breaking news
Dr Rajkumar
-
వణికించిన భీమన అమావాస్య.. రాజ్‌కుమార్ కిడ్నాప్ జరిగిందిలా..
బెంగళూరు: నిన్న ఆగస్టు 12(బుధవారం) అమావాస్య. శ్రావణమాసంలో వచ్చే ఈ అమావాస్యను కన్నడనాట భీమన అమావాస్యగా పిలుస్తుంటారు. ఈ రోజు కన్నడనాట కలకలం చెలరేగే ఘటన చోటుచేసుకుంది... జూలై 30, 2000 వ సంవత్సరం.. రాష్ట్రమంతా భీమన అమావాస్య వేడుకల్లో నిమగ్నమై ఉన్న వేళ, కన్నడ చలనచిత్ర రత్నం, అభినవ భార్గవ డాక్టర్ రాజ్‌కుమార్ కిడ్నాప్ ఉదంతం కర్ణాటక చరిత్రలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. గజనూరులోని తన ఫామ్‌హౌస్‌లో బోరు బావి పనులు చూసుకునేందుకు వెళ్లిన రాజ్‌కుమార్‌ను అడవి గజదొంగ వీరప్పన్ బందీగా చేసుకున్నాడు. రాత్రి 9:30 గంటల సమయంలో ఆయుధాలతో వచ్చిన దుండగులు, రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేశారు.అతని భార్య పార్వతమ్మకు ఒక ఆడియో క్యాసెట్‌ను అప్పగించి, ‘అయ్యా, పదండి’ అంటూ ఆయన్ని అడవుల్లోకి తీసుకెళ్లారు. ఈ ఘటనతో కర్ణాటక ఒక్కసారిగా స్తంభించిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ నివాసానికి చేరుకున్న పార్వతమ్మ, ఆ క్యాసెట్ అందజేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఆ తర్వాత మొదలైన 108 రోజుల కిడ్నాప్ ఉదంతం, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలకు అతిపెద్ద సవాలుగా మారింది. జర్నలిస్టు ఆర్ఆర్ గోపాల్ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ, అడవిలోకి పలుమార్లు వెళ్లి చర్చలు జరిపారు. రాజ్‌కుమార్ అపహరణతో కర్ణాటకలో వ్యాపారాలు, రవాణా వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. అభిమానులు రోడ్లపైకి వచ్చి కన్నీరు మున్నీరయ్యారు.అయితే అడవిలో బందీగా ఉన్న సమయంలో కూడా రాజ్‌కుమార్ చాలా ప్రశాంతంగా యోగా, ప్రాణాయామం చేసుకునేవారని, ఆయన నిబ్బరం వీరప్పన్‌ను సైతం ఆకట్టుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. సుదీర్ఘ చర్చలు, ఉత్కంఠభరిత పరిణామాల అనంతరం, 108 రోజుల తర్వాత నవంబర్ 15, 2000న రాజ్‌కుమార్ క్షేమంగా విడుదలయ్యారు. ఆయన రాకతో కర్ణాటక ప్రజల్లో ఆనందోత్సాహాలు నిండాయి. ఈ ఘటనపై 2013లో ‘అత్తహాస’ అనే సినిమా కూడా వచ్చింది. ఇప్పటికీ భీమన అమావాస్య వచ్చిందంటే, ఆ 108 రోజుల ఆందోళన, ప్రజల ఆవేదన అందరికీ గుర్తుకు వస్తుంది. -
కన్నడ స్టార్ రాజ్‌కుమార్ కిడ్నాప్‌పై సినిమా
కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ (Dr. Rajkumar) జీవితంలోని కీలక అంశమైన కిడ్నాప్ నేపథ్యంలో ఓ సినిమా రానుంది. రాజ్‌కుమార్‌ని వీరప్పన్ (Veerappan) కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే! అశోక్, ముని, నాగేశ్ ప్రధాన పాత్రధారులుగా కట్టా శ్రీకర్ ప్రసాద్ దర్శకత్వంలో వి.లీలా మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అక్టోబరులో షూటింగ్ ప్రారంభం కానుంది. శ్రీకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘రాజ్‌కుమార్‌గారిని వీరప్పన్ కిడ్నాప్ చేయడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. అప్పటి కిడ్నాప్ కోణంలో పలు అంశాలను ఈ చిత్రంలో చర్చించబోతున్నాం. ఈ చిత్రానికి ప్రతిభగల టెక్నీషియన్లు పని చేయనున్నారు. పూర్తి వివరాలు దసరా తర్వాత వెల్లడిస్తాం’’ అని చెప్పారు. అసలేం జరిగింది?కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తండ్రి రాజ్‌కుమార్‌ను 2000వ సంవత్సరం జూలై 30న వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. రాజ్‌కుమార్‌తో పాటు ఆయన అల్లుడు గోవింద్రాజ్, బంధువు నగేష్, అసిస్టెంట్ దర్శకుడు నాగప్పను కూడా కిడ్నాప్ చేశాడు. ఆ సమయంలో తమిళనాడులో కరుణానిధి అధికారంలో ఉన్నారు. వీరప్పన్.. రాజ్‌కుమార్‌ను టార్గెట్ చేశాడని 1999లోనే సిట్ (వీరప్పన్‌ను పట్టుకోవడం కోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం) ప్రభుత్వాన్ని హెచ్చరిచింది.అయినా నటుడికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం వీరప్పన్‌తో పలుమార్లు చర్చలు జరిపింది. అలా 108 రోజులపాటు రాజ్‌కుమార్‌ను బంధించిన వీరప్పన్ 2000 సంవత్సరం నవంబర్ 15న ఆయన్ను వదిలేశాడు. చర్చలు జరిపినా వినని వీరప్పన్.. సడన్‌గా రాజ్‌కుమార్‌ను విడుదల చేయడం మిస్టరీగానే మిగిలిపోయింది. 2004లో సిట్ బృందం చేతిలో వీరప్పన్ మృతి చెందగా, 2006 ఏప్రిల్ 12న రాజ్‌కుమార్ తుదిశ్వాస వదిలారు.చదవండి: బిగ్‌బాస్: 5 నెలల పాప.. అయితే గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా? -
'ఆయనతో సినీరంగానికి నష్టం'
బొమ్మనహళ్లి: కన్నడ సినిమా రంగం నిలబడటానికి డాక్టర్ రాజ్‌కుమార్ ఎంతో కృషి చేశారు. అయితే ఇటీవల మరో సీనియర్ నటుడు ఒకరు సినిమా రంగాన్ని మొత్తం పాడు చేస్తున్నారు. ఆయనెవరు, విషయం ఏమిటన్నది మరోసారి మీడియా ముందు చెబుతానని కన్నడ సినిమా హాస్యనటుడు బుల్లెట్ ప్రకాశ్ అన్నారు. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కన్నడ సినిమా రంగంలో నటుల మధ్య విభేదాలున్నాయని, కొంతమంది గ్రూపులుగా ఏర్పడి సినిమా రంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. -
బ్రిటిష్ లైబ్రరీలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ జీవిత చరిత్ర!
లండన్: ప్రఖ్యాత కన్నడ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ జీవిత ఆధారంగా ఇంగ్లీష్ భాషలో రచించిన పుస్తకాన్ని లండన్ లోని బ్రిటిష్ లైబ్రరీకి అందించారు. బ్రిటిష్ లైబ్రరీలోని ఆసియా, ఆఫ్రికా స్టడీస్ విభాగాధిపతి డాక్టర్ కేథరిన్ ఈగ్లేటన్ కు అందించిన జర్నలిస్ట్ మంజునాథ్, ఆయన సతీమణి, నటి డాక్టర్ సౌమ్య మంజునాథ్ చవన్ తెలిపారు. గత సంవత్సరంలో రాజ్ కుమార్ జన్మదిన సందర్భంగా 'డాక్టర్ రాజ్ కుమార్: ది పర్సన్ ఆఫ్ బిహైండ్ పర్సనాలిటీ' అనే పుస్తకాన్ని బెంగుళూరులో ఆయన కుమారులు పునీత్ రాజ్ కుమార్, ప్రకృతి ఎన్ బన్వాసీలు అధికారికంగా విడుదల చేశారు. నిరాడంబరతకు, మానవీయ విలువలకు కట్టుబడిన వ్యక్తి రాజ్ కుమార్ అని రచయిత మంజునాథ్ తెలిపారు. 1954లో చలన చిత్ర జీవితాన్ని ఆరంభించిన కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సుమారు 208 చిత్రాల్లో నటించి.. దాదాపు ఐదు దశాద్దాలపాటు సేవలందించారు.


