breaking news
email address
-
వెల్కమ్ బ్యాక్ మై ఫ్రెండ్!
అది టోక్యో వీధి.. మధ్యాహ్నపు ఎండ.. నిత్యం కిటకిటలాడే ఆ నగరంలో ఒక వృద్ధుడు ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అతని కళ్లలో ఒక తరం కిందటి జ్ఞాపకం మెరుస్తోంది. సరిగ్గా 48 ఏళ్ల క్రితం విడిపోయిన తన ప్రాణ మిత్రుడు కనిపిస్తాడా? అసలు ఆ పాత ఈమెయిల్ చిరునామా ఇంకా పని చేస్తోందా?అమ్మ దాచిన అపురూప నిధికథ అమెరికాలోని నార్త్ కరోలినాలో మొదలైంది. వాల్టర్ అనే వ్యక్తి.. తన తల్లి మరణానంతరం ఆమె పాత వస్తువులను సర్దుతున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. చనిపోవడానికి ముందు ఆమె రాసుకున్న పాత కాగితాల మధ్య.. ఒక చిరునామా, ఒక పాత ఈమె యిల్ ఐడీ కనిపించింది. అది 48 ఏళ్ల క్రితం తన ఇంట్లో ఎక్సే్ఛంజ్ స్టూడెంట్‌గా ఉన్న జపాన్ మిత్రుడు కజుహికోది. అతను వాల్టర్ ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. అలా వాల్టర్, కజుహికోలు చిన్నప్పుడే మంచి మిత్రులయ్యారు. వాల్టర్ తల్లికి కజుహికో అంటే చాలా ఇష్టం. ఆ అబ్బాయి సొంత కొడుకులా ఉండేవాడు. అందుకే ఆమె పాత కాగితాల్లో కజుహికో వివరాలను, ఆఖరికి అతని పాత ఈమెయిల్ చిరునామాను కూడా భద్రంగా రాసి పెట్టుకుంది.ఆఖరి ప్రయత్నం ఫలించిందినిజానికి 48 ఏళ్ల తర్వాత ఆ ఈమెయిల్ పని చేస్తుందని ఎవరూ అనుకోరు. కానీ జపాన్ వెళ్లే విమానం ఎక్కడానికి కొద్ది నిమిషాల ముందు, వాల్టర్ ఒక చిన్న సాహసం చేశాడు. ‘ఆ ఈమెయిల్ ఐడీ ఇప్పుడు పనిచేస్తుందో లేదో.. ఆ మిత్రుడు బతికే ఉన్నాడో లేదో’.. అన్న సందేహంతోనే ఒక మెయిల్ పంపాడు. విమానం దిగేసరికి అద్భుతం జరిగింది.. నాలుగు దశాబ్దాల నిశ్శబ్దాన్ని బద్ధలు కొడుతూ.. అవతలి వైపు నుండి సమాధానం వచ్చింది. జపాన్‌లో ఉన్న కజుహికో స్పందించాడు. కానీ వారి మధ్య భాష సమస్య ఎదురైంది. వాల్టర్ మిత్రుని భార్య నోబుకో మధ్యవర్తిగా మారి, వారిద్దరి మధ్య సందేశాలను అనువదించింది. చివరికి టోక్యోలో ఒక లంచ్ మీటింగ్ ఖరారైంది.కన్నీటి ఆలింగనంనిర్దేశించిన ప్రదేశంలో ఇద్దరూ కలుసు కున్నారు. 48 ఏళ్ల క్రితం యవ్వనంలో చూ సుకున్న ఆ ఇద్దరి కనులు.. ఇప్పుడు ముడతలు పడ్డ ముఖాల్లో ఒకరినొ కరిని గుర్తు పట్టా యి. ఇంకేమీ మా ట్లాడలేదు.. ఒకరి నొకరు గట్టిగా హత్తుకున్నారు. ఆ ఆలింగనంలో అర్ధ శతాబ్దపు ఎడబాటు, ఆనందం, కన్నీళ్లు అన్నీ కలిసిపోయాయి. ఈ దృశ్యం చూసిన వారందరి కనులు చెమర్చాయి.స్నేహానికి ’ఎక్స్పైరీ డేట్’ లేదు!వాల్టర్ కుమార్తె మెరెడిత్ డీన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. వారి ఆలింగనం చూసి సోషల్ మీడియా ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది. చితికిపోయిన కాగితం మీద దొరికిన అక్షరం.. విడిపోయిన ఇద్దరు మిత్రులను కలిపింది. ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా, స్వచ్ఛమైన స్నేహానుబంధం ఏనాటికీ వాడిపోదని ఈ సంఘటన నిరూపించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మెయిల్ ఐడీ నచ్చలేదా? మార్చుకుందురులే..!
మనలో చాలా మందికి ఈమెయిల్ ఖాతాలు ఉంటాయి. అయితే ఈ మెయిల్ ఐడీల విషయంలో ఎక్కువ మందికి అసంతృప్తే ఉంటుంది. ఎందుకంటే చాన్నాళ్ల క్రితం వీటిని తెరిచేటప్పుడు సిస్టమ్ ఆటోమెటిక్‌గా సూచించిన ఏదో ఒక ఐడీని ఈమెయిల్ అడ్రెస్‌గా సెట్ చేసుకుని ఉంటారు. కానీ దాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పుడు అరే ఈ మెయిల్ ఐడీ అంత బాగా లేదే.. దీన్ని మనకు నచ్చినట్టు మార్చుకునే అవకాశం ఉంటే బాగుండు.. అనుకుంటుంటారు.ఇప్పుడా అవకాశాన్ని గూగల్ కల్పించబోతోంది. టెక్ దిగ్గజం రాబోయే సిస్టమ్ మార్పును వివరించే హిందీ భాష సపోర్ట్ డాక్యుమెంటేషన్‌ను ఇటీవల అప్డేట్ చేసింది. అందులో జీమెయిల్ అడ్రస్‌లను మార్చుకునే వెసులుబాటు గురించి పేర్కొంది.ప్రసిద్ద ఫోర్బ్స్ ప్రచురించిన కథనం ప్రకారం.. గూగుల్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ జీమెయిల్ అడ్రెస్‌లను మార్చుకోవచ్చు. అయితే ఇందుకు నిర్దిష్ట పరిమితులు ఉంటాయి. ఇలా మెయిల్ ఐడీ మార్చుకోవడానికి ఏడాదికి ఒక్కసారి.. మొత్తంగా మూడు సార్లు అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇంతకుముందున్న మెయిల్ అడ్రస్ కూడా అలియాస్‌గా కొనసాగుతుంది. అంటే దానికి వచ్చే మెయిల్స్ అలాగే వస్తుంటాయి. ఇక ఖాతా డేటా అంటే ఫోటోలు, మెసేజ్‌లు, ఇమెయిల్‌లు వంటి వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదు.కాగా ఇప్పటి వరకు గూగుల్ అకౌంట్‌కు థర్డ్ పార్టీ ఈమెయిల్ చిరునామాలతో సైన్ అప్ చేసిన వినియోగదారులకు మాత్రమే ఖాతా ఈమెయిల్ మార్పులను అనుమతిస్తోంది. కానీ జీమెయిల్ అడ్రెస్ల మార్పునకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు గూగుల్ అందిస్తున్న కొత్త ఫీచర్‌ను సోషల్ మీడియా యూజర్లు స్వాగతిస్తున్నారు. -
పొంగులేటికి బెదిరింపు ఈ మెయిల్
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి శుక్రవారం ఒక బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. ఈ మేరకు పొంగులేటి పూర్తి ఆధారాలతో అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం అర్బన్ సీఐ మధుసూదన్ కథనం ప్రకారం... ఖమ్మంలో రోటరీనగర్‌లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయ మెయిల్ అడ్రస్‌కు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బెదిరిస్తూ మెయిల్ పంపారు. శనివారంలోగా ఎన్నికల పోటీ నుంచి విరమించుకోవాలని లేకుంటే... జిల్లా వ్యాప్తంగా కరపత్రాలు పంచుతామని, పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు తిరిగి మెయిల్ పంపాలని అందులో పేర్కొన్నారు. ‘నీ ఓటమే లక్ష్యం’ అని పేర్కొంటూ శ్రీనివాసరెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి మెయిల్ పెట్టారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి ఉన్నతస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.


