breaking news
eco project
-
ఎకో టౌన్‌కు ఓకే..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో చెత్త సమస్యలకు పరిష్కారంగా.. ఘన వ్యర్థాల నిర్వహణను మరింత ఆధునిక సాంకేతికతతో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్లో 86 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనున్న ఎకోటౌన్ ప్రాజెక్టులో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు ఇచ్చిన అనుమతికి తాజాగా అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈమేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ జీఓ జారీ చేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం, జపాన్‌లోని ప్రిఫెక్చర్‌కు చెందిన కిటాక్యూషూ నగరం మధ్య కుదిరిన స్నేహ, సహకార ఒప్పందంలో భాగంగా అమలు కానుంది. విజ్ఞప్తికి స్పందించి.. నగరాల్లో సర్క్యులర్ ఎకానమీ విధానాన్ని ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెట్ జీరో లక్ష్యాల సాధన కోసం ఎకోటౌన్ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సిద్ధాపూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 252, 278, 361లోని 150 ఎకరాల భూమిని బదిలీ చేయాల్సిందిగా గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్ టీజీఐఐసీని కోరారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించిన పరిశ్రమలు, వాణిజ్యశాఖ.. సిద్ధాపూర్‌లోని 86 ఎకరాల టీజీఐఐసీ భూమిని జీహెచ్ఎంసీకి ఉచితంగా బదిలీ చేసేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరి 11న అడ్వాన్స్ పొజిషన్ సర్టిఫికెట్ ద్వారా ఈ భూమిని జీహెచ్ఎంసీకి అప్పగించారు. హెచ్ఐఎంఎస్డబ్ల్యూకు వ్యర్థాల నిర్వహణ బాధ్యతలు.. 86 ఎకరాల స్థలంలో ఘనవ్యర్థాల నిర్వహణ సదుపాయాలు కలి్పంచేందుకు వీలుగా హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (హెచ్‌ఐఎంఎస్‌డబ్ల్యూ) సంస్థకు ‘క్యూర్’ స్పెషలాఫీసర్ ఇదివరకే అనుమతులిచ్చారు. ఆ అనుమతుల్ని పరిశీలించిన ప్రభుత్వం ఇప్పుడు ధ్రువీకరిస్తూ జీఓ జారీ చేసింది. సంబంధిత చట్టాలు, నిబం«ధనలు ,ప్రభుత్వ ఉత్తర్వులు, ఇంటిగ్రేటెడ్ మున్సిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు ఒప్పంద నిబంధనల ప్రకారమే ప్రాజెక్టును అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను ప్రభుత్వం ఆదేశించింది.ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు మరింత బలం..ఎకో టౌన్ ప్రాజెక్టు అమల్లోకి వస్తే హైదరాబాద్‌లో ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు మరింత బలం చేకూరడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, వనరుల పునరి్వనియోగం, సుస్థిర నగరాభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారంగానూ.. నగరం నలు వైపులా ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం తెలిసిందే. -
కేవలం మూడున్నర గంటల్లో మట్టి ఇళ్లను నిర్మిస్తున్న ఇటలీ.. కారణం తెలుసా..
మన పూర్వికులు మట్టితో కట్టిన ఇళ్లలో జీవించారు. సైన్స్ అభివృద్ధిచెందని కాలంలో మట్టి ఇళ్లను నిర్మించుకుని నివాసమున్నారు. ఐతే టెక్నాలజీపై ప్రపంచానికే పాఠాలు చెప్పగల ఈ సంపన్న దేశంఎందుకో మట్టితో ఇళ్లను కట్టుతోంది. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.. ఇటలీలోని రావెన్న ప్రాంతంలో కుండ ఆకారంలో బంకమట్టితో ఇళ్లు కడుతున్నారు. అచ్చం.. మన పూర్వికుల ఇళ్లమాదిరి కట్టేస్తున్నారు. వీటిని టెల్కా హౌసులు అని అంటారు. అంతేకాదు 3డీ ప్రింటింగ్ సహాయంతో కేవలం మూడున్నర గంటల్లో వీటిని నిర్మిస్తున్నారు. 645 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన ఈ గుండ్రని ఇళ్ల లోపల బెడ్ రూం, బాత్ రూం, లివింగ్ రూములతో సకల సౌకర్యాలతో కూడి ఉన్నాయి. ఈ డోమ్ హౌస్‌ల నిర్మాణాల వెనుక గొప్ప సందేశం కూడా ఉందండోయ్! వీటిని నిర్మించాలనే ఆలోచన సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ మారియో కుసినెల్లా నుండి ఉద్భవించింది. ఇళ్లు లేనివారు వీటిని వాడుకోవచ్చట కూడా. రాబోయో రోజుల్లో ఇంకా తక్కువ సమయంలో కట్టేస్తానంటున్నాడు మారియో. ప్రపంచంలోనే మొట్టమొదటి పర్యావరణ హిత ఇళ్లివి (ఎకో ఫ్రెండ్లీ హౌస్). ప్రకృతి విపత్తుల్లో ఒక వేళ ఇవి కూలిపోతే 3డి ప్రింటింగ్‌తో తిరిగి నిర్మించుకోవచ్చిన మారియో చెబుతున్నాడు. విపత్తు సంభవించే ప్రాంతాలకు ఇటువంటి ఇళ్లు మంచి ఎంపిక అని మారియో చెప్పారు. జీరో కార్భన్ కన్స్ట్రక్షన్ ఆవిష్కరణ కోసం ఈ ప్రాజెక్ట్ ఎంపిక చేయబడింది. ఈ ప్రాజెక్ట్ క్లైమాట్ ఛేంజ్ సమ్మిట్‌లో కూడా ప్రదర్శించబడింది. చదవండి: కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా? -
పర్యాటక హంగులు!
కందనూలు జిల్లాకు పర్యాటక శోభ నల్లమలలో ప్రకృతి రమణీయ దృశ్యాలు ఈకో టూరిజం అభివృద్ధికి శ్రీకారం రూ.109కోట్లతో ప్రణాళికలు సిద్ధం కొత్తగా ఏర్పాటుకానున్న నాగర్‌కర్నూల్ జిల్లాకు పర్యాటక హంగులు కలగనున్నాయి. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో కృష్ణా పరివాహక ప్రాంతంతో పాటు నల్లమల అడవులు ప్రకృతి అందాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయంగా ఉన్నాయి. ఈ ప్రాంతాలను పర్యాటకకేంద్రాలుగా మార్చేందుకు తెలంగాణ పర్యాటక శాఖ, అటవీ శాఖ సంయుక్తంగా ఈకో టూరిజం అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చాయి. ఆదిశగా ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించింది. కేంద్ర పర్యాటకశాఖ రూ.109కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. – అచ్చంపేట పేదల ఊటీ అభివృద్ధికి రూ.10.5కోట్లు అచ్చంపేట ప్రాంతంలోని ఉమామహేశ్వర క్షేత్రం కింది కొండ బోగమహేశ్వరం వద్ద పర్యాటకుల కోసం కాటేజీలు, బేష్ క్యాంపు, కొండపైకి మొట్లు అభివృద్ధి వంటి పనులకు రూ.10.50 కోట్లకు టెండర్లు ఖరారు చేశారు. పేదల ఊటీగా అభివర్ణిస్తున్న ఉమామహేశ్వర క్షేత్రం ఇప్పటికే ప్రముఖ పర్యాటక కేంద్రంగా బాసిల్లుతోంది. మరోవైపు మల్లెల తీర్థం జలపాతం వరకు రోడ్డు అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేశారు. మల్లెలతీర్థం లోయలోకి వెళ్లేందుకు 270మెట్లు ఉన్నాయి. మెట్లదారి ఇబ్బందికరంగా ఉండటంతో వృద్ధులు, పిల్లలు సులువుగా ఎక్కేందుకు వాటి డిజైన్ మార్చడంతో పాటు రోప్‌వే ఏర్పాటు చే యనున్నారు. ఇక్కడ విద్యుత్ సౌకర్యం, సోలార్లైట్లు, డ్రస్సింగ్ రూమ్‌లతో పాటు పర్యాటకుల విశ్రాంతి కోసం షెడ్లు నిర్మాణం వంటి ప్రతిపాదనలు రూపొందించారు. రూ.12కోట్లతో టెండర్లు ఫర్హాబాద్ వ్యూఫాయింట్ వద్ద కాటేజీలు, టూరిజం హోటళ్ల ఏర్పాటుకు రూ.12కోట్లు మంజూరు చేస్తూ టెండర్లు పిలిచారు. అన్ని హంగులతో కూడిన వసతులు, రాత్రివేళల్లో విడిది చేసేందుకు పల్లె వాతావరణాన్ని తలపించే సూట్లు, చెంచుల నివాసంలా ఉండే బొడ్డు గుడిసెల నమూనాలతో రూములు ఏర్పాటుకు ప్రతిపాదించారు. దట్టమైన అభయారణ్యంలో వ్యూపాయింట్ ఉంది. నల్లమలలోని అటవీ అందాలు, వన్యమృగాల సంచారాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆ ప్రదేశంలో జింకలు, నెమళ్లు, ఎలుగుబంట్లు, పులుల సంచారం బాగా ఉంటుంది. పర్యాటకుల రక్షణ కోసం వన్యమృగాల నుంచి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అటవీశాఖ సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతేడాది కేంద్ర పర్యాటకశాఖ ఆడిషనల్ డీజీ భారతీశర్మ కృష్ణానది తీరం వెంట ఏర్పాటు చేసే కాటేజీలు, స్టాల్స్, పర్యాటకంగా అభివృద్ధి చేసే ప్రాంతాలను పరిశీలించి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంలో పనులు ఊపందుకున్నాయి. వెనకబడిన అచ్చంపేట,కొల్లాపూర్ ప్రాంతాలకు మంచి గుర్తింపు, ఆదాయ వనరులు సమకూరడటంతో పాటు వ్యాపార సంబంధాలు బలపడనున్నాయి. పర్యాటకంగా రూపుదిద్దుకొనే ప్రాంతాలు.. శ్రీశైలం ఎడమగట్టు పాతాళగంగా, ఈగలపెంట, మల్లెలతీర్థం, అక్కమదేవి గుహలు, ఫర్హాబాద్ ప్యూపాయింట్ అందాలు, ఉమామహేశ్వరం క్షేత్రం, కొల్లాపూర్ మండలం సోమశిల లలితాంబికా సోమేశ్వరాలయం, సింగోటం లక్ష్మినర్సింహస్వామి ఆలయం, రత్నగిరి కొండ, శ్రీవారిసముద్రం ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. శ్రీశైలం–సోమశిల కృష్టానదిలో బోట్ ప్రయాణం నల్లమల పర్యాటకకేంద్రాలను సందర్శించేందుకు పర్యాటకుల కోసం హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సోమశిలకు వాహనాల్లో చేరవేస్తున్నారు. సోమశిల నుంచి శ్రీశైలం క్షేత్రానికి కృష్ణానదిలో 80కిలోమీటర్ల దూరం. 80మంది పర్యాటకులు ప్రయాణించే సామర్థ్యం కలిగిన బోటు ఏర్పాటు చేశారు. ఎడమ పాతాళగంగ ఈగలపెంటలో కృష్ణానది ఒడ్డున 30అడుగుల ఎత్తయిన వాష్ టవర్ ఏర్పాటు చే సేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కృష్ణమ్మ ఓడిలో ప్రయాణిస్తే అతిపెద్ద శిలాతోరణంగా పేరున్న అక్కమ్మ బిలాన్ని చూడవచ్చు. తెలంగాణ ప్రభుత్వం అక్కమదేవి గుహలను సోమశిల, ఈగలపెంట నుంచి చూపించే అవకాశం కల్పించింది. చుట్టూ ఎత్తయిన కొండలు, ఆకాశన్నంటే చుక్కల పర్వతం, జల సవ్వడుల మధ్య సాగే ప్రయాణం యాత్రికులకు మరిచిపోలేని అనుభూతినిస్తుంది.


