కమర్షియల్‌ ప్రాపర్టీ కొనేందుకు ఇదే సరైన సమయం! | Things to consider when buying a commercial property | Sakshi
Sakshi News home page

కమర్షియల్‌ ప్రాపర్టీ కొనేందుకు ఇదే సరైన సమయం!

Sep 20 2025 7:20 PM | Updated on Sep 20 2025 7:41 PM

Things to consider when buying a commercial property

సాక్షి, సిటీబ్యూరో: వాణజ్య సముదాయాల్లో పెట్టే పెట్టుబడిపై 8 నుంచి 11 శాతం అద్దె గిట్టుబాటయితే.. ఇళ్లపై రాబడి రెండు నుంచి నాలుగు శాతం వరకే ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. రానున్న ఐదేళ్లలో ఎంతలేదన్నా 2కోట్ల చ.అ. వాణిజ్య భవనాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఇప్పటికే కొన్ని నగరాల్లో వాణిజ్య స్థలాల ధరలు తగ్గాయి. దీంతో వీటిలో పెట్టుబడి పెట్టడానికిదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశీలించాల్సిన అంశాలేమిటో ఓ సారి చూద్దాం.

వాణిజ్య సముదాయాల్లో స్థలం కొన్న తర్వాత దాన్ని అమ్ముకోగానే మెరుగైన ఆదాయం గిట్టుబాటవుతుంది. ఇదొక్కటే కాదు ప్రతినెలా ఆశించిన స్థాయిలో అద్దె కూడా లభిస్తుంది. కాకపోతే అన్ని విధాలా అభివృద్ధికి ఆస్కారం ఉన్న చోట నిర్మితమయ్యే వాణిజ్య కట్టడాల్లో స్థలం తీసుకోవాలి. కాకపోతే పెట్టుబడి పెట్టే ముందు ప్రతి అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి రావాలి.

ఇవే కీలకం..     

  • వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయనం, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో మదుపు చేయాలి.

  • ఒక ప్రాంతంలో నిర్మించే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని బేరీజు వేయాలి. 

  • భవనాన్ని నిర్మించే డెవలపర్‌ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి భవనాల్లో నిర్వహణ మెరుగ్గా ఉంటేనే గిరాకీ ఉంటుంది.

  • మీరు వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగానికి ఆస్కారం ఉందా? అక్కడ జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి.

  • మీరు కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడ ఉంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి.

  • వాణిజ్య సముదాయంలో స్థలం కొనాలన్న నిర్ణయానికి వచ్చేముందు.. నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం బీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కోరుకున్న రాబడి గిట్టుబాటవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement