basic salary
-
సర్కారు నమ్మక ద్రోహం!
సాక్షి, అమరావతి: ఐదో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులకు చంద్రబాబు ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది. వారిని మూడో గ్రేడ్ కిందకు మార్చి, బేసిక్ వేతనాన్ని పెంచుతామని జీవో ఇచ్చి, రూపాయి కూడా పెంచకుండా మోసం చేసింది. గ్రామ పంచాయతీల్లో రీ కేటగిరైజేషన్ ప్రక్రియలో పంచాయతీ కార్యదర్శుల్లో అట్టడుగు ఉద్యోగుల కనీస బేసిక్ వేతనం రూ.28,280కి పెంచుతామని గతేడాది నవంబర్ 4న జీవో ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. తీరా దానిని రూ.25,220కి కుదిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు నెలల క్రితం ఇచ్చిన జీవో అమలు జరిగితే రాష్ట్రంలో దాదాపు 8,500 మంది పంచాయతీ కార్యదర్శుల వేతనాలు పెరిగేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వారి ఆశలను వమ్ము చేస్తూ వేతనాలకు కోత పెట్టేసింది. 2019–2020 సంవత్సరాల్లో గ్రామ సచివాలయాల ఉద్యోగ నియామకాల సమయంలో గ్రేడ్–5 సచివాలయ కార్యదర్శులుగా ఉద్యోగాలు పొందిన వారు ఈ ప్రక్రియలో నష్టపోతున్నారు. సంస్కరణల పేరిట జనాభా, వార్షికాదాయం ప్రాతిపదికన రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను కొత్తగా వర్గీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిగా కసరత్తు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3, గ్రేడ్–4, గ్రేడ్–5 కేటగిరీలుగా ఉన్న గ్రామ పంచాయతీలను గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3 పంచాయతీలుగా వర్గీకరించాలని గత ఏడాది అక్టోబర్‌లో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో కేవలం ఐదు శాతం గ్రామ పంచాయతీలను అర్బన్ పంచాయతీలుగా పేర్కొంటూ, వాటి నిర్వహణ బాధ్యతలను డిప్యూటీ ఎంపీడీవోలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఐదు కేటగిరీల్లో కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శులను కేవలం మూడు గ్రేడ్లలో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో చివరి గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శుల కనీస బేసిక్ వేతనం రూ.28,280గా నిర్ణయించి, గతంలో ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా ఆ బేసిక్ వేతనాన్ని రూ.25,220కు తగ్గించేసింది. అభినందన సభ సాక్షిగా మోసం గ్రామ పంచాయతీలను రీ కేటగిరైజేషన్ ద్వారా పంచాయతీ కార్యదర్శులందరికీ పదోన్నతులు వస్తాయని ఆ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. గతేడాది నవంబర్ 4న ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పదోన్నతుల అభినందన సభ కూడా నిర్వహించారు. తాజాగా ప్రభుత్వ నిర్వాకంతో దాదాపు 8,500 మంది పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్–5 నుంచి గ్రేడ్–3కి మారినప్పటికీ, వారి జీతాల్లో రూపాయి కూడా పెరగదని స్పష్టమైంది. ప్రభుత్వం తమను మోసం చేసిందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు.మొదట ప్రకటించిన పేస్కేల్ ఇవ్వాల్సిందే ప్రభుత్వమిచ్చిన జీవో 91లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల అట్టడుగు కేటగిరి ఉద్యోగుల కనీస బేసిక్ వేతనం రూ.28,280గా నిర్ధారించి, ఇప్పుడు దానిని రూ.25,220కు తగ్గించడం అత్యంత అన్యాయమని నవీన పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు బగ్గా జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మార్పు వల్ల గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు ఆర్థికంగా తీవ్ర నష్టం కలగడమే కాకుండా, మరింత భారం పెరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. పే స్కేల్ తగ్గింపు ఉద్యోగుల మనోబలాన్ని దెబ్బతీసే నిర్ణయం అవుతుందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఈ సవరణను ఉపసంహరించుకొని, మొదట ప్రకటించిన విధంగా రూ.28,280 పే స్కేల్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సంఘం తరఫున ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
మరో ఐదు రోజుల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం!
దశాబ్దాల కాలం నాటి ‘ఆదాయపు పన్ను చట్టం 1961’ మరికొద్ది రోజుల్లో చరిత్ర పుటల్లోకి వెళ్లనుంది. దీని స్థానంలో ఆధునికమైన, పారదర్శకమైన ‘ఆదాయపు పన్ను చట్టం 2025’, ‘ఆదాయపు పన్ను నియమాలు 2026’ అమలులోకి రానున్నాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ మార్పులు అమలు కానున్న నేపథ్యంలో వేతన జీవులు తమ పన్ను ప్రణాళికలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.కొత్త చట్టం వస్తోంది కదా అని ప్రస్తుత పన్ను చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పాత, కొత్త చట్టాల మధ్య స్పష్టమైన విభజన రేఖను గీసింది.2025-26 ఆర్థిక సంవత్సరం: ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు మీరు సంపాదించిన ఆదాయంపై పాత చట్టం (1961) ప్రకారమే పన్ను విధిస్తారు. దీనికి సంబంధించిన రిటర్నులను 2026 జూలైలో సమర్పించాల్సి ఉంటుంది.2026-27 ఆర్థిక సంవత్సరం: ఏప్రిల్ 1, 2026 తర్వాత సంపాదించే ఆదాయానికి మాత్రమే కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 వర్తిస్తుంది.ఆటోమేటెడ్ రిటర్న్స్: తప్పులకు తావులేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నోటిఫై చేసిన కొత్త నిబంధనల ప్రకారం, భవిష్యత్తులో పన్ను చెల్లింపు ప్రక్రియ పూర్తిగా డిజిటల్, ఆటోమేటెడ్ కానుంది.ఇకపై మీ జీతం, బ్యాంక్ వడ్డీలు, షేర్ల లావాదేవీల వివరాలను మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. కంపెనీలు, బ్యాంకుల నుంచి డేటా నేరుగా సిస్టమ్‌లోకి వస్తుంది.సిస్టమ్ ఆటోమేటిక్‌గా వివరాలను సేకరించినప్పటికీ ఆ సమాచారం సరైనదేనని ధ్రువీకరించే బాధ్యత పన్ను చెల్లింపుదారుడిదే.ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫారం-16, ఫారం-26AS స్థానంలో మరింత పారదర్శకమైన కొత్త డాక్యుమెంట్ ఫార్మాట్లు రానున్నాయి.హెచ్ఆర్ఏ, అలవెన్సులపై నిఘాపన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసే విషయంలో కొత్త నిబంధనలు కఠినంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) విషయంలో యజమాని వివరాలు, పాన్ కార్డు, సంబంధిత పత్రాలను సమర్పించడం తప్పనిసరి కానుంది.సీటీసీలో మార్పులుకొత్త చట్టం ప్రకారం, ఉద్యోగి ప్రాథమిక వేతనం(బేసిక్ పే) అతని మొత్తం సీటీసీలో కనీసం 50 శాతం ఉండాలి. దీనివల్ల పీఎఫ్, గ్రాట్యుటీ కంట్రిబ్యూషన్లు పెరుగుతాయి. ఫలితంగా చేతికి వచ్చే జీతం స్వల్పంగా తగ్గినప్పటికీ దీర్ఘకాలిక పొదుపు, పదవీ విరమణ ప్రయోజనాలు మెరుగుపడతాయి.కొత్త వ్యవస్థ పన్ను ఎగవేతను అరికట్టడమే కాకుండా నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ప్రక్రియను సులభతరం చేస్తుంది. అయితే, ఆటోమేటెడ్ ఫ్లాగింగ్ సిస్టమ్ వల్ల చిన్న తప్పు జరిగినా నోటీసులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, 2026 ఏప్రిల్ నుంచి ప్రతి పైసా ఖర్చుకు, ప్రతి మినహాయింపునకు సరైన రికార్డులు కలిగి ఉండటం ముఖ్యం.ఇదీ చదవండి: ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు -
50 శాతం శాలరీ హైక్.. సెలవుల పెంపు; డిమాండ్లు ఇవే
గోదావరిఖని: దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికుల ఉమ్మడి చార్టర్ ఆఫ్ డిమాండ్లను జాతీయ కార్మిక సంఘాలు సిద్దం చేశాయి. ఈ నెలాఖరుతో 10వ వేతన సంఘం గడువు పూర్తి కానుంది. వచ్చే నెల నుంచి కొత్త వేతన ఒప్పందం అమలు కావాల్సి ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు జాతీయ సంఘాలు ఒకేతాటిపైకి వచ్చి ఉమ్మడి చార్టర్ ఆఫ్ డిమాండ్లు పొందు పర్చాయి. దేశంలోని 4 లక్షల మంది కార్మికులకు వర్తించనున్న డిమాండ్లపై బొగ్గు గని కార్మికుల్లో ఆసక్తి రేకిస్తోంది. తమకు సంబంధించి జాతీయ కార్మిక సంఘాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి.. 11వ వేతన కమిటీలో జీతభత్యాలు ఏ విధంగా పెరుగుతాయి.. అలవెన్సులు ఏ విధంగా ఉంటాయనే ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. దేశంలో ఉన్న జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ యూనియన్లు తమ డిమాండ్లను ఉమ్మడిగా సిద్దం చేశాయి. ఈనెల 3న నిర్వహించిన వర్చువల్ సమావేశంలో దీనికి అంగీకరించారు. ప్రధానంగా మూల వేతనం, అలవెన్సులు, సెలవులు తదితర అంశాలపై ఇప్పటికే స్పష్టతకు వచ్చాయి. దీనిపై ఆదివారం మరోసారి వర్చువల్ సమావేశం నిర్వహించి పూర్తిస్థాయిలో అంగీకారం తెలుపనున్నాయి. ఈ ఒప్పందం పూర్తయితే 01.07.2021 నుంచి 30.06.2026 వరకు అమలులో ఉండనుంది. ప్రధాన డిమాండ్లు ప్రస్తుత మూల వేతనంపై 50 శాతం జీతం పెంచాలి. ఎల్ఎల్టీసీ రూ.75 వేలు, ఎల్టీసీ రూ .50 వేలు చెల్లించాలి రెస్క్యూ అలవెన్స్ వేతనంలో 15 శాతం చెల్లించాలి. క్వారీ, వాషరీ, క్రషర్, సీహెచ్‌పీల్లో పనిచేసే కార్మికులకు వేతనంలో 10 శాతం డస్ట్ అలవెన్స్ ఇవ్వాలి సాధారణ సెలవులు 11 నుంచి 15 రోజులకు పెంచాలి సిక్ లీవ్ 15 నుంచి 20 రోజులకు పెంచాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే కార్మికులు కోలుకునేంత వరకు పూర్తి స్థాయి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి మూడేళ్ల వరకు శిక్షణ, స్టడీ లీవ్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం నిర్వహించే సమావేశాలకు టీఏ, డీఏతో పాటు నలుగురు ట్రేడ్ యూనియన్ ప్రతినిధులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలి. గ్రాడ్యువిటీ చెల్లింపునకు సీలింగ్ పరిమితి ఉండొద్దు విధుల్లో మరణించిన కాంట్రాక్టు కార్మికులతో సహా పర్మినెంట్ కార్మికులకు రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. ఆధార పడిన వారికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి. సీపీఆర్ఎంఎస్ స్కీంపై రూ.25 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించాలి. ప్రతి గనిపై లైఫ్ సపోర్టు అంబులెన్సులు ఏర్పాటు చేయాలి పెన్షన్ ఫండ్ కోసం టన్ను బొగ్గుపై రూ.20 వసూలు చేయాలి. కనీస పెన్షన్ రూ.10 వేలకు తగ్గకూడదు వారంలో 40 పని గంటలు లేదా ఐదు రోజులు పనిదినాలు ఉండాలి కాంట్రాక్టు కార్మికులకు క్రమబద్ధీకరించాలి గనుల్లో కొత్త నియామకాలు ప్రారంభించాలి. కార్మికుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలి కాంట్రాక్టు కార్మికులకు జేబీసీసీఐ పరిధిలోకి రావాలి. పారామెడికల్ స్టాఫ్‌కు ప్రత్యేక క్యాడర్ స్కీం తయారు చేయాలి. యువత చదువుకు తగిన ఉద్యోగం ఇవ్వాలి. వీటితో పాటు మరికొన్ని డిమాండ్లపై జాతీయ కార్మిక సంఘాలు పూర్తి స్థాయి కసరత్తు చేసి బొగ్గు పరిశ్రమ ద్వైపాక్షిక కమిటీకి అందించనున్నాయి. ఈ డిమాండ్లపై కోలిండియా యాజమాన్యం జాతీయ కార్మిక సంఘాలతో చర్చించనుంది. ఇరువర్గాల సంప్రదింపుల అనంతరం పూర్తి స్థాయి నిర్ణయాలు వెలువడనున్నాయి. చదవండి: సింగరేణిలో ఇదేం వివక్ష ? -
సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ
వాషింగ్టన్: సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గత ఆర్థిక సంవత్సరంలో 42.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 305 కోట్లు) ప్యాకేజీ అందుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 66 శాతం అధికం. నాదెళ్ల మూలవేతనం సుమారు 2.3 మిలియన్ డాలర్లే అయినప్పటికీ, ప్యాకేజీలో అత్యధిక భాగం (సుమారు 29.6 మిలియన్ డాలర్లు) స్టాక్ ఆప్షన్స్ కింద లభించింది. 2017–18లో సత్య నాదెళ్ల 25.8 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. ‘గత ఆర్థిక సంవత్సరం కంపెనీ అత్యంత మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించింది. దీనికి సత్య నాదెళ్ల సారథ్యం, కస్టమర్ల విశ్వాసం చూరగొనడానికి ఆయన చేసిన కృషి, కంపెనీలో ప్రవేశపెట్టిన కొత్త మార్పులు, కొంగొత్త టెక్నాలజీలు.. మార్కెట్లలోకి కార్యకలాపాలను విస్తరించడం వంటి అంశాలు తోడ్పడ్డాయి‘ అని మైక్రోసాఫ్ట్ తెలిపింది. హైదరాబాదీ అయిన సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
తగ్గనున్న ఈపీఎఫ్.. పెరగనున్న వేతనాలు
న్యూఢిల్లీ : టేక్-హోమ్ శాలరీ చాలా తక్కువగా వస్తోందని బాధపడుతున్నారా? అయితే ఇక ఆ దిగులును ప్రభుత్వం కాస్త తగ్గించబోతుంది. ఉద్యోగుల టేక్-హోమ్ శాలరీని పెంచాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. దీని కోసం ఉద్యోగుల వేతనాల్లోంచి తీసుకునే సామాజిక భద్రత సహకారం(సోషల్ సెక్యురిటీ కాంట్రిబ్యూషన్)ను తగ్గించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. దేశంలో ఉన్న ఉద్యోగులందరికీ ఒకే విధమైన సామాజిక భద్రత సహకారం ఉండేలా కార్మిక మంత్రిత్వ శాఖ కమిటీ పనిచేస్తుందని.. ప్రస్తుతమున్న సీలింగ్ 24 శాతాన్ని, 2 శాతం తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదనలను తయారు చేస్తుందని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగుల సహకారం కింద వారి బేసిక్ వేతనం నుంచి 12 శాతాన్ని ఈపీఎఫ్‌కి అందిస్తున్నారు. అంతేకాక ఆర్గనైజేషన్స్ కూడా ఉద్యోగుల బేసిక్ వేతనం నుంచి 3.67 శాతాన్ని తమ సహకారం కింద ఈపీఎఫ్‌లో క్రెడిట్ చేస్తున్నాయి. ఈపీఎస్ లేదా ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కింద 8.33 శాతం మైనస్ అవుతుంది. ఇవన్నీ కలిపి మొత్తంగా 24 శాతం ఉద్యోగుల బేసిక్ వేతనం నుంచి కట్ అవుతుంది. తాజాగా ఉద్యోగుల ఈపీఎఫ్ సహకారాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది. దీంతో ఉద్యోగుల టేక్-హోమ్ శాలరీ పెరగబోతుంది. ప్రస్తుతం 20 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలకు కేవలం 10 శాతం మాత్రమే ఈపీఎఫ్ సహకారం ఉంది. ఇదే విధానాన్ని అన్ని ఆర్గనైజేషన్లకు అమలు చేయాలని ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. దీంతో 10 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు లబ్ది చేకూరనుంది. ఒక్కసారి కార్మిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆ మంత్రిత్వ శాఖ వాటాదారులతో సంప్రదింపులు జరుపుతుంది. ప్రస్తుతం సామాజిక భద్రత స్కీమ్ కింద 10 కోట్ల మంది ఉద్యోగులున్నారు. వీరిని 5 రెట్లు అంటే 50 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రత సహకారం తగ్గితే, ఇటు ఉద్యోగులు, అటు ఆర్గనైజేషన్లకు రెండింటికీ ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. -
మూల వేతనం 7 వేల నుంచి 18 వేలకు పెంపు!
న్యూ ఢిల్లీ: ఏడవ వేతన సంఘం సిఫారసుల అమలుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో కోటి మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, ఫించనుదారులకు లబ్ధి చేకూరనుంది. ఓవరాల్ గా ఈ సిఫారసుల అమలుతో వీరి ఆదాయం 23.5 శాతం మేర పెరుగుతోంది. కేంద్ర కేబినెట్ ఆమోదీంచిన సిఫారసుల్లో ప్రధానంగా.. ఉద్యోగుల మూల వేతనం నెలకు 7 వేల నుంచి 18 వేలకు చేరుకోనుంది. కనీస పెన్షన్ సైతం 3,500 నుంచి 9 వేలకు పెంపును కేబినెట్ ఆమోదించింది. అలవెన్స్‌ల విషయంలో వేతన సంఘం చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. ఈ సిఫారసులను 2016 జనవరి 1 నుంచి అమలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.


