ఆయన్ను ముసుగేసి కొడితే రూ.10 వేలిస్తా: రాజమౌళి | SS Rajamouli Funny Counter to Anil Ravipudi | Sakshi
Sakshi News home page

ఆయన్ను ఫాలో అయి మరీ కొడితే ప్రైజ్‌మనీ ఇస్తానంటూ జక్కన్న బంపర్‌ ఆఫర్‌

May 2 2024 2:12 PM | Updated on May 2 2024 5:38 PM

SS Rajamouli Funny Counter to Anil Ravipudi

వెనకాల కెమెరా పట్టుకుని తిరుగుతూ అతడి మీద ముసుగేసి గుద్దితే వారికి రూ.10 వేలు ఇస్తానని బంపరాఫర్‌ ఇచ్చాడు.

టాలీవుడ్‌ హీరో సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కృష్ణమ్మ. అతీరా రాజ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు.  మే 10న రిలీజ్‌ కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు కొరటాల శివ, అనిల్‌ రావిపూడి, రాజమౌళి, గోపీచంద్‌ మలినేని ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ముసుగేసి గుద్దితే..
ఈ కార్యక్రమంలో జక్కన్న మాట్లాడుతూ చిత్ర యూనిట్‌ను మెచ్చుకున్నాడు. టైటిల్‌, టీజర్‌, ట్రైలర్‌ అన్నీ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు. సత్యదేవ్‌కు స్టార్‌డమ్‌ తెచ్చే సినిమా కృష్ణమ్మ అవ్వాలని కోరాడు. చివర్లో అనిల్‌ రావిపూడి వెనకాల కెమెరా పట్టుకుని తిరుగుతూ అతడి మీద ముసుగేసి గుద్దితే వారికి రూ.10 వేలు ఇస్తానని బంపరాఫర్‌ ఇచ్చాడు.

రాజమౌళిని ఇరికించేసిన డైరెక్టర్‌
అనిల్‌ రావిపూడి మీద ఈ రేంజులో ఫైరవడానికి కారణం లేకపోలేదు. అతడు స్టేజీపైకి వచ్చీరావడంతోనే దేవర అప్‌డేట్‌ చెప్పాలని కొరటాల శివను,  మహేశ్‌బాబుతో చేస్తున్న మూవీ జానర్‌ ఏంటి? కథేంటి? అని రాజమౌళిని ఇరికించేశాడు. అందుకే జక్కన్న ఇలా తనదైన స్టైల్‌లో నాలుగు కొట్టమని కౌంటర్‌ వేశాడు. ఇది విని షాకైన అనిల్‌ రావిపూడి.. పది వేలంటే నిజంగానే కొట్టేస్తారు.. దయచేసి ప్రైజ్‌మనీ తగ్గించండి అని కోరాడు. వీరిద్దరి స్పీచ్‌లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

చదవండి: రోజుకు 12 గంటలు పని చేయించుకున్నారు.. డబ్బులివ్వకుండా వేధిస్తున్నారు!

Advertisement
 
Advertisement
Advertisement