breaking news
Commercial property
-
ఇల్లా, ఫ్లాటా.. వాణిజ్య భవనాల్లో స్థలమా?
ఇల్లా, ఫ్లాటా.. లేక వాణిజ్య భవనాల్లో స్థలమా? దేంట్లో తీసుకుంటే భవిష్యత్తులో ధర పెరగడానికి ఆస్కారముంది? ప్రస్తుత పరిస్థితుల్లో ఎందులో పెట్టుబడి పెడితే అధిక రాబడి అందుకోవచ్చు? నివసించడం కోసం ఇల్లు కొనేవారు కొందరైతే.. పెట్టుబడి కోణంలో ఆలోచించి అడుగు వేసేవారు మరికొందరు. అయితే పెట్టుబడి అనేసరికి, నేటికీ అధికశాతం మంది నివాస గృహాలపై దృష్టి సారిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో వాణిజ్య భవనాల్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. – సాక్షి, సిటీబ్యూరోఅందుబాటు ప్రాంతాలిక్కడే.. నివాసమైనా.. వాణిజ్యమైనా.. అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతంలో భవనాల్ని చేపడితే.. కొనుగోలుదారులు ముందువరసలో ఉంటారనే విషయం నిర్మాణ సంస్థలకు తెలుసు. అందుకే మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, మదీనాగూడ, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ, కేపీహెచ్‌బీ కాలనీ వంటి ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాల్ని ఎక్కువగా చేపడుతున్నారు. విస్తీర్ణం తక్కువ గల స్థలంలో మదుపు చేయడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది.పక్కాగా చూడాలి నగరంలో మొదటి రకం వాణిజ్య సముదాయాల సంఖ్య తక్కువ ఉన్నాయి. వెయ్యి చదరపు అడుగుల నుంచి ఇందులో స్థలాలను కొనుగోలు చేయవచ్చు. వీటిలో పెట్టుబడి పెట్టాక వచ్చే అద్దెలపై 30 శాతం రాయితీ లభిస్తుంది. ప్రాపర్టీ మేనేజర్లు గల వాణిజ్య భవనాల్లో కొనడం ఉత్తమం. అప్పుడే ఆదాయానికి ఢోకా ఉండదు. భవిష్యత్తులో ధర పెరుగుదలా ఎక్కువే ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యాక ఆరు నెలల తర్వాతనైనా వాణిజ్య ఆఫీసు సముదాయాలు అద్దెదారులతో నిండుతాయి. సుమారు ఆరేడేళ్లలోపు వంద శాతం పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశముంది.వాణిజ్య సముదాయాలా? పెట్టుబడి కోణంలో చూసేవారు.. మంచి రాబడిని అందుకోవడానికి.. రెండోసారి ఇల్లు కొనడం బదులు వాణిజ్య లేదా ఆఫీసు సముదాయాల్లో పెట్టుబడి పెట్టడమే మేలని నిపుణులు చెబుతున్నారు. మొదటిసారి ఇల్లు కొనేటప్పుడు లభించే పన్ను రాయితీలు రెండోసారి దొరకవని గుర్తుంచుకోవాలి. నివాస సముదాయాలతో పోలిస్తే వాణిజ్య భవనాల్లో పెట్టుబడి పెట్టేవారికి, నెలసరి అద్దె రెండు రెట్లు ఎక్కువగా గిట్టుబాటవుతుంది. అయితే ధర మాత్రం కొన్ని ప్రాంతాల్లో యాభై శాతం అధికంగా ఉంటుంది.ఉదాహరణకు, నివాస సముదాయాల ధర చదరపు అడుగుకి రూ.3,500 ఉందనుకోండి.. వాణిజ్య సముదాయాల్లో రూ.5,250 దాకా పెట్టాల్సి ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరలో స్వల్ప మార్పులు ఉంటాయి. వాణిజ్య నిర్మాణాల్లో పెట్టుబడి పెట్టాలంటే దాదాపు యాభై శాతం సొమ్మును చేతిలో పెట్టుకుంటేనే ఉత్తమమని నిపుణులు అంటున్నారు. గృహరుణాలతో పోలి్చతే వాణిజ్య సముదాయాలను కొనడానికిచ్చే రుణాలపై రెండు నుంచి నాలుగు శాతం దాకా వడ్డీ అధికంగా ఉంటుంది. అలాగని కనిపించిన ప్రతి వాణిజ్య సముదాయంలో పెట్టుబడి పెట్టకూడదు. నివాస సముదాయాలా? మొదటిసారి ఇల్లు కొనాలని భావించేవారు ఎవరైనా.. ముందుగా నివాస సముదాయాన్ని కొనుగోలు చేయాలి. ఆరంభంలో 20 శాతం సొమ్ము కడితే చాలు.. 80 శాతం వరకూ బ్యాంకు నుంచి గృహరుణం లభిస్తుంది. అంటే తక్కువ సొమ్ముతో సొంతింటి కల తీరుతుంది. అప్పు తీసుకున్న కొన్నాళ్లకే తీర్చక్కర్లేదు. 20–25 ఏళ్ల వరకూ నెలసరి వాయిదాల్ని చెల్లించే వెసులుబాటు ఉంటుంది. గృహరుణం తీసుకున్నాక.. విడతలవారీగా రుణాల్ని తిరిగి కట్టొచ్చు. వడ్డీ, అసలుపై ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందని తెలిసిందే. 20 శాతం సొమ్ముతో ఇల్లు కొనుక్కుంటే చాలు.. ఆరేళ్లలో ఆయా ఇంటి విలువ రెట్టింపవుతుంది. ఏడు లేదా ఎనిమిదేళ్లలో అప్పు మొత్తం తీరిపోయే అవకాశముంది.నివాస సముదాయాల రంగంలో ఏటా 12–15 శాతం ఇంటి విలువ పెరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఇది సాధ్యమయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మంచి ప్రాంతంలో.. టైటిల్ క్లియర్‌గా ఉండి, సంబంధిత నివాస సంఘం ప్రాజెక్టును సమర్థంగా నిర్వహిస్తేనే విలువ పెరుగుతుంది. అంతే తప్ప, సంఘ సభ్యులు గొడవపడి, నిర్వహణ గురించి పట్టించుకోకపోతే అంతే సంగతులు. ప్రాజెక్టును సంఘానికి అప్పగించాక నిర్వహణ మెరుగ్గా జరపాలి.ఇదీ చదవండి: ఇంటికి ఇలాంటి ఫ్లోరింగ్.. ఇప్పుడిదే ట్రెండింగ్! -
రిటైల్ షాపులకు భలే డిమాండ్
న్యూఢిల్లీ: రిటైల్ వాణిజ్య వసతులకు డిమాండ్ బలంగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో షాపింగ్ మాల్స్, ప్రముఖ ప్రాంతాల్లోని రిటైల్ వసతుల (ప్రధాన రహదారుల వెంట/హైస్ట్రీట్) లీజింగ్ సెపె్టంబర్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే 45 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా టాప్– 8 నగరాల్లో 2.41 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 1.66 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఈ వివరాలను విడుదల చేసింది. ‘‘భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి క్రమంలో కొనసాగుతోంది. వినియోగదారుల ప్రాధాన్యతలు విస్తరిస్తుండడంతో నాణ్యమైన రిటైల్ వసతులకు డిమాండ్ పెరుగుతోంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఎండీ గౌతమ్ సరాఫ్ తెలిపారు. నగరాల వారీ లీజింగ్.. → హైదరాబాద్‌లో 0.51 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర రిటైల్ వసతుల లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 0.49 మిలియన్ ఎస్ఎఫ్టీతో పోల్చి చూస్తే 3.5 శాతం పెరిగింది. → ఢిల్లీ ఎన్సీఆర్లో ఏకంగా 87 శాతం అధికంగా 0.51 మిలియన్ ఎస్ఎఫ్టీ రిటైల్ లీజింగ్ జరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 0.27 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగానే ఉంది. → ముంబై మార్కెట్లో క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 0.22 మిలియన్ ఎస్ఎఫ్టీతో పోల్చి చూస్తే రెట్టింపై 0.59 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. → పుణెలోనూ 85 శాతం అధికంగా 0.33 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర రిటైల్ వసతుల లీజింగ్ నమోదైంది. → బెంగళూరులో లీజింగ్ 13 శాతం తగ్గి 0.18 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. → చెన్నై మార్కెట్లో 8 శాతం వృద్ధితో రిటైల్ లీజింగ్ 0.16 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. → అహ్మదాబాద్‌లో 27 శాతం తక్కువగా 0.06 మిలియన్ ఎస్ఎఫ్టీకి లీజు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 0.09 