హైదరాబాద్‌లో కమర్షియల్‌ స్థలం.. కొంటున్నారా? | Commercial Property Investment In Hyderabad, Here Are The Important Points To Know | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కమర్షియల్‌ స్థలం.. కొంటున్నారా?

Jun 22 2025 12:06 PM | Updated on Jun 22 2025 1:54 PM

Commercial Property Investment in Hyderabad

వాణజ్య సముదాయాల్లో పెట్టే పెట్టుబడిపై 8 నుంచి 11 శాతం అద్దె గిట్టుబాటు అయితే.. ఇళ్లపై రాబడి 2 నుంచి 4 శాతం వరకే ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అధిక సరఫరా, ప్రతికూల మార్కెట్, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు తదితర కారణాలతో ప్రధాన నగరాల్లో వాణిజ్య స్థలాల ధరలు తగ్గాయి. దీంతో వీటిలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. వాణిజ్య సముదాయల్లో స్థలం కొన్న తర్వాత దాన్ని అమ్ముకోగానే మెరుగైన ఆదాయం గిట్టుబాటు అవుతుంది. ఇదొక్కటే కాదు ప్రతినెలా ఆశించిన స్థాయిలో అద్దె కూడా లభిస్తుంది. అన్ని విధాలా అభివృద్ధికి ఆస్కారం ఉన్న చోట నిర్మించే వాణిజ్య నిర్మాణాల్లో స్థలం తీసుకోవాలి. కాకపోతే పెట్టుబడి పెట్టే ముందు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి రావాలి. –సాక్షి, సిటీబ్యూరో

ఇవే కీలకం..

  • వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయనం, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో మదుపు చేయాలి.

  • ఒక ప్రాంతంలో నిర్మించే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశం ఉందా? అనే విషయాన్ని బేరీజు వేయాలి.

  • భవనాన్ని నిర్మించే డెవలపర్‌ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి భవనాల్లో నిర్వహణ మెరుగ్గా ఉంటేనే గిరాకీ ఉంటుంది.

👉 ఇది చదివారా? ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్‌!

  • మీరు వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగానికి ఆస్కాముందా? ఆయా ప్రాంతంలో జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి.

  • మీరు కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడుంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి.

  • వాణిజ్య సముదాయంలో స్థలం కొనాలన్న నిర్ణయానికి వచ్చేముందు.. నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం బీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కోరుకున్న రాబడి గిట్టుబాటవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement