breaking news
exactly
-
క్షణికావేశంతో నిండు ప్రాణం తీసుకుంది
తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య ప్రేమికుడితో తరచూ ఫోన్లో మాట్లాడుతుండటమే కారణం పెడనలో ఘటన పెడన రూరల్ : ప్రేమికుడితో తరచూ ఫోన్లో మాట్లాడుతున్నందుకు తల్లి మందలించిందనే కోపంతో ఓ యువతి బల వంతంగా ప్రాణం తీసుకుంది. మృతురాలి తల్లి తెలిపిన స మాచారం ప్రకారం గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పట్టణ శివారులోని వీరభద్రపురంలో యర్రా గిరిజాకుమారి కుటుంబం నివాసం ఉంటోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉ న్నారు. భర్త చనిపోవడంతో చేనేత పనులు చేసుకుంటూ కు టుంబాన్ని పోషిస్తోంది. పెద్దకుమార్తె దివ్య నాగరేవతి(20) గుడ్లవల్లేరులోని పాలిటెక్నిక్ కళాశాలలో గతేడాది ఈసీఈ కో ర్సు పూర్తి చేసింది. మచిలీపట్నంలోని భెల్ కంపెనీలో అ ప్రెంటీస్గా శిక్షణ పొందుతోంది. రెండో కుమార్తె కూడా పా లిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తోంది. కు మారుడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. నాగరేవతి గురువారం రాత్రి ఫోన్లో ప్రేమికుడితో మాట్లాడుతుండగా తల్లి మందలించింది. తరువాత తల్లి, కుమారుడు నిద్రకు ఉపక్రమిస్తుండగా రేవతి కిరోసిన్ డ బ్బా తీసుకుని బాత్రూమ్లోకి వెళ్లి శరీరంపై పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో భరించలేక కేకలు వేస్తూ బయటకు వచ్చి కుప్పకూలిపోయింది. లోపలనుంచి తల్లి, కుమారుడు వచ్చి ఆమెపై ఇసుక చల్లి మంటలు ఆర్పేందుకు యత్నించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రేవతి అక్కడికక్కడే మరణించింది. ఎస్సై అల్లు దుర్గాప్రసాద్ వ చ్చి విచారణ నిర్వహించారు. బందరు డీఎస్పీ డాక్టర్ కె. శ్రీనివాస్, బందరు రూరల్ సీఐ ఎస్.వి.వి.ఎస్.మూర్తి శుక్రవారం ఘటనాస్థలికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. స్థా నిక ఆర్ఐ తేజ, వీఆర్వో భద్రంతో పంచనామా నిర్వహించి, బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై కేసు దర్యాప్తు చేపట్టారు. రెండేళ్లుగా ఓ యువకుడితో ప్రేమలో.. రేవతి గుడ్లవల్లేరు కళాశాలలో పాలిటెక్నిక్ చదివే రోజుల్లో పె డనకు చెందిన ఓ మాస్టర్ వీవర్ కుమారుడితో ప్రేమలో ప డింది. అతడు కూడా గుడ్లవల్లేరులో పాలిటెక్నిక్ చదివేవాడు. ఇద్దరూ రోజూ రైలులో కాలేజీకి వెళ్లి వస్తుండేవారు. రెండేళ్లు గా వీరు ప్రేమించుకుంటున్నారు. రేవతి తన ప్రేమ గురించి తల్లికి తెలియజేసి, ఇద్దరికీ పెళ్లి చేయాలని కోరింది. దీంతో గి రిజ సంవత్సరం క్రితం రేవతి ప్రేమికుడి ఇంటికి వెళ్లి, అతడి కుటుంబసభ్యులతో మాట్లాడింది. అయితే మాస్టర్ వీవర్ స్థితిమంతుడు కావడంతో ఈ వివాహానికి అంగీకరించలేదు. అయినప్పటికీ ఇద్దరి ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. రే వతి తరచూ ప్రేమికుడితో ఫోన్లో మాట్లాడుతుండగా తల్లి అభ్యంతరం చెప్పేది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి రేవ తి ఫోన్లో మాట్లాడుతుండగా తల్లి మందలించింది. దీంతో ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. రేవతిని ప్రే మికుడికి ఇచ్చి వివాహం చేసేందుకు అతడి కుటుంబసభ్యు లు అంగీకరించి ఉంటే తన కుమార్తె ప్రాణం దక్కేదని గిరిజాకుమారి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. రేవతిని కోడలిగా చేసుకునేందుకు నిరాకరించిన వారిపై కేసు నమోదు చేయా లని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. -
‘పరీక్షా’ కాలం
ఒకేసారి మూడు ఎన్నికలు విద్యార్థులకు విషమ పరీక్షే సమైక్య ఉద్యమంతో రోజులతరబడి జరగని తరగతులు వరుస ఎన్నికలతో నేతలు, పార్టీలకూ కీలక పరీక్షే అవును.. ఇది నిజంగా పరీక్షా కాలమే. విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు.. రాజకీయ నేతలు.. పార్టీలకు కీలక పరీక్షలు ఒకేసారి వచ్చాయి. తమ భవితకు, ఉన్నత చదువుల మెట్టు ఎక్కేందుకు విద్యార్థులకు పదోతరగతి పరీక్ష.. బిడ్డల జీవితాలపై ఆశలు పెట్టుకునే తల్లిదండ్రులకూ ఇది అగ్ని పరీక్ష.. పదవుల కుర్చీ ఎక్కేందుకు నేతల జాతకాలకు ఎన్నికల పరీక్ష.. మనుగడ కోసం రాజకీయ పార్టీలకు ఇదే కీలక పరీక్ష.. ఇలా అందరికీ ఒకేసారి పరీక్షా కాలం ముంచుకొచ్చింది. సాక్షి, మచిలీపట్నం : మరోసారి ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. ఈసారి మున్సిపల్, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు మూడూ ఒకేసారి రావడం.. అదీ విద్యార్థులకు పరీక్షల సీజన్ కావడంతో విద్యార్థులకు మాత్రం ఇది విషమ పరీక్షేనని చెప్పొచ్చు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సార్వత్రిక ఎన్నికలు ఏ మాత్రం అవరోధం కాకూడదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావించారు. అయినా వారి ఆశలు ఫలించలేదు. ఇప్పుడు పదో తరగతి పరీక్షలు, ఎన్నికలు పోటీపడి మరీ జరుపుకోవాల్సి వచ్చింది. దీంతో అటు విద్యార్థులు, ఇటు రాజకీయ నాయకులు భవిత కోసం ఈ పరీక్షల్లో పాస్ అయ్యేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభించారు. ఏడాదంతా అవాంతరాలే... ఈ ఏడాదంతా విద్యార్థులకు అవాంతరాలే ఎదురయ్యాయి. జిల్లాలో ఈ ఏడాది రాష్ట్ర విభజన నేపథ్యంలో పెద్ద ఎత్తున సమైక్య ఉద్యమం సాగింది. దాదాపు వంద రోజులకు పైగా ఉద్యమాలు ఉవ్వెత్తున సాగాయి. ఫలితంగా విద్యాసంస్థలు మునుపెన్నడూ లేని విధంగా రోజులతరబడి మూతపడ్డాయి. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని తీవ్రంగా నష్టపోయారు. ప్రైవేటు క్లాసులు పెట్టినా సిలబస్ పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. అరకొర చదువులతోనే పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాల్సిన దుస్థితి దాపురించింది. దీనికితోడు కరెంటు కోతలు, ఎన్నికల వాతలు విద్యార్థుల ఏకాగ్రతను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. విద్యార్థులందరికీ ఇబ్బందికరమే... ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 15 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో సుమారు 60 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. మార్చి 12 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న లక్షా 30 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు ఈ నెల ఆరో తేదీ నుంచి జరుగుతున్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు పూర్తయిన తరువాత జిల్లాలో ఎంసెట్, ఐసెట్, ఎడ్ సెట్ (బీఈడీ), డైట్ సెట్ (డీఈడీ), సీప్ (పాలిటెక్నిక్ ఎంట్రన్స్), జామ్ (ఇంజినీరింగ్ తరువాత కోర్సు), భాషా పండితులకు పండిట్ ఎంట్రన్స్ టెస్ట్ వంటి వరుస పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థుల భవితకు పరీక్షలు ఎన్నికల సమయంలోనే జరగడం ఇబ్బందికరమేనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. పార్టీలకూ పెద్ద పరీక్షే... జిల్లాలో ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించడంతో విజయవాడతో పాటు మచిలీపట్నం, గుడివాడ, పెడన, నూజివీడు, జగ్గయ్యపేట మున్సిపాలిటీలు, నందిగామ, తిరువూరు, ఉయ్యూరు నంగర పంచాయతీలు పరీక్షకు సిద్ధమయ్యాయి, ఒక కార్పొరేషన్లో 59 మంది కార్పొరేటర్లు, ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో 218 మంది కౌన్సిలర్లు ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో పదవీయోగం కోసం పరీక్షకు సిద్ధమైన అభ్యర్థులు అప్పుడే వ్యూహరచనలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో మే ఏడో తేదీన జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం రాజకీయ పార్టీలకు పెద్ద పరీక్షగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేని దుస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీకి వలస వెతలు తీవ్రమయ్యాయి. సమైక్యాంధ్ర చాంపియన్గా నిలిచిన వైఎస్సార్సీపీ జిల్లాలో ధీమాగా ఎన్నికల పరీక్షలకు సిద్ధమైంది. వరుస పరీక్షల్లో విజేతలెవరనేది ఫలితాల వరకు ఎదురుచూడాల్సిందే మరి.