breaking news
bittu
-
రాహుల్ వ్యాఖ్యలతో పార్లమెంట్లో కలకలం
న్యూఢిల్లీ: బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తన మాజీ అనుచరుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూపై విమర్శలు గుప్పించారు. విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో ఈ ఇద్దరు నేతలు ఎదురుపడటంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి, బీజేపీలో చేరిన బిట్టూను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నిరసన తెలుపుతున్న ఎంపీల మధ్య నుండి బిట్టూ వెళ్తుండగా, రాహుల్ గాంధీ ఆయనను చూపిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇదిగోండి.. ఒక ద్రోహి ఇటుగానే వెళ్తున్నారు.. అతని ముఖం చూడండి’ అని ఎద్దేవా చేశారు. అంతటితో ఆగకుండా, బిట్టూ వైపు చేయి చాపి ‘హలో బ్రదర్, నా ద్రోహి మిత్రమా.. కంగారు పడకు, నువ్వు మళ్లీ తిరిగి కాంగ్రెస్‌లోకే వస్తావు" అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.రాహుల్ గాంధీ కరచాలనం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, రవనీత్ బిట్టూ తిరస్కరించారు. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బిట్టూ ఆయనను దేశ శత్రువు అని అభివర్ణించారు. కాంగ్రెస్ దేశాన్ని అమ్మేస్తోందని ఆయన ఆరోపించగా, దానికి బదులుగా బీజేపీయే దేశాన్ని విక్రయిస్తోందని కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య కొద్దిసేపు వాడీవేడీ చర్చ జరిగింది.రవనీత్ బిట్టూ-రాహుల్ గాంధీ మధ్య విభేదాలు ఈనాటివి కావు. 2024లో రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో సిక్కుల గురించి చేసిన వ్యాఖ్యలపై బిట్టూ తీవ్రంగా మండిపడ్డారు. అప్పట్లో రాహుల్‌ను ‘దేశంలోనే నంబర్ వన్ ఉగ్రవాది’ అని బిట్టూ విమర్శించడం పెను దుమారం రేపింది. తాజాగా పార్లమెంట్ వేదికగా జరిగిన ఈ పరిణామం, గత కొంతకాలంగా వీరి మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరాన్ని మరోసారి బహిర్గతం చేసింది. -
పిల్లలు చేసే విచిత్రం
సాయి ప్రణీత్, లిఖిత్, బిట్టు, నీరజ్ ముఖ్య తారలుగా జై రామ్‌కుమార్ దర్శకత్వంలో ఎర్రోజు వెంకటాచారి సమర్పణలో మహ్మద్ అస్లాం నిర్మించిన ‘అంతా విచిత్రమ్’ పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. జి.శ్రీను గౌడ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు భోలే షావలి సంగీతం అందించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత అస్లాం మాట్లాడుతూ– ‘‘వినూత్నమైన కథాంశంతో రామ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను చూసి ఇంప్రెస్ అయిన ఎం. అచ్చిబాబు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు’’ అన్నారు. ‘‘పవన్‌కల్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి సూపర్ హీరోల ఫ్యాన్స్ అయిన కొందరు చిన్నారుల కథాంశమే ఈ చిత్రం’’ అన్నారు రామ్ కుమార్. చిన్నపిల్లలతో రూపొందిన ఈ చిత్రం విజయం సాధించాలని అతిథులుగా పాల్గొన్న రామ సత్యనారాయణ, సాయి వెంకట్, అనంతరాముడు ఆకాంక్షించారు. -
బకెట్లో పడి చిన్నారి మృతి
మహబూబ్‌నగర్(గోపాల్పేట్): బకెట్లో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్పేట మండలం నాగాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, భార్గవి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు బిట్టు(2)ను మంచం మీద పడుకోబెట్టి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా ఈ విషాదం జరిగింది. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ మంచం పక్కనే ఉన్న నీళ్ల బకెట్లో పడి మృతి చెందాడు. బాలుడు బకెట్లో పడ్డ సంగతి ఆలస్యంగా తెలియడంతో అప్పటికే ఘోరం జరిగిపోయింది. చిన్నారి బిట్టు మృతితో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.


