బ్రిటిష్ లైబ్రరీలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ జీవిత చరిత్ర! | Book on Dr Rajkumar presented to British Library | Sakshi
Sakshi News home page

బ్రిటిష్ లైబ్రరీలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ జీవిత చరిత్ర!

Sep 15 2013 2:16 PM | Updated on Sep 1 2017 10:45 PM

ప్రఖ్యాత కన్నడ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ జీవిత ఆధారంగా ఇంగ్లీష్ భాషలో రచించిన పుస్తకాన్ని లండన్ లోని బ్రిటిష్ లైబ్రరీకి అందించారు.

లండన్:
ప్రఖ్యాత కన్నడ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ జీవిత ఆధారంగా ఇంగ్లీష్ భాషలో రచించిన పుస్తకాన్ని లండన్ లోని బ్రిటిష్ లైబ్రరీకి అందించారు.  బ్రిటిష్ లైబ్రరీలోని ఆసియా, ఆఫ్రికా స్టడీస్ విభాగాధిపతి డాక్టర్ కేథరిన్ ఈగ్లేటన్ కు అందించిన జర్నలిస్ట్ మంజునాథ్, ఆయన సతీమణి, నటి డాక్టర్ సౌమ్య మంజునాథ్ చవన్ తెలిపారు.
 
గత సంవత్సరంలో రాజ్ కుమార్ జన్మదిన సందర్భంగా 'డాక్టర్ రాజ్ కుమార్: ది పర్సన్ ఆఫ్ బిహైండ్ పర్సనాలిటీ' అనే పుస్తకాన్ని బెంగుళూరులో ఆయన కుమారులు పునీత్ రాజ్ కుమార్, ప్రకృతి ఎన్ బన్వాసీలు అధికారికంగా విడుదల చేశారు. నిరాడంబరతకు, మానవీయ విలువలకు కట్టుబడిన వ్యక్తి రాజ్ కుమార్ అని రచయిత మంజునాథ్ తెలిపారు.
 
1954లో చలన చిత్ర జీవితాన్ని ఆరంభించిన కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సుమారు 208 చిత్రాల్లో నటించి.. దాదాపు ఐదు దశాద్దాలపాటు సేవలందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement