Barbie OTT Release: తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన హాలీవుడ్‌ హిట్‌ సినిమా | Hollywood Hit Movie Barbie Telugu Version Released In OTT, Check Streaming Platform Details| Sakshi
Sakshi News home page

Barbie Telugu Version In OTT: తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన హాలీవుడ్‌ హిట్‌ సినిమా

May 4 2024 2:25 PM | Updated on May 4 2024 3:33 PM

Barbie Telugu Streaming Now OTT

హాలీవుడ్ సినిమా 'బార్బీ' గతేడాది జూలై 21న రిలీజై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో చేరిపోయిన బార్బీ  క్రియేట్‌ చేసింది. ఈ క్రమంలో బార్బీ , ప్రపంచవ్యాప్తంగా రూ. 11వేల కోట్లకు పైగా వసూలు చేసింది. ఇండియాలో బార్బీ మూవీకి దాదాపు 150 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి తెలుగు వర్షన్‌ వచ్చేసింది.

హాలీవుడ్ స్టార్స్ మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్, కేట్ మెక్ కిన్నన్, విల్ ఫెర్రెల్, అమెరికా ఫెరెరా, ఇస్సా రే, సిము లియులు బార్బీలో నటించారు. 96వ ఆస్కార్ అవార్డుల్లో ఎనిమిది నామినేష‌న్స్‌లలో చోటు దక్కించుకుని రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అయితే,  బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో మాత్ర‌మే ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. ఇప్పుడు జియో సినిమా ఓటీటీలో తెలుగు వెర్ష‌న్ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో అయితే రెంటల్‌ విధానంలో రూ. 149 రూపాయ‌లు చెల్లించి చూడవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement