
విజయవాడ: నకిలీ మద్యం కేసులో పట్టుబడ్డ టీడీపీ నేత జనార్థన్‌రావు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు ఎక్సైజ్ పోలీసులు. ఈ కేసులో ఏ-1గా ఉన్న జనార్థన్‌రావును అక్టోబర్ 17వ తేదీ వరకూ రిమాండ్ విధించిన నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి.
లిక్కర్ బిజినెస్‌లో లాభాలు లేవని జనార్దన్ రావుతో చేతులు కలిపారు టిడిపి నాయకుడు జయచంద్ర రెడ్డి, సురేంద్ర నాయుడు. కూటమి ప్రభుత్వం వచ్చాక అధిక సంఖ్యలో మద్యం షాపులను దక్కించుకున్నారు వీరిద్దరూ. ఈ క్రమంలోనే 2025 జూన్ నుంచి ఇబ్రహీంపట్నం కేంద్రంగా నకిలీ మద్యం తయారీ జరిపినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.
తెలంగాణలోని హైదరాబాద్ నుంచి NDPL లిక్కర్‌ను తీసుకొని ఏఎన్‌ఆర్ బార్ లో జనార్ధన్ రావు అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు. హైదరాబాద్‌లో E-7 అనే బార్ లో పార్టనర్ గా చేరిన జనార్ధన్ రావు.. అక్కడ చీప్ లిక్కర్‌ను ఇబ్రహీంపట్నం తీసుకొని వచ్చి అమ్మకాలు జరిపాడు. బిజినెస్ పార్టనర్స్‌తో గోవా కి వెళ్లి.. అప్పటికే లిక్కర్ బిజినెస్‌లో కలిసి ఉన్న బాలాజీ తో చేతులు కలిపారు.
బాలాజీ ద్వారా స్పిరిట్, హీల్స్, క్యాప్‌లు, క్యారేమిల్, ఎసెన్స్ తీసుకొని వచ్చారు. ఈ క్రమంలోనే నకిలీ మద్యం తయారు చేసి ఏఎన్‌ఆర్ బార్‌లో విక్రయించారు. ఈ నకిలీ మద్యం తయారు చేసేందుకు.. ఫేక్ లేబుల్స్, లిక్కర్ బాటిల్స్ శ్రీనివాస్, రమేష్ అనే ఇద్దరు సప్లయ్ చేసిన విషయం వెల్లడైంది. నకిలీ మద్యం తయారు చేసేందుకు ముంబై, బెంగళూరు, ఢిల్లీ నుంచి ఇబ్రహీం పట్నంకి స్పిరిట్ తరలించేవారు. జనార్ధన్‌రావు సోదరుడు జగన్మోహనరావు ద్వారా నకిలి బ్రాండ్‌లను తయారు చేశారు.
జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అరెస్ట్..
అన్నమయ్య జిల్లా:
తంబళ్లపల్లి నియోజకవర్గంలో ములకలచెరువు కల్తీ మద్యం కేసులోఎక్సైజ్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. దీనిలో భాగంగా తంబళ్లపల్లె టిడిపి ఇంచార్జి జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అష్రఫ్‌ను అరెస్టు చేశారు. అష్రఫ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తంబళ్లపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. నకిలీ మద్యం కేసులో ఏ 21 నిందితుడుగా ఉన్న అష్రఫ్.. నకిలీ మద్యాన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు గ్రామాలకు తరలించినట్లు గుర్తించారు.
రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు అష్రప్ బయటపెట్టినట్లు సమాచారం. టిడిపి ఇంచార్జి జయచంద్రారెడ్డికి చెందిన బ్లాక్ స్కార్ఫియో వాహనంలో నకిలీ మద్యం బెల్ట్ షాపులకు సరఫరా చేసినట్లు వెల్లడించినట్లు సమాచారం. మరొకవైపు టిడిపి నేతలు జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది కోసం పోలీసుల బెంగళూరులో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి:
పక్కావ్యూహం ప్రకారమే..!