Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Cm Jagan Speech In Nellore Public Meeting
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్‌

సాక్షి, నెల్లూరు జిల్లా: ‘‘నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. ఓ వైపు ఎన్డీఏలో కొనసాగుతూ మరో వైపు మైనార్టీలపై దొంగప్రేమ కురిపిస్తున్నాడు’’ అంటూ చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్‌లో బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మైనార్టీలకు ఎప్పటికీ అండగా ఉంటా..  తాము 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.‘‘వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా?. ఆరునూరైనా ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ముస్లింలకు మత ప్రాతిపదికన 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదు. వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇవి. మళ్లీ ముస్లింల కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడు. చంద్రబాబు ఓ ముదిరిపోయిన తొండ. ఇది కాదా ఊసరవెల్లి రాజకీయం, ముస్లిం రిజర్వేషన్లకు చంద్రబాబు కట్టుబడి ఉన్నారా?’’ అంటూ సీఎం జగన్‌ నిలదీశారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయని.. మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుందని సీఎం అన్నారు. బాబు మోసాలకు ఓడించేందుకు మీరంతా సిద్ధమా అంటూ పిలుపునిచ్చారు. లంచాలు, వివక్ష లేకుండా బటన్‌ నొక్కి డబ్బులు జమ చేస్తున్నాం. జగన్‌ పాలనలో అభివృద్ధి లేదని విష ప్రచారం చేస్తున్నారు.’’ అని సీఎం జగన్‌ ధ్వజమెత్తారు.‘‘కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు కడుతున్నాం, ఇది కాదా అభివృద్ధి?. కొత్త 4 పోర్టులు నిర్మిస్తున్నాం, ఫిషింగ్‌ హార్బర్‌లు నిర్మిస్తున్నాం.. ఇది కాదా అభివృద్ధి?. పిల్లలకు ట్యాబులు ఇస్తారని ఎవరైనా ఊహించారా?. క్వాలిటీ చదువులు అభివృద్ధి కాదా?. ఇంటి వద్దకే పెన్షన్‌, ఇంటి వద్దకే రేషన్‌. 14 ఏళ్లలో ఏరోజైనా ఇలాంటి అభివృద్ధి చేశారా?. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం. 6వ తరగతి నుంచి డిజిటల్‌ బోధన, గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్తూ గ్రామ, వార్డు సచివాలయాలు. రైతులకు అండగా ఆర్‌బీకే వ్యవస్థను నెలకొల్పాం. ఉద్ధానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించాం. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం’’ అని సీఎం చెప్పారు.‘‘వెలిగొండలో రెండు టన్నెళ్లు పూర్తి చేశాం. ప్రకాశం జిల్లాకు నీళ్లు తరలిస్తాం. వెలిగొండ, శ్రీశైలం నుంచి నీళ్లు రాక ఫ్లోరైడ్‌తో జనం ఇబ్బంది పడుతుంటే ఏనాడైనా చంద్రబాబు పట్టించుకున్నాడా?. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌వన్‌గా నిలిచాం. మా పాలనలో రూ. 2లక్షల 70వేలు కోట్లను ప్రజల ఖాతాల్లో వేశాం. ఎంఎస్‌ఎంఈలకు తోడుగా ఉన్నాం. చంద్రబాబు హయాంలో రూ.32 వేల కోట్లు పెట్టబడులు వస్తే.. మీ బిడ్డ జగన్‌ హయాంలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఈ అభివృద్ధి అంతా చంద్రబాబుకు కనిపించడం లేదా?’’ అంటూ సీఎం జగన్‌ దుయ్యబట్టారు.                                

Candidate Offers To Pay Rs 40000 To Founder For a Job Tweet Goes Viral
నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా!

ఓ వ్యక్తి చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం చేయాలని అనుకుంటాడు. అయితే చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం రావడం అనేది ప్రస్తుత కాలంలో అసాధ్యమైపోతోంది. దీంతో కొందరు సొంతంగా బిజినెస్ చేస్తుంటే.. మరికొందరు ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. దీని కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.ఇటీవల వింగిఫై వ్యవస్థాపకుడు ఒక తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో ఓ వ్యక్తి వింగిఫైలో తనకు ఉద్యోగం కావాలని. ''ఉద్యోగం కోసం నేను 500 డాలర్లు (రూ. 41000 కంటే ఎక్కువ) చెల్లిస్తాను. వారం రోజుల్లో నా పనితనాన్ని నిరూపించుకుంటాను. ఆలా నిరూపించుకోని సమయంలో నన్ను ఉద్యోగం నుంచి తొలగించండి. ఆ డబ్బు కూడా మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా మీ టీమ్ సమయాన్ని వృధా చేయకూడదని చేస్తున్నాను'' అని పేర్కొన్నారు.ఈ పోస్టును వింగిఫై ఛైర్మన్ పరాస్ చోప్రా షేర్ చేసిన తరువాత నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగార్ధుల పరిస్థితి ఇది అని కొందరు కామెంట్ చేశారు. మరి కొందరు జాబ్ తెచ్చుకోవడానికి ఇది సరైన మార్గం కాదని పేర్కొన్నారు. అయితే చోప్రా మాత్రం ఇది అందరి దృష్టిని ఆకర్శించింది అని అన్నారు.This is how you get attention!(Obviously won’t take money but very impressed with the pitch) pic.twitter.com/mlJIL0154u— Paras Chopra (@paraschopra) May 3, 2024

Heeramandi: Sanjay Leela Bhansali And Six Heroines Remunerations Detalis
దుమ్మురేపుతున్న ‘హీరామండి’.. భన్సాలీకి భారీ రెమ్యునరేషన్‌?

బాలీవుడ్‌లో భారీ చిత్రాలకు కేరాఫ్‌ సంజయ్‌ లీలా భన్సాలీ. ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. ఎంత భారీగా ఖర్చు చేస్తాడో అంతకు మించిన కలెక్షన్స్‌ను రాబడతాడు. అందుకు ఆయన తెరెక్కించిన ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్‌’ చిత్రాలే నిదర్శనం. తాజాగా ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ తెరకెక్కించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘హీరామండి’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిఫిక్స్‌లో ఈ భారీ వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో ఈ వెబ్‌ సిరీస్‌ని తెరకెక్కించాడు భన్సాలీ. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల​ లాంటి భారీ తారాగణంతో పిరియాడిక్‌ డ్రామాగా ఈ వెబ్‌ సిరీస్‌ని రూపొందించాడు.(చదవండి: 'హీరామండి' వెబ్‌ సిరీస్‌ రివ్యూ) స్వాతంత్య్రానికి పూర్వం ‘హీరామండి’ వేశ్యా వాటికలో చోటు చేసుకున్న పలు సంఘటనల ఆధారంగా తెరక్కించిన ఈ వెబ్‌ సీరిస్‌ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తోంది.  భన్సాలీ మేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సిరీస్‌ కోసం భన్సాలీ చాలా కాలంపాటు కష్టపడ్డారు. అందుకు తగ్గట్టే నెట్‌ఫ్లిక్స్‌ భారీ రెమ్యునేరేషన్‌ ఇచ్చిందట. ఈ వెబ్‌ సిరీస్‌ కోసం భన్సాలీ దాదాపు రూ. 70 కోట్ల వరకు పారితోషికంగా తీసుకున్నట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన ఆరుగురు హీరోయిన్లకు కూడా భారీగానే రెమ్యునరేషన్‌ అందింట. ఈ సిరీస్‌లో ఫరిదాన్‌ పాత్రను పోషించిన సోనాక్షి సిన్హాకు అత్యధికంగా రూ. 2 కోట్ల పారితోషికంగా అప్పగించిందట నెట్‌ఫిక్స్‌. అలాగే మల్లికా జాన్‌ పాత్రలో నటించిన మనిషా కొయిరాలాకి కోటి రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మరో కీలక పాత్రను అదితిరావు హైదరి పోషించింది. ఇందుకుగాను ఆమె రూ. కోటిన్నర వరకు తీసుకుందట. అలాగే లజ్జోగా నటించిన రిచా చంద్దా రూ. 1 కోటి, వహిదాగా నటించిన సంజీదా షేక్‌ రూ. 40 లక్షలు, ఆలంజేబుగా నటించిన షర్మిన్‌ సెగల్‌ రూ. 35 లక్షలు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Ksr Comments on Pawan kalyan Pithapuram Constituency Campaign
పవన్‌ వ్యూహానికి వంగా గీత కౌంటర్‌ వ్యూహమిదే..!

పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో ఎన్నికల బరిలో తలపడుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి వంగా గీత చాలా వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆమె తన పార్టీ గురించి, తన గురించి, తన ప్రభుత్వ స్కీముల గురించి చెబుతున్నారే తప్ప పవన్‌ను ఏ విధంగాను విమర్శించడం లేదు. అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆమె తెలివిగా ప్రచారం చేపట్టారు. వంగా గీత.. గత మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారు. విద్యార్ధి దశలో ఉన్నప్పుడే ఆమె రాజకీయాలపై ఆసక్తితో ఉండేవారు. సామాజిక స్పృహతో ఉండేవారు. పవన్‌తో పోల్చితే పెద్ద ధనికురాలు కూడా కాదు. అయినా స్వయంశక్తితో, రాజకీయాలలోకి వచ్చారు. 1994లో శాసనసభ సీటు కోసం ప్రయత్నించారు కాని సఫలం కాలేదు. తదుపరి కాలంలో జడ్పి చైర్ పర్సన్ గాను, రాజ్యసభ సభ్యురాలిగా, శాసనసభ సభ్యురాలిగా, 2019లో లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.ఆయా సందర్భంలో ఆమె ప్రజల సమస్యలపై శ్రద్ద వహించేవారు. సాధ్యమైన మేరకు ఆ సమస్యలను తీర్చే యత్నం చేసేవారు. ప్రజలలో కలిసిపోతుంటారు. ఆమె తమకు అందుబాటులో ఉండరన్న మాట రానివ్వరు. కరోనా సమయంలో జబ్బుబారిన పడ్డవారికి ఆమె భయపడకుండా సేవలందించారు. వ్యాధి సోకినవారిని స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే, వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రులకు పంపించడానికి కృషి చేసేవారు. ఇవన్ని ఆమెకు ఇప్పుడు పాజిటివ్ పాయింట్లుగా ఉన్నాయి. బాగా విద్యాధికురాలు. రెండు పీజీలు, న్యాయశాస్త్ర పట్టభద్రురాలుగా ఉన్నారు. ఆమె లాయర్‌గా కూడా పేదలకు సేవలందించారు. ఆమె భర్త విశ్వనాద్ కూడా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆమెకు చేదోడువాదోడుగా నిలబడడం కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎవరైనా ‘పవన్‌తో పోటీ పడుతున్నారు.. మరి గెలవడం సాధ్యమా?’ అని అడిగితే, 'ఆయనకు సినిమా రంగంలో పేరు ఉంది.. నాకు ప్రజాసేవ రంగంలో పేరు ఉంది. పవన్‌కు కూడా ప్రజా సేవ చేయాలని ఉండవచ్చు.. కాని ఆయనకు ఉన్న పరిస్థితులు అందుకు అవకాశం ఇవ్వవు" అని నేర్పుగా సమాధానం చెబుతున్నారు.పవన్ విద్య గురించి ఎవరైనా అడిగితే, దాని గురించి తాను మాట్లాడనని, ఆయన సినిమాలలో స్టార్ అయ్యారు కదా! అంటూ తనకు ఉన్న డిగ్రీలు, ఇతర అర్హతలను మాత్రమే వివరిస్తున్నారు. పవన్‌ చదువు తక్కువ అనే పాయింట్‌ను కూడా ప్రస్తావించడం లేదు. తాను ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తినని చెప్పడానికి పలు ఉదాహరణలు వివరిస్తుంటారు. ఎవరికైనా నియోజకవర్గ ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే, తాను పిఠాపురంలోనే అందుబాటులో ఉంటానని, అదే పవన్‌ అయితే ఎక్కడో షూటింగ్‌లలో బిజీగా ఉంటారని, అందువల్ల ఆయన చేయలేరని, ఆయన పీఏలను పెట్టుకున్నా ప్రజలకు సేవలందించడం కష్టమని అంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపట్ల ప్రజలు ఆకర్షితులయ్యారని, ముఖ్యంగా మహిళలు అయితే మరింతగా ఆదరిస్తున్నారని ఆమె చెబుతున్నారు. ప్రచారంలో ఎవరి ఇంటి వద్ద అన్నా ఆగకపోతే ప్రత్యేకించి పిలిచి మరీ తమ ఇళ్లవద్దకు తీసుకు వెళుతున్నారని ఆమె చెప్పారు. ఆయన ప్రచారానికి ఇప్పటికే నాగబాబు, జబర్దస్త్ టీమ్ తదితర నటులు వచ్చారని, బహుశా మెగాస్టార్ చిరంజీవి రాకపోవచ్చని అనుకుంటున్నానని గీత అభిప్రాయ పడ్డారు.లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని చెబుతున్న పవన్‌ వీరందరిని ఎందుకు తీసుకు వస్తున్నట్లు అని గీత ప్రశ్నిస్తున్నారు. మరో ఆసక్తికరమైన వాదన తెచ్చారు. పిఠాపురంలో ఏదైనా సమస్య ఉంటే తాను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే అవకాశం ఉంటుందని, జనసేనకు ఆ అవకాశం ఉండదని, వారు వేరే పార్టీ వారి దగ్దరకు వెళ్లాల్సి ఉంటుందని, ఆ తేడాను కూడా ప్రజలు గుర్తించారని ఆమె చెబుతున్నారు. కాపు సామాజికవర్గం వారు పవన్ వైపు ఎక్కువగా ఉన్నారా అని ప్రశ్నిస్తే, అలా ఏమీ ఉండదని, తాను కాపువర్గానికి చెందిన వ్యక్తినే కదా అని అంటారు. తాను కాపు సామాజికవర్గానికి ఉపయోగపడే పనులు అనేకం చేయించానని, ప్రత్యేకించి కాపు కళ్యాణమండపాలు నిర్మించడానికి నిధులు సమకూర్చానని ఆమె గుర్తు చేస్తున్నారు. ఎవరైనా అన్ని సామాజికవర్గాల ఆదరణ పొందాలి తప్ప, ఏ ఒక్క వర్గమో సపోర్టు చేస్తే గెలిచే పరిస్థితి ఉండదని అన్నారు. కొంతమంది కావాలని బయట నుంచి వచ్చి అలజడులు సృష్టించడానికి యత్నిస్తున్నారని, ఇది చాలా ప్రశాంతమైన నియోజకవర్గమని, ప్రజలు వీటిని గమనిస్తున్నారని ఆమె అన్నారు.పవన్ కళ్యాణే పెద్ద సినిమా స్టార్ అయినప్పుడు, జబర్దస్త్ టీవీ నటులు వంటివారి ప్రచారంతో ఏమి అవసరం వచ్చిందోనని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా తాను విజయం సాధిస్తానన్న ధీమాను గీత వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో చాలామంది ఒక మాట చెబుతున్నారు. జగన్ చాలా తెలివిగా వంగా గీతను ఎంపిక చేసి  పవన్‌ను ఆత్మరక్షణలో పడేశారని అంటున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వంటివారు ఆమెకు మద్దతు ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. పిఠాపురంలో సుమారు తొంభైవేల వరకు కాపుల ఓట్లు ఉండవచ్చని అంచనా. వాటి ఆధారంగా గెలవవచ్చన్న ఆశతో పవన్‌ అక్కడ పోటీలోకి దిగడం, వర్మ వంటి టీడీపీ నేతలను తనను గెలిపించాలని వేడుకున్న వైనం ఇవన్ని ఆయనకు కాస్త మైనస్ అయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తన అభ్యర్ధులను గెలిపించవలసిన నేత, తన గెలుపుకోసమే ఇతరులను అభ్యర్ధించవలసిన పరిస్థితి ఏర్పడడం చాలామందికి నచ్చడం లేదు.జనసేనకు స్వయంగా నియోజకవర్గం అంతటా పోల్ మేనేజ్ మెంట్ యంత్రాంగం లేదన్నది ఒక అభిప్రాయం. తెలుగుదేశం పార్టీవారి మద్దతు ఉన్నా, పిఠాపురాన్ని జనసేనకు ఇస్తారని ప్రకటన రాగానే, టీడీపీ శ్రేణులు భగ్గుమనడం కూడా పవన్‌కు నష్టం చేసింది. పవన్‌కు పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదని, అక్కడ ఉన్న సమస్యలు తెలియవని, తాను ఏమి చేస్తానో చెప్పలేకపోతున్నారని వైస్సార్‌సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం సినిమా గ్లామర్ ఆకర్షణతో గెలవాలన్నది పవన్‌ వ్యూహం అయితే, ప్రజాసేవ ద్వారా వచ్చిన గ్లామర్‌తో పాటు జగన్ ప్రభుత్వం అమలు చేసిన స్కీముల ప్రభావంతో విజయం సాధించాలన్నది వంగా గీత వ్యూహంగా ఉంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Doctors Removed Led Bulb From boy Lungs In Chennai
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్‌ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఓ ఐదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా అనుకోకుండా చిన్న ఎల్‌ఈడీ బల్బు మింగాడు. కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బల్బు బాలుడి ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు డాక్టర్లు గుర్తించారు.బాలుడు దగ్గుతుండడంతో పాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆపరేషన్‌ చేసి బల్బు తీయడానికి డాక్టర్లు ప్రయత్నించారు. రెండుసార్లు బ్రాంకోస్కోపి సర్జరీ చేసినప్పటికీ బల్బు బయటికి తీయడం వీలు కాలేదు. దీంతో డాక్టర్లు బాలుడి ‌ఛాతి ఓపెన్‌ చేసి సర్జరీ చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు.మేజర్‌ సర్జరీ అని భయపడ్డ తల్లిదండ్రులు బాలుడిని శ్రీరామచంద్ర మిషన్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు సీటీ స్కాన్‌తో బల్బును గుర్తించి బ్రాంకోస్కోపి సర్జరీ ద్వారా తీసివేశారు. దీంతో బాలుడి ఆరోగ్యం కుదుటపడింది. బాలుడు త్వరలోనే కోలుకుంటాడని డాక్టర్లు తెలిపారు.

IPL 2024 CSK Pathirana: Dhoni is playing My Father Role in my Cricket Life
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్‌ వైరల్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ పేసర్‌, శ్రీలంక బౌలర్‌ మతీశ పతిరణ టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్‌ ధోని పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ధోని తనకు తండ్రిలాంటి వాడని పేర్కొన్నాడు. తన కన్న తండ్రి మాదిరే ధోని కూడా తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడని తెలిపాడు.కాగా ఐపీఎల్‌-2022కు సిసంద మగల దూరం కాగా అతడి స్థానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌లో అడుగుపెట్టాడు పతిరణ. ఆ మరుసటి ఏడాది అంటే 2023లో 12 మ్యాచ్‌లలో కలిపి 19 వికెట్లు పడగొట్టాడు.ధోని నాయకత్వంలో సీఎస్‌కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. బేబీ మలింగగా ప్రశంసలు అందుకుంటూ ప్రస్తుతం సీఎస్‌కే ప్రధాన పేసర్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు.అయితే, దీనకంతటికి కారణం ధోనినే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యువ పేసర్‌ ఆరంభంలో తడబడ్డా తలా అతడికి అండగా నిలిచాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్న సమయంలోనూ నైతికంగా మద్దతునిచ్చాడు.ఈ నేపథ్యంలో తాజాగా సీఎస్‌కే ‘లయన్స్‌ అప్‌క్లోజ్’ చాట్‌లో మతీశ పతిరణ మాట్లాడుతూ ధోనితో తన అనుబంధం గురించి వివరించాడు. ‘‘మా నాన్న తర్వాత నా క్రికెట్‌ లైఫ్‌లో తండ్రి పాత్ర పోషించింది ధోనినే.నన్నొక చిన్నపిల్లాడిలా చూసుకుంటారు. నా పట్ల శ్రద్ధ వహిస్తారు. అవసరమైన సమయంలో సలహాలు, సూచనలు ఇస్తుంటారు. నేను ఎప్పుడు ఏం చేయాలో చెబుతూ ఉంటారు.ఇంట్లో మా నాన్న నాతో ఇలా ఉంటారో ఇక్కడ ధోని కూడా నాతో అలాగే ఉంటారు. చిన్న చిన్న విషయాలను కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తలు చెబుతారు. నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగేలా మోటివేట్‌ చేస్తారు.మైదానం వెలుపల మేము ఎక్కువగా మాట్లాడుకోము. అయితే, నన్ను కలిసిన ప్రతిసారీ.. ‘‘ఆటను ఆస్వాదించు. ఫిట్‌నెస్‌ కాపాడుకో’’ అని చెబుతారు.మహీ భాయ్‌.. మీరు వచ్చే సీజన్‌లోనూ ఆడాలి. ప్లీజ్‌ మాతో కలిసి ఆడండి.. అప్పటికీ నేనిక్కడ ఉంటే(నవ్వుతూ)’’ అంటూ పతిరణ ధోని పట్ల అభిమానం చాటుకున్నాడు.కాగా ఈ సీజన్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా.. ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక పతిరణ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు కూల్చాడు. సీఎస్‌కే ఆడిన 10 మ్యాచ్‌లలో ఐదు గెలిచి పట్టికలో ఐదో స్థానంలో ఉంది.The bond beyond the field 💛🫂#LionsupClose Full video 🔗 - https://t.co/xt5t6K9SjR #WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/odZdVvlrF6— Chennai Super Kings (@ChennaiIPL) May 4, 2024

AP Politics And Election Live Updates On May 4th
AP Election Updates May 4th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Andhra Pradesh Election Updates 4th May...06:05 PM, May 4th, 2024టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు.కొద్దిరోజులుగా ఐివీఆర్ఎస్ కాల్స్ ద్వారా నిరాధార ఆరోపణలు చేస్తున్న టీడీపీ.దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ. వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.విచారణ జరపమని సీఐడీని ఆదేశించిన ఎన్నికల సంఘం.తక్షణమే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశం.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చేస్తున్న ప్ర‌చారంపై ఈసీకి  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు పిర్యాదు .ఐవీఆర్ ఎస్ కాల్స్ ద్వారా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్న వైఎస్సార్‌సీపీ బృందంప్ర‌భుత్వంపై ఫేక్ ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆధారాలు అందచేసిన వైఎస్సార్సీపీ బృందంఎన్నిక‌ల కోడ్‌కు  విరుద్దంగా టీడీపీ ప్ర‌చారం చేస్తున్న‌ట్లు గుర్తించిన ఈసీ.ఫిర్యాదుపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా సీఐడీకి ఆదేశాలు జారీ చేసిన అడిష‌న‌ల్ సీఈవో హ‌రేంధిరియ ప్ర‌సాద్.06:05 PM, May 4th, 2024తాడేపల్లి :వైఎస్సార్‌సీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన ముస్లిం మైనారిటీల జేఏసీ నేతలుముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జలతో చర్చించిన జేఏసీ నేతలుసజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్స్ముస్లిం మత పెద్దలు నన్ను కలిశారుముస్లిం రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ వైఖరిని వారు మెచ్చుకున్నారువైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా జగన్ వ్యవహరిస్తున్నారువైసీపి డీఎన్ఏలోనే మైనారిటీలు ఉన్నారుసీఏఏ, ఎన్.ఆర్సి, యూసీసీలపై కూడా మా పార్టీ స్పష్టత ఇచ్చిందిదేశంలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారుఏడు సీట్లను జగన్ ముస్లింలకు ఇచ్చాంరాజ్యసభలో కూడా ముస్లింలకు సీటు కల్పిస్తాంముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పిందిచంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?ఈ విషయంలో కూటమి నేతలు స్పష్టత ఇవ్వాలిదీనిపై ముస్లింలు కూడా కూటమిని గట్టిగా నిలదీయాలివైఎస్సార్ హయాంలో వచ్చిన రిజర్వేషన్లను తొలగించటానికి వీల్లేదన్నదే మా డిమాండ్నసీర్ అహ్మద్, మత పెద్ద కామెంట్స్ముస్లింలకు అండగా నిలుస్తామని వైసీపి నేతలు చెప్పారు.మా సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు.వైఎస్సార్‌సీపీ మొదటి నుంచీ మాకు అండగా నిలిచింది.మునీర్ అహ్మద్, ముస్లిం మతపెద్దముస్లింలు వెనుకపడి ఉన్నారని వైఎస్సార్ గుర్తించారుఅందుకే రిజర్వేషన్ లు కల్పించారుదానివలన ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారుచంద్రబాబు మా విషయంలో ద్వంద్వ నీతి ప్రదర్శిస్తున్నారుఇలాగే ఉంటే మళ్ళీ ప్రజలు తగిన బుద్ది చెప్తారుసీఎం జగన్ సంక్షేమ పథకాలు మాకు ఎంతో ఉపయోగపడ్డాయిహుస్సేనీబాబా, ముస్లిం మతపెద్ద కామెంట్స్ముస్లింల అపోహలన్నీ వైసీపి మన ఏతలు తొలగించారువచ్చే ఎన్నికలలో రెండు ఓట్లు వైసీపికి వేయాలి175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లు గెలిపిస్తాం5:55 PM, May 4th, 2024నెల్లూరు , ప్రచారసభలో  సీఎం వైఎస్ జగన్‌ స్పీచ్గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం మొదలు టోఫెల్‌, IB దాకా అంతర్జాతీయ విద్య వరకూ పిల్లల చదువుల్లో విప్లవాలు తెచ్చాం. నాడు నేడు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, 6వ తరగతి నుండే డిజిటల్‌ బోర్డులు, డిజిటల్ బోధన, బైజ్యూస్‌ కంటెంట్, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ క్లాసులు, బైలింగ్వల్‌ టెక్స్ట్‌బుక్స్‌ క్వాలిటీ చదువులు, సస్టెయినబుల్ డెవలప్మెంట్ ఇది కాదా అభివృద్ధివెలిగొండ నీళ్లు రాక, శ్రీశైలం నీళ్లు రాక ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్‌ బాధితులతో అతలాకుతలం అయినప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు.వెలిగొండ రెండు టన్నెళ్లు పూర్తిచేసాం. ఈ వర్షాకాలంలో వెలిగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకువస్తున్నాం.నెల్లూరు, సంగం బ్యారేజీలు పూర్తి చేసి జాతికి అంకితం చేశాం.చిత్రావతీ రిజర్వాయిర్, గండికోట రిజర్వాయిర్‌, పులిచింతల రిజర్వాయిర్‌ లలో R&R పూర్తి చేసి డ్యాముల్లో పూర్తి సామర్థ్యంతో నీళ్లు నింపుతున్నాం.5:25 PM, May 4th, 2024తాడేపల్లి :వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన ముస్లి మైనార్టీల జేఏసీ నేతలుముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జలతో చర్చించిన జేఏసీ నేతలుఅనంతరం సజ్జల మాట్లాడుతూ..ముస్లిం మత పెద్దలు నన్ను కలిశారుముస్లిం రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ వైఖరిని వారు మెచ్చుకున్నారువైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా జగన్ వ్యవహరిస్తున్నారువైఎస్సార్‌సీపీ డీఎన్ఏలోనే మైనారిటీలు ఉన్నారుసీఏఏ, ఎన్‌ఆర్సీ, యూసీసీలపై కూడా మా పార్టీ స్పష్టత ఇచ్చిందిదేశంలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారుఏడు సీట్లను జగన్ ముస్లింలకు ఇచ్చారురాజ్యసభలో కూడా ముస్లింలకు సీటు కల్పిస్తాంముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పిందిచంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?ఈ విషయంలో కూటమి నేతలు స్పష్టత ఇవ్వాలిదీనిపై ముస్లింలు కూడా కూటమిని గట్టిగా నిలదీయాలివైఎస్సార్ హయాంలో వచ్చిన రిజర్వేషన్లను తొలగించటానికి వీల్లేదన్నదే మా డిమాండ్ 5:10 PM, May 4th, 2024విశాఖ :గంటా శ్రీనివాస్ కాపు ద్రోహి: తోట రాజీవ్, కాపునాడు అధ్యక్షుడు, విశాఖరియల్ ఎస్టేట్ వ్యక్తులను ఎన్నికలకు గంటా వాడుకుంటున్నారుగంటా పోటీ చేసిన నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చెయ్యడుఅక్కడి ప్రజలకు అందుబాటులో ఉండడుగంటా ఏ నాడూ చట్ట సభలకు వెళ్ళింది లేదుగంటాకు పొలిటికల్ బ్రోకర్ పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాంగంటా మాకు అవసరం లేదని భీమిలి ప్రజలు అంటున్నారుగంటా మంత్రిగా ఉండి విశాఖకు ఏం చేశాడుగంటాను పవన్ కళ్యాణ్ పలుమార్లు తిట్టాడుఅలాంటి గంటాకు ఎంత డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారునోటికాడ కూడు లాక్కోవడం గంటాకు అలవాటుగంటా రాజకీయ బంధిపోటు దొంగ 3:46 PM, May 4th, 2024నన్ను అంతమొందించే ప్రయత్నం సీఎం రమేష్ చేస్తున్నారు: బుడి ముత్యాల నాయుడుతనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పోతున్నారునా ఇంటి మీద డ్రోన్ ఎగరేయవలసిన అవసరమేముంది?డ్రోన్‌తో నా కదలికలను పరిశీలిస్తున్నారురౌడీయిజం గుండాయిజం చేయాలని సీఎం రమేష్ చూస్తున్నారుప్రజాక్షేత్రంలో తనపై గెలవలేనని చెప్పి నన్ను అంతమొందించే కుట్రలు చేస్తున్నారువచ్చిన వారు కూడా సీఎం రమేష్ పంపితేనే వచ్చామని చెబుతున్నారుసీఎం రమేష్ చెబితేనే డ్రోన్ తో విజువల్స్ తీశామని వచ్చిన వారు చెబుతున్నారువారు మా ప్రాంతానికి చెందిన వ్యక్తుల కాదుఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తులతో రెక్కీ నిర్వహించాల్సిన అవసరమే ఉంది3:15 PM, May 4th, 2024పలమనేరు ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్‌ప్రత్యేకహోదాను అమ్మేసిన బాబు లాంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా?మోసగాళ్లతో మనం యుద్ధం చేస్తున్నాంకొత్త హామీలతో మోసం చేసేందుకు మళ్లీ ముగ్గురు కలిసి వస్తున్నారు14 ఏళ్లపాటు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క మంచైనా చేశాడా?అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు, మోసాలు..అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు చంద్రముఖి మారిపోతాడుబాబు తన హయాంలో పేద ప్రజలకు ఒక్క సెంటు భూమైనా ఇచ్చాడా?ఈ 59 నెలల పాలనలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాంమేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే సాంప్రదాయాన్ని పూర్తిగా మార్చేశాంమేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి 99 శాతం అమలు చేశాం59 నెలల పాలనలో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయిచంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమేమరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందిగ్రామ సచివాలయాల్లో ప్రజలకు 600 రకాల సేవలు అందుతున్నాయివర్షం రూపంలో దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తున్నారని భావిస్తున్నా 2:50 PM, May 4th, 2024విజయవాడమేము అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేశాం: దేవినేని అవినాష్విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్‌ ది ప్రెస్‌లో వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్‌10ఏళ్లలో అనేక మార్పులు, చేర్పులు జరిగాయి.. అనేక అనుభవాలు నేర్పిందితూర్పు నియోజకవర్గంలో గత ప్రభుత్వాలు, గత పాలకులు చేయలేని అభివృద్ధి పనులు చేశాం..2వ డివిజన్ నుండి 22 వ డివిజన్ వరకు అన్ని పనులు చేశాంటీడీపీ అధికారంలో ఉండి, మేయర్ ప్రజా ప్రతినిధులు అన్ని ఉన్నా అభివృద్ధి శూన్యంకొండ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించాం2019, 2020లో వరదలు వచ్చాయికృష్ణ లంక కరకట్ట ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ పూర్తిచేశాంరూ. 150 కోట్లు మొదటి విడతలోనే ఇచ్చాంమేము చేసిన పనిని టీడీపీ వాళ్ళు చేసారని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? వీడియోలు ఎలా తీయించుకోగలుతున్నారు?గద్దె రామ్మోహlన్‌రావు ఒక అసమర్థ ఎమ్మెల్యేకేవలం మాటలు, షో రాజకీయాలతో ప్రజలను గద్దె మోసం చేశాడువైఎస్సార్‌సీపీ కార్పోరేటర్లు గెలిచిన చోట టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదుమేము ఏ పార్టీ అభ్యర్థులు గెలిచారా అని చూడలేదు.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేశాం4 సంవత్సరాల కాలంలో ప్రతి గడపను 4 సార్లు తిరిగానుటీడీపీ ఒక్కసారి కూడా ప్రజల గడప తొక్కలేదురోడ్లు, మంచినీళ్లు, పార్కు లు ,డ్రైనేజ్ నిర్మించామని ప్రజలే చెపుతున్నారు.. ఇదే గా అభివృద్ధి- ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకున్న అభివృద్ధికి అడ్డాగా తూర్పు నియోజకవర్గాన్ని చూపిస్తాం2:42 PM, May 4th, 2024అనంతపురం:అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో భగ్గుమన్న టీడీపీ అసమ్మతిటీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయుల మధ్య ఘర్షణఐక్యత కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో రసాభాసపరస్పరం వాగ్వాదం, తోపులాటకు పాల్పడ్డ ఇరువర్గాలుటిక్కెట్ రాకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తి గా ఉన్న   మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు 1:00 PM, May 4th, 2024చంద్రబాబుది క్రిమినల్ మైండ్: జోగి రమేష్చంద్రబాబుపై జోగి రమేష్‌ సీరియస్‌ కామెంట్స్‌రాజకీయ హాంతకుడు బాబు.డీబీటీ ద్వారా వచ్చే పథకాలను ఆపేయమన్నాడు.ఈసీకి ఫిర్యాదు చేయించిన దుర్మార్గుడు చంద్రబాబు.ఆసరా, చేయూత, విద్యా దీవెన, ఇన్‌పుట్‌ సబ్సిడీ పథకాలు ఆపేయాలని ఈసీని కోరారు.అవ్వాతాతలను పొట్టన పెట్టుకున్న వ్యక్తి బాబు.చంద్రబాబు రాక్షసుడు మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు.బాబు నిజస్వరూపం ప్రజలు గమనించాలి.రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు.కుప్పంలో చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడించాలి.మంచి చేస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నాడు.ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు.  12:40 PM, May 4th, 2024బుడి ముత్యాల నాయుడు ఇంటిపై రెక్కీ! బీజేపీ నేతల ఓవరాక్షన్‌..డ్రోన్‌తో విజువల్స్ తీస్తున్న బీజేపీ నేతలు.అనుమానం వచ్చి ఆరా తీసిన స్థానికులు.పొంతన లేని సమాధానాలు ఇచ్చిన బీజేపీ నేతలు.విజువల్స్ తీస్తున్న వారిని పట్టుకున్న స్థానికులు.పట్టుకున్న వారిని పోలీసులకు అప్పగింత.నిందితులను విచారిస్తున్న పోలీసులు.విజువల్స్ తీసిన వారు స్థానికులు కాదంటున్న వైఎస్సార్‌సీపీ నేతలు.సీఎం రమేష్ ఆదేశాలతోనే విజువల్స్ తీశారంటున్న వైఎస్సార్‌సీపీ నేతలు, స్థానికులుదేవరపల్లి పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులుముగ్గురిని విచారిస్తున్న దేవరపల్లి పోలీసులుడ్రోన్ కెమెరాను ఎందుకు ఇంటిపై ఎగురవేస్తున్నారు అని ప్రశ్నించిన పోలీసులుముగ్గురి వద్ద బీజేపీ పార్టీ కండువాలు గుర్తించిన పోలీసులు  12:20 PM, May 4th, 2024సుజనా చౌదరికి వైఎస్సార్‌సీపీ నేతల కౌంటర్‌..కేశినేని నాని కామెంట్స్‌మైనారిటీలను, బీసీలను మోసం చేసి పక్క దారిలో పశ్చిమ నియోజకవర్గానికి వచ్చాడు. 12ఏళ్ళు రాజసభ సభ్యుడిగా, మూడేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న నీ వల్ల ఏమైనా అభివృద్ధి జరిగిందా?రాజ్యసభ సభ్యుడిగా 60కోట్లు నిధులు వస్తే ఒక్క అర్ధ రూపాయి అయినా ఖర్చు చేశావా?.  పశ్చిమని బెస్ట్ చేస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారుఅసిఫ్, వైస్సార్సీపీ వెస్ట్ అభ్యర్థిచంద్రబాబు ఎలా మాయమాటలు చెప్పాడో.. అలాగే సుజనా కూడా మాయ మాటలు చెపుతున్నాడు.విజయవాడ ప్రజలకు సుజనా చౌదరి మొహం తెలుసా?డబ్బుంటే ఏదైనా చేయొచ్చని సుజనా భ్రమలో ఉన్నాడు.పశ్చిమలో తెలుగుదేశం కండువా కప్పుకొన్నాడు.. ఒక్కడు కూడా సుజనా వెనక లేరు.జెండాలు జత కట్టి వచ్చిన మమ్మల్ని ఢీకొట్టలేరు.. మా జెండా ఏ జెండా రెండు ఒకటే. 12:00 PM, May 4th, 2024గద్దెకు దేవినేని కౌంటర్‌ దేవినేని అవినాష్‌ కామెంట్స్‌.. జగన్‌ ప్రభుత్వం శంకుస్థాపనలే కాకుండా ప్రారంభోత్సవాలు కూడా చేసింది.రిటేనింగ్ ప్రారంభంతో గద్దె ఓటమి మొదలైందికరకట్టవాసుల కష్టాలు పట్టని టీడీపీ నేతలుప్రతీ ఇంటికే పథకాలు పంపిన జగన్ ప్రభుత్వానికే మా మద్దతు అని ప్రజలు అంటున్నారుటీడీపీ చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారుటీడీపీ నేతల లాగా కాల్ మనీ సెక్స్ రాకెట్‌ మా పార్టీ నేతలు లేరు670 కోట్లతో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి జరిగిందిగంజాయికి పునాదులు వేసింది టీడీపీ ఎమ్మెల్యే కాదా?.విశాఖలో దొరికిన డ్రగ్స్‌కు గద్దె రామ్మోహన్ కుటుంబానికి సంబంధాలున్నాయినిజానిజాలు వెలికితీయాలిజగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని టీడీపీగా చెప్పుకోడానికి సిగ్గులేదా?.చిల్లర రాజకీయాలు చేయడం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కే దక్కుతుందిఅసమర్థ ఎమ్మెల్యే మాకు వద్దు అని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు 11:20 AM, May 4th, 2024బాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గనటీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన అప్పు ఆయన కడతారా?.75 ఏళ్లు దాటిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. కోట్ల సూర్యప్రకాశ్‌ ఒక్కరోజు నాతో పాటు వచ్చి డోన్‌లో తిరగండి. పుష్కర కాలం ఎంపీ పదవి అనుభవించి మీరేం సాధించారో చెప్పండి.ప్రతీ దానికి ట్యాక్స్‌లు కట్టిన నేడు ఆర్థిక నేరుస్థుడినా? అయితే మరి మిమ్మల్ని ఏమనాలి. ఎన్నికల్లో వేసిన నామినేషన్‌ను కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటారా?. ఆస్తులు సహా అని వివరాలు, దానికి సంబంధించిన పత్రాలను పక్కాగా రిటర్నింగ్‌ ఆఫీసర్‌కి సమర్పించాం. అప్లికేషన్‌లో రాయనంత మాత్రాన తప్పుడు నామినేషన్‌ అవుతుందా?. నాకు సంబంధించిన వివరాలన్నీ జతపరిచాం. రైల్వే సహాయ మంత్రిగా ఉండి.. పేకాట ఆడటమేనా అందుబాటులో ఉండటం అంటే? స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ ప్రతిపక్షాలకు మేలు జరిగేది కాదా?. డోన్‌ను కర్నూలులో కలుపుతారా అని అంటున్నారే నంద్యాలలో కలుస్తున్నప్పుడు ఏం చేశారు. మిమ్మల్ని, చంద్రబాబును ప్రజలు నమ్మేపరిస్థితి లేదు.  10:40 AM, May 4th, 2024బాబు నీకు పేదల ఉసురు తగులుతుంది: ఎంపీ విజయసాయిమానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెలా ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు నిమ్మగడ్డ రమేష్‌ చౌదరి ద్వారా ఈసీకి ఫిర్యాదుమొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు పంచాయతీ సెక్రటేరియట్‌లో సైతం పెన్షన్లు పంపిణీని అడ్డుకున్నారు. బ్యాంకుల్లో పెన్షన్‌ సొమ్ము జమ చేయించడంతో బ్యాంకుల దగ్గర పడిగాపులుకాస్తూ వడదెబ్బతో వయోవృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. బాబు ముఖంలో పశ్చాతాపానికి బదులు మందహాసం కనిపిస్తోంది. పేదల ఉసురు నీకు తప్పక తగులుతుంది బాబూ.మానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెల ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు తన నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్‌ చౌదరి ద్వారా ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదులు చేయించాడు. మొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 4, 2024  9:20 AM, May 4th, 2024మళ్లీ తప్పులో కాలేసిన లోకేశం! మళ్లీ తప్పులో కాలేసిన మంగళగిరి మాలోకం!ఏపీలో పోలింగ్ ఎప్పుడో కూడా తెలియనివాడు @JaiTDPలో ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వెళ్లి మార్చి 13న ఓటు వేసుకో @naralokesh.. ఏపీ ప్రజలంతా మే 13న ఓటు వేస్తారు మంగళగిరి ప్రజలారా ఇలాంటి బుర్రతక్కువ వాళ్ళు మీకు అవసరమా?#TDPJSPBJPCollapse#EndOfTDP pic.twitter.com/b2a2Xj64CR— YSR Congress Party (@YSRCParty) May 4, 2024 ఏపీలో ఎన్నికలు ఎప్పుడో కూడా తెలియని వ్యక్తి నారా లోకేష్‌మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌ కామెడీ ట్రాక్‌మే 13న పోలింగ్‌ అయితే మార్చి 13న ఓటు వేయమన్న లోకేష్‌లోకేష్‌ మాటలతో ఒక్కసారిగా నవ్వుకున్న ప్రజలు 8:50 AM, May 4th, 2024చంద్రబాబు మరో కుట్ర..టీడీపీ అధినేత చంద్రబాబు మరో దారుణ కుట్రపేదలకు ప్రభుత్వ పథకాలు అందకుండా మోకాలడ్డుఇప్పటికే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వనీయకపోవటంతో వృద్దులు, వికలాంగుల అవస్థలుబ్యాంకుల చుట్టూ మండుటెంటలో తిరుగుతున్న పెన్షన్ దారులుతాజాగా వైఎస్సార్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, విద్యాదీవెన, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ నిధులను ఇవ్వనీయకుండా అడ్డుఇవన్నీ గత ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలేఐనాసరే టీడీపీ ఫిర్యాదుతో నిధులను రిలీజ్ చేయనివ్వని ఎన్నికల సంఘంఇప్పటికే అనేకసార్లు ఎన్నికల‌ సంఘాన్ని అనుమతి కోరిన ప్రభుత్వంటీడీపీ ఫిర్యాదుతో ఇంకా అనుమతి ఇవ్వని ఈసీ 7:45 AM, May 4th, 2024ఓటమి భయంలో కూటమి నేతల ఓవరాక్షన్‌..ఓటమి భయంతో టీడీపీ, జనసేన కూటమి నేతల కుట్ర రాజకీయాలువైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక పోతున్న కూటమి నేతలుప్రచారాలలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకి తెగబడుతున్న టీడీపీ, జనసేన కార్యకర్తలుసీఎం జగన్‌పై వ్యక్తిగత దూషణలతో కార్యకర్తలని రెచ్చగొట్టేలా ప్రచారంలో బాబు, పవన్‌ వివాదాస్పద ‍వ్యాఖ్యలు.వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్న టిడిపి, జనసేన నేతలుమచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి పేర్ని కిట్టు ప్రచార సమయంలో దాడికి పాల్పడ్డ జనసేన, టీడీపీ నాయకులుదెందులూరు నియోజకవర్గంలో ప్రచారంలో ఉండగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్లతో, కర్రలతో చింతమనేని అనుచరుల దాడిచిలకలూరిపేట నియోజకవర్గంలో ఈవూరివారిపాలెంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా కావటి మనోహర్ నాయుడుపై దాడికి ప్రయత్నం.అదే సమయంలో ప్రచార రథం ధ్వంసంమంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా మేకా వెంకట్ రెడ్డిపై దాడి.ఎన్నికల ప్రచారంలో నిలదీసిన మహిళని చెప్పుతో కొడతానంటూ రెచ్చిపోయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిసీఎం సభలకి పెరుగుతున్న జనాదరణతో కూటమి నేతలలో ఓటమి భయంఅందుకే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు.. అసహనంతో ప్రజలపై తిట్ల పురాణం  7:00 AM, May 4th, 2024నేడు సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..నేడు  పలమనేరు నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గొనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌నేడు హిందూపురం, పలమనేరు, నెల్లూరులో బహిరంగ సభల్లో పాల్గొనున్న సీఎం జగన్సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి 12.10 నిమిషాలకు హెలికాప్టర్‌లో బయలుదేరనున్న సీఎంమధ్యాహ్నం ఒంటి గంటకు పలమనేరుకు చేరుకోనున్న సీఎం జగన్మధ్యాహ్నం 1.30 నుంచి 2.05 వరకు పలమనేరు బహిరంగ సభలో పాల్గొంటారు.మధ్యాహ్నం 2.30 పలమనేరు నుంచి బయలుదేరి  3.50 గంటలకు  నెల్లూరు చేరుకోనున్న సీఎం జగన్మధ్యాహ్నం 3.50 నుంచి 4.35 గంటల వరకు నెల్లూరులో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. 6:45 AM, May 4th, 2024ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం: కేశినేని నానిచంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై పొత్తులో ఉన్న బీజేపీకి నమ్మకం లేదుఅందుకే మేనిఫెస్టోలో బీజేపీ నేతల ఫోటో ఒకటి కూడా లేదు.చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానీ మానిఫెస్టోఅందుకే మేనిఫెస్టోని పట్టుకోడానికి  కూడా బీజేపీ నేతలు ఇష్టపడలేదురానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా సీఎం జగన్‌ను మరోసారి గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారుఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, పార్టీ కార్యాలయానికి తాళం వేయడం ఖాయంటీడీపీని బీజేపీలో విలీనం చేసి చంద్రబాబు హైదరాబాద్‌లో తన ఇంటికి వెళ్లిపోతారుఈ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందిదేవినేని ఉమా ఒక చచ్చిన పాము.. అతని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ఉమాకు సీటు రాకపోతే ఇంటికి వెళ్లి పరామర్శించలేని ద్రోహి తంగిరాల సౌమ్య 6:30 AM, May 4th, 2024జూనియర్‌ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని ఓడించాలి: కొడాలి నానిగుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నానిజూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలిపెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై నాకు, సీఎం జగన్‌కు అమితమైన ప్రేమఅందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాముపార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబుఅన్న ఎన్టీఆర్ వారసులు.. అభిమానులెవరు టీడీపీలో ఉండరు, చంద్రబాబు వెంట నడవరుపదిమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకొని టిడిపి కార్యక్రమాలకు వెళితే... ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాంమన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబు, లోకేష్ తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదుఅభిమానులందరూ కష్టపడి టిడిపిని గెలిపిస్తే.. ఎన్టీఆర్‌ను తుంగలో తొక్కుతారు. లోకేష్‌ను అందలం ఎక్కిస్తారుఎన్టీఆర్‌ టీడీపీ పగ్గాలు పట్టుకున్నప్పుడే.. అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలిచంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తూ చిత్తుగా ఓడిస్తేనే.. పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కి వస్తాయిఎవరైతే పెద్ద ఎన్టీఆర్‌ను  వెన్నుపోటు పొడిచారో.. పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరికి వస్తారుపెద్ద ఎన్టీఆర్‌కు  దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఐటీడీపీ ద్వారా సోషల్‌ మీడియాలో తిట్టిస్తున్నారునేను పెద్ద ఎన్టీఆర్ భక్తుడిని.. నందమూరి హరికృష్ణ నా గురువు.. నేను వైసీపీలో ఉన్నా నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెబుతాను.నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.. వైఎస్సార్‌ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను.ఎన్టీఆర్ కుటుంబంతో నాకు ఉన్న బాంధవ్యం విడదీయరానిది.. వారికోసం నేను.. నాకోసం వారు అనేక త్యాగాలు చేశారుఎన్టీఆర్‌, వైఎస్సార్‌ నాకు రెండు కళ్లుతెలుగుదేశం పార్టీ గౌడ.. యాదవ.. మత్స్యకార.. ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది.. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి.సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటుచేసి.. అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక రాజ్యసభ స్థానాలు ఇస్తూ.. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించారు.ప్రజలను నమ్ముకుని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్‌కు, నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి.

Agra School Principal Thrashes Teacher For Coming Late, Video Viral
Viral Video: స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి

విద్యాసంస్థల్లో టీచర్లు, లెక్చరర్లు, ప్రిన్సిపల్స్‌ సభ్యత మరచి ప్రవర్తిస్తున్నారు. విద్యార్ధులు, తోటి ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో హెడ్‌మిస్ట్రెస్‌ ఫేషియల్‌ చేయించుకుంటున్న వీడియో తీసినందుకు టీచర్‌పై దాడి చేసిన నిర్వాకం మరవక ముందే రాష్ట్రంలో ఆగ్రాలో మరో ఘటన చోటుచేసుకుంది.ఆగ్రాలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారనే నెపంతో ఓ ప్రిన్సిపల్-టీచర్‌పై దాడికి పాల్పడింది. బూతులు తిడుతూ, దుస్తులు చెరిగేలా భౌతిక దాడికి దిగింది. సీగానా గ్రామంలోని ప్రీ-సెకండరీ స్కూల్ టీచర్ గుంజన్ చౌదరి పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని ప్రిన్సిపాల్‌ గొడవకు దిగింది. అంతేగాక టీచర్‌పై దాడి చేసింది. ఈ ఘర్షణలో ఇద్దరు వస్త్రాలు చిరిగిపోయాయి.అంతటితో ఆగకుండా నోటికి కూడా పని చెప్పారు. బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు.  అక్కడే ఉన్న తోటి టీచర్లు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ప్రిన్సిపల్ డ్రైవర్ విడదీసే ప్రయత్నం చేసినా.. చివరికి టీచర్‌తో అతడు కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న కొందరు తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది.A Principal in Agra beat up a teacher this bad just because she came late to the school. Just look at her facial expressions. She's a PRINCIPAL 😭 @agrapolice pic.twitter.com/db8sKvnNvs— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 3, 2024

Sara Tendulkar Opens Up About Dealing With PCOS and all
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్‌

మాస్టర్‌బ్లాస్టర్, సచిన్ టెండూల్కర్ కుమార్తె,  Gen-Z సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సారా టెండూల్కర్   గురించి పెద్ద పరిచయం అవసరం లేదు.  సోషల్‌ మీడియాలో భారీ అభిమానులను సంపాదించుకున్న సారా, తన లైఫ్‌ స్టయిల్‌, ఇతర విషయాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల టీనేజ్‌ అమ్మాయిగా తాను ఎదుర్కొన్న సమస్యల గురించి బహిరంగా మాట్లాడింది. ముట్టుకుంటే కందిపోయే సున్నితంగా, మెరిసిసోయే చర్మంతో కనిపించే సారా పీసీఓఎస్‌తో చాలా ఇబ్బందులు పడిందట. విపరీతమైన మొటిమలతో బాధపడేదట. యుక్తవయస్సులో PCOSతో తన పోరాటం గురించి  ప్రముఖ ‍మ్యాగజీన్‌ వోగ్‌తో మాట్లాడింది. పీసీఓఎస్‌, ఇతర సమస్యల నుంచి విముక్తి  పొందేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేదని, చివరికి జీవన శైలి మార్పులతోనే పరిష్కారం లభించిందని చెప్పుకొచ్చింది. ‘‘యాసిడ్, రెటినాల్ నుండి లేజర్ల వరకు  అన్నీ ప్రయత్నించా. కానీ ఏవీ పని చేయలేదు"- సారాసాధారణ శిక్షణ తర్వాత, బరువు తగ్గడం,  ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడంతో పాటు ఎక్కువగా నీళ్లు తాగడం లాంటివి చేసింది. ఫలితంగా తన స్కిన్‌ అద్భుతంగా  మారి, పీసీఓఎస్‌ సమస్య కూడా తగ్గిందని వెల్లడించింది. మెడిసిన్ రంగంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన సారా మోడల్‌గా ఫ్యాషన్‌ ప్రపంచంలో కూడా రాణిస్తోంది. పలు బ్రాండ్‌లతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే.పీపీఓఎస్ అనేది నేడు చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. హార్మోన్ల అసమతుల్యత వల్ల మొటిమలు, బరువు పెరగడం, ముఖంపై అవాంఛిత రోమాలు, పీరియడ్స్ సమస్యలు, సంతాన లేమి మొదలైన సమస్యలు వస్తాయి. 

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all