ఎక్కువరోజులు బ‌త‌క‌లేడు అని డాక్ట‌ర్లు చేతులెత్తేశారు: న‌టుడు | Shekhar Suman Recalls Doctor Said his Son Aayush Would Live Only for 8 Months | Sakshi
Sakshi News home page

బ‌త‌క‌డం క‌ష్ట‌మ‌ని తేల్చేశారు.. అత‌డి అవ‌స్థ చూడ‌లేక‌ త్వ‌ర‌గా పోవాల‌ని..

May 3 2024 1:06 PM | Updated on May 3 2024 5:56 PM

Shekhar Suman Recalls Doctor Said his Son Aayush Would Live Only for 8 Months

ప్ర‌పంచంలోనే బెస్ట్ డాక్టర్స్ ద‌గ్గర‌కు వెళ్లాను. బాబాల ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్లాను. బౌద్ధ‌మతాన్ని స్వీక‌రించాను. కానీ ఎటువంటి అద్భుతాలు జ‌ర‌గ‌లేదు.

చాలాకాలం త‌ర్వాత హీరామండి: ది డైమండ్ బ‌జార్ అనే వెబ్ సిరీస్‌తో ఇండ‌స్ట్రీకి రీఎంట్రీ ఇచ్చాడు న‌టుడు శేఖ‌ర్ సుమ‌న్‌. హీరామండి సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇంట‌ర్వ్యూల‌లో పాల్గొంటున్నాడు. ఈ సంద‌ర్భంగా శేఖ‌ర్ త‌న జీవితంలోని ఓ సంఘ‌ట‌న‌ను పంచుకున్నాడు.

తిర‌గ‌ని ఆస్ప‌త్రి లేదు
'మా నాన్న ఒక డాక్టర్‌.. ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఆయ‌న త‌న మ‌న‌వ‌డిని కాపాడ‌లేక‌పోయాడు. నా కొడుకు ఆయుష్‌కు అరుదైన వ్యాధి సోక‌డంతో ఎక్కువ‌రోజులు బ‌త‌క‌లేడ‌ని వైద్యులు తేల్చి చెప్పేశారు. త‌న‌ను ఎలాగైనా బ‌తికించుకోవాల‌ని ఆస్ప‌త్రుల చుట్టూ తిరిగాను. ప్ర‌పంచంలోనే బెస్ట్ డాక్టర్స్ ద‌గ్గర‌కు వెళ్లాను.  బాబాల ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్లాను. బౌద్ధ‌మతాన్ని స్వీక‌రించాను. కానీ ఎటువంటి అద్భుతాలు జ‌ర‌గ‌లేదు.

నా కుమారుడు క‌ళ్ల‌ముందే..
గుండె మార్పిడి చేయాల‌న్నారు. అయితే రిస్క్ ఎక్కువ అని చెప్ప‌డంతో అందుకు ఒప్పుకోలేదు. నా కుమారుడు క‌ళ్ల‌ముందే చావుకు ద‌గ్గ‌ర‌వుతుంటే ఏమీ చేయ‌లేక‌పోయాను. అత‌డు ఎనిమిది నెల‌లు మాత్ర‌మే బ‌తక‌గ‌ల‌డు అని చెప్పారు. కానీ వాడు నాలుగేళ్లదాకా జీవించాడు. చివరి రోజుల్లో త‌ను ఏవేవో ఊహించుకునేవాడు. 

నా చేతుల‌తో మోసుకెళ్లి
త‌న దుస్థితి చూసి దేవుడిని త‌న‌తోపాటు తీసుకెళ్ల‌మ‌ని కోరుకోక త‌ప్ప‌లేదు. త‌న అవ‌స్థ చూడ‌లేక‌పోయాం. అలా ప‌ద‌కొండేళ్ల వ‌య‌సులో త‌ను ఊపిరి వ‌దిలేశాడు. ఆ రోజు నిర్జీవంగా ప‌డి ఉన్న అత‌డిని నా చేతుల‌తో మోసుకెళ్లి అంత్య‌క్రియ‌లు జరిపాము అని చెప్తూ ఎమోష‌న‌ల‌య్యాడు.

చ‌ద‌వండి: సింపుల్‌గా ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ గృహప్ర‌వేశ వేడుక‌.. పిల్ల‌ల‌తో అదే ఇంట్లో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement