breaking news
Buffalo milk
-
బొద్దింక పాలు: మీరు ఎప్పుడూ చూడని సూపర్‌ఫుడ్!
ఒక పూట పాలు లేకపోతే, ఆ రోజు ఎంత కష్టంగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఉదయాన్నే టీ, కాఫీలు పెట్టుకోవడం దగ్గర నుంచి, రాత్రిపూట మజ్జిగ తాగే వరకు ఇంట్లో ఏదోరకంగా పాల అవసరం కనిపిస్తూనే ఉంటుంది. పెరుగు, వెన్న, నెయ్యి ఇలా ప్రతి పాల ఉత్పత్తితోనూ రోజువారీ అవసరాలు, అలవాట్లు ముడిపడే ఉంటాయి. అందుకే, కుదిరితే పాడినయినా పెంచుకుంటాం, లేదా పాలకేంద్రంలో ఖాతానైనా పెట్టుకుంటాం. ఏదేమైనా రోజుకు లీటరో అరలీటరో పాలు స్టవ్ మీద కాగాల్సిందే! ప్రతి ఇంట్లోనూ పాలకున్న డిమాండ్ అలాంటిది.నిజానికి పాలు ఒక సంపూర్ణ ఆహారం. పాలు మన శరీరానికి కావలసిన కాల్షియం, ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు ఇలా చాలా పోషకాలనే అందిస్తాయి. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కాల్షియం చాలా ఉపయోగపడుతుంది. అలాగే కండరాలు, కణజాలాల నిర్మాణానికి ప్రొటీన్ ఎంతగానో సహాయపడుతుంది. పాలలో విటమిన్–డి, విటమిన్–బి12తో పాటు పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. పాలు తాగటంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పాలు ఎముకలను బలపరుస్తాయి, కండరాలను అభివృద్ధి చేస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అన్ని వయసుల వారికి పాలు ఒక ముఖ్యమైన పోషకం. పిల్లలు ఎదగడానికి, పెద్దలు ఆరోగ్యంగా ఉండటానికి పాలు చాలా అవసరమని డాక్టర్లు ఎప్పుడూ చెబుతుంటారు.మనిషి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి పాడిని పెంచి, పాలను వినియోగించుకోవడం మొదలుపెట్టాడని చరిత్ర చెబుతోంది. అంటే దాదాపు పదివేల సంవత్సరాల క్రితం నుంచే, పశువుల పాలతో ప్రయోజనాలను అందుకుంటున్నాం.ఏ జంతువుల పాలు.. ఏమేమి ఫలితాలు?పాలల్లో ఆవు పాలు శ్రేష్ఠమైనవి. ఇక గేదె పాలు, మేక పాలు, ఒంటె పాలు కూడా అనేక సంస్కృతులలో ప్రత్యేకంగా వినియోగిస్తారు. ప్రత్యేక రుచి, పోషక విలువలు, ప్రత్యేక లక్షణాల కారణంగా వాటి పాలను వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు.బొద్దింక పాలుకీటకమైన ఈ బొద్దింకల నుంచి పాలను తియ్యడం చాలా అసాధారణమైన పని. పసిఫిక్ బీటిల్ బొద్దింకలు ‘బొద్దింక పాలు’ అని పిలవబడే ఒక పోషకసమృద్ధ స్ఫటికాకార పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి బొద్దింకల గర్భధారణ సమయంలో వాటి పిల్లలకు పోషణను అందించడానికి ఉపయోగపడతాయి. ఇవి అధిక ప్రొటీన్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. వీటిని మనుషులు వినియోగించుకోవడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వాణిజ్యపరంగా బొద్దింకల పాలను ఉత్పత్తి చేయడం లేదు. దీనిని ఒక ‘సూపర్ ఫుడ్’గా మార్కెట్ చేసే ప్రయత్నాలను కొన్ని పరిశోధనా సంస్థలు సాగిస్తున్నాయి. కానీ ఇది కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి సాంకేతిక, ఆర్థిక, సామాజిక అడ్డంకులు చాలా ఉన్నాయి.ఆవు పాలుఇవి ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పాలు. ఇవి కాల్షియం, ప్రొటీన్, విటమిన్–డిలతో నిండి ఉంటాయి. ఈ పాలను నేరుగా తాగడానికి, పెరుగు, వెన్న, చీజ్ వంటి ఇతర పాల ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు.గొర్రె పాలు ఇవి చాలా పోషకమైనవి, వీటిలో కొవ్వు, ప్రొటీన్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. గొర్రె పాలను ఎక్కువగా చీజ్ తయారీకి వినియోగిస్తారు. ముఖ్యంగా ఫెటా, రోక్ఫోర్ట్ వంటి చీజ్‌లు వీటితోనే తయారు చేస్తారు.గేదె పాలుఆవు పాల కంటే ఈ పాలల్లో కొవ్వు, మినరల్స్, ప్రొటీన్లు కొంత ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా భారతదేశం, పాకిస్తాన్, ఇటలీ వంటి దేశాలలో ఎక్కువగా దొరుకుతాయి. పెరుగు, మొజారెల్లా చీజ్, ఇతర పాల ఉత్పత్తుల తయారీకి ఈ పాలనే వినియోగిస్తారు. గేదె పాలు చాలా క్రీమీగా ఉంటాయి. ఇందులో లాక్టోస్ కూడా ఎక్కువ.గాడిద పాలుఇవి చాలా అరుదుగా లభిస్తాయి, కానీ వాటి పోషక విలువలు చర్మ సంరక్షణకు, ఉబ్బసం నయం చేయడానికి ప్రసిద్ధి చెందాయి. అందుకే వీటిని చర్మ సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. శిశువులకిచ్చే ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా కూడా సూచిస్తారు.మేక పాలు ఆవు పాల కంటే తేలికగా జీర్ణమవుతాయి. కొంత భిన్నమైన రుచిని కలిగి ఉంటాయి. వీటిలో కాల్షియం, విటమిన్–ఎ అధికంగా ఉంటాయి. మేక పాల నుంచి చీజ్, పెరుగులతో పాటు సబ్బులు కూడా తయారు చేస్తారు. ఈ మేక పాలు ప్రపంచ పాల ఉత్పత్తిలో సుమారు 2% వాటాను కలిగి ఉన్నాయి. పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో గత 20 సంవత్సరాలలో దీని ఉత్పత్తి దాదాపు 60% పెరిగింది. మేకపాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అవయవాల పనితీరుకు సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి మంచివి.ఒంటె పాలుపశ్చిమాసియా, ఆఫ్రికాలోని ఎడారి ప్రాంతాలలో ఒంటె పాలు శతాబ్దాలుగా ఒక ముఖ్యమైన ఆహారం. ఈ పాలలో విటమిన్–సి, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఒంటె పాలు తేలికగా జీర్ణమవుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు ఈ పాలు మంచి ఔషధం. ఈ పాలు కొన్ని వైద్యపరమైన ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయని నమ్ముతారు. ఈ పాలను ఐస్‌క్రీమ్, చీజ్ వంటి ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.గుర్రపు పాలుఖజక్స్తాన్, మంగోలియా, తూర్పు ఐరోపాలో గుర్రపు పాలను కూమిస్, అయిరాగ్ వంటి సంప్రదాయకంగా పులియబెట్టే పానీయాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పానీయాలు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండటమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. గుర్రపు పాలు తల్లి పాలను పోలి ఉంటాయి. అమైనో ఆమ్లాలు, కొవ్వు శాతం ఈ పాలలో ఎక్కువగా ఉండటంతో చీజ్ తయారీకి ఇవి చక్కగా పనికొస్తాయి.మూస్ పాలుఇవి చాలా అరుదుగా లభిస్తాయి. వీటిని స్వీడన్, రష్యా, కెనడాలో వాణిజ్యపరంగా ఉపయోగిస్తాయి. మూస్ పాలను చీజ్, పెరుగు, ఐస్ క్రీమ్ తయారీకి ఉపయోగిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్‌లలో మూస్ చీజ్ ఒకటి.రెయిన్ డీర్ పాలుసైబీరియా, ఉత్తర స్కాండినేవియా వంటి చల్లని ప్రాంతాలలో నివసించే ప్రజలు రెయిన్ డీర్ పాలను వినియోగిస్తారు. ఆవు పాల కంటే వీటిలో కొవ్వు, ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి, ఇవి చాలా శక్తిమంతమైన ఆహారం.జిరాఫీ పాలు జిరాఫీ పాలు అసాధారణమైనవి. మానవ వినియోగానికి సాధారణంగా లభ్యం కావు. వీటి పాలలో కొవ్వు, ప్రొటీన్ అధికంగా ఉంటాయి. ఇవి జిరాఫీ పిల్లల వేగవంతమైన పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయి. అయితే, జిరాఫీల నుంచి పాలు తీయడం చాలా కష్టం. అది పెద్ద సవాలుతో కూడుకున్న పని.యాక్ పాలుహిమాలయ ప్రాంతంలో ఈ యాక్ పాలు చాలా ప్రత్యేకం. ఇవి ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి, టిబెటన్లు, ఇతర పర్వత నివాసుల ఆహారంలో ఈ పాలను తప్పనిసరి తీసుకుంటారు. ఈ పాలు చిక్కగా, ఎక్కువ కొవ్వులతో ఉండటంతో వెన్న, చీజ్ తయారీకి అనుకూలంగా ఉంటాయి.అపోహలు నిజాలుపాలు తాగితే బరువు పెరుగుతారు!ఇది నిజం కాదు. పాలలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా అవసరం. పాలు బరువును పెంచుతాయా లేదా అనేది మీరు తీసుకునే పాల రకం (ఫుల్ క్రీమ్, స్కిమ్డ్ మిల్క్), తీసుకునే పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. క్రీమ్ తొలగించిన పాలను తీసుకుంటే క్యాలరీ కంటెంట్ తగ్గుతుంది, ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.పాలను ఎక్కువగా కాగబెడితే పోషకాలు తగ్గుతాయి!ఇది పూర్తిగా తప్పు. పాలను కాగబెట్టడంతో అందులో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది, పాలు తాగడానికి సురక్షితంగా మారతాయి. పదేపదే మరిగించడంతో పోషకాలకు ఎటువంటి హాని జరగదు.పాలు ఎముకల నుంచి కాల్షియంను బయటకు తీస్తాయి!ఈ అపోహకు శాస్త్రీయ ఆధారాలు లేవు. వాస్తవానికి, పాలు కాల్షియంకు అద్భుతమైన వనరు. ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.పాలు తాగితే కఫం ఉత్పత్తి అవుతుంది!ఈ వాదన పూర్తిగా సరైనది కాదు. దగ్గు సమయంలో స్కిమ్డ్ మిల్క్ తీసుకోవడంతో కఫం పెరుగుతుందని కొందరు నమ్ముతారు, కానీ పాలు తాగడానికి, కఫం ఉత్పత్తికి ప్రత్యక్ష సంబంధం లేదు.పాలు మొటిమలు రావడానికి కారణమవుతాయి!పాల వినియోగం, మొటిమల మధ్య ప్రత్యక్ష సంబంధానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. జన్యుశాస్త్రం, హార్మోన్లు, మనం తీసుకునే ఆహారం వంటి ఎన్నో అంశాలు చర్మ ఆరోగ్యంలో కీలకంగా మారతాయి.తల్లిపాలు పట్టిస్తున్నప్పుడు తల్లి అనారోగ్యంతో ఉంటే బిడ్డకు పాలు ఇవ్వకూడదు!అనారోగ్యంతో ఉన్న తల్లి, తన పిల్లలకు పాలు ఇవ్వడంలో ఎటువంటి సమస్య ఉండదు. తల్లికి అనారోగ్యంగా ఉంటే, ఆమె శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. అవి శిశువులకు రక్షణనిస్తాయి. తల్లి నుంచి పిల్లలకు వ్యాధి వ్యాపించడం చాలా అరుదుగా జరుగుతుంది.ముర్రుపాలు బిడ్డకు పట్టించకూడదు!ప్రసవానంతరం లేత పసుపు రంగులో వచ్చే ముర్రుపాలు బిడ్డకు చాలా ముఖ్యమైనవి. అవి రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు, పోషకాలను నిండి ఉంటాయి.పాలు లాభాలుపాలు కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అవి పోషకాల మిశ్రమం. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లతో పాటు కీలకమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. మన రోజువారీ ఆరోగ్యానికి పాలు ఎంతగానో దోహదపడతాయి. పాలలో ఉండే ప్రధాన పోషకాలు, అవి మన శరీరానికి చేసే మేలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.విటమిన్–ఎఇది కంటిచూపుకు ఎంతో అవసరం. కణాల పెరుగుదలను ప్రోత్సహించి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.విటమిన్–డిఎముకల ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. శరీరం క్యాల్షియంను సమర్థంగా గ్రహించేలా చేస్తుంది. దాంతో ఎముకలకు పటుత్వం లభిస్తుంది.విటమిన్–బి3 (నియాసిన్) మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.విటమిన్–బి5 (పాంటోథెనిక్ ఆమ్లం)శరీరంలోని జీవక్రియలు సజావుగా సాగేందుకు ఈ విటమిన్ తోడ్పడుతుంది.విటమిన్–బి12నాడీవ్యవస్థ పనితీరుకు, డీఎన్ఏ నిర్మాణానికి ఇది అత్యవసరం.విటమిన్–ఈఇవి పాలలో తక్కువ శాతం ఉంటాయి. అయితే పాలిచ్చే జంతువులను బట్టి, అవి తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా వ్యత్యాసం ఉంటుంది. మనిషి పాలలో విటమిన్ ఈ ఎక్కువగా లభిస్తుంది.క్యాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి, వాటి దారుఢ్యాన్ని కాపాడటానికి ఇది ప్రధాన పోషకం.ఫాస్ఫరస్క్యాల్షియంతో కలిసి ఎముకలు, దంతాల నిర్మాణానికి ఫాస్ఫరస్ దోహదపడుతుంది.అయోడిన్థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ కీలకమైనది, ఇది శరీర విధులను నియంత్రిస్తుంది.సెలీనియంఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, వాటికి రక్షణ కల్పిస్తుంది.జింక్రోగనిరోధక శక్తిని కాపాడటంలో జింక్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. గాయాలు త్వరగా మానేలా కూడా చేస్తుంది.ప్రొటీన్కండరాల పెరుగుదలకు ప్రొటీన్ అత్యవసరం. కణజాలం నిర్మాణానికి, దెబ్బతిన్న కణజాలం కోలుకోవడానికి కూడా ఇది దోహదపడుతుంది.కార్బోహైడ్రేట్స్పాలలోని లాక్టోస్ ఒక కీలకమైన కార్బోహైడ్రేట్. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.కొవ్వులుకొవ్వులు శరీరానికి శక్తినిస్తాయి. అలాగే విటమిన్లు(ఎ, డి, ఈ వంటివి), శరీరంలో ఇముడ్చుకోవడానికి ఈ కొవ్వులు ఎంతగానో తోడ్పడతాయి.నిజానికి లాక్టోస్ అలర్జీ ఉన్నవారు పాలు, పాల పదార్థాలను తీసుకోకూడదు. వాటికి బదులుగా, కాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, మొక్కల ఆధారిత పాలు (సోయా మిల్క్, బాదం మిల్క్) వంటివి తీసుకోవచ్చు. పాలు అలవాటు ఉన్నవారు, పాలు తాగడంతో ఎలాంటి సమస్య లేనివారు ఏదో ఒక రూపంలో, తగిన మోతాదులో తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. -
ఆవు పాల ధర తగ్గింపు.. గేదె పాల ధర పెంపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ విజయ డెయిరీ రైతుల నుంచి సేకరిస్తున్న ఆవు పాల ధరను తగ్గించాలని యోచిస్తోంది. అదే సమయంలో గేదె పాల ధరను లీటర్‌కు రూ.4 వరకు పెంచడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. గేదె పాల ధరను రూ.3 వరకు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు అమలులోకి రాలేదు. అప్పుల భారం పైపైకి విజయ డెయిరీ సంస్థకు దాదాపు రూ.1,000 కోట్ల టర్నోవర్ ఉన్నప్పటికీ.. ప్రస్తుతం దాదాపు రూ.250 కోట్ల నష్టాల్లో ఉంది. ప్రతినెలా రూ.13కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు నష్టాలు వస్తున్నట్లు తెలిసింది. రైతులకు నెలనెలా చెల్లించాల్సిన పాల బకాయిలు కూడా ఇవ్వలేని దుస్థితిలోకి సంస్థ వెళ్లినట్లు అధికారవర్గాల సమాచారం. ప్రస్తుతం మూడునాలుగు బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఆవుపాల సేకరణ ధర అధికంగా ఉండడమే అందుకు కారణమని చెబుతున్నారు. ప్రైవేటు కంటే రూ.10 అదనం విజయ డెయిరీ ప్రతీరోజు 4.5 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. అందులో 85 శాతం మేరకు ఆవు పాలే ఉంటున్నాయి. ప్రైవేట్ డెయిరీ సంస్థలు ఆవు పాలు లీటర్‌కు రూ.32 నుంచి రూ.33 చెల్లించి సేకరిస్తుండగా.. విజయ డెయిరీ మాత్రం రూ.42 ఇస్తోంది. గేదె పాలు లీటర్‌కు రూ.48 చెల్లిస్తోంది. ఆవుపాల సేకరణతో సంస్థకు ఆదాయం కంటే నష్టమే ఎక్కువగా వస్తోందని ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు వాపోయారు. మరోవైపు సంస్థలో టన్నుల కొద్దీ పాలపొడి నిల్వలు పేరుకుపోయినట్లు సమాచారం. మార్కెటింగ్‌లో బలహీనంరాష్ట్రంలో గేదె పాలకంటే ఆవు పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్లు సమాచారం. ఆవు పాలకు ప్రైవేట్ సంస్థలకంటే విజయ డెయిరీ అధిక ధర ఇస్తుండటంతో రైతులు ఆవు పాలు ఈ సంస్థకు పోస్తూ.. గేదె పాలను స్థానికంగా అధిక ధరకు అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. ప్రైవేట్ డెయిరీలు డీలర్లకు లీటర్‌పై దాదాపు రూ.10 వరకు మార్జిన్ ఇస్తుండగా, విజయ డెయిరీ రూ.5–6 మాత్రమే ఇస్తోంది. దీంతో డీలర్లు ఈ సంస్థ పాలు, పాల ఉత్పత్తులు అమ్మేందుకు ముందుకు రావటంలేదని సమాచారం. తన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడంలోనూ సంస్థ విఫలమవుతోందన్న విమర్శలు కూడా ఉంది. దీంతో ప్రైవేట్ సంస్థలతో పోటీని తట్టుకోవడంలో విజయ డెయిరీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అంగన్వాడీలకు ప్రస్తుతం లక్ష లీటర్ల పాలను విక్రయిస్తున్నట్లు, అలాగే గురుకులాలకు కూడా పాలను సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని దేవాలయాలకు ఈ సంస్థ నెయ్యిని సరఫరా చేస్తోంది. -
పొంగిన పాల సేకరణ ధర
సాక్షి, అమరావతి: ‘జగనన్న పాల వెల్లువ’ ద్వారా పాలను సేకరిస్తున్న అమూల్ సంస్థ తాజాగా నాలుగోసారి పాలసేకరణ ధరను పెంచింది. ఇటీవలే ఆవుపాలపై లీటర్‌కు గరిష్టంగా రూ. 4.12 చొప్పున పెంచగా, తాజాగా గేదె పాలపై రూ.3.93 పెంచింది. అంతేకాక.. పాలుపోసే రైతులతోపాటు సొసైటీలకు అదనపు ప్రోత్సాహకాలను ప్రకటించింది. నెలకు 200 లీటర్లకు పైబడి పాలుపోసే రైతులకు రూ.2.50 వరకు అదనపు ప్రయోజనం చేకూర్చనుంది. మహిళా పాడిరైతు సంఘాల కార్యదర్శులు, సహాయ కార్యదర్శులకు ప్రత్యేక ప్రోత్సాహం కింద లీటర్‌కు పావలా చొప్పున ఇవ్వనున్నారు. ఆదివారం నుంచి ఈ పెంపు, ప్రోత్సాహకాలు అమలులోకి రానున్నాయి. 20 నెలల్లో రూ.181.90 కోట్ల చెల్లింపు ‘జగనన్న పాలవెల్లువ’ కింద 2020 డిసెంబర్లో మూడు జిల్లాల్లో పాల సేకరణకు శ్రీకారం చుట్టగా, 20 నెలల్లో 15 జిల్లాలకు (పునర్విభజన తర్వాత) విస్తరించారు. 2,344 గ్రామాల్లో 2,34,548 మంది నమోదు కాగా, రోజుకు 1.06 లక్షల మంది పాలుపోస్తున్నారు. ఇప్పటివరకు 4.20 కోట్ల లీటర్ల పాలను సేకరించగా రూ.181.90 కోట్లు చెల్లించారు. అమూల్ తరఫున రాయలసీమలో కైరా, కోస్తాంధ్రలో సబర్కాంత్, ఉత్తరాంధ్రలో బనస్కాంత్ యూనియన్లు పాలు సేకరిస్తున్నాయి. ఇక విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ట్రయిల్ రన్ నిర్వహిస్తుండగా.. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో సర్వే జరుగుతోంది. వీటితో పాటు మిగిలిన అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, శ్రీబాలాజీ జిల్లాల్లో డిసెంబర్‌లోగా విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాలుగోసారి పాలసేకరణ ధర పెంపు పథకం ప్రారంభించినప్పుడు లీటర్‌కు గరిష్టంగా 11 శాతం వెన్న, 9 శాతం ఎస్ఎన్ఎఫ్ (వెన్నలేని ఘన పదార్థాలు)తో గేదె పాలకు రూ.71.47లు, 5.4 శాతం వెన్న, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో ఆవు పాలకు రూ.34.20 చొప్పున చెల్లించిన అమూల్ సంస్థ గడిచిన 20 నెలల్లో మూడుసార్లు పాలసేకరణ ధరలను పెంచింది. ప్రస్తుతంు లీటర్ గేదె పాలకు గరిష్టంగా రూ.80.22, ఆవుపాలకు రూ.37.90 చొప్పున చెల్లిస్తుండగా తాజాగా అమూల్ తరఫున ఉత్తరాంధ్రాలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్ జిల్లా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ నాలుగోసారి పాల సేకరణ ధర పెంచింది. ఇటీవలే ఆవు పాలకు లీటర్‌పై గరిష్టంగా రూ.4.12ల చొప్పున పెంచిన యూనియన్, తాజాగా గేదె పాలపై లీటర్‌కు రూ.3.93 చొప్పున పెంచింది. దీంతో గరిష్టంగా ఆవుపాల ధర లీటర్ రూ.40.73లకు చేరగా, తాజాగా గేదె పాలు ధర లీటర్‌కు రూ.84.15కు చేరనుంది. అమూల్ సంస్థ గడిచిన 20 నెలల్లో గేదె పాలపై రూ.12.68, ఆవు పాలపై రూ.6.53ల మేర పెంచింది. పాడి రైతులకు ప్రోత్సాహకాలు పాల సేకరణ ధర, రాయల్టీ బోనస్ కాకుండా పాలుపోసే రైతులతో పాటు సొసైటీ నిర్వాహకులకు అదనంగా ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ ప్రోత్సాహకాలను ప్రతీనెలా 7వ తేదీన చెల్లించనుంది. పాలుపోసే సామర్థ్యాన్ని బట్టి లీటర్‌కు రూ.0.75 నుంచి రూ.2.25ల వరకు రైతులకు ప్రోత్సాహకాలను అందించనుంది. ఇక సొసైటీ కార్యదర్శులు, సహాయ కార్యదర్శులకు సైతం లీటర్‌పై పావలా రాయితీని ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధంగా ప్రతీ సొసైటీ పరిధిలో ఒక రూపాయి నుంచి రూ.2.50 వరకు అదనపు ప్రోత్సాహం అందుకోనున్నారు. ప్రైవేటు డెయిరీల పరిధిలో.. ఇక అమూల్ రాకతో పోటీని తట్టుకోలేక ప్రైవేటు డెయిరీలు సైతం పాలసేకరణ ధరను విధిగా పెంచాల్సి వచి్చంది. ఫలితంగా వాటికి పాలుపోసే పాడి రైతులకు అదనపు మేలు చేకూరింది. గతంలో ఎన్నడూలేని రీతిలో లీటర్‌పై రూ.12 నుంచి రూ.15ల వరకు ఆయా డెయిరీలు పెంచాల్సి వచ్చింది. ఫలితంగా 20 నెలల్లో ఏకంగా రూ.2,020.46 కోట్ల మేర రైతులకు అదనపు లబ్ధిచేకూరినట్లుగా అంచనా వేశారు. 20 నెలల్లో నాలుగోసారి పెంపు.. జగనన్న పాల వెల్లువ కింద పాలుపోసే పాడి రైతులకు అమూల్ తరఫున ఉత్తరాంధ్రలో పాలు సేకరిస్తున్న బనస్కాంత్ యూనియన్ నాలుగోసారి పాలసేకరణ ధరను పెంచడంతోపాటు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. తాజా పెంపుతో సుమారు 40వేల మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 15 జిల్లాల్లో పాలు సేకరిస్తున్నాం. డిసెంబర్ నెలాఖరుకల్లా మిగిలిన జిల్లాలకు విస్తరించేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. – అహ్మద్‌బాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ -
Reindeer: దుప్పి పాలు రుచి చూస్తారా!
పాలు అంటే మనకు సాధారణంగా గుర్తుకు వచ్చేది అవులు, గేదెలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో మేకపాలు, గొర్రె పాలు కూడా తాగుతారన్న విషయం మనకు తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో పాల కోసం దుప్పి (రైన్డీర్)ని పెంచుతారన్న విషయం మీకు తెలుసా? స్కాండినేవియా ప్రాంతంలో ఈ రైన్డీర్ పాలు వినియోగిస్తారు. అతి తక్కువ పరిమాణంలో లభించే ఈ పాలను పోషకాల ఘనిగా చెప్పవచ్చు. ఈ పాలలో 20 శాతం కొవ్వు 10 శాతం ప్రొటీన్లు ఉంటాయి. అయితే ఒక్కో రైన్డీర్ రోజుకి ఒకటి నుంచి రెండు కప్పుల పాలు మాత్రమే ఇస్తుంది. భౌగోళిక, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏఏ జంతువుల పాలు వినియోగిస్తారో చూద్దాం.. ఒంటె (సోమాలియా, కెన్యా) ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే పాడి జంతువు ఒంటె. ఇవి సుమారు వారం రోజుల పాటు నీరు తాగకుండా జీవించగలవు. సోమాలియా, కెన్యాలు ప్రపంచంలో అత్యధికంగా ఒంటె పాలను ఉత్పత్తి చేస్తున్న దేశాలు. ఒంటెలు రోజుకు 5 నుండి 20 లీటర్ల పాలు ఇస్తాయి. ఆవు పాలతో పోల్చితే ఒంటె పాలు చిక్కగానూ, రుచిలో కాస్త ఉప్పగానూ ఉంటాయి. గేదె (ఇండియా, పాకిస్తాన్) ఇండియా, పాకిస్తాన్లలో పాల ఉత్పత్తికి ప్రధాన ఆధారం పాడి గేదెలు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పరిమాణంలో 80 శాతానికిపైగా గేదె పాలు ఈ రెండు దేశాల్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. గేదెలు ఆవుల కన్నా ఎక్కువ పాల దిగుబడిని ఇస్తాయి. భారత్‌లో గుజరాత్‌లోని సూరత్ చుట్టు పక్కల ప్రాంతాల్లో గేదె పాలతో తయారుచేసే ‘సూర్తి పనీర్’ అనే మృదువైన జున్ను (చీజ్)కు విశేషమైన గుర్తింపుఉంది. సాహివాల్ (ఇండియా, పాకిస్తాన్) ఇండియా, పాకిస్తాన్లలో ప్రధానంగా కనిపించే మరో పాడి ఆవు సాహివాల్. ఇది పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం సాహివాల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో వృద్ధి చెందిన దేశవాళీ ఆవు. మన దేశంలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దేశీ జాతి ఆవులు కనిపిస్తాయి. వీటిలో రోజుకు 10 నుంచి 15 లీటర్ల పాల దిగుబడి సామర్థ్యం ఉంది. పాలలో వెన్న 5 నుంచి 10 శాతం వరకు ఉంటుంది. గుర్రం (మంగోలియా) గుర్రాలను ఎందుకు వినియోగిస్తారో అందరికీ తెలుసు. కానీ గుర్రం పాల గురించి చాలా మందికి తెలీదు. మంగోలియాలో గుర్రాలను వ్యవసాయంతోపాటు పాల ఉత్పత్తికి వాడుతున్నారు. ఇక్కడ గుర్రపు పాలను 24 నుంచి 48 గంటలపాటు పులియబెట్టి, చిలకడం ద్వారా కౌమిస్ (లేదా ఐరాగ్) అనే పానీయాన్ని తయారు చేస్తారు. పుల్లగా ఉండే ఈ పానీయంలో 2 శాతం ఆల్కహాల్ ఉండటం విశేషం. యాక్ (జడల బర్రె) / (టిబెట్) యాక్ (జడల బర్రె) హిమాలయ ప్రాంతానికి చెందిన పాడి జంతువు. వీటి నుండి పాలతోపాటు ఉన్ని, మాంసం ఉత్పత్తి చేస్తున్నారు. చలికాలంలో కంటే వేసవిలో ఎక్కువ పాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. ఆవు పాలతో పోల్చితే జడల బర్రె పాలలో కొవ్వులు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీటి పాలతో వెన్న, వివిధ రకాల చీజ్‌లను తయారు చేస్తారు. మేక (ఫ్రాన్స్) ఫ్రాన్స్‌లో మేక పాలు విరివిగా వినియోగిస్తున్నారు. ఇక్కడ మేక పాలను రకరకాల చీజ్ల తయారీలో ఉపయోగిస్తారు. సహజసిద్ధంగా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండటం వల్ల మేక పాలను చర్మ సంరక్షణకు, సౌందర్య సాధనాల (కాస్మొటిక్స్) తయారీకి వినియోగిస్తున్నారు. మేక పాలలో కంటి చూపుకు మేలు చేసే ఎ–విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. రైన్డీర్ (పలవల దుప్పి)/ (ఫిన్‌ల్యాండ్) రైన్డీర్ పాలు చాలా అరుదుగా లభిస్తాయి. స్కాండినేవియా భూభాగంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రైన్డీర్లు సంచరిస్తున్నాయి. ఇవి రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల పాలు మాత్రమే ఇస్తాయి. ఈ పాలలో 20 శాతం కొవ్వు పదార్థం ఉండటంతో చిక్కదనంతో పాటు రుచిగా ఉంటాయి. ఫిన్‌ల్యాండ్‌లో రైన్డీర్ పాలను ‘లేపజువస్టో’ అనే జున్ను తయారీకి వాడతారు. గొర్రె (గ్రీస్) గొర్రె పాలకు గ్రీస్ ప్రసిద్ధి చెందింది. ఆవు పాలతో పోల్చితే గొర్రె పాలలో కొవ్వు శాతం ఎక్కువ. అందువల్ల ఇవి చీజ్ తయారీకి అత్యుత్తమైనవి. గ్రీస్‌లో గొర్రె పాలతో ఎన్నో వెరైటీల చీజ్‌లను తయారు చేస్తున్నప్పటికీ ‘ఫెటా చీజ్’ అనే వెరైటీని ఇక్కడ ఎక్కువ మంది ఇష్టపడతారు. గొర్రె పాలలో అధికంగా ఉండే కాల్షియం మన దంతాలను, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మూస్ (రష్యా, స్వీడన్) ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదుగా లభిస్తున్న మూస్ పాలను రష్యా, స్వీడన్ దేశాలలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. మూస్ రోజుకు 1 నుండి 6 లీటర్ల పాలను ఇస్తుంది. మూస్ పాలతో తయారయ్యే చీజ్ (మూస్ చీజ్) ప్రపంచంలో అత్యంత ఖరీదైన చీజ్‌గా గుర్తింపు పొందింది. ప్రపంచంలో మూస్ చీజ్‌ను తయారు చేస్తున్న ఏకైక కేంద్రం (మూస్ హౌస్) స్వీడన్‌లోని బ్జుర్హోమ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మూడు వెరైటీలతో మూస్ చీజ్‌లను తయారు చేస్తున్నారు. గాడిద పాలు గాడిద పాలు మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కలిగిఉన్నట్లు ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ప్రకటించింది. రోగ నిరోధక శక్తిని పెంచే మెడిసినల్ వ్యాల్యూస్ కూడా గాడిద పాలలో ఉన్నాయి. విటమిన్లు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెండ్లు పుష్కలంగా ఉంటాయి. గాడిద పాలు స్నానానికి ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుందని, చర్మ సంరక్షణ కలుగుతుందని శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. క్రీస్తు పూర్వం ఈజిప్టు రాణి క్లియో పాత్ర తన బ్యూటీని కాపాడుకోవడానికి గాడిద పాలతోనే స్నానం చేసేదట. ఇప్పటికీ అందానికి కేరాఫ్ అడ్రస్‌గా ఆమెనే చెబుతారు. -
పాపం.. క్షీరదాలు!
అమ్మ పాలు అమృతం.. గేదె పాలు బలవర్థకం.. ఆవు పాలు ఔషధం.. కొందరికి ఖరము పాలు పథ్యం.. పాల కడిలి నుంచే కదా అమృతం పుట్టింది. అయితే ఇప్పుడు అలాంటి పాలను కాలకూట విషంగా మార్చేస్తున్నారు. స్వార్థ బుద్ధితో.. డబ్బుపై పేరాశతో చుట్టూ ఉన్నవారు చచ్చినా.. గేదెలు కృశించి పోయినా కావాల్సింది పచ్చనోట్లే.. వాటినే తింటారేమో.. ఛీ... సాక్షి, చీరాల (ప్రకాశం): అన్నింటి కంటే పాలు స్వచ్ఛంగా ఉంటాయని అందరి విశ్వాసం. కానీ ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం పాల వెనుక కూడా విషం అనే నిజం పడగెత్తుతోంది. తెల్లటి పాల నురగలో విషం కూడా దాగి ఉందనేని నమ్మశక్యం కాని నిజంగా మారింది. స్వార్థం కోసం పాలను విషతుల్యం చేస్తున్నారు. అవి తాగిన వారు అనేక వ్యాధులకు గురవుతుండగా పశువులు వ్యాధుల బారిన పడి కబేళాలకు తరలి వెళ్తున్నాయి. పశుపోషకులు, పాల ఉత్పత్తిదారులు గేదెల ఫాం యజమానులు పాల దిగుబడుల కోసం అర్రులు చాస్తున్నారు. దిగుబడులతో ఎక్కువ లాభాలను గడించాలనే ఆశతో పాడి గేదెలకు చెందిన దూడలని సరిపడా పాలు తాగనీయకుండా తల్లి నుంచి దూరం చేస్తున్నారు. దీంతో పిల్లలకు పాలు సరిపోక అనారోగ్యానికి గురై పుట్టిన కొన్ని నెలలకే మృత్యువాతపడుతున్నాయి. గేదెకు పొదుగు నుంచి రొమ్ముల వరకు పాలు రావాలంటే దూడ కొద్దిసేపు పొదుగు వద్ద సేపేందుకు (దూడ పాలు లాగడం) ప్రయత్నం చేయాల్సి ఉంది. కానీ దూడలు పాలు తాగేస్తున్నాయనే ఉద్దేశంతో వాటిని వెంటనే దూరం చేస్తున్నారు. దూడ లేకుంటే మిగులు పాలన్నీ అమ్మవచ్చనే దురాలోచనతో దూడ బదులు నిషేధిత డ్రగ్ అక్సోటాసిన్ ఇంజక్షన్లను రోజుకు రెండుసార్లు గేదెలకు వేసి మొత్తం పాలు పిండుతున్నారు. ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌లో అనేక రకాల హార్మోన్లుంటాయి. గేదె సేపాలంటే దూడ కనీసం పది నిమిషాల పాటు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కానీ రూ.5ల విలువైన ఆక్సిటోసిన్ ఒక్క ఇంజక్షన్ వేస్తే చాలు క్షణాల్లో గేదెసేపి పూర్తి అయి పొదుగు నుంచి పాలు కారిపోతాయి. అంత ప్రమాదకర హర్మోన్లు ఉండే ఈ ఇంజక్షన్లను నోరులేని జీవాలు తట్టుకోవడం చాలా కష్టం అయినా అక్రమార్కులు తమ పని మానుకోవడంలేదు. ఆక్సిటోసిన్ పాలు తాగితే అనర్థాలు పాలు తాగితే ఆరోగ్యమంటారు. కానీ ఆక్సిటోసిన్ ఇంజక్షన్ వాడిన గేదెల పాలు తాగితే అనేక అనర్థాలు వస్తాయని వైద్యులు అంటున్నారు. ప్రమాదకర హార్మోన్లు కలిసిన ఈ పాలు తాగితే క్యాన్సర్ వంటి జబ్బులు వస్తాయి. కళ్ల జబ్బులతో పాటు ఆడ పిల్లలు చిన్న వయస్సులోనే మెచ్యూర్ కావడం, వక్షోజాలు పెరగడంతో పాటు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకరమైన హార్మోన్లు ఉన్న ఈ ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌ను ప్రభుత్వం పదేళ్ల క్రితంమే నిషేధించింది. ప్రమాదకరమైన హార్మోన్లు ఉన్న ఈ ఇంజక్షన్లను పాడి గేదెలకు వేయడం వలన గేదెలు యదకు రాకపోవడం, గర్భసంచి వంటి జబ్బులతో పాటు తక్కువ కాలానికే ఆ గేదెలు చనిపోతున్నాయి. ఎక్కడ కావాలంటే అక్కడ.. ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు వాడిన గేదె పాలు తాగిన వారికి రోగాలతో పాటు పశువులు కూడా అంతరించిపోతున్నాయనే ఉద్దేశంతో చాలా కాలంగా ఈ ఇంజక్షన్లను ప్రభుత్వం నిషేధించింది. కానీ చాటుమాటున ఆ ఇంజక్షన్లు చెన్నై ద్వారా మన రాష్ట్రానికి తరలించి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. చీరాలలోని బెస్తపాలెం వద్ద ఉన్న ఒక పశువుల మెడికల్ షాపు, నల్లగాంధీ బొమ్మసెంటర్తో పాటు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇవి పుష్కలంగానే దొరుకుతున్నాయి. నిషేధిత డ్రగ్‌ను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. అయినా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మూమూళ్ల మత్తులో పడి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పశువులకు ప్రమాదకరం ప్రొట్యూటరీ అనే గ్రంథి ద్వారా ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజక్షన్లు తయారవుతాయి. ప్రమాదకరమైన హార్మోన్లు ఉండటం వలన గేదెలు తట్టుకోలేక ఎదకు రాకపోవడం, గర్భం దాల్చినా మధ్యలోనే చనిపోయిన దూడలను వదలడంతో పాటు గర్భాశయం చుట్టూ ఉన్న కండరాలు వదులై గర్భాశయ సమస్యలు ఏర్పడతాయి. - పశువైద్యాధికారి టి.శివారెడ్డి ప్రమాదకరం ఆక్సీటోసిన్ పాలలో రోగాలను కలుగజేసే క్రిములు చాలా ఉంటాయి. ఆ క్రిములు శరీరంలోకి వెళితే అనారోగ్య పాలవడం ఖాయం. అటువంటి ఇంజక్షన్లు గేదెలకు వేసిన క్షణంలోనే గేదె పొదుగు నిండి పాలు కారుతుంటాయి. – పి. జయమ్మ సహజసిద్ధమైన పాలు శ్రేష్టం సహజ సిద్ధమైన పాలను మాత్రమే తాగాలి. ముఖ్యంగా చిన్న బిడ్డలకు బయట దొరికే పాలను పట్టించకూడదు. ఇంజక్షన్లు వేసిన పాలు ప్రమాదకరం. అధికారులు తగిన చర్యలు తీసుకుని అక్రమార్కులను అరికట్టాలి. –పి. మాధవి -
పాలభారతం
పుట్టినప్పుడు మొట్టమొదటిగా మన గొంతు తడిపేవి తల్లిపాలు మాత్రమే. ఎదుగుతున్న కొద్దీ ఆవుపాలు, గేదెపాలు తాగుతాం. పిల్లల ఎదుగుదలకే కాదు, రోగులు త్వరగా కోలుకోవడానికీ, వయోవృద్ధులు సత్తువ కోల్పోకుండా ఉండటానికీ పాలను మించిన పోషక పానీయమేదీ లేదు. శారీరక శక్తికి అవసరమైన అత్యంత కీలకమైన పోషక పదార్థాల్లో చాలా వరకు పాలలోనే ఉంటాయి. పోషకాహార పదార్థాల జాబితా నుంచి పాలను మినహాయించడం సాధ్యం కాదు. శ్వేతవిప్లవం తర్వాత మన దేశం పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది. ఇదొక ఘన విజయం. స్వార్థశక్తుల కారణంగా పాలు కల్తీకి లోనవుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాలేవీ పాల కల్తీని అరికట్టలేకపోతున్నాయి. ఇదొక దారుణ వైఫల్యం. ప్రపంచ పాల దినోత్సవం (జూన్ 1) సందర్భంగా పాల గురించి, కల్తీ పాపాల గురించి కొన్ని సంగతులు... సహజసిద్ధంగా దొరికే పాలు నిస్సందేహంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శైశవ దశ వరకు మాత్రమే పిల్లలు తల్లిపాలపై ఆధారపడతారు. ఆ తర్వాత పిల్లలకు క్రమంగా ఆవుపాలు లేదా గేదెపాలు అలవాటు చేస్తారు. మేక, గొర్రె, ఒంటె, గుర్రం, గాడిద వంటి జంతువుల పాలు కూడా అక్కడక్కడా వాడుకలో ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడుకలో ఉన్నవి ఆవుపాలు, గేదెపాలు మాత్రమే. వివిధ రకాల పాల ఉత్పత్తులు కూడా ఆవుపాలు, గేదెపాలతోనే ఎక్కువగా తయారు చేస్తారు. ఆవుపాలతో పోలిస్తే గేదెపాలలో ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు కాసింత ఎక్కువగా ఉంటాయి. అయితే, ఆవుపాలు తేలికగా అరుగుతాయి. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు గేదెపాల కంటే ఆవుపాలు తీసుకోవడమే మేలు. అలాగే, తల్లిపాలు చాలని పసిపిల్లలకు కూడా ఆవుపాలు పట్టడమే క్షేమమని నిపుణులు చెబుతారు. కండరాల ఆరోగ్యానికి, ఎముకల దారుఢ్యానికి, కంటిచూపు బాగుండటానికి, రక్తహీనత నుంచి రక్షణకు పాలు ఎంతగానో దోహదపడతాయి. ఆరోగ్యంగా ఉండటానికి అన్ని వయసుల వారికీ పాలు చాలా అవసరం. స్వచ్ఛమైన పాలు గుక్కెడైనను చాలు... తెల్లనివన్నీ పాలు కాదని నానుడి. పాలన్నీ తెల్లగానే ఉంటాయి గాని తెల్లనివన్నీ పాలు కాదు. మరీ ముఖ్యంగా పాల పేరిట అందమైన ప్యాకెట్లలో మార్కెట్లను ముంచెత్తుతున్నవన్నీ స్వచ్ఛమైన పాలు కానేకాదు. ఇదివరకటి సత్తెకాలంలో పాలలో కాసిన్ని నీళ్లు కలిపితేనే జనం గగ్గోలు పెట్టేవారు. పాలను నీళ్లతో కల్తీచేసే పాడు రోజులు దాపురించాయని వాపోయేవారు. ఇప్పుడు కల్తీకాలం మరింత ముదిరింది. నీళ్లేమిటి ఖర్మ పాలలో ఏకంగా పిండి, వనస్పతి, యూరియా, డిటర్జెంట్, ఫార్మాలిన్ సహా నానా ప్రమాదకర రసాయనాలను ఎడాపెడా కలిపేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో యథేచ్ఛగా చెలగాటమాడుతున్నారు. పాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి కోసం ‘క్షీర విప్లవం’ చేపట్టిన మన దేశంలోనే కల్తీపాల వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వరంగ డెయిరీ సంస్థలు స్వచ్ఛమైన పాలనే అందిస్తూ వస్తున్నా, సాక్షాత్తు పాలకులే ప్రైవేటు డెయిరీలకు కొమ్ము కాస్తుండటంతో కల్తీపాల వ్యాపారానికి అడ్డు లేకుండా పోతోంది. మనదేశంలో ప్యాకెట్లలో లభించే పాలలో ఏకంగా 68 శాతం మేరకు కల్తీ పాలేనని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏ) గత ఏడాది చేపట్టిన అధ్యయనంలో తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛమైన పాలు గుక్కెడైనను చాలు అనుకోవాల్సి వస్తోంది. పాల ఉత్పాదన... వినియోగం... పాల ఉత్పాదనలో మన దేశం ముందంజలోనే ఉన్నా, తలసరి పాల వినియోగంలో మాత్రం కొంత వెనుకబడే ఉంది. వర్ఘీస్ కురియన్ తెచ్చిన క్షీర విప్లవం (వైట్ రివల్యూషన్) పుణ్యమాని పాల ఉత్పాదనలో మన దేశం పూర్తి స్వయంసమృద్ధి సాధించగలిగింది. కురియన్ తెచ్చిన క్షీర విప్లవం ప్రపంచంలోనే అతిపెద్ద పాడి అభివృద్ధి కార్యక్రమంగా గుర్తింపు పొందింది. స్వాతంత్య్రం వచ్చిన తొలి పాతికేళ్లలో మన దేశంలో పాలకు విపరీతమైన కొరత ఉండేది. ఆ కొరత తీర్చడానికి ప్రభుత్వం 1965లో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. అప్పటికే గుజరాత్‌లోని ఆనంద్ కేంద్రంగా పాడి సహకార సంస్థ ‘అమూల్’ను విజయవంతం చేసిన వర్ఘీస్ కురియన్ను అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్‌గా నియమించారు. ‘అమూల్’ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే లక్ష్యంతో ‘ఆపరేషన్ ఫ్లడ్’ పేరిట చేపట్టిన క్షీర విప్లవం సత్ఫలితాలను సాధించింది. దేశవ్యాప్తంగా పాల ఉత్పాదన ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఫలితంగా ప్రపంచ స్థాయిలోనే పాల ఉత్పత్తిలో భారత్ అగ్రగామిగా ఎదిగింది. కల్తీ అనర్థాలు పాలలో నీళ్లు కలపడం చాలాకాలం నుంచి తెలిసినదే. నీళ్లు కలిపితే పాలు పలచగా మారిపోతాయి. అలా పలచగా మారకుండా ఉండటానికి, నీళ్లు కలిపినా స్వచ్ఛమైన పాలలా భ్రమింపజేయడానికి కల్తీరాయుళ్లు నానారకాల పదార్థాలను పాలలో కలుపుతున్నారు. యూరియా, పిండి, డిటర్జెంట్, వనస్పతి, అమోనియం సల్ఫేట్, ఫార్మాలిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం బైకార్బొనేట్, బోరిక్ ఆసిడ్ వంటివి ఇష్టానుసారం కలిపేస్తున్నారు. పాల ఉత్పత్తిని పెంచడానికి పాడి పశువులకు ఇష్టానుసారం ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలాచోట్ల ఇలాంటి పద్ధతుల్లో కల్తీ చేసిన పాలనే పాల కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి వివిధ బ్రాండ్ల పేర్లతో ప్యాకెట్లలో కల్తీ పాలు మార్కెట్లోకి వచ్చిపడుతున్నాయి. గత్యంతరం లేని జనాలు ఈ పాలనే తాగుతూ రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. కేవలం పాలను మాత్రమే కాదు, పాల ఉత్పత్తులను కూడా కల్తీరాయుళ్లు యథాశక్తి కల్తీ చేసి పారేస్తున్నారు. పెరుగు, వెన్న, నెయ్యి, కోవా, పనీర్, రబ్డీ వంటి పాల ఉత్పత్తుల్లో పిండి, వనస్పతి, బ్లాటింగ్ పేపర్, కృత్రిమ రంగులు కలుపుతున్నారు. అధికారులు అప్పుడప్పుడూ దాడులు చేస్తూ కల్తీరాయుళ్లను పట్టుకుంటున్నా, పాల కల్తీని పూర్తిగా కట్టడి చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. సహజసిద్ధమైన పాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో, కల్తీ పాలు ఆరోగ్యానికి అంతకు రెట్టింపు చేటు చేస్తాయి. కల్తీ పాల వల్ల జీర్ణకోశ సమస్యలు, కిడ్నీ వ్యాధులు, గుండెజబ్బులు తలెత్తుతాయి. చక్కెర జబ్బు, అధిక రక్తపోటు ఉన్న రోగులు ఇలాంటి కల్తీ పాలు తాగితే వారి పరిస్థితి మరింత విషమించే ప్రమాదం కూడా లేకపోలేదు. ప్రైవేటు పా‘పాలు’ మన దేశంలో కల్తీపాలు మార్కెట్‌ను ముంచెత్తడానికి ప్రైవేటు డెయిరీ సంస్థలే ప్రధాన కారణం. లాభార్జనే ధ్యేయంగా గల ప్రైవేటు డెయిరీ సంస్థలు నానారకాల ప్రమాదకర రసాయనాలతో పాలను కల్తీ చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. తెలుగు రాష్ట్రాలనే నమూనాగా తీసుకుంటే పాల కల్తీ పరిస్థితి అర్థమవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో ప్రభుత్వరంగ సంస్థగా ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ‘విజయ’ బ్రాండ్‌తో పాల ప్యాకెట్లను మార్కెట్లోకి తెచ్చింది. తర్వాత క్రమంగా ప్రైవేట్ డెయిరీ సంస్థలు రంగప్రవేశం చేశాయి. ‘విజయ’ డెయిరీ నాణ్యత గల పాలను అందిస్తుండగా, ప్రైవేటు సంస్థలు ఉత్పత్తిని పెంచుకోవడానికి నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చేశాయి. ముఖ్యంగా ‘హెరిటేజ్’ సంస్థ డెయిరీ రంగంలోకి అడుగుపెట్టాక ‘విజయ’ వెనుకబడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సంస్థ అయిన ‘హెరిటేజ్’కు లాభాల పంట పండించాలనే లక్ష్యంతోనే అప్పటి ప్రభుత్వం ‘విజయ’ డెయిరీని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వివిధ డెయిరీ సంస్థలకు చెందిన పాల నమూనాలను నిర్వహించగా, హెరిటేజ్ సహా పదకొండు ప్రైవేటు డెయిరీ సంస్థలు సరఫరా చేస్తున్న పాలలో డిటర్జెంట్, ఇతర రసాయనాలు ఉన్నట్లు తేలింది. చిన్నా చితకా స్థాయిలో కల్తీలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్న అధికార యంత్రాంగం కల్తీలకు పాల్పడుతున్న బడా డెయిరీ సంస్థలపై చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు లేవు. పాల కోసం మనుషులు పశువులను పెంచడం పదివేల ఏళ్ల కిందటే మొదలైంది. పలు ప్రాచీన నాగరికతలు పాలను పవిత్ర పానీయంగా భావించేవి. వివిధ దేశాల పౌరాణిక సాహిత్యంలో పాలకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటికి ప్రాచీన ఈజిప్షియన్లు భారీ స్థాయిలో పాడి పశువులను పెంచేవారు. విరివిగా పాలను వినియోగించేవారు. పాలను తోడుబెట్టి పెరుగు తయారు చేయడం, వెన్న సేకరించడం వంటి ప్రక్రియలు క్రీస్తుపూర్వం 5000 సంవత్స రాల నాటికే మానవులకు తెలుసు. ప్రాచీనకాలంలోనే భారతీయులు పాలతో రకరకాల వంటకాలను తయారు చేసేవారు. ప్రాచీన రోమన్, ఈజిప్షియన్ మహిళలు గాడిద పాలను సౌందర్య సాధనంగా వాడేవారు. క్లియోపాత్రా, నీరో చక్రవర్తి భార్య స్పోరస్ ఏకంగా గాడిద పాలతో స్నానం చేసేవారు. సోయాగింజలతో కృత్రిమ పాలను తయారు చేసే ప్రక్రియ చైనాలో క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది కాలంలో మొదలైంది. చాలాకాలం వరకు మిగిలిన ప్రపంచానికి సోయాపాల గురించి తెలియదు. అమెరికన్ మార్కెట్లో మొదటిసారిగా 1979లో సోయాపాలు అందుబాటులోకి వచ్చాయి. కొందరు శుద్ధ శాకాహారులు పాడిపశువుల నుంచి సేకరించిన సహజమైన పాల బదులు సోయాపాలు తాగడం ఫ్యాషన్‌గా కూడా మారింది. ఫ్రెంచి శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ 1863లో పాశ్చరైజేషన్ ప్రక్రియను కనిపెట్టిన తర్వాత పాలలోని సూక్ష్మజీవులను నాశనం చేసి, పాలను సురక్షితంగా సరఫరా చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. పారిశ్రామికీకరణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పాలకు గిరాకీ పెరగడమే కాదు, పాల ఉత్పాదన కూడా గణనీయంగా పెరిగింది. ప్రపంచంలోనే తొలి డెయిరీ సంస్థ న్యూయార్క్ డెయిరీ కంపెనీ 1877లో మొదలైంది. అప్పట్లో ఈ సంస్థ గాజు సీసాల్లో పాలను ప్యాక్‌చేసి సరఫరా చేసేది. పాలకు ప్రత్యామ్నాయాలు ఆవుపాలు, గేదెపాలలో ఉండే ల్యాక్టోజ్ కొందరికి సరిపడదు. అలాంటి వాళ్లకు పాలలోని పోషకాలు అందాలంటే వారికి తగిన ప్రత్యామ్నాయం సోయాపాలు. సోయా గింజలను నానబెట్టి, బాగా నీరు చేర్చి రుబ్బి సోయాపాలు తయారు చేస్తారు. పాడి పశువుల పాలకు దీటుగా సోయాపాలలోనూ ప్రొటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాడి పశువుల పాలు సరిపడని వారు మాత్రమే కాదు, జంతు సంబంధ ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండే శుద్ధ శాకాహారులు (వీగన్స్) కూడా పాడి పశువుల పాలకు బదులుగా సోయాపాలు, సోయాపాల ఉత్పత్తులను విరివిగా వాడుతున్నారు. ఆవుపాలు, గేదెపాలతో తయారయ్యే పనీర్ బదులుగా సోయాపాలతో తయారయ్యే తోఫుతో కూడా రకరకాల వంటకాలను ఆస్వాదిస్తున్నారు. పాడి పశువుల పాలకు బదులుగా కొందరు కొబ్బరి పాలు, బాదంగింజల పాలు వంటివి కూడా విరివిగా వాడుతున్నారు. -
కొన్ని జంతువుల పాలు పసుపు రంగులో ఎందుకుంటాయి?
స్కూల్ ఎడ్యుకేషన్ గేదె పాలు తెల్లగా ఉండటాన్ని, ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు కదా! ఇలా కొన్ని జంతువుల పాలు తెల్లగా ఉండటానికి, మరికొన్ని జంతువుల పాలు తెల్లగా లేకపోవడానికి చాలా ముఖ్య కారణమే ఉంది. ఆవు పాలలో ‘బీటా కెరోటిన్’ అనే పదార్థం కొంచెం ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఆ పాలకు లేత పసుపు రంగు వస్తుంది. గేదె పాలలో ఆ పదార్థం లేకపోవడం వల్ల పాలు తెల్లగా ఉంటాయి. చిన్నపిల్లలకు గేదె పాల కంటే ఆవుపాలు మంచివని చెప్పడానికి.. వాటిలో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా, ఈ బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండటం కూడా కారణం. ఆవుపాలు సులభంగా జీర్ణం కావడమే కాకుండా వాటిలోని బీటా కెరోటిన్ ‘ఎ’ విటమిన్‌గా మార్పు చెంది చిన్నారులకు బాగా ఉపయోగపడుతుంది. పాలలో ఉండే వివిధ పదార్థాల నిష్పత్తిలో ఉన్న తేడాలను బట్టి ఆయా జంతువుల పాల రంగుల్లో తేడాలు ఉంటాయి.