KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే | Mumbai Indians win toss, choose to bowl first against KKR | Sakshi
Sakshi News home page

KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే

May 3 2024 7:23 PM | Updated on May 3 2024 7:52 PM

Mumbai Indians win toss, choose to bowl first against KKR

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ కీలక పోరుకు సిద్దమైంది. వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ తమ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ముంబై మాత్రం ఒకే ఒక మార్పు చేసింది. ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ స్ధానంలో నమాన్‌ ధీర్‌ వచ్చాడు. 

కాగా ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్‌ చాలా కీలకం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో ఉన్న ముంబై.. ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే.

తుది జట్లు
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), నమన్ ధీర్, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార

కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement