టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ కుమార్తెకు అరుదైన గౌరవం! | Tollywood Star Director Sukumar Daughter Gets Dadasaheb Phalke Award | Sakshi
Sakshi News home page

Sukumar: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ సుకుమార్‌ కుమార్తెకు అరుదైన గౌరవం!

May 1 2024 9:14 PM | Updated on May 2 2024 11:57 AM

Tollywood Star Director Sukumar Daughter Gets Dadasaheb Phalke Award

టాలీవుడ్ డైరెక్టర్‌ సుకుమార్‌, త‌బితా సుకుమార్ దంప‌తుల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డిని ఉత్త‌మ‌బాల న‌టిగా దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారం వ‌రించింది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన గాంధీ తాత చెట్టు చిత్రంలో ఉత్త‌మ‌న‌ట‌న‌కు ఈ అవార్డును అంద‌జేశారు. ఢీల్లిలో జ‌రిగిన అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఈ అవార్డును ఆమెకు అంద‌జేశారు. ప్ర‌స్తుతం ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ హైద‌రాబాద్‌లో గ్రేడ్-8 అభ్య‌సిస్తున్న సుకృతి వేణి బండ్రెడ్డి   న‌టించిన ఈ చిత్రం గ‌తంలో కూడా  ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ప్ర‌ద‌ర్శించారు.

ఈ చిత్రంలో సుకృతి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లతో పాటు ప‌లు అవార్డుల‌ను గెలుచుకుంది. దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌, ఇండియ‌న్ ఫిల్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఉత్త‌మ తొలి సినిమా బాల‌న‌టిగా సుకృతి వేణికి అవార్డులు వ‌రించాయి. 11వ నోయిడా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో ఉత్త‌మ చిత్రంగా.. న్యూఢిల్లి ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో జూరీ బెస్ట్ ఫిలింగా.. ఉత్త ప్రాంతీయ చిత్రంగా అవార్డులు అందుకుంది. జైపూర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌తో పాటు 8వ ఇండియ‌న్ వ‌ర‌ల్డ్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో బెస్ట్ జ్యూరీ ఫిలింగా గాంధీ తాత చెట్టు అవార్డులు అందుకోవ‌డం విశేషం.

ఇవి కాకుండా ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ నుండి ఈ చిత్రానికి ఆహ్వానాలు అందుతున్నాయి. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ముఖ్య ఉద్దేశంగా తెర‌కెక్కిన ఈ సందేశాత్మ‌క చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్,  సుకుమార్ రైటింగ్స్‌తో పాటు గోపీ టాకీస్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించాయి.  న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, శేష సింధు రావులు నిర్మాత‌లుగా వ్యవహరించారు. ప‌ద్మావ‌తి మ‌ల్లాది  ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి త‌బితా సుకుమార్ స‌మ‌ర్ప‌కురాలిగా వ్యవహరించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement