ఎట్టకేలకు ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. రిలీజ్ డేట్ ఇదే | Manjummel Boys OTT Release Date Latest | Sakshi
Sakshi News home page

Manjummel Boys OTT: ఫైనల్‌‌గా హిట్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్

Apr 27 2024 11:58 AM | Updated on Apr 27 2024 11:58 AM

Manjummel Boys OTT Release Date Latest

హమ్మయ్యా.. ఎట్టకేలకు 'మంజుమ్మల్ బాయ్స్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. థియేటర్లలో రిలీజైన దాదాపు రెండున్నర నెలల తర్వాత స్ట్రీమింగ్ కాబోతుంది. ఫలానా తేదీన ఓటీటీ రిలీజ్ అని తెగ హడావుడి చేశారు. కానీ అది నిజం కాలేదు. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన ఓటీటీ సంస్థ.. వీడియోతో అధికారికంగా ప్రకటించింది.

ఫిబ్రవరిలో రిలీజై థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన సినిమా 'మంజుమ్మల్ బాయ్స్'. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 22న మలయాళంలో విడుదలైంది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఏప్రిల్ 6న రిలీజై ఇక్కడ దాదాపు రూ.10 కోట్లకు పైనే వసూళ్లు సాధించింది.

ఒరిజినల్ వెర్షన్ రిలీజై ప్రస్తుతానికి దాదాపు రెండున్నర నెలలు పైనే అయిపోయింది. దీంతో ఇప్పుడు ప్రశాంతంగా హాట్‌స్టార్.. 'మంజుమ్మల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించింది. అందరూ అనుకుంటున్నట్లు మే 3న కాకుండా 5వ తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. దక్షిణాది భాషలతో పాటు హిందీ వెర్షన్ ఇదే తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement