స్థానిక సంస్థల విధులు
రాష్ర్ట పంచాయతీ రాజ్ ఫైనాన్‌స కార్పొరేషన్ ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ? సంతానం కమిటీ
భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థలను పంచాయతీరాజ్ సంస్థలు అంటారు. భారత్‌లో రాష్ర్ట ప్రభుత్వాలే ప్రత్యేక చట్టాల ద్వారా స్థానిక సంస్థలను ఏర్పాటు చేస్తాయి. 1863లో మద్రాస్ శాసనసభ స్థానిక సంస్థలకు సంబంధించి తొలి శాసనం చేసింది. 1884లో లోకల్ బోర్‌డ్స యాక్ట్‌ను రూపొందించారు. ఈ చట్టం ద్వారా గ్రామ పంచాయతీలు, తాలూకా బోర్‌డలు, జిల్లా బోర్డులు అనే మూడంచెల్లో స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారు.
1909లో ఏర్పడిన రాయల్ కమిషన్ మూడంచెల స్థానిక సంస్థల ఏర్పాటును సిఫార్సు చేయడంతో 1920లో మద్రాసు గ్రామ పంచాయతీ చట్టం చేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి ఎన్. గోపాల స్వామి అయ్యర్ 1928లో ఒక బిల్లును రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ బిల్లును సమర్థించకుండా మద్రాస్ గ్రామ పంచాయతీ చట్టాన్ని రద్దు చేసి పంచాయతీ సంస్థలను మద్రాసు లోకల్ బోర్డు చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది.
స్వాతంత్య్రానంతరం 1950లో మద్రాస్ గ్రామ పంచాయతీ చట్టం అమల్లోకి వచ్చింది. నిజాంపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో 1940లో తొలిసారిగా గ్రామ పంచాయతీ చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారం 442 గ్రామ పంచాయతీలు స్థానిక స్వపరిపాలన సంస్థలుగా ఏర్పడ్డాయి. ఈ చట్టాన్ని రద్దు చేస్తూ హైదరాబాద్ పంచాయతీ చట్టం 1951లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం స్థానంలో 1956లో తీసుకువచ్చిన హైదరాబాద్ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం ఆదాయం శాంతి భద్రతలు, న్యాయవిచారణ, అభివృద్ధికి సంబంధించిన విధులను గ్రామపంచాయతీలకు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 1964లో గ్రామపంచాయతీల చట్టం ఏర్పడింది. ప్రజాస్వామ్య పరిపాలనా వికేంద్రీకరణను పటిష్టపర్చే క్రమంలో 1986లో మండల ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రణాళికా అభివృద్ధి సమీక్ష మండళ్ల చట్టాన్ని రూపొందించారు. కానీ 1994 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండల పరిషత్ నిర్మాణం, నిర్వహణలో మార్పులు ప్రవేశ పెడుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీ యాక్ట్ 1994ను తీసుకొచ్చింది. 1964 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం గ్రామ వార్షిక ఆదాయం రూ. 10,000 కంటే ఎక్కువగా ఉంటే వాటిని నోటిఫైడ్ పంచాయతీలుగా వ్యవహరించారు. నోటిఫైడ్ పంచాయతీలను గ్రూప్-1, గ్రూప్-2 పంచాయతీలుగా విభజించారు. గ్రూప్-1లో రూ. 60,000 వార్షికాదాయం దాటిన పంచాయతీలు, గ్రూప్-2లో రూ. 40,000 నుంచి రూ. 60,000 వార్షికాదాయం లభించే పంచాయతీలు ఉంటాయి.
గ్రామ పంచాయతీల విధులు
ఙ్ట్చఛగ్రామ పంచాయతీల అభివృద్ధికి వార్షిక ప్రణాళికలు రూపొందించడం
ఙ్ట్చఛగ్రామ పంచాయతీ వార్షిక బడ్జెట్ రూపొందించడం
{పభుత్వ ఆస్తులకు సంబంధించి ఆక్రమణలు తొలగించడం
ఆరోగ్య సదుపాయాల కల్పన, అంటువ్యాధుల నివారణ, పారిశుధ్య నిర్వహణ.
పంచాయతీల పరిధిలో నియమబద్ధ మార్కెట్ల నిర్వహణ
మౌలిక సౌకర్యాల కల్పన, వాటి నిర్వహణ
భూ సంస్కరణల అమలు, భూమిశిస్తు వసూలు
{పాథమిక పాఠశాలల స్థాపన, నిర్వహణ
{V>-Ð]l*-°Mి సంబంధించిన గణాంకాలను నిర్వహించడం
పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యాంశాలు
1687- మద్రాస్ మున్సిపల్ బాడీ ఏర్పాటుకు సంబంధించి రాయల్ చార్టర్
1857- విత్త వికేంద్రీకరణను ఆర్థిక సంక్షోభం నివారణకు పరిష్కారంగా భావించడం.
1870 - బెంగాల్ చౌకిదారీ చట్టం
1882 - లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్‌కు సంబంధించి లార్‌డరిప్పన్ తీర్మానం
1907 - వికేంద్రీకరణకు సంబంధించి రాయల్ కమిషన్ ఏర్పాటు
1948 - గ్రామ్ స్వరాజ్‌కు సంబంధించి గాంధీ, అంబేద్కర్ మధ్య చర్చలు
1957- బల్వంతరాయ్ మెహతా కమిషన్- జిల్లా, బ్లాక్, గ్రామస్థాయిలో పంచాయతీ నిర్మాణానికి సిఫార్సు, ప్రతి ఐదేళ్లకు ఎన్నికైన లోకల్ బాడీలు, బ్లాక్ స్థాయిలో బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన సిఫార్సులు
1963- కె. సంతానం కమిటీ - రాష్ర్ట పంచాయతీరాజ్ ఫైనాన్‌స కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి సిఫార్సు.
1978- అశోక్ మెహతా కమిటీ - జిల్లా, బ్లాక్ స్థాయిలో రెండంచెల పంచాయతీ వ్యవస్థకు సంబంధించిన సిఫార్సు
1985- జీవీకే. రావ్ కమిటీ - బ్లాక్ డెవలప్‌మెంట్ కార్యాలయాలు, ప్రణాళికల రూపకల్పన, గ్రామీణాభివృద్ధి కార్య క్రమాల అమలు, పర్యవేక్షణకు సంబంధించిన సిఫార్సులు.
1986 - ఎల్‌ఎం. సింఘ్వీ కమిటీ -ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు గ్రామసభ (విలేజ్ అసెంబ్లీ) బేస్‌గా ఉండాలని సిఫార్సు.
1993 - భారత రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ
1996 - ట్రైబల్ కమ్యూనిటీలకు ఐదో షెడ్యూల్డ్ ఏరియా కింద సెల్ఫ్ గవర్నమెంట్ అధికారాలు
2004 - పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు
2009 - కేంద్ర రెవెన్యూ డివిజబుల్ పూల్‌లో పంచాయతీల వాటాను పదమూడో ఆర్థిక సంఘం సిఫారసు చేసింది.
మండల ప్రజాపరిషత్ వనరులు - విధులు
గ్రామ పంచాయతీకి, జిల్లా పరిషత్తుకు మధ్య ఉన్న స్థానిక సంస్థ పంచాయతీ సమితి. ఆంధ్రప్రదేశ్‌లో 1983లో పంచాయతీరాజ్ సంస్థల నిర్మాణ క్రమం, రెవెన్యూ పాలనలో కొన్ని సంస్కరణలు ప్రవేశ పెట్టారు. 1959లో తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తుల చట్టాన్ని తొలగించి ఆంధ్రప్రదేశ్ మండల ప్రజాపరిషత్తులు, జిల్లా ప్రజాపరిషత్తులు, జిల్లా ప్రణాళిక అభివృద్ధి సమీక్ష మండళ్ల చట్టం 1986ను ప్రవేశ పెట్టారు.
ఈ నేపథ్యంలో రాష్ర్టంలోని మూడంచెల పంచాయతీరాజ్ నిర్మాణ క్రమంలోని బ్లాకు పంచాయతీల స్థానంలో మండల ప్రజాపరిషత్‌లు, జిల్లా పరిషత్తుల స్థానంలో జిల్లా ప్రజాపరిషత్తులు ఏర్పాటు చేశారు. రుసుములు, జరిమానాల ద్వారా లభించే వనరులు, స్టాంప్ డ్యూటీపై సర్‌చార్జ్జీలో వాటా, భూములపై గ్రామ పంచాయతీ విధించే సెస్సుపై లెవీ వసూళ్లు, కొన్ని ప్రత్యేక పథకాల అమలుకు బ్లాకు బడ్జెట్ నుంచి నిధులు, రాష్ర్ట ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని సహాయక నిధులు మండల పరిషత్తుకు ఆదాయం.
విధులు:
అభివృద్ధి ప్రణాళికల తయారీతోపాటు తమ పరిధిలోని గ్రామ పంచాయతీల పర్యవేక్షణ
వ్యవసాయ రంగం అభివృద్ధి, గ్రామీణ అడవుల పెంపకం.
{పాథమిక విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, సమాచారం మొదలైన విషయాలకు సంబంధించి ప్రత్యేక పాలనా బాధ్యతలు.
చిన్న నీటిపారుదల సదుపాయాల కల్పన, రక్షిత మంచినీటి సరఫరా
{పాథమిక ఆరోగ్య కేంద్రాలు, మాతా శిశు సంక్షేమ కేంద్రాల స్థాపన
జిల్లా ప్రజాపరిషత్తు వనరులు - విధులు
రాష్ర్ట ప్రభుత్వం నుంచి లభించే రాబడులు, రుణాలు, సహాయక నిధులు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణకు లభించే సహాయక నిధులు, బదిలీ అయ్యే పన్నుల్లో భాగం, కొన్ని విధుల నిర్వహణకు ప్రత్యేకంగా మంజూరు చేసిన మొత్తం జిల్లా పరిషత్తుకు ఆదాయ వనరులుగా ఉంటాయి.
విధులు
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అందించే ఆర్థిక నిధులను మండల పరిషత్తుల మధ్య పంపిణీ చేయడం.
మౌలిక సౌకర్యాల (విద్య, ఆరోగ్యం, రోడ్డు రవాణా, పాఠశాలల నిర్మాణం) కల్పన.
మండల పరిషత్తుల వార్షిక బడ్జెట్ల పరిశీలన
జిల్లా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం
ఙ్ట్చఛగ్రామ పంచాయతీ, మండల ప్రజాపరిషత్తుల పర్యవేక్షణ.
ముఖ్యమైన ప్రశ్నలు
1. పన్నులు, డ్యూటీలు, రుసుములు మొదలైన మార్గాల ద్వారా రాష్ర్ట ప్రభుత్వానికి వచ్చే నికర ఆదాయంలో పంచాయతీరాజ్ సంస్థల వాటాను నిర్ధారించేది ?
రాష్ర్ట ఆర్థిక సంఘం
2. అసోం పంచాయతీ సమితిని ఏ పేరుతో వ్యవహరిస్తారు?
జనపదీయ పంచాయతీ
3. ‘ఆంధ్రప్రదేశ్ మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్, జిల్లా ప్రణాళిక అభివృద్ధి సమీక్ష మండళ్ల చట్టం’ ఎప్పుడు తీసుకొచ్చారు?
1986
4. బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచనల మేరకు బ్లాక్ స్థాయిలో ఉండే స్థానిక పాలన సంస్థ?
పంచాయతీ సమితి
5.ఙ్ట్చఛగ్రామ పంచాయతీలను నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీలుగా ఏ చట్టం ప్రకారం వర్గీకరించారు?
1964 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం
6.ఙ్ట్చఛగ్రామ పంచాయతీలు, తాలూకా బోర్డులు, జిల్లా బోర్డులు అనే మూడంచెల్లో స్థానిక సంస్థల ఏర్పాటును ఉద్దేశించిన చట్టం?
లోకల్ బోర్‌డ్స యాక్ట్
7. మద్రాస్ గ్రామ పంచాయతీ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
1950
8. పంచాయతీ సంస్థల పనితీరులో లోపాలను సవరిస్తూ స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి బిల్లును రూపొందించినవారు?
ఎన్. గోపాల స్వామి అయ్యర్
9. భారత్‌లో స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏమని పిలుస్తారు?
పంచాయతీ రాజ్ సంస్థలు
10. హైదరాబాద్ సంస్థానంలో గ్రామ పంచాయతీ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1940
11. {V>-Ò$× పునర్నిర్మాణం ఉద్దేశంగా ప్రారంభించిన పథకం?
సమాజ అభివృద్ధి పథకం
12. టోల్‌ట్యాక్స్ అంటే?
గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చే వాహనాలపై విధించే పన్ను
13. ఇంటిపై విధించే పన్నును బట్టి దానిపై సర్‌చార్జీగా విధించేది?
లైబ్రరీ సెస్సు
14. ఇండియన్ స్టాంప్ యాక్ట్‌ను ఎప్పుడు తీసుకొచ్చారు?
1899
15. లోకల్ ఫండ్ సెస్ అంటే?
రెండో సప్లిమెంటరీ లెవీ అయిన భూమి సెస్సు
16. ఉత్తర ప్రదేశ్‌లో పంచాయతీ సమితిని ఏమని వ్యవహరిస్తారు?
క్షేత్ర సమితి
17. రాష్ర్ట ఆర్థిక సంఘం కాల పరిమితి?
ఐదేళ్లు
18. మొదటి రాష్ర్ట ఆర్థిక సంఘం ఎప్పుడు ఏర్పాటైంది?
జూన్ 22, 1994
19. రాష్ర్ట ఆర్థిక సంఘం పంచాయతీలను ఎన్ని తరగతులుగా వర్గీకరించింది?
నాలుగు
20. రాష్ర్ట పంచాయతీ రాజ్ ఫైనాన్‌స కార్పొరేషన్ ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ?
సంతానం కమిటీ
21. {పజాస్వామ్య వికేంద్రీకరణకు గ్రామ సభ ప్రాతిపదికగా ఉండాలని సిఫార్సు చేసింది?
ఎల్.ఎం.సింఘ్వీ


