గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్‌ నటి..! | Tollywood Actress Kovai Sarala Appeares After Long Time In Hyderabad | Sakshi
Sakshi News home page

Kovai Sarala: కోవై సరళ ఇంతలా మారిపోయిందేంటి?

Apr 29 2024 8:04 PM | Updated on Apr 29 2024 8:04 PM

Tollywood Actress  Kovai Sarala Appeares After Long Time In Hyderabad

సీనియర్ నటి కోవై సరళ మీకు గుర్తుందా? ఆమె పేరు వినగానే కామెడీ వెంటనే గుర్తుకొచ్చేస్తోందా? కోవై సరళ- బ్రహ్మానందం జోడీ చేసే కామెడీ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ మెదలుతూనే ఉంటాయి.  టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తమిళనాడుకి చెందిన కోవై సరళ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో నటించారు.

ప్రస్తుతం చాలా తక్కువగా సినిమాల్లో కనిపిస్తున్నారు. చివరిసారిగా 2022లో వచ్చిన సెంబి చిత్రంలో కోవై సరళ నటించింది. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో సూపర్‌ హిట్‌ సిరీస్‌ అరణ్మనై పార్ట్‌-4 త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. బాక్‌ పేరుతో తెలుగులోనూ ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌కు కోవై సరళ కూజా హాజరయ్యారు. సరికొత్త లుక్‌లో కనిపించి సందడి చేశారు. సినీ ప్రియులు గుