు దండుకునే ప్రజా ప్రతినిధులకు ఇంత భారీ ప్లాంట్ గురించి తెలియదంటే ఎవరు నమ్ముతారు?⇒ ఈ కేంద్రాన్ని విజయవాడకు చెందిన జనార్దనరావు అనే వ్యక్తి చూస్తుంటాడని.. అంతా అతనిపైకి నెట్టేయడం ఎంత వరకు సమంజసం?⇒ అధికార పార్టీ నేతల అండ దండలు లేకుండా స్థానికేతరుడు ఇంత భారీ నకిలీ మద్యం ప్లాంట్‌ను నడపగలడా?⇒ రోజుకు 20వేలకు పైగా 180 ఎంఎల్ బాటిళ్ల మద్యం తయారు చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ నుంచి ఇప్పటి వరకు ఎంత సరుకు విక్రయించారు?⇒ ఒడిశా, తమిళనాడు నుంచి వచ్చిన తొమ్మిది మంది కూలీలపై కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం సబబా? ⇒ పెద్దలంతా తప్పించుకుని ఒక్క కట్టా సురేంద్ర నాయుడిని మాత్రమే బలి పశువును చేస్తున్నారని నిలదీస్తున్న ఓ సామాజిక వర్గీయుల ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు?నకిలీ మద్యం ప్లాంట్ కేసులో పది మంది అరెస్ట్ములకలచెరువు: అన్నమయ్య జిల్లా ములకలచెరువు పాత హైవే సమీపంలో బట్టబయలైన నకిలీ మద్యం తయారీ కేంద్రం కేసులో 14 మందిపై కేసు నమోదు చేసి, 10 మందిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ తెలిపారు. స్థానిక ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆయన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో జనార్దనరావు, కట్టా రాజు, పి.రాజేష్, కొడాలి శ్రీనివాసరావు, నాగరాజు, హాజీ, బాలరాజు, మణిమారన్, ఆనందన్, సూర్య, వెంకటేషన్ సురేష్, మిథున్, అనంతదాస్, కట్టా సురేంద్ర నాయుడుపై కేసు నమోదు చేశారు.వీరిలో జనార్దనరావు, పి.రాజేష్, కట్టా రాజు, కొడాలి శ్రీనివాసులు పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. మిగతా వారిని అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి ఎస్ఎస్ ట్యాంకు, డిస్టలరీ వాటర్ ట్యాంకు, బాటిళ్లకు మూతలు బిగించే 3 యంత్రాలు, మూడు వాహనాలు, ఎలక్ట్రికల్ మోటార్, 1,050 లీటర్ల స్పిరిట్, బాటిలింగ్‌కు సిద్ధంగా ఉన్న 1,470 లీటర్ల మద్యం, 20,208 బాటిళ్ల మద్యం, 12 వేల ఖాళీ బాటిళ్లు, వేలాది మూతలు, 70 క్యాన్లు, రాయల్ లాన్సర్ లేబుళ్లు 10,800, ఓల్డ్ అడ్మిరల్ లేబుళ్లు 1200, 4 వేల రోల్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వీటి విలువ రూ.1.75 కోట్లని చెప్పారు. -
ఆగని ‘కల్తీ’ మద్యం దందా..!
సాక్షి, యాదాద్రి: జిల్లాలో ఏడాది కాలంగా కల్తీ మద్యం దందా జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారం పెద్ద ఎత్తున కొనసాగుతున్నా ఎక్సైజ్‌శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో బెల్టుషాపులు కేంద్రంగా నకిలీ మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న అనుమానం మద్యం ప్రియులు వ్యక్తం చేస్తున్నారు. మద్యం వ్యాపారుల ధన దాహానికి అడ్డూఅదుపు లేకుండా రెక్టిఫైడ్ స్పిరిట్‌తో మద్యాన్ని తయారు చేసి పలురకాల బ్రాండ్లతో విక్రయించిన తీరు మద్యంప్రియులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఎన్నికల సీజన్లో కల్తీ మద్యం వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా మద్యం దుకాణాల ద్వారా, బెల్టుదుకాణాల ద్వారా కల్తీ మద్యాన్ని విక్రయించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కల్తీ మద్యం విక్రయదారులను పోచంపల్లితోపాటు, బాలాపూర్, వికారాబాద్‌లలో అరెస్టు చేశారు. మరో నెలరోజుల్లో మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఎక్సైజ్ పోలీస్‌లు పట్టుకున్న మద్యంతో చీకటి వ్యాపారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పదిమంది నిందితులు అరెస్ట్ చేసిన పోలీస్‌లు మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. ఒరిజనల్‌గా నమ్మిస్తూ: అక్రమ మద్యం వ్యాపారులు రెక్టిఫైడ్ స్పిరిట్‌ను తమ రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసి పలురకాల బ్రాండ్లకు చెందిన మూతలు, లేబుళ్లను కొనుగోలు చేసి పాత సీసాల్లో రెక్టిఫైడ్ స్పిరిట్‌ను నింపి వాటిలో మద్యం రంగు వచ్చే విధంగా క్యారామాల్ లిక్విడ్‌ను కలిపారు. మద్యం కొనుగోలుదారునికి ఎలాంటి అనుమానం రాకుండా ప్యాక్ చేసి ప్రభుత్వ సరఫరా లేబుళ్లను అంటించి అన్ని రకాల మద్యాన్ని డూప్లికేట్ సీసాల్లో ఒరిజినల్ ధరకే విక్రయించారు. బయటబడిన బండారం.. భూదాన్‌పోచంపల్లి మండలం అబ్దుల్లానగర్‌లో గత నెల 14న రెక్టిఫైడ్ స్పిరిట్‌తో క్యారామిల్ కలిపి మద్యాన్ని తయారు చేస్తున్న మద్ది అనిల్‌రెడ్డితోపాటు మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి లక్షల రూపాయలు విలువ చేసే రెక్టిఫైడ్ స్పిరిట్, క్యారామిల్ మద్యం సీసాల మూతలను పలు బ్రాండ్లకు సంబంధించిన లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సుమారు 10మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మరికొంత మంది కోసం గాలింపు చేపట్టారు. భూదాన్‌పోచంపల్లి మండలం ముక్తాపూర్ శివారులో గత నెల 19న పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టుబడిన నేపథ్యంలో పోలీసులు ఇప్పటి వరకు 10మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా మరో నలుగురి కోసం వెతుకుతున్నారు. భూదాన్‌పోచంపల్లి మండలం అబ్దుల్లానగర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్న స్పిరిట్, సామగ్రి, మద్యం సీసాల మూతలు (ఫైల్) మూడు నెలలుగా జిల్లాలో నకిలీ మద్యం ఛాయలు గుర్తించినట్లు ఎక్సైజ్ పోలీసులు చెబుతుండగా అంతకంటే ముందు ఏడాది కాలంనుంచే కల్తీ దందా పెద్ద ఎత్తున సాగుతున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం కేసులో తాజాగా మద్యం సీసాల నకిలీ మూతలను విక్రయించే హైదరాబాద్‌కు చెందిన లాయిఖ్అలీ, స్టిక్కర్స్‌ను విక్రయించే హైదరాబాద్‌కు చెందిన సుదీర్‌లను ఇప్పటికే అరెస్టు చేయగా తాజాగా స్పిరిట్‌ను సరఫరా చేసే తాండూరుకు చెందిన మొగులప్ప స్టిక్కర్స్‌ను కొనుగోలు చేసిన మహబూబాబాద్‌కు చెందిన శశాంక్గౌడ్లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అయితే ఢిల్లీలో హోలోగ్రామ్స్ తయారు చేసే కంపెనీపై దృష్టిసారించిన పోలీసులు అక్కడి నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ మద్యం కేసులో కర్ణాటకకు చెందిన ఇద్దరు, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన ఒక్కొక్కరు చొప్పున నిందితుల వేటలో పోలీసులు బిజీగా ఉన్నారు. బెల్టుషాపుల ద్వారా విక్రయం.. నకిలీ మద్యం కొన్ని మద్యం షాపులతోపాటు బె ల్టుషాపుల్లో పెద్ద ఎత్తున విక్రయించినట్లు ఎక్సైజ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నారా యణపూర్, చౌటుప్పల్ మండలం మల్కాపూర్‌లో మద్యం దుకాణాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితులై న అనిల్‌రెడ్డితోపాటు మరికొంత మంది తమ కు తెలిసిన వారి ద్వారా జిల్లాతోపాటు హైదరాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌జిల్లాల్లో విక్రయించినట్లు ఇప్పటికే బయటపడింది. నకిలీ మద్యం కేసును ఛేదించడం ద్వారా జిల్లాలో భారీ రాకెట్‌కు తెరదించినట్లైందని ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు. నిందితులందరినీ పట్టుకుం టామని ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు. -
నకిలీ మద్యం ముఠా గుట్టురట్టు
సాక్షి, పరిగి/తాండూరు: నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టు రట్టయింది. యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో తీగలాగితే వికారాబాద్ జిల్లాలో డొంక కదిలింది. యాదాద్రి, వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఇద్దరిని అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం. నకిలీ మద్యం తయారీకి వినియోగించే ముడి పదార్థాలైన స్పిరిట్, లేబుల్స్, మూతలు తదితర సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. నాలుగు రోజుల క్రితం యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేసి నకిలీ మద్యంతో పాటు మద్యం తయారీకి వినియోగించే సామగ్రిని పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అక్కడ అనుమానితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. కర్ణాటక, తాండూరు ప్రాంతం నుంచి ముడి పదార్థాలు సరఫరా అవుతున్నట్లు బయటపడింది. దీంతో యాదాద్రి, వికారాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు తమ సిబ్బందితో కలిసి సోమవారం జిల్లాలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పెద్దేముల్ మండలం నాగులపల్లిలో బెల్టు షాపు నిర్వహిస్తున్న బిచ్చయ్య, మరో వ్యక్తి మొగులయ్య నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మొగులయ్యను అదుపులోకి తీసుకోగా బిచ్చయ్య పరారయ్యాడు. నాగులపల్లిలో తమ ఇళ్లలో తనిఖీలు చేసి లేబుళ్లు, స్పిరిట్ తదతితర మద్యం తయారీకి వినియోగించే ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దోమలోనూ తనిఖీలు మొగులయ్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో దోమ మండల కేంద్రానికి చెందిన బెస్ల లక్ష్మణ్‌కు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో దోమలో సైతం దాడులు నిర్వహించి లక్ష్మణ్ ఇంట్లో మద్యం తయారికీ వినియోగించే ముడి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే, నకిలీ మద్యం తయారీ ప్రస్తుతం కాస్త మందగించినా గత ఎన్నికల సమయంలో పెద్దమొత్తంలో తయారు చేసి విక్రయించినట్లు ఎక్సైజ్ పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగా దోమ మండల కేంద్రంలో 150 నకిలీ లేబుల్స్, నాలుగు లీటర్ల స్పిరిట్, మద్యం బాటిళ్లను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. మద్యం షాపుల్లో సోదాలు సోమవారం మొత్తం అధికారులు మద్యం షాపుల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహిం చారు. దోమ, పెద్దేముల్, తాండూరులో తనిఖీలు చేశారు. నకిలీ మద్యం వైన్ షాపులకు ఏమైనా సరఫరా అవుతుందా.. అనే కోణంలో తనిఖీలు నిర్వహించారు. యాదాద్రి ఎన్ఫోర్స్మెంట్ సీఐ భరత్‌భూషన్, పరిగి సీఐ చంద్రశేఖర్ ఇతర సిబ్బంది తనిఖీల్లో ఉన్నారు. -
అన్ని మాఫియాలూ విజృంభిస్తాయి
ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కేంద్ర నిఘా వర్గాలు హుండీ, హవాలా దందాలపై కన్నేయండి అధీకృత సంస్థల లావాదేవీలూ పరిశీలించండి ఫేక్ కరెన్సీ ముఠాలపై నిఘా ముమ్మరం చేయండి నకిలీ మద్యం మాఫియా విజృంభించే ప్రమాదం సాక్షి, హైదరాబాద్: ఎంపీటీసీ నుంచి లోక్‌సభ వరకు అన్ని ఎన్నికలు వరుసగా రావడంతో బందోబస్తులు, భద్రతా ఏర్పాట్లతోపాటు పైకి కనిపిం చని సమస్యలు మరెన్నో ప్రభుత్వ యంత్రాంగానికి ఉన్నాయి. వీటన్నింటికీ మించిన ఆందోళనకర కోణాలను కేంద్ర నిఘా వర్గాలు వెలుగులోకి తెచ్చాయి. ధనం, మద్య ప్రవాహాలతో పాటు వీటితో ముడిపడిన మాఫియాలు సైతం విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ మాఫియాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించాయి. ఏవైనా రెండు దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్య మార్పిడిని హవాలా అంటారు. ఓ దేశంలోనే వివిధ ప్రాంతాల మధ్య జరిగే డబ్బు మార్పిడిని హుండీ అంటారు. సాధారణంగా ఈ రెండు మార్గాలను పన్ను ఎగ్గొట్టేందుకు వ్యాపారులు వినియోగిస్తుంటారు. ఎన్నికల సమయంలో పార్టీలు, అభ్యర్థులు అనధికారిక ఖర్చుల కోసం వీటినే ఆశ్రయిస్తారని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ రెండింటితో పాటు అధీకృత మార్పిడిదారుల లావాదేవీలనూ నిశితంగా పరిశీలించాలని సూచించాయి. భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు అనేక ఉగ్రవాద సంస్థలూ నకిలీ నోట్లను ముద్రిస్తున్నాయి. వీటిని స్థానికంగా ఏర్పాటు చేసుకున్న ముఠాల సాయంతో బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్‌కు చేర్చి, అక్కడి నుంచి దేశంలోని మిగతా ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ‘ఎన్నికల ఖర్చుల’కు అవసరమైన డబ్బు కోసం అనేక మార్గాలను అన్వేషించే వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ నోట్లను భారీ స్థాయిలో చెలామణి చేయడానికి ముఠాలు ప్రయత్నిస్తాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ నేరాల్లో ఆరితేరిన ముఠాలతోపాటు ఎన్నికల కారణంగా పెరిగిన డిమాండ్‌ను ఆసరా చేసుకొని కొత్త ముఠాలూ పుట్టుకొచ్చే ప్రమాదముందని హెచ్చరించాయి. నకిలీ నోట్ల ముఠాలపై నిఘా ముమ్మరం చేయాలని సూచించాయి. దుబాయ్ కేంద్రంగా జరిగే హవాలా వ్యాపారంలో ప్రతి ముఠాకూ రెండు చోట్లా ఏజెంట్లు ఉంటారు. నగదు పంపాల్సిన వారు దుబాయ్‌లో ఉన్న ఏజెంట్‌కు డబ్బు అందిస్తే.. అతడి ద్వారా సమాచారం అందుకునే భారత్‌లోని ఏజెంట్ ఆ మొత్తాన్ని ఇక్కడ డబ్బు అందుకొనే వారికి ఇస్తాడు. ఇప్పుడు ఈ పంథా మారింది. దుబాయ్‌లో ఏజెంట్లు తీసుకున్న డబ్బు అక్కడున్న మాడ్యూల్తో పాటు పాకిస్థాన్‌లోని ప్రధాన సూత్రధారులు పంచుకుంటున్నారు. తిరిగి భారత్‌లో చెల్లించడానికి మాత్రం ఉత్తరాదిలో ఏర్పాటు చేసుకున్న ముఠాలతో సైబర్ నేరాలు చేయించి, ఆ మొత్తాన్ని ఇక్కడ డెలివరీకి వినియోగిస్తున్నారు. ఇలాంటి ముఠాలు పెద్ద మొత్తంలో పంజా విసురుతాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఓటర్లను ప్రలోభపరచడానికి మద్యాన్నీ భారీగా వినియోగిస్తుంటారు. ఖర్చు లెక్కల్లో చూపించకుండా ఉండేందుకు అనేక మార్గాల్లో మద్యాన్ని కొంటారు. దీన్ని అదునుగా చేసుకుని నకిలీ మద్యం మాఫియా కూడా రెచ్చిపోతుందని నిఘా వర్గాలు అంచనావేశాయి. మద్యం మాఫియాల ప్రభావం నేరుగా ప్రజలపై పడుతుందని, తీవ్ర దుష్పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించాయి.