breaking news
Anti-Maoist operations
-
ఐదేళ్లలో అభివృద్ధి చేస్తాం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి, హైదరాబాద్: రాబోయే ఐదేళ్లలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల రూపురేఖలు మార్చడం తమ తదుపరి లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. నిర్దేశిత లక్ష్యం 2026 మార్చి 31లోగా దేశంలో మావోయిస్టులను నిర్మూలించడంలో కృషి చేసిన పోలీసులు, భద్రతా బలగాలను సోమవారం జగదల్పూర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించారు. దీంతోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన సేవా కేంద్రాలను నేతనార్ గ్రామంలో అమిత్ షా ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తమ దగ్గర అభివృద్ధి జరగకపోవడం వల్లే ఆయుధాలు చేపట్టామనే తప్పుడు ప్రచారం చేస్తూ మావోయిస్టులు బస్తర్ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఇటీవల మూడు వేల మంది మావోయిస్టులు లొంగిపోతే, అందులో రెండు వేల మందికి కనీసం రాయడం, చదవడం రాదని, ఈ ప్రాంతానికి మావోయిస్టులు చేసిన అన్యాయాలకు ఇదో ఉదాహరణ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేసిన కృషితో ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులను నిర్మూలించామని పేర్కొన్నారు.15 శాతం బస్తర్ ఆదివాసీల కోసం...నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సూచనలతో బస్తర్‌లో గుజరాత్ తరహాలో పాడి పరిశ్రమ అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందని అమిత్ షా చెప్పారు. ఇకపై వచ్చే ఉద్యోగాల భర్తీ ప్రకటనల్లో 15 శాతం ఉద్యోగాలను బస్తర్ ఆదివాసీల కోసం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన మావోయిస్టులను నిర్మూలించేందుకు 2018 నుంచి విస్త్రృత ప్రయత్నాలు జరిగాయని అమిత్‌షా అన్నారు.ఢిల్లీలో పెద్ద పెద్ద భవనాల్లో కూర్చుని కాగితాలు, కంప్యూటర్ల మీద ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి 2026 మార్చి 31వ తేదీని గడువుగా పెట్టుకున్నామని అమిత్ షా గుర్తుచేశారు. పై స్థాయిలో ఎన్ని ప్లాన్లు వేసినా వాటి క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తారనేది కీలకమని, ఆ విషయంలో వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలు, పారా మిలిటరీ బలగాలు, స్పెషల్ ఫోర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేశాయని కితాబునిచ్చారు. ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న బలగాలకు ఆయన అభినందనలు తెలిపారు.తెలంగాణకు అభినందనలుబస్తర్లో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ పార్టీకి దిశానిర్దేశం చేసే నేతల్లో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారున్నారు. దీంతో నిర్దేశిత గడువులోగా మావోయిస్టులను నిర్మూలించడంలో తెలంగాణ పోలీస్ అధికారులు కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో జగదల్పూర్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ భద్రతా సలహాదారు శివధర్‌రెడ్డి (మాజీ డీజీపీ), తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, మల్కాజ్గిరి సీపీ బి.సుమతి (ఎస్ఐబీ మాజీ చీఫ్), డీజీపీ ఆపరేషన్స్ (ఆక్టోపస్, గ్రేహౌండ్స్) అనిల్ కుమార్‌ను అమిత్‌షా సత్కరించారు. మావోయిస్టు కార్యకలాపాల నిరోధానికి శివధర్‌రెడ్డి విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయ్, హోంమంత్రి విజయ్‌శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నక్సల్స్ ఏరివేతలో కీలకం కానున్న మహిళా శక్తి
న్యూఢిల్లీ: నక్సల్ ప్రభావిత ప్రాంతాలను ప్రత్యేక బలగాలు జల్లెడ పడుతుంటాయి. అయితే, నక్సల్స్ ఏరివేతలో మహిళా శక్తిని కూడా వినియోగించుకోవాలని కేంద్రం భావించింది. ఈ మేరకు నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మహిళా భద్రతా దళాలు విధులు నిర్వర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడవుల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) మహిళా కమాండోలు పని చేయనున్నారు. సీఆర్పీఎఫ్ 88వ మహిళా బెటాలియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శిక్షణ పొందిన మహిళా కమెండోలను నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాల్లో విధి నిర్వహణకు పంపించాలని నిర్ణయించినట్లు సీఆర్పీఎఫ్ పేర్కొంది. ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా బెటాలియన్ ఏర్పాటుచేసిన ఘనత సీఆర్పీఎఫ్కే దక్కిందని ప్రకటించింది. ఇక సీఆర్పీఎప్ మహిళా కమెండోలను నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాలకు పంపించి నక్సలైట్లను అరికడతామని ధీమా వ్యక్తం చేసింది. సీఆర్పీఎఫ్ మహిళా బెటాలియన్‌లోని 34 మంది మహిళలను కోబ్రా దళంలోకి ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా మూడు నెలల పాటు కమాండో శిక్షణ ఇస్తున్నట్లు సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఏపీ మహేశ్వరి తెలిపారు. మహిళా బెటాలియన్‌లో పని చేస్తున్న పలువురు మహిళలకు అశోక్ చక్రతోపాటు పలు అవార్డులు దక్కాయని వివరించారు. విధి నిర్వహణలో భాగంగా సీఆర్పీఎఫ్ దళం అత్యంత ధైర్య సాహసాలు చూపిస్తోందని పేర్కొన్నారు. Women commandos for Anti-Naxals operations: @crpfindia inducts #women commondos for its anti #naxal CoBRA unit. After completion of their 3 months training, mahila warriors will be posted in Naxal affected areas like Sukma, Dantewada, Bijapur etc with male commandos. pic.twitter.com/P3UGRxA2lH — Ankur Sharma (@AnkurSharma__) February 6, 2021 -
పోలీసుల బస్సుపై మావోయిస్టుల కాల్పులు
గడ్చిరోలి, న్యూస్‌లైన్: గడ్చిరోలి జిల్లాలో ఎన్నికల బందోబస్తు నిర్వహించి తిరిగివె ళ్తున్న పోలీసుల బస్సుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనతో అవాక్కయిన పోలీసులు కూడా నిలదొక్కుకుని ఎదురుకాల్పులు జరిపారు. అయితే సంఘటనలో ఒక పోలీసు అధికారి మరణించగా మరో అయిదుగురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు అందించిన వివరాల మేరకు అహేరి తాలూకాలోని ఆషా గ్రామం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎన్నికలను అడ్డుకుంటామని మావోయిస్టులు ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు వారు జిల్లాలోని తమ పట్టున్న ప్రాంతాల్లో కరపత్రాలను పంచడంతోపాటు అనేక ప్రాంతాల్లో బోర్డులను కూడా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీస్ యం త్రాంగం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది. అయితే జిల్లాలో తమ పట్టును నిరూపించుకునేందుకు గురువారం పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను అపహరిం చేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. బేస్ క్యాంప్‌పై కాల్పులు జరిపారు. అయితే పెద్ద మొత్తం లో ఉన్న పోలీసుల బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో పారిపోయారు. అనంతరం ఎన్నికల విధులు నిర్వహించి సామగ్రి సహా పోలీసులు, సిబ్బంది బస్సులో వెళ్తుండగా ఊహిం చని విధంగా మావోయిస్టులు మరోసారి పథకం ప్రకారం నలుమూలల నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పోలీసులు సైతం ఎదురుకాల్పులు ప్రారంభించడంతో దట్టమైన పొదలను ఆధారంగా చేసుకుని అక్కడి నుంచి పారిపోయారు. గంటసేపు రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాగా, ఈ కాల్పు ల్లో గిరిధర్ ఆత్రమ్ అనే పోలీసు మరణిం చగా రమేష్, సందీప్ కొడపే, మురళి వెలదే, ఆమర్దీప్ బురసే, ప్రకాస్ చికారామ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరిని హెలికాప్టర్ సహా యంతో నాగపూర్‌కు తరలించారు. ఈ ఘటన అనంతరం అక్కడికి అదనపు బలగాలు చేరుకుని ఆయా ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి.