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → కోల్‌కతాలో 12 శాతం పెరిగి 0.06 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర లీజింగ్ లావాదేవీలు జరిగాయి. ప్రీమియం వసతులకు డిమాండ్.. కొత్త మాల్స్ నిర్మాణం పూర్తి అయి అందుబాటులోకి రావడంతోపాటు, క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ తక్కువగా ఉండడం, అధిక వృద్ధికి కారణమైనట్టు డీఎల్ఎఫ్ వైస్ చైర్మన్, ఎండీ శ్రీరామ్ ఖట్టర్ తెలిపారు. ‘‘వినియోగదారులు కేవలం ఉత్పత్తినే కాకుండా మెరుగైన అనుభవం (వసతులు) కోసం చూస్తున్నారు. దీంతో మేము ప్రీమియం వసతులను ఆఫర్ చేయడంపై దృష్టి సారించాం’’అని ఖట్టర్ వివరించారు. భారత వినియోగ మార్కెట్ పట్ల దేశ, విదేశీ బ్రాండ్లలో విశ్వాసం పెరగడం వల్ల బలమైన లీజింగ్ నమోదైనట్టు నెక్సస్ సెలక్ట్ మాల్స్ ప్రెసిడెంట్ నిజార్ జైన్ తెలిపారు. దేశ మధ్యతరగతి వర్గం పెరుగుతుండంతో వినియోగ మార్కెట్ విషయమై రిటైలర్లలోనూ బలమైన విశ్వాసం నెలకొన్నట్టు ఆరోణ్ గ్రూప్ ఎండీ నిమిష్ అరోరా తెలిపారు. డీ2సీ బ్రాండ్లు ఇప్పుడు ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ విస్తరణపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. -
కమర్షియల్ ప్రాపర్టీ కొనేందుకు ఇదే సరైన సమయం!
సాక్షి, సిటీబ్యూరో: వాణజ్య సముదాయాల్లో పెట్టే పెట్టుబడిపై 8 నుంచి 11 శాతం అద్దె గిట్టుబాటయితే.. ఇళ్లపై రాబడి రెండు నుంచి నాలుగు శాతం వరకే ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. రానున్న ఐదేళ్లలో ఎంతలేదన్నా 2కోట్ల చ.అ. వాణిజ్య భవనాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఇప్పటికే కొన్ని నగరాల్లో వాణిజ్య స్థలాల ధరలు తగ్గాయి. దీంతో వీటిలో పెట్టుబడి పెట్టడానికిదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశీలించాల్సిన అంశాలేమిటో ఓ సారి చూద్దాం.వాణిజ్య సముదాయాల్లో స్థలం కొన్న తర్వాత దాన్ని అమ్ముకోగానే మెరుగైన ఆదాయం గిట్టుబాటవుతుంది. ఇదొక్కటే కాదు ప్రతినెలా ఆశించిన స్థాయిలో అద్దె కూడా లభిస్తుంది. కాకపోతే అన్ని విధాలా అభివృద్ధికి ఆస్కారం ఉన్న చోట నిర్మితమయ్యే వాణిజ్య కట్టడాల్లో స్థలం తీసుకోవాలి. కాకపోతే పెట్టుబడి పెట్టే ముందు ప్రతి అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి రావాలి.ఇవే కీలకం.. వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయనం, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో మదుపు చేయాలి.ఒక ప్రాంతంలో నిర్మించే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని బేరీజు వేయాలి. భవనాన్ని నిర్మించే డెవలపర్ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి భవనాల్లో నిర్వహణ మెరుగ్గా ఉంటేనే గిరాకీ ఉంటుంది.మీరు వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగానికి ఆస్కారం ఉందా? అక్కడ జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి.మీరు కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడ ఉంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి.వాణిజ్య సముదాయంలో స్థలం కొనాలన్న నిర్ణయానికి వచ్చేముందు.. నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం బీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కోరుకున్న రాబడి గిట్టుబాటవుతుంది. -
హైదరాబాద్‌లో కమర్షియల్ స్థలం.. కొంటున్నారా?
వాణజ్య సముదాయాల్లో పెట్టే పెట్టుబడిపై 8 నుంచి 11 శాతం అద్దె గిట్టుబాటు అయితే.. ఇళ్లపై రాబడి 2 నుంచి 4 శాతం వరకే ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అధిక సరఫరా, ప్రతికూల మార్కెట్, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు తదితర కారణాలతో ప్రధాన నగరాల్లో వాణిజ్య స్థలాల ధరలు తగ్గాయి. దీంతో వీటిలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. వాణిజ్య సముదాయల్లో స్థలం కొన్న తర్వాత దాన్ని అమ్ముకోగానే మెరుగైన ఆదాయం గిట్టుబాటు అవుతుంది. ఇదొక్కటే కాదు ప్రతినెలా ఆశించిన స్థాయిలో అద్దె కూడా లభిస్తుంది. అన్ని విధాలా అభివృద్ధికి ఆస్కారం ఉన్న చోట నిర్మించే వాణిజ్య నిర్మాణాల్లో స్థలం తీసుకోవాలి. కాకపోతే పెట్టుబడి పెట్టే ముందు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి రావాలి. –సాక్షి, సిటీబ్యూరోఇవే కీలకం..వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయనం, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో మదుపు చేయాలి.ఒక ప్రాంతంలో నిర్మించే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశం ఉందా? అనే విషయాన్ని బేరీజు వేయాలి.భవనాన్ని నిర్మించే డెవలపర్ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి భవనాల్లో నిర్వహణ మెరుగ్గా ఉంటేనే గిరాకీ ఉంటుంది.👉 ఇది చదివారా? ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!మీరు వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగానికి ఆస్కాముందా? ఆయా ప్రాంతంలో జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి.మీరు కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడుంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి.వాణిజ్య సముదాయంలో స్థలం కొనాలన్న నిర్ణయానికి వచ్చేముందు.. నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం బీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కోరుకున్న రాబడి గిట్టుబాటవుతుంది. -
రియల్టీలో సిప్ చేద్దామా!
వాణిజ్య ప్రాపరీ్టపై పెట్టుబడి పెట్టాలంటే సామాన్య ఇన్వెస్టర్లకు అయ్యే పనేనా..! ఎక్కడ చూసినా ధరలు గణనీయంగా పెరిగిపోయిన తరుణంలో.. కొనాలంటే పెద్ద మొత్తమే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అయితే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాదిరే క్రమానుగత పెట్టుబడి (సిప్) విధానంలో వాణిజ్య ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేయాలన్న ఆకాంక్షలకు ఆచరణ మార్గమే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (రీట్లు). వీటిలో ఇన్వెస్ట్ చేయడం ఎలా? వచ్చే ప్రయోజనం ఎంత మేర? తదితర వివరాలను అందించే కథనమే ఇది. రీట్ అంటే...?రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (రీట్లు) పేరులో ఉన్నట్టుగానే.. వివిధ రకాల వాణిజ్య ప్రాపరీ్టలపై పెట్టుబడులు పెడుతుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ మాదిరే ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సమీకరిస్తుంటాయి. వాటిని వాణిజ్య ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేస్తాయి. ఆయా ప్రాపరీ్టలను అద్దెకు, లీజుకు ఇస్తుంటాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి వాటాదారులకు క్రమం తప్పకుండా పంచుతుంటాయి. ఆఫీసులు, మాల్స్, ఇండ్రస్టియల్ పార్క్‌లు, వేర్‌హౌస్‌లు, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్ సెంటర్లు తదితర వసతులపై రీట్లు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే బాండ్లు, గోల్డ్, స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఉదాహరణకు ఓ పది మంది స్నేహితుల బృందం ఉందనుకుందాం. తలో రూ.10 లక్షలు వేసుకుని రూ.కోటితో ఒక వాణిజ్య భవనాన్ని సమకూర్చుకున్నారు. దాన్ని ఓ కార్పొరేట్ సంస్థ కార్యాలయానికి లీజుకు ఇచ్చారు. లీజు రూపంలో వచ్చే మొత్తం నుంచి 90 శాతాన్ని పది మంది డివిడెండ్ కింద పంచుకుంటారు. రీట్‌లో ఇదే మాదిరి జరుగుతుంది. కాకపోతే రీట్ల నిర్వహణలో ఇలాంటి వాణిజ్య ఆస్తులు పెద్ద సంఖ్యలో ఉంటాయి. అమెరికా, జపాన్ తదితర దేశాల్లో రీట్లకు ఎంతో ఆదరణ ఉంది. కానీ మన దేశంలో వీటిపై అంత అవగాహన లేదు. అందుకే ఇవి పెద్దగా ప్రాచుర్యానికి నోచుకోలేదు. ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలుగా వీటికి తగినంత ప్రచారం కల్పించేందుకు సెబీ తన వంతు కృషి చేస్తోంది. స్టాక్స్, ఫండ్స్ మాదిరే రీట్లు కూడా సెబీ పర్యవేక్షణ కిందకే వస్తాయి. సెబీ నిబంధనల ప్రకారం రీట్లు 80% పెట్టుబడులను అద్దెను సమ కూర్చే ఆస్తులపైనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మరో 20% మేర పెట్టుబడులను నిర్మాణంలోని ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే, వచ్చే అద్దె ఆదాయంలో నిర్వహణ వ్యయాలు, పన్నులు పోను మిగిలిన నికర మొత్తం నుంచి 90 శాతాన్ని ఇన్వెస్టర్లకు పంపిణీ చేయాలి. ప్రయోజనాలు... అద్దె ఆదాయంరీట్లకు లీజు రూపంలో ఆదాయం వస్తుంటుంది. దీన్ని వాటాదారులకు డివిడెండ్ రూపంలో పంపిణీ చేస్తాయి. సాధారణంగా ప్రతి మూడేళ్లకోసారి 15 శాతం అద్దె పెంచాలన్న నిబంధనతో లీజు ఒప్పందాలు చేసుకుంటుంటాయి. దీంతో వాటాదారులకు వచ్చే డివిడెండ్ ఆదాయం కూడా కాలక్రమేణా పెరుగుతూ వెళుతుంది. కొత్త లీజు సమయంలో అప్పటికి పెరిగిన మార్కెట్ ధరల ప్రకారమే ఒప్పందాలు చేసుకుంటుంటాయి. వడ్డీ ఆదాయం రీట్లు తమవద్దనున్న మిగులు నిధులపై వడ్డీ రాబడిని పొందుతుంటాయి. లేదా ప్రాపర్టీ లీజుదారులకు రుణాలు సమకూర్చడం ద్వారా వాటిపై ఆదాయం పొందుతాయి. ఈ రూపంలోనూ వాటాదారులకు ఆదాయం లభిస్తుంది. మన దేశంలో రీట్లు ప్రధానంగా టైర్–1 పట్టణాల్లోని ప్రాపరీ్టలపైనే ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఉన్నాయి. కనుక వీటి ధరలు మరింత పెరిగేందుకు ఆస్కారం ఉంది. పనితీరు భిన్నంస్టాక్స్, బాండ్లు తదితర సాధనాలకు భిన్నంగా రీట్ స్పందన ఉంటుంది. అంటే స్టాక్స్ లేదా బాండ్ల ధరలు పడిపోతే రీట్ల ధరలు కూడా పడిపోవాలనేమీ లేదు. ఆ సమయంలో ఇవి స్థిరంగా ఉండొచ్చు. లేదా లాభాలను ఇవ్వొచ్చు. ఒకవేళ రీట్ల ధరలు కూడా తగ్గినా.. ఇతర సాధనాల స్థాయిలో ఉండదు. ఈ విధంగా పెట్టుబడుల్లో కొంత భాగానికి రిస్క్ తగ్గుతుంది. పెట్టుబడి విలువ వృద్ధిరీట్ల నిర్వహణలోని ప్రాపరీ్టల విలువలు కొంత కాలానికి సహజంగా పెరుగుతుంటాయి. తమ నిర్వహణలోని ఆస్తుల విలువలను ఎప్పటికప్పుడు రీట్లు మదింపు చేసుకోవాలి. దీంతో పెరిగిన ప్రాపరీ్టల విలువ రీట్ యూనిట్ విలువపై ప్రతిఫలిస్తుంది. అలాగే, ఆరి్థకంగా లాభదాయకం లేని, లీజు పరంగా అంత డిమాండ్ లేని ప్రాపరీ్టలను విక్రయించి, డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని ప్రాపరీ్టలపై ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇది కూడా పెట్టుబడి విలువ వృద్ధికి, డివిడెండ్ వాటా పెంపునకు దారితీస్తుంది. అంతేకాదు, కొంత మేర రుణాలు తీసుకుని కొత్త ప్రాపరీ్టలపై వెచి్చంచేందుకు సైతం వీటికి వెసులుబాటు ఉంటుంది. కనుక కాలక్రమంలో, కంపెనీ నగదు ప్రవాహాలు, నికర విలువ పెరుగుతున్న కొద్దీ.. కొత్త ప్రాపర్టీలను అదనంగా సమకూర్చుకుంటాయి. ఆ విధంగానూ పెట్టుబడుల విలువ వృద్ధి చెందుతుంది. ఆదాయం పెరుగుతుంది. మెరుగైన లిక్విడిటీభౌతిక ప్రాపర్టీ కొనుగోలు చేస్తే విక్రయించడానికి చాలా సమయం తీసుకోవచ్చు. అదే రీట్లను పనిదినాల్లో ఏ రోజు అయినా విక్రయించుకుని, మరుసటి రోజే ఆ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో పొందొచ్చు. ఇవి స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయి ఉంటాయి కనుక లిక్విడిటీ సమస్య ఉండదు.లిస్టెడ్ రీట్లు... బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్, నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రీట్లు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు లిస్ట్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా త్రైమాసికానికి ఒకసారి డివిడెండ్‌ను పంపిణీ చేస్తున్నాయి.ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? రీట్‌లో పెట్టుబడులకు ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు తప్పనిసరిగా ఉండాలి. స్టాక్స్‌ను కొనుగోలు చేసినట్టుగానే రీట్ యూనిట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇవి డీమ్యాట్ ఖాతాలో జమ అవుతాయి. రాబడులు... వాణిజ్య రియల్ ఎస్టేట్‌పై వార్షిక రాబడులు 8–10 శాతం మధ్య ఉంటాయి. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్‌పై రాబడులు ఒక్కోసారి 15 శాతం స్థాయిలో ఉంటాయి. కానీ, మన దేశంలో రీట్‌లపై ప్రస్తుత రాబడులు 10 శాతం లోపే ఉన్నాయి. మన ఆరి్థక వ్యవస్థ రానున్న రోజుల్లో మరింత విలువను సంతరించుకుంటుందని నిపుణుల అంచనా. దీనికితోడు ఈ మార్కెట్ పరిణతి చెందిన కొద్దీ రీట్‌లపై వార్షిక రాబడులు 10 శాతం, అంతకంటే ఎగువ స్థాయికి చేరుకుంటాయని నిపుణుల అంచనా. 2022–2024 మధ్య రీట్ల నుంచి డివిడెండ్ రాబడి 6–9 శాతం మధ్య ఉన్నట్టు, పెట్టుబడి విలువలో 12–18 శాతం మేర వృద్ధి ఉన్నట్టు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక చెబుతోంది.ఇవి గమనించాలి..→ రీట్లు స్వల్పకాలానికి కాకుండా దీర్ఘకాలం కోసమే (ఐదేళ్లు అంతకుమించిన కాలం) పరిశీలించడం సూచనీయం. అప్పుడు మూలధన పెట్టుబడి వృద్ధి సాధ్యపడుతుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ సైక్లికల్‌గా ఉంటుంది. స్వల్పకాలంలో రీట్ల ధరలు స్టాక్స్ మాదిరే ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొంత మేర హెచ్చుతగ్గులకు గురికావచ్చు. → మనదేశంలో ఇప్పటి వరకు కేవలం నాలుగు రీట్లే లిస్ట్ అయి ఉన్నాయి. ఇందులో నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ మాత్రం రిటైల్ మాల్స్ ఆస్తులపైనే అధిక శాతం ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన రీట్లు ఆఫీస్ ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేసేవి. పనితీరు పోల్చి చూసేందుకు పరిమిత అవకాశాలే ఉన్నాయి. → ఇన్వెస్ట్ చేసే ముందు ఆయా రీట్ల పరిధిలోని ప్రాపరీ్టలలో ఆక్యుపెన్సీ రేషియో (భర్తీ రేటు) చూడాలి. లీజుకు తీసుకున్న కంపెనీలు అన్నీ ఒకే రంగంలో కాకుండా భిన్న రంగాలకు చెందినవి అయితే రిస్క్ వైవిధ్యం అవుతుంది. రీట్ల నిర్వహణలోని ప్రాపరీ్టల నాణ్యత, డిమాండ్ చూడాలి. → ఆర్థిక సంక్షోభ సమయాల్లో, కరోనా వంటి విపత్తుల సమయాల్లో ఆఫీస్ లీజింగ్ మార్కెట్‌పై ప్రభావం పడొచ్చు. అలాంటి సందర్భాల్లో డివిడెండ్ పంపిణీ, మూలధన పెట్టుబడి విలువ ప్రభావితం కావచ్చు. → మన దగ్గర స్టాక్స్‌తో పోలిస్తే రీట్లకు ప్రాచుర్యం తక్కువ. కనుక స్టాక్ ఎక్సే్చంజీల్లో వీటి లిక్విడిటీ (ట్రేడింగ్ వ్యాల్యూమ్) తక్కువగా ఉంటుంది. → తమకు స్థిరమైన ఆదాయం కావాలని కోరుకునే వారు రీట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా తమ మొత్తం పెట్టుబడుల్లో 10 శాతం వరకు కేటాయించుకోవచ్చన్నది నిపుణుల సూచన. పన్ను బాధ్యత... రీట్ పెట్టుబడులపై డివిడెండ్ రూపంలో వచ్చే ఆదాయంపై పన్ను కొంత భిన్నంగా ఉంది. బ్రూక్‌ఫీల్డ్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్లు రాయితీతో కూడిన పన్ను రేటును ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 115బీఏఏ కింద ఎంపిక చేసుకోలేదు. ఇవన్నీ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)పైనే ఇన్వెస్ట్ చేశాయి. కనుక ఇవి పంపిణీ చేసే డివిడెండ్‌పై పన్ను లేదు. ఒకవేళ ఎస్పీవీలు రాయితీ రేటును ఎంపిక చేసుకుంటే, అప్పుడు అవి పంపిణీ చేసే డివిడెండ్ పన్ను పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ తనకు వర్తించే శ్లాబు ప్రకారం దీనిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డివిడెండ్‌పై పన్ను వర్తించేట్టు అయితే, రీట్లు 10 శాతం టీడీఎస్ కింద తగ్గించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తాయి. ఇన్వెస్టర్లు తమ వార్షిక పన్ను రిటర్నుల్లో దీన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. సొంత ప్రాపరీ్టలపై రీట్లకు వచ్చే ఆదాయం నుంచి వాటాదారులకు డివిడెండ్ పంపిణీ చేసినా, ఎస్పీవీలకు ఇచ్చిన రుణాలపై రీట్లకు వచ్చే ఆదాయాన్ని వాటాదారులకు పంపిణీ చేసిన సందర్భాల్లోనూ.. ఇన్వెస్టర్ వ్యక్తిగత ఆదాయానికే కలుస్తుంది. ఇక రీట్లలోని పెట్టుబడులకు స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాదిరే పన్ను నిబంధనలు వర్తిస్తాయి. విక్రయించినప్పుడు వచ్చే లాభంపై మూలధన లాభాల పన్ను చెల్లించాలి. ఏడాదిలోపు విక్రయించగా వచ్చిన లాభంపై 20 శాతం పన్ను, ఏడాది ముగిసిన తర్వాత విక్రయించినప్పుడు వచి్చన లాభం మొదటి రూ. లక్ష తర్వాత మొత్తంపై 12.5 శాతం చెల్లించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మిగిలిన వాటానూ కొంటున్న బ్లాక్‌స్టోన్!
ముంబై: ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ కమర్షియల్ ప్రొపరీ్టస్లో మిగిలిన 50 శాతం వాటాను బ్లాక్‌స్టోన్ గ్రూప్ కొనుగోలు చేయనున్నదని సమాచారం. ఈ మేరకు బ్లాక్‌స్టోన్‌తో ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డీల్ విలువ రూ.4,420 కోట్లు ఉండొచ్చని అంచనా. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి బ్లాక్‌స్టోన్ కంపెనీ నిరాకరించింది. గత ఏడాది మార్చిలో ఇండియాబుల్స్ కమర్షియల్ ప్రొపరీ్టస్లో 50 శాతం వాటాను బ్లాక్‌స్టోన్ కంపెనీ రూ.4,750 కోట్లకు కొనుగోలు చేసింది. -
12న ఎస్బీఐ మెగా ఈ-వేలం
ముంబై: మొండిబకాయిలుగా మారిన నివాస, వాణిజ్య ఆస్తులను జూన్ 12న ఆన్లైన్లో వేలం వేయనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 14 తర్వాత ఎస్బీఐ ఇలా ఈ-వేలం నిర్వహించడం ఇది రెండోసారి. అప్పట్లో బ్యాంకు రూ. 1,200 కోట్లు విలువ చేసే 300 నివాస, వాణిజ్య ఆస్తులను వేలానికి ఉంచింది. అయితే, కేవలం సుమారు రూ. 100 కోట్లు విలువ చేసే 130 ప్రాపర్టీలను మాత్రమే విక్రయించగలిగింది. వీటిలో ఎక్కువగా నివాస ఆస్తులే ఉన్నాయి. తాజాగా జూన్ 12 నిర్వహించబోయే ఈ-వేలంలో సుమారు 40 నగరాల్లో మొండిబకాయిలుగా మారిన ఆఫీసులు, షాప్‌లు, అపార్ట్మెంట్లు, ఫ్యాక్టరీ బిల్డింగులు మొదలైన వాటిని ఎస్బీఐ విక్రయించనుంది. మార్చి క్వార్టర్లో ఎస్బీఐ స్థూల నిరర్థక ఆస్తులు 4.95 శాతం నుంచి 4.25 శాతం స్థాయికి మెరుగుపడ్డాయి. అలాగే నికర ఎన్పీఏలు కూడా 2.57 శాతం నుంచి 2.12 శాతం స్థాయికి తగ్గాయి.


