పెళ్లి చేసుకోనున్న బుల్లితెర జంట‌.. న‌టి ఏమందంటే? | Is Shivangi Joshi And Kushal Tandon Getting Engaged? See Actress Reaction On This | Sakshi
Sakshi News home page

Shivangi Joshi - Kushal Tandon: త్వర‌లో ఎంగేజ్‌మెంట్‌? న‌టి సర్‌ప్రైజ్..

May 3 2024 4:44 PM | Updated on May 3 2024 6:08 PM

Is Shivangi Joshi and Kushal Tandon Getting Engaged?

గ‌తేడాది ప్రారంభ‌మైన ఈ సీరియ‌ల్ ఇటీవ‌లే ముగిసింది. ఆన్‌స్క్రీన్‌లో జంట‌గా క‌నిపించిన వీరు ఆఫ్‌స్క్రీన్‌లోనూ క‌లిసి క‌నిపించ‌

బుల్లితెర సెల‌బ్రిటీలు శివంగి జోషి, కుషల్ టండ‌న్ ప్రేమించుకుంటున్నార‌ని గ‌త కొంత‌కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకోబోతున్నార‌ని ఊహాగానాలు వెలువ‌డ్డాయి. తాజాగా ఈ రూమ‌ర్స్‌పై ఇరువురూ స్పందించారు. త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నామంటూ వస్తున్న వార్త‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని క్లారిటీ ఇచ్చారు.

నాకు ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌బోతుందా?
ఈ మేర‌కు శివంగి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది. 'నాకు రూమ‌ర్స్ అంటే ఎంతో ఇష్టం. నా గురించి నాకే తెలియని విష‌యాల‌ను తెలుసుకుంటుంటే భ‌లే అనిపిస్తుంది. మీడియా మిత్రులారా.. నాకు ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌బోతుందా? ఇది నాక్కూడా తెలీదే.. నేను మార్ష‌ల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం థాయ్‌లాండ్‌లో ఉన్నాను. మీరేమో ఏదేదో రాసేస్తున్నారు.

సీరియ‌ల్‌లో క‌లిసి..
కాస్త వార్త రాసేముందు ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకోండి' అని సూచించింది. అటు కుష‌ల్ కూడా ఏదో ట్రైనింగ్ తీసుకుంటున్న‌ట్లు పోస్ట్ చేశాడు. కాగా శివంగి, కుష‌ల్‌.. బ‌ర్సాతే మౌస‌మ్ ప్యార్ కా అనే సీరియ‌ల్‌లో క‌లిసి న‌టించారు. గ‌తేడాది ప్రారంభ‌మైన ఈ సీరియ‌ల్ ఇటీవ‌లే ముగిసింది. 

ఇద్దరి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్
ఆన్‌స్క్రీన్‌లో జంట‌గా క‌నిపించిన వీరు ఆఫ్‌స్క్రీన్‌లోనూ క‌లిసి క‌నిపించ‌డంతో ఇద్దరి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ ఉంద‌ని అందరూ భావించారు. గ‌తంలోనూ శివంగి.. బాలికా వ‌ధు సీరియ‌ల్ న‌టుడు ర‌ణ్‌దీప్ రాయ్‌తో డేటింగ్‌లో ఉంద‌ని రూమ‌ర్స్ వ‌చ్చాయి. అయితే అవేవీ నిజం కాద‌ని న‌టి క్లారిటీ ఇచ్చింది. అత‌డు కేవ‌లం త‌న స్నేహితుడు మాత్ర‌మేన‌ని చెప్పింది.

చ‌ద‌వండి: ప్రియుడితో పెళ్లికి రెడీ.. ఎంగేజ్‌మెంట్ వీడియో షేర్ చేసిన బ్యూటీ

Advertisement
 
Advertisement
Advertisement