breaking news
Dr tamma kotireddy
-
స్పేషియల్ బడ్జెట్‌తోనే సుస్థిరాభివృద్ధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ చర్చలలో ద్రవ్యలోటు, మూలధన వ్యయం, రాబడి, సబ్సిడీలు, రుణానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత పెరిగింది. కానీ అభివృద్ధి చెందిన దేశాలలో జియో స్పేషియల్ డేటా అందుబాటులో ఉండి, అన్ని ప్రాంతాలకు అవసరమైన నిధులు శాస్త్రీయంగా నిర్ణయించబడుతుండగా, ఈ స్థితి భారత్‌లో పూర్తి స్థాయిలో కన్పించడం లేదు. సుస్థిరాభివృద్ధికి తోడ్పడే బడ్జెట్‌ను రూపొందించాలంటే ‘స్పేషియల్ బడ్జెటింగ్’ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. దేశంలోని వివిధ ప్రాంతాలలో సహజ వనరుల, మౌలిక సౌకర్యాల లభ్యత, భూవినియోగ మార్పులు, పర్యావరణం, వాతావరణ మార్పులను విశ్లేషించి నిధులు కేటాయించే ‘స్పేషియల్ ప్రణాళిక ఆధారిత బడ్జెట్’ రూపకల్పన అత్యవసరం. ఎందుకు అవసరం?దేశంలోని కొన్ని రాష్ట్రాలు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారిత బడ్జెట్ రూపకల్పనను పూర్తి స్థాయిలో అమలు చేయక పోయినా– గ్రామీణాభివృద్ధి, భూరికార్డులు, డిజాస్టర్ మేనేజ్మెంట్, మౌలిక సౌకర్యాలు, రవాణా, ప్రజారోగ్యం, పర్యావరణం, నీటి వన రుల యాజమాన్యంలో ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. స్పేషియల్ విశ్లేషణతో కూడిన బడ్జెట్‌ను రూపొందించినట్లయితే భౌగోళికంగా నిర్లక్ష్య పరచబడిన ప్రాంతాలకు అదనపు పెట్టుబడులు సమకూరి ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ ప్రభుత్వాలు రాజకీయంగా ప్రభావశీల నియోజకవర్గాలు, ఇప్పటికే మౌలిక సౌకర్యాలు లభ్యమయ్యే ప్రాంతాలకు అధిక నిధులు కేటాయించే పరిస్థితి ఉన్నందువలన సామాజిక, ఆర్థిక లక్ష్యాల సాధనలో భారత్ వెనుకబడి ఉంది. బిగ్ డేటా అనలటిక్స్, జి.పి.ఎస్, మెషిన్ లెర్నింగ్, డ్రోన్ సర్వీస్, రిమోట్ సెన్సింగ్,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ ఆధారిత జియోస్పేషియల్ ప్లాట్‌ఫామ్స్ లాంటి సాంకేతికతను అభివృద్ధి చెందిన దేశాలలో వినియోగిస్తుండటం వల్ల ఆధారాలతో కూడిన విధాన నిర్ణయాలను ఒడ్జెట్ రూప కల్పనలో తీసుకోగలుగుతున్నాయి. బడ్జెట్ వ్యయ నాణ్యత, సమర్థ తను పెంచే కీలక సంస్కరణగా స్పేషియల్ బడ్జెటింగ్ రూపొందింది. జనాభా లెక్కల గణాంకాలు, సామాజిక–ఆర్థిక సూచికలు, ఉపాధి గణాంకాలు, బహుమితీయ పేదరిక సూచీలను అనుసంధా నించడం ద్వారా పేదరిక తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు వివిధ ప్రాంతాలకు నిధులను సమర్థవంతంగా కేటాయించగలవు. వెనుక బడిన ప్రాంతాలకు అదనపు మద్దతునిచ్చే విషయంలో స్పేషియల్ విశ్లేషణ ప్రభుత్వాలకు ఉపకరిస్తుంది. పునరుత్పాదక శక్తి ప్రణాళిక ఆధారంగా శక్తి రంగానికి, మురికి వాడల గుర్తింపు ద్వారా హౌసింగ్ రంగానికి, పాఠశాలల అందు బాటు, మౌలిక వసతుల తేడాను బట్టి విద్యా రంగానికి, వివిధ జబ్బుల మ్యాపింగ్, ఆసుపత్రులు ఉన్న ప్రదేశాలను బట్టి ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపునకు ‘స్పేషియల్ విశ్లేషణ’ ఉపకరిస్తుంది. భూరికార్డుల యాజమాన్యం, వ్యవసాయం, పట్టణ ప్రణాళిక, నీటి వనరుల యాజమాన్యం, వరదల మ్యాపింగ్‌లో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ను తెలంగాణ ఉపయోగిస్తుండగా; పట్టణాభివృద్ధి, సహజ వనరుల పర్యవేక్షణలో కర్ణాటక; మౌలిక సౌకర్యాలు, గవర్నెన్స్‌లో మహారాష్ట్ర; మౌలిక వసతులు, అభివృద్ధి ప్రణాళిక విష యంలో ఉత్తరప్రదేశ్ ఈ సాంకేతికతను వినియోగిస్తున్నాయి. తక్కువగా ఉండటానికి కారకాలుఅనేక రాష్ట్రాల్లో జి.ఐ.ఎస్. ఆధారిత బడ్జెట్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలులో లేదు. కొన్ని శాఖలు తమ డేటాను ఇతర శాఖలతో పంచుకోక పోవడం వలన సమగ్ర డేటా సమన్వయం క్లిష్టంగా మారింది. కొన్ని రాష్ట్రాలలో డిజిటల్ భూరికార్డులు అందు బాటులో ఉండగా, కొన్నింట ఇప్పటికీ పాత రికార్డులే వినియోగంలో ఉన్నాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, అస్సాం, తమిళనాడు, బిహార్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల భూరికార్డుల డిజిటలైజేషన్ పాక్షికంగా ఉండి, ఇంకా పూర్తిస్థాయిలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సాధ్యం కావడం లేదు. ప్రణాళిక, ఆర్థిక శాఖల మధ్య సరైన సహకారం లేక పోవడం కూడా జి.ఐ.ఎస్.ను పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడానికి కారణం. ఆధునిక సాంకేతిక సాధనాలైన కృత్రిమ మేధ, రిమోట్ సెన్సింగ్, మెషిన్ లెర్నింగ్, శాటిలైట్ ఎనర్జీ, జీపీఎస్, డ్రోన్ సర్వేలు, బిగ్ డేటా అనలిటిక్స్ వినియోగంలో సమస్యల నెదుర్కో వడం వలన స్పేషియల్ విశ్లేషణ ఆధారిత బడ్జెట్ రూపకల్పన సాధ్యం కావడం లేదు. కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రమే నూతన సాంకేతికతకు సంబంధించిన సమన్వయం చేసిన కోర్సులను అందించడం, నైపు ణ్యత కల్గిన శ్రామిక శక్తి తక్కువగా ఉండటం అకడమిక్ ప్రాజెక్టులను రూపొందించడానికే ఈ సాంకేతికత పరిమితమై స్థానిక గవర్నెన్స్ సమస్యల నివారణపై దృష్టి కేంద్రీకరించడం లాంటి అంశాలు స్పేషియల్ బడ్జెటింగ్ అమలుకు అవరోధంగా నిలిచాయి. ద రోడ్ అహెడ్దేశంలోని సుమారు 806 జిల్లాలలో 112 జిల్లాలను ఆకాంక్ష జిల్లాలుగా, 329 జిల్లాలలోని 513 బ్లాక్‌లను ఆకాంక్ష బ్లాక్‌లుగా గుర్తించడం జరిగింది. ఆర్థిక సమ్మిళితం, పౌష్టికాహారం, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక సౌకర్యాల లభ్యతలు, పేదరికం ఆధారంగా వెనుకబడిన జిల్లాలను గుర్తించడం జరిగింది. బిహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని జిల్లాలలో బ్యాంకింగ్ సౌకర్యాల అందుబాటు తక్కువగా ఉండటం, నీటి పారుదల, డిజిటల్ కనెక్టివిటీ లాంటి సమస్యలు ఉన్నాయి. దేశంలోని వివిధ జిల్లాలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి నివారణకు బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చే క్రమంలో స్పేషియల్ విశ్లేషణ అవసరం.సామాజిక, ఆర్థిక పర్యావరణ గణాంకాలతో భౌగోళిక సమా చారాన్ని అనుసంధానపరచడం ద్వారా ప్రభుత్వాలు వనరుల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించగలవు. స్పేషియల్ బడ్జెటింగ్‌ను పూర్తిగా అమలు చేయగలిగినపుడు అన్ని డిపార్ట్మెంట్స్లో ఒకే విధ మైన జియోస్పేషియల్ డేటాప్లాట్ఫామ్ సాధ్యమై అధిక నాణ్యతతో కూడిన స్పేషియల్ డేటాసెట్ లభ్యమవుతుంది. తద్వారా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య పటిష్టమైన సహకారం పెరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాలలో మాదిరి ఆధునిక సాంకేతికత వినియోగంలో భాగంగా కార్యక్రమాలను సమన్వయపరచినట్లయితే సమీప భవిష్యత్తులో స్పేషియల్ ఆధారిత బడ్జెట్ రూపకల్పన సాధ్యమై సుస్థిరాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది.డా‘‘ తమ్మా కోటిరెడ్డివ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు -
స్థానిక సంస్థల విధులు
భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థలను పంచాయతీరాజ్ సంస్థలు అంటారు. భారత్‌లో రాష్ర్ట ప్రభుత్వాలే ప్రత్యేక చట్టాల ద్వారా స్థానిక సంస్థలను ఏర్పాటు చేస్తాయి. 1863లో మద్రాస్ శాసనసభ స్థానిక సంస్థలకు సంబంధించి తొలి శాసనం చేసింది. 1884లో లోకల్ బోర్డ్స యాక్ట్‌ను రూపొందించారు. ఈ చట్టం ద్వారా గ్రామ పంచాయతీలు, తాలూకా బోర్డలు, జిల్లా బోర్డులు అనే మూడంచెల్లో స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారు. 1909లో ఏర్పడిన రాయల్ కమిషన్ మూడంచెల స్థానిక సంస్థల ఏర్పాటును సిఫార్సు చేయడంతో 1920లో మద్రాసు గ్రామ పంచాయతీ చట్టం చేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి ఎన్. గోపాల స్వామి అయ్యర్ 1928లో ఒక బిల్లును రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ బిల్లును సమర్థించకుండా మద్రాస్ గ్రామ పంచాయతీ చట్టాన్ని రద్దు చేసి పంచాయతీ సంస్థలను మద్రాసు లోకల్ బోర్డు చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది. స్వాతంత్య్రానంతరం 1950లో మద్రాస్ గ్రామ పంచాయతీ చట్టం అమల్లోకి వచ్చింది. నిజాంపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో 1940లో తొలిసారిగా గ్రామ పంచాయతీ చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారం 442 గ్రామ పంచాయతీలు స్థానిక స్వపరిపాలన సంస్థలుగా ఏర్పడ్డాయి. ఈ చట్టాన్ని రద్దు చేస్తూ హైదరాబాద్ పంచాయతీ చట్టం 1951లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం స్థానంలో 1956లో తీసుకువచ్చిన హైదరాబాద్ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం ఆదాయం శాంతి భద్రతలు, న్యాయవిచారణ, అభివృద్ధికి సంబంధించిన విధులను గ్రామపంచాయతీలకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో 1964లో గ్రామపంచాయతీల చట్టం ఏర్పడింది. ప్రజాస్వామ్య పరిపాలనా వికేంద్రీకరణను పటిష్టపర్చే క్రమంలో 1986లో మండల ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రణాళికా అభివృద్ధి సమీక్ష మండళ్ల చట్టాన్ని రూపొందించారు. కానీ 1994 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండల పరిషత్ నిర్మాణం, నిర్వహణలో మార్పులు ప్రవేశ పెడుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీ యాక్ట్ 1994ను తీసుకొచ్చింది. 1964 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం గ్రామ వార్షిక ఆదాయం రూ. 10,000 కంటే ఎక్కువగా ఉంటే వాటిని నోటిఫైడ్ పంచాయతీలుగా వ్యవహరించారు. నోటిఫైడ్ పంచాయతీలను గ్రూప్-1, గ్రూప్-2 పంచాయతీలుగా విభజించారు. గ్రూప్-1లో రూ. 60,000 వార్షికాదాయం దాటిన పంచాయతీలు, గ్రూప్-2లో రూ. 40,000 నుంచి రూ. 60,000 వార్షికాదాయం లభించే పంచాయతీలు ఉంటాయి. గ్రామ పంచాయతీల విధులు ఙ్ట్చఛగ్రామ పంచాయతీల అభివృద్ధికి వార్షిక ప్రణాళికలు రూపొందించడం ఙ్ట్చఛగ్రామ పంచాయతీ వార్షిక బడ్జెట్ రూపొందించడం {పభుత్వ ఆస్తులకు సంబంధించి ఆక్రమణలు తొలగించడం ఆరోగ్య సదుపాయాల కల్పన, అంటువ్యాధుల నివారణ, పారిశుధ్య నిర్వహణ. పంచాయతీల పరిధిలో నియమబద్ధ మార్కెట్ల నిర్వహణ మౌలిక సౌకర్యాల కల్పన, వాటి నిర్వహణ భూ సంస్కరణల అమలు, భూమిశిస్తు వసూలు {పాథమిక పాఠశాలల స్థాపన, నిర్వహణ {V>-Ð]l*-°Mి సంబంధించిన గణాంకాలను నిర్వహించడం పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యాంశాలు 1687- మద్రాస్ మున్సిపల్ బాడీ ఏర్పాటుకు సంబంధించి రాయల్ చార్టర్ 1857- విత్త వికేంద్రీకరణను ఆర్థిక సంక్షోభం నివారణకు పరిష్కారంగా భావించడం. 1870 - బెంగాల్ చౌకిదారీ చట్టం 1882 - లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్‌కు సంబంధించి లార్డరిప్పన్ తీర్మానం 1907 - వికేంద్రీకరణకు సంబంధించి రాయల్ కమిషన్ ఏర్పాటు 1948 - గ్రామ్ స్వరాజ్‌కు సంబంధించి గాంధీ, అంబేద్కర్ మధ్య చర్చలు 1957- బల్వంతరాయ్ మెహతా కమిషన్- జిల్లా, బ్లాక్, గ్రామస్థాయిలో పంచాయతీ నిర్మాణానికి సిఫార్సు, ప్రతి ఐదేళ్లకు ఎన్నికైన లోకల్ బాడీలు, బ్లాక్ స్థాయిలో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన సిఫార్సులు 1963- కె. సంతానం కమిటీ - రాష్ర్ట పంచాయతీరాజ్ ఫైనాన్స కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి సిఫార్సు. 1978- అశోక్ మెహతా కమిటీ - జిల్లా, బ్లాక్ స్థాయిలో రెండంచెల పంచాయతీ వ్యవస్థకు సంబంధించిన సిఫార్సు 1985- జీవీకే. రావ్ కమిటీ - బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయాలు, ప్రణాళికల రూపకల్పన, గ్రామీణాభివృద్ధి కార్య క్రమాల అమలు, పర్యవేక్షణకు సంబంధించిన సిఫార్సులు. 1986 - ఎల్ఎం. సింఘ్వీ కమిటీ -ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు గ్రామసభ (విలేజ్ అసెంబ్లీ) బేస్‌గా ఉండాలని సిఫార్సు. 1993 - భారత రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ 1996 - ట్రైబల్ కమ్యూనిటీలకు ఐదో షెడ్యూల్డ్ ఏరియా కింద సెల్ఫ్ గవర్నమెంట్ అధికారాలు 2004 - పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు 2009 - కేంద్ర రెవెన్యూ డివిజబుల్ పూల్‌లో పంచాయతీల వాటాను పదమూడో ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. మండల ప్రజాపరిషత్ వనరులు - విధులు గ్రామ పంచాయతీకి, జిల్లా పరిషత్తుకు మధ్య ఉన్న స్థానిక సంస్థ పంచాయతీ సమితి. ఆంధ్రప్రదేశ్‌లో 1983లో పంచాయతీరాజ్ సంస్థల నిర్మాణ క్రమం, రెవెన్యూ పాలనలో కొన్ని సంస్కరణలు ప్రవేశ పెట్టారు. 1959లో తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తుల చట్టాన్ని తొలగించి ఆంధ్రప్రదేశ్ మండల ప్రజాపరిషత్తులు, జిల్లా ప్రజాపరిషత్తులు, జిల్లా ప్రణాళిక అభివృద్ధి సమీక్ష మండళ్ల చట్టం 1986ను ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో రాష్ర్టంలోని మూడంచెల పంచాయతీరాజ్ నిర్మాణ క్రమంలోని బ్లాకు పంచాయతీల స్థానంలో మండల ప్రజాపరిషత్‌లు, జిల్లా పరిషత్తుల స్థానంలో జిల్లా ప్రజాపరిషత్తులు ఏర్పాటు చేశారు. రుసుములు, జరిమానాల ద్వారా లభించే వనరులు, స్టాంప్ డ్యూటీపై సర్చార్జ్జీలో వాటా, భూములపై గ్రామ పంచాయతీ విధించే సెస్సుపై లెవీ వసూళ్లు, కొన్ని ప్రత్యేక పథకాల అమలుకు బ్లాకు బడ్జెట్ నుంచి నిధులు, రాష్ర్ట ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని సహాయక నిధులు మండల పరిషత్తుకు ఆదాయం. విధులు: అభివృద్ధి ప్రణాళికల తయారీతోపాటు తమ పరిధిలోని గ్రామ పంచాయతీల పర్యవేక్షణ వ్యవసాయ రంగం అభివృద్ధి, గ్రామీణ అడవుల పెంపకం. {పాథమిక విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, సమాచారం మొదలైన విషయాలకు సంబంధించి ప్రత్యేక పాలనా బాధ్యతలు. చిన్న నీటిపారుదల సదుపాయాల కల్పన, రక్షిత మంచినీటి సరఫరా {పాథమిక ఆరోగ్య కేంద్రాలు, మాతా శిశు సంక్షేమ కేంద్రాల స్థాపన జిల్లా ప్రజాపరిషత్తు వనరులు - విధులు రాష్ర్ట ప్రభుత్వం నుంచి లభించే రాబడులు, రుణాలు, సహాయక నిధులు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణకు లభించే సహాయక నిధులు, బదిలీ అయ్యే పన్నుల్లో భాగం, కొన్ని విధుల నిర్వహణకు ప్రత్యేకంగా మంజూరు చేసిన మొత్తం జిల్లా పరిషత్తుకు ఆదాయ వనరులుగా ఉంటాయి. విధులు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అందించే ఆర్థిక నిధులను మండల పరిషత్తుల మధ్య పంపిణీ చేయడం. మౌలిక సౌకర్యాల (విద్య, ఆరోగ్యం, రోడ్డు రవాణా, పాఠశాలల నిర్మాణం) కల్పన. మండల పరిషత్తుల వార్షిక బడ్జెట్ల పరిశీలన జిల్లా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం ఙ్ట్చఛగ్రామ పంచాయతీ, మండల ప్రజాపరిషత్తుల పర్యవేక్షణ. ముఖ్యమైన ప్రశ్నలు 1. పన్నులు, డ్యూటీలు, రుసుములు మొదలైన మార్గాల ద్వారా రాష్ర్ట ప్రభుత్వానికి వచ్చే నికర ఆదాయంలో పంచాయతీరాజ్ సంస్థల వాటాను నిర్ధారించేది ? రాష్ర్ట ఆర్థిక సంఘం 2. అసోం పంచాయతీ సమితిని ఏ పేరుతో వ్యవహరిస్తారు? జనపదీయ పంచాయతీ 3. ‘ఆంధ్రప్రదేశ్ మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్, జిల్లా ప్రణాళిక అభివృద్ధి సమీక్ష మండళ్ల చట్టం’ ఎప్పుడు తీసుకొచ్చారు? 1986 4. బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచనల మేరకు బ్లాక్ స్థాయిలో ఉండే స్థానిక పాలన సంస్థ? పంచాయతీ సమితి 5.ఙ్ట్చఛగ్రామ పంచాయతీలను నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీలుగా ఏ చట్టం ప్రకారం వర్గీకరించారు? 1964 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం 6.ఙ్ట్చఛగ్రామ పంచాయతీలు, తాలూకా బోర్డులు, జిల్లా బోర్డులు అనే మూడంచెల్లో స్థానిక సంస్థల ఏర్పాటును ఉద్దేశించిన చట్టం? లోకల్ బోర్డ్స యాక్ట్ 7. మద్రాస్ గ్రామ పంచాయతీ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 8. పంచాయతీ సంస్థల పనితీరులో లోపాలను సవరిస్తూ స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి బిల్లును రూపొందించినవారు? ఎన్. గోపాల స్వామి అయ్యర్ 9. భారత్‌లో స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏమని పిలుస్తారు? పంచాయతీ రాజ్ సంస్థలు 10. హైదరాబాద్ సంస్థానంలో గ్రామ పంచాయతీ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1940 11. {V>-Ò$× పునర్నిర్మాణం ఉద్దేశంగా ప్రారంభించిన పథకం? సమాజ అభివృద్ధి పథకం 12. టోల్‌ట్యాక్స్ అంటే? గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చే వాహనాలపై విధించే పన్ను 13. ఇంటిపై విధించే పన్నును బట్టి దానిపై సర్‌చార్జీగా విధించేది? లైబ్రరీ సెస్సు 14. ఇండియన్ స్టాంప్ యాక్ట్‌ను ఎప్పుడు తీసుకొచ్చారు? 1899 15. లోకల్ ఫండ్ సెస్ అంటే? రెండో సప్లిమెంటరీ లెవీ అయిన భూమి సెస్సు 16. ఉత్తర ప్రదేశ్‌లో పంచాయతీ సమితిని ఏమని వ్యవహరిస్తారు? క్షేత్ర సమితి 17. రాష్ర్ట ఆర్థిక సంఘం కాల పరిమితి? ఐదేళ్లు 18. మొదటి రాష్ర్ట ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పాటైంది? జూన్ 22, 1994 19. రాష్ర్ట ఆర్థిక సంఘం పంచాయతీలను ఎన్ని తరగతులుగా వర్గీకరించింది? నాలుగు 20. రాష్ర్ట పంచాయతీ రాజ్ ఫైనాన్స కార్పొరేషన్ ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ? సంతానం కమిటీ 21. {పజాస్వామ్య వికేంద్రీకరణకు గ్రామ సభ ప్రాతిపదికగా ఉండాలని సిఫార్సు చేసింది? ఎల్.ఎం.సింఘ్వీ


