ఓటీటీలోకి 'పుష్ప' విలన్ హిట్ సినిమా.. తెలుగులో డైరెక్ట్ రిలీజ్ | Fahadh Faasil Aavesham Movie OTT Release Date | Sakshi
Sakshi News home page

Avesham OTT: నేరుగా ఓటీటీలో సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

May 3 2024 12:28 PM | Updated on May 3 2024 3:00 PM

Fahadh Faasil Aavesham Movie OTT Release Date

రీసెంట్ టైంలో ఇన్ స్టాలో తెగ ట్రెండ్ అవుతున్న 'ఆవేశం' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయింది. థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీలోకి రాబోతుంది. ఇంతకీ ఆ డేట్ ఎప్పుడంటే?

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్.. హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. కానీ 'పుష్ప' విలన్‌గానే తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యాడు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ మూవీస్‌తో హిట్స్ కొట్టే ఇతడు.. రీసెంట్‌గానే 'ఆవేశం' మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. దీన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తారనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు అవన్నీ కాదన్నట్లు నేరుగా ఓటీటీలోకి తీసుకురాబోతున్నారు. ఇంతకీ ఆ సంగతేంటి?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)

మలయాళంలో ఫహాద్ ఫాజిల్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్నాడు. ఈ మధ్య 'ఆవేశం' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాతో వచ్చాడు. ఇందులో గ్యాంగస్టర్ రంగా అనే పాత్రలో అదరగొట్టేశాడు. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు కూడా సొంతం చేసుకున్నాడు. అయితే దీన్ని డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తారేమో అని కొందరు ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ చేయబోతున్నారు.

ఫహాద్ 'ఆవేశం' సినిమా థియేటర్లలో ఏప్రిల్ 11న రిలీజ్ కాగా.. ఇప్పుడు నెలలోనే ఓటీటీలోకి వచ్చేయబోతుంది. డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. మే 9 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోతుందట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రానుందని సమాచారం. 

(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. రిలీజ్ డేట్ ఇదే

Advertisement
 
Advertisement
Advertisement