త్వరలోనే బాహుబలి ట్రైలర్‌.. రాజమౌళి పోస్ట్ వైరల్! | Rajamouli Shares Latest Video Of Bahubali Trailer announcement | Sakshi
Sakshi News home page

Rajamouli : త్వరలోనే బాహుబలి ట్రైలర్‌.. రాజమౌళి పోస్ట్ వైరల్!

Apr 30 2024 9:23 PM | Updated on May 3 2024 1:15 PM

Rajamouli Shares Latest Video Of Bahubali Trailer announcement

తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్‌ సినిమాతో ఏకంగా ఆస్కార్‌ అవార్డును సాధించారు. అంతకుముందే బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించారు. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ‌, త‌మ‌న్నా ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి తెలుగు సినిమా కీర్తిని మరింత పెంచింది. రెండు భాగాలుగా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వర్షం కురిపించింది.

అయితే తాజాగా రాజమౌళి చేసిన ట్వీట్‌ నెట్టింట తెగ వైరలవుతోంది. బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్ పేరుతో యానిమేటేడ్‌ సిరీస్‌ వస్తోందంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో బాహుబలిని చిత్రాన్ని యానిమేటేడ్‌ వర్షన్‌లో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.

కాగా.. బాహుబ‌లి చిత్రాన్ని వివిధ రూపాల్లో తీసుకువ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేద‌ని రాజ‌మౌళి గతంలో చాలాసార్లు ప్రస్తావించిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉండగా.. రాజ‌మౌళి ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబు హీరోగా యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ సినిమాని తెర‌కెక్కించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement