breaking news
Eternal
-
సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలంటే ఏమిటి?
సమాజంలో ప్రతి ఒక్కరూ మంచి జీవితాన్ని కోరుకుంటారు. శాంతి, సుఖ సంతోషాలు తమ సొంతం కావాలని అభిలషిస్తారు. కష్టనష్టాలను, అశాంతిని ఎవ్వరూ ఆశించరు. కానీ ఏదీ ఆశించినట్లు, అనుకున్నట్లు జరగదు. జీవితంలో అనుకూల, ప్రతికూల పరస్థితులు వస్తూనే ఉంటాయి. ఎగుడు దిగుళ్ళు మానవ జీవితంలో అనివార్యం. అనుకూల పరిస్థితుల్లో ΄ పొంగిపోవడం, ప్రతికూల పరిస్థితుల్లో కుంగిపోవడం మానవుడి చంచల స్వభావానికి నిదర్ళనం. అసలు మంచి జీవితమంటే ఏమిటి? సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలంటే ఏమిటి? అందమైన భవంతి, కళ్ళు చెదిరే ఆస్తులు, హోదా, అధికారం, వాహనాలు, భార్యాపిల్లలు, కుటుంబం – ఇవన్నీ సమకూరితే మంచిజీవితం లభించినట్లేనా? సుఖసంతోషాలు సొంతమైనట్లేనా? కాదు..ఇవన్నీ ఆనందంలో ఒక భాగమే తప్ప, పరిపూర్ణ సంతోషానికి సోపానాలు కాలేవు. ఇది అనుభవం చెప్పే యథార్ధం. ఎందుకంటే, అందమైన ఇల్లు, కోరుకున్న భార్య, రత్నాల్లాంటి బిడ్డలు, విలాసవంతమైన వాహనాలు, కావలసినంత బ్యాంకుబ్యాలెన్సు, బలం, అధికారం, – ఇంకా రకరకాల విలాసవంతమైన సాధనా సంపత్తి నిత్యం అందుబాటులో ఉన్నప్పటికీ, సంతోషంకోసం, సంతృప్తికరమైన జీవితం కోసం వెదుకులాట మానవ సమాజంలో ప్రతినిత్యం మనం చూస్తున్నాం. అన్నీ ఉండికూడా అనుభవించలేని అనేకమంది సంపన్నులూ మనకు పరిచయమే. అంటే ఇవన్నీపాక్షిక ఆనందాన్ని మాత్రమే అందించగలవుకాని, పరిపూర్ణసంతోషానికి సోపానం కాలేవని మనకు అర్థమవుతోంది. అయినా మనిషి అనాదిగా శాంతి, సంతోషాలకోసం తంటాలు పడుతూనే ఉన్నాడు. తనకు తోచిన ప్రయోగాలతోపాటు, తనలాంటి వారు చెప్పే సూత్రాలన్నిటినీ పాటిస్తున్నాడు. ఎవరెవరి చుట్టూనో తిరుగుతూ, చెప్పిందల్లా చేస్తూ, తులమో ఫలమో సమర్పించుకుంటూ ఉన్నాడు. కాని ఎక్కడా శాంతి, సంతోషం లభించడంలేదు. ధనం ధారపోసి కొనుక్కుందామంటే, అది మార్కెట్లో లభ్యమయ్యే వస్తువు కూడా కాదాయె. మరేమిటీ మార్గం? మంచిజీవితం, శాంతి, సంతోషం, సంతృప్తి ఇవన్నీ ఎండమావేనా? ఇదే విషయాన్ని ఒక శిష్యుడు ముహమ్మద్ ప్రవక్త (స) వారిని అడిగాడు. అప్పుడాయన గారు,’ అల్లాహ్ ను (దైవాన్ని) బాగా స్మరించు. అనాథలను ఆదరించు. పేదసాదలకు శక్తిమేర సహాయం చెయ్యి.’ అని ఉపదేశించారు. అంటే, ఇలా చెయ్యడం ద్వారా నువ్వు కోరుకుంటున్న శాంతి, సంతోషాలతో నిండిన మంచి జీవితం ప్రాప్తమవుతుంది అని అర్థం. కాని నాలుగు రాళ్ళసంపాదన సమకూరగానే దుర దృష్ట వశాత్తూ మనుషుల్లో అహం పెరిగి పోతోంది. దైవాన్ని స్మరించడం తరువాత సంగతి, అసలు దైవాన్నే మరిచి పోయి, పేదసాదలను దగ్గరికి రానివ్వని పరిస్థితి నెలకొంటోంది. మరిక శాంతి లభించాలంటే ఎలా లభిస్తుంది.? కాబట్టిసర్వకాల సర్వావస్థల్లో దైవాన్ని స్మరిస్తూ, సాధ్యమైనంతమేర మంచి పనులు చేస్తూ, చెడులకు దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. సత్కార్వాల్లో లభించే సంతోషం సంతృప్తి మరెందులోనూ లభించదు. ధర్మబద్ధమైన సంపాదన, ధర్మసమ్మతమైన ఖర్చు, సత్కార్యాల్లో సమయాన్ని వెచ్చించడం – ఇదిగనక మనం ఆచరించగలిగితే నిత్య సంతోషం, ఇహపర సాఫల్యం సొంతమనడంలో సందేహమే లేదు.– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
2 రోజుల్లో రూ.2 వేల కోట్లు.. ‘క్విక్’ కుబేరుడు!
ఎటర్నల్ (జొమాటో) వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) నికర సంపద అమాంతం పెరిగిపోయింది. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు రూ.2,000 కోట్లు పెరిగింది. ఎటర్నల్ క్విక్ కామర్స్ విభాగమైన బ్లింకిట్ లో కనిపించిన గణనీయమైన వృద్ధిని ఇన్వెస్టర్లు స్వాగతించడంతో, ఎటర్నల్ షేర్లు రెండు రోజుల్లో 21 శాతానికి పైగా పెరిగాయి. ఎన్ఎస్ఈలో తాజా ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ .311.60 ను కూడా తాకాయి.సెల్ఫ్ మేడ్ బిలియనీర్ అయిన 42 ఏళ్ల దీపిందర్ గోయల్ ఎటర్నల్ కంపెనీలో తనకున్న 3.83 శాతం వాటా కారణంగా కొత్తతరం కంపెనీలో తన వాటా విలువ రూ.11,515 కోట్లకు పెరిగింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం ఈ ఐఐటీయన్ నికర సంపద 1.9 బిలియన్ డాలర్లుగా ఉంది.విప్రో, టాటా మోటార్స్, నెస్లే, ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీల కంటే ఎటర్నల్ షేర్లు రూ.3 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కును దాటాయి. ఎటర్నల్ షేర్ల జోరు ప్రత్యర్థి స్విగ్గీపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపింది. దీంతో ఆరోజు ఆ కంపెనీ షేరు 7 శాతానికి పైగా పెరిగింది.నెట్ ఆర్డర్ వ్యాల్యూ (ఎన్ఓవీ) పరంగా బ్లింకిట్ ఇప్పుడు జొమాటో కంటే పెద్దది కావడంతో టాప్ బ్రోకరేజీ సంస్థలు ఇప్పుడు రూ.400పై దృష్టి సారించాయి. రూ.400 టార్గెట్ ధరతో ఎటర్నల్‌ను బైకి అప్ గ్రేడ్ చేస్తూ జెఫరీస్ అత్యంత దూకుడుగా వ్యవహరించింది. పోటీ ముప్పును అతిగా అంచనా వేసినట్లు కూడా అంగీకరించింది.దీపిందర్ గురించి..పంజాబ్‌లోని ముక్త్సర్లో 1983 జనవరి 26న జన్మించిన దీపిందర్ గోయల్.. ఐఐటీ ఢిల్లీ నుంచి మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. 2008లో ఫుడీబే (Foodiebay) అనే వెబ్‌సైట్‌తో ప్రారంభమైన ఆయన వ్యాపార ప్రయాణం, తర్వాత జొమాటోగా (Zomato)గా మారింది. దీపిందర్ వ్యూహాత్మక నిర్ణయాలతో జొమాటో దేశ విదేశాల్లో విస్తరించింది. 2022లో బ్లింకిట్ (Blinkit) అనే క్విక్ కామర్స్ సంస్థను కొనుగోలు చేసి, ఆ రంగంలోనూ తన ఆధిపత్యాన్ని చూపించారు. 2025లో జొమాటో పేరును ఎటర్నల్ లిమిటెడ్ (Eternal Limited)గా మార్చారు. -
ఉన్నది ఒకటే అన్న భావనే అద్వైతం
ద్వైతం కానిది అద్వైతం. అంటే రెండు అనే భావన పోయి ఉన్నది ఒకటే అని భావించగలగటం అద్వైతమవుతుంది. అయితే ఉపాధులన్నీ సమానమని అర్థం కాదు. పాపపుణ్య కర్మ ఫలితంగా వచ్చిన ఉపాధులు పరస్పరం భిన్నమైనవే. అవి పూర్తిగా నశించిపోయేవే. నశించనిది, నిత్యసత్యమైనది ఉపాధి గతమైన ఆత్మ ఒక్కటే. ఈ విషయం గ్రహించటమే సమదర్శి స్వభావం. నిత్యసత్యం, వ్యవహార సత్యం అనేవి రెండున్నాయని గ్రహించాలి. మనకు కనబడే ప్రపంచమంతా వ్యవహారంలో సత్యం. కాని నిత్యసత్యము మాత్రం కాదు. ప్రపంచం నిత్యసత్యమని తెలిస్తే అది భ్రాంతి అనక తప్పదు. ఈ అద్వైత జ్ఞానం వల్ల తానంటూ వేరే ఉండక అంతట తననే చూడటం, తనలోనే సర్వాన్ని చూడటం జరుగుతుంది. ‘ఆత్మ వత్సర్వభూతాని సర్వభూతాని చాత్మని’ అనే దాని కర్థం అదే. ఈ జ్ఞానం ఒక్క గురుబోధ, గురుసేవ వల్లనే లభ్యం. కేవలం గ్రంథ పఠనం చాలదు.ఒక గురువు గారు తన శిష్యుడికి ‘అద్వైతం’ గురించి పాఠం ప్రారంభించారు. ‘భగవంతుడు ఒకడే. ఆయన సర్వాంతర్యామి. ఆయన సంకల్పంతో సృష్టి జరిగింది. ఆయనొక్కడే నిత్య సత్యం. ఈ కనబడేది అంతా భ్రాంతి వల్ల కనబడు తున్నది కాని నిజానికి ఇదేదీ లేదు. అని మొదట్లో బోధించటం జరిగింది. ఈ జ్ఞానం శిష్యులలో స్థిరపడటానికి ఇంకా సమయం కావాలి. గురువిచ్చే అనుభవం సంపాదించాలి. అప్పుడుగాని అర్థమైనట్లు కాదు. ప్రాథమిక దశలోనే ఉన్న ఈ శిష్యుడు ఒక సారి అడవికి వెళ్ళి వస్తూ ఉన్నాడు. దారిలో ఒక మదపుటేనుగు ఎదురుగా వస్తున్నది. దానిపై ఉన్న మావటివాడు, ఈ ఏనుగు ఇది పూర్తిగా మచ్చిక కాని మదపుటేనుగు పక్కకు తప్పుకో అని అరిచాడు. ఆ శిష్యునికి అద్వైతం పాఠం గుర్తుకొచ్చింది. ‘ఈ కనబడేదంతా బ్రహ్మమే. రెండవదంటూ లేదు.’ కాబట్టి ఈ కన బడే ఏనుగు భ్రాంతి జన్యమైంది. కనుక నేను తప్పుకోవలసిన పని లేదని ముందుకు నడిచాడు. ఏనుగు రానే వచ్చింది, తొండంతో అతణ్ణి విసిరి అవతల పారవేసింది. అప్పుడు ఆ శిష్యుడికి అర్థమైందో లేదో కాని మనకు మాత్రం బాగా అర్థమవ్వాల్సింది ఏమిటంటే... ‘ఉపాధులన్నింటిలోనూ ఉన్న అంతర్యామి ఆత్మ ఒక్కటే అయినా, ఉపాధి గత భేదం భేదమే’అని! -
ఈ ప్రేమ అనిర్వచనీయం
-
సంపాదించలేని అమ్మ అనాథయ్యింది..!
ఇచ్ఛాపురం: సంపాదించలేని అమ్మ అనాథయ్యింది. పని చేసే శక్తి కోల్పోయిన తల్లి ఒంటరిదైపోయింది. డబ్బు లేని ఆ మాతృమూర్తి కన్నబిడ్డలకు బరువైంది. 85 ఏళ్ల కాలాన్ని తన రెక్కల కష్టంతో గడిపిన ఆ మనిషి ఇప్పుడు అలసిపోయింది. పేగు తెంచుకు పుట్టిన వారు బంధాలు తెంచుకుని వెళ్లిపోతుంటే కన్నీరు పెట్టడం తప్ప ఇంకేమీ చేయలేకపోయింది. ఇచ్ఛాపురం పట్టణంలోని గొల్లవీధికి చెందిన నీలాపు అచ్చమ్మ అందరూ ఉండి అనాథలా మారింది. అచ్చమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిని తన రెక్కలు ముక్కలు చేసుకుని అచ్చమ్మ పెంచింది. అందరికీ పెళ్లిళ్లు చేసింది. వారిలో ఒక కుమారుడు చనిపోగా మరో కుమారుడు మున్సిపాలిటీలోని బెల్లుపడ కాలనీలో చిన్నదుకాణం పెట్టుకొని బతుకుతున్నాడు. అచ్చమ్మ తన కుమార్తెతో కలసి తోటవీధిలోని ఓ అద్దె ఇంటిలో ఉండేది. అచ్చమ్మ తనకు వచ్చే పింఛన్ డబ్బును కుమార్తెకే ఇచ్చేసి అక్కడే ఉండేది. సోమవారం అచ్చమ్మ కూతురు తల్లి వద్ద ఉన్న కాస్త బంగారాన్ని తీసుకుని ఆమెను గొల్లవీధి మండపం వద్ద విడిచిపెట్టేసింది. 85 ఏళ్ల వయసులో ఎక్కడకు వెళ్లాలో తెలీక, ఏం చేయాలో పాలుపోక అక్కడే తడికళ్లతో బిత్తర చూపులు చూసుకుంటూ ఉండిపోయింది. ఆమెను ఆ పరిస్థితుల్లో చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. అధికారులు స్పందించి ఆమెకు న్యాయం చేయాలని వారు కోరారు. -
నిత్య కృషీవలుడు సీఎం కేసీఆర్
సూర్యాపేట : నిరంతరం అనేక సమస్యలు పరిష్కరిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధికి బాటలు వేస్తున్న నిత్యకృషివలుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇవ్వని హామీలను సైతం తెరపైకి తెస్తూ అమలు చేస్తున్న ఘనత దేశంలో సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మహారాష్ట్ర నీటి ఒప్పందంతో సాగు, తాగునీటి సమస్య తీరనుందని చెప్పారు. రాష్ట్రంలో నిర్మించనున్న ఐదు ప్రాజెక్టులతో రాష్ట్ర రైతుల ఎదుర్కొంటున్న కరువు దూరం కానుందని పేర్కొన్నారు. ఈ నెల 23న మహారాష్ట్రలో విద్యుత్, నీటి ప్రాజెక్టుల ఒప్పంద పత్రాలపై సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి సమక్షంలో సంతకాలు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వైవీ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాశ్, మిర్యాలగూడ మున్సిపల్ చైర్పర్సన్ తిరునగరు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎడతెగని నిరీక్షణ..
బియాస్ దుర్ఘటన జరిగి నేటికి నెల ఇంకా తీరని వేదన.. ఆగని రోదన గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు మరణించిన విద్యార్థుల ఇళ్ల వద్ద తొలగని విషాద ఛాయలు సాక్షి, సిటీబ్యూరో/నల్లకుంట/జగద్గిరిగుట్ట: బియాస్ ఘటన జరిగిన నేటికి సరిగ్గా నెల.. అయినా ఇంకా తీరని వేదన.. ఆగని రోదన.. ఈ ఘటనలో నగరానికి చెందిన 16 మంది విద్యార్థులు మరణించారు. గల్లంతైన వారిలో మరో ముగ్గురి ఆచూకీ లేకుండా పోయింది. గల్లంతైన విద్యార్థులు శ్రీనిధి (కరీంనగర్), రిషితారెడ్డి (బాచుపల్లి), కల్లూరి శ్రీహర్ష (నల్లకుంట) కోసం కన్నవారు కళ్లలో వేయి వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. నిద్రాహారాలు మాని తమ వారి కోసం ఎడతెగని నిరీక్షణతో భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇక దుర్ఘటనలో మృత్యువాత పడిన 16 మంది నగర విద్యార్థుల ఇళ్ల వద్ద కూడా ఇంకా విషాదఛాయలు తొలిగిపోలేదు. బంధుమిత్రుల పరామర్శలతో, ఆత్మీయుల పలకరింపులతో నేటికీ ఉద్విగ్నవాతావరణం నెలకొంది. బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలలో సెలవుల అనంతరం సోమవారం తరగతులు పునఃప్రారంభమయ్యాయి. తోటి విద్యార్థులను కోల్పోయి షాక్‌కు గురైన పలువురు విద్యార్థులు భారంగా కాలేజీకి వచ్చారు. మొన్నటివరకు తమ మిత్రులతో కళాశాల ఆవరణలో గడిపిన తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో కళాశాల వాతావరణం ఉద్విగ్నంగా మారింది. కళాశాల వద్ద విషాద ఛాయలు దుర్ఘటన జరిగి నెలైనా వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీ విద్యార్థులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. సెలవుల అనంతరం సోమవారం పునఃప్రారంభమైన బాచుపల్లిలోని కళాశాల ప్రాంగణంలో ఉద్విగ్నత నెలకొంది. నదీ ప్రవాహంలో 24 మంది విద్యార్థులు గల్లంతు కాగా వారిలో 21 మంది మృత్యువాతపడడం, మరో ముగ్గురు విద్యార్థుల ఆచూకీ తెలియకపోవడంతో తోటి విద్యార్థులు తీవ్రంగా కలత చెందారు. తమ తోటి వారితో గడిపిన స్మృతులను, కళాశాల ప్రాంగణంలో వారితో కలిసి మెలిసి గడిపిన సంఘటనలను గుర్తుచేసుకొని తల్లడిల్లారు. ప్రతి విద్యార్థి ముఖంలోనూ విషాద ఛాయలే కనిపించాయి. కళాశాల ఆవరణలో విద్యార్థులతోపాటు, సిబ్బంది, ఫ్యాకల్టీలు మృతి చెందిన విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కాలేజీకి సెలవు ప్రకటించడంతో విద్యార్థులు బరువెక్కిన హృదయాలతో ఇళ్లకు తిరిగి వెళ్లారు. పరిహారంపై సర్కార్ల నిర్లక్ష్యం.. దుర్ఘటనలో మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలకు హిమాచల్ ప్రదేశ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాయి. కానీ ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు ఏ ఒక్క ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదని బాధితుడు సంజయ్‌కుమార్ (మిట్టపల్లి అఖిల్ తండ్రి) ‘సాక్షి’కి తెలిపారు. విద్యారుణాలను మాఫీ చేస్తామని, కళాశాలకు చెల్లించిన ఫీజులను తిరిగి తల్లిదండ్రులకు ఇస్తామన్న వాగ్దానాలు సైతం మాటలకే పరిమితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన నగర విద్యార్థులు వీరే.. బియాస్ నదిలో గల్లంతైన వారిలో 16 మంది నగర విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వీరిలో విజేత, లక్ష్మీగాయత్రి, ఐశ్వర్య, రాంబాబు, దేవాశీష్బోస్, సాబేర్ హుస్సేన్, అరవింద్, పరమేశ్వర్, పి.వెంకటదుర్గ తరుణ్, అశీష్మంతా, మాచర్ల అఖిల్, శివప్రకాశ్‌వర్మ, సాయిరాజ్, బైరినేని రిత్విక్, కిరణ్‌కుమార్, మిట్టపల్లి అఖిల్ ఉన్నారు. రిషితా ఎక్కడున్నావమ్మా... కూతురు రిషితారెడ్డి జాడ తెలియక తల్లి మంచం దిగడంలేదు. చెల్లెలి కోసం చెమ్మగిల్లిన కళ్లతో అన్న.. ఏమి చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో నేను కొట్టుమిట్టాడుతున్నాం. కూతురి జాడ కోసం నెల రోజులుగా ఎదురు చూస్తున్నాం. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ నంబర్లకు నిత్యం ఫోన్‌చేసి సమాచారం తెలుసుకుంటున్నాం. ప్రాణాలతో వస్తుందనే ఆశతోనే బతుకుతున్నాం. దుర్ఘటనకుకాలేజీ యాజమాన్యమే కారణం. విద్యార్థులను స్టడీ టూర్‌కి తీసుకెళ్లిన కళాశాల యాజమాన్యంతోపాటు ఫ్యాకల్టీలు అడుగడుగునానిర్లక్ష్యంగా వ్యవహరించారు. - కృష్ణారెడ్డి (గల్లంతైన రిషితారెడ్డి తండ్రి) శ్రీహర్ష కోసం వేయికళ్లతో.. బియాస్ నదిలో గల్లంతైన కల్లూరి శ్రీహర్ష (19) కోసం తల్లిదండ్రులు కేఆర్‌కేబీ ప్రసాద్, స్వర్ణలతలు కళ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ఎప్పటికైనా తమవాడు తిరిగివస్తాడన్న ఆశతో జీవిస్తున్నారు. నల్లకుంట శివం రోడ్డు బతుకమ్మకుంట సబ్‌స్టేషన్ ఎదురు వీధిలోని శ్రీమత్ రాజాస్ రెసిడెన్సీలో (ఇంటి నంబర్ 2-2-1118/ఏ) వారు నివాసముంటున్నారు. కేఆర్‌కేబీ ప్రసాద్ వృత్తిరీత్యా అడ్వకేట్. జూన్ 3న వీఎన్ఆర్ కళాశాల నుంచి హిమాచల్‌ప్రదేశ్ స్టడీ టూర్‌కు వెళ్లిన వారిలో ప్రసాద్ కుమారుడు శ్రీహర్ష కూడా ఉన్నాడు. అదే నెల 8న స్నేహితులతో కలిసి ఫొటోలు దిగుతూ బియాస్ నదిలో గల్లంతైన విషయం విదితమే. నెల రోజులు గడుస్తున్నా నేటికీ ఆచూకీ లభించలేదు. తమ కుమారుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని, ఏదో ఒక రోజు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని శ్రీహర్ష తల్లిదండ్రులు ఆశతో కుమారుని కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తుండడం అందరినీ కలచివేస్తోంది. కుటుంబ సభ్యులతోపాటు బందువులు, స్నేహితులు శ్రీహర్ష జాడకోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. చాలా బాధగా ఉంది... బియాస్ ఘటన దురదృష్టకరం. ఇంత మంది మృతి చెందడం ఎంతో బాధకలిగించింది. కాలేజీలోని ప్రతి విద్యార్థి ఇప్పటికి ఈ షాక్ నుంచి తేరుకోలేక పోతున్నారు. - రాజేశ్, ఎంటెక్, ఫస్ట్ ఇయర్ ఎక్కడ చూసినా అదే చర్చ.. ఈ రోజు కాలేజీకి రాగానే బియాస్ ఘటననే గుర్తుచేసుకున్నాం. మరణించిన విద్యార్థులను తలచుకుంటేనే ఎంతో ఆవేదన కలుగుతోంది. వారి తల్లిదండ్రులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలి. - రామ్, ఎంటెక్, ఫస్ట్ ఇయర్ తలచుకుంటేనే భయంగా ఉంది.. మా తోటి విద్యార్థులు నది ప్రవాహంలో కొట్టుకుపోవడం.. ఆపై మరణించడం తలచుకుంటేనే భయంగా ఉంది. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. - రఘువీర్, బిటెక్, తృతీయ సంవత్సరం మరువలేని చేదు జ్ఞాపకం... బియాస్ నదిలో మా స్నేహితులను కోల్పోవడం జీవితంలో ఓ చేదు జ్ఞాపకం. ఈ దురదృష్టకర సంఘటన నిజం కాకుంటే బాగుండు అనిపించింది. - చైతన్య, బిటెక్, తృతీయ సంవత్సరం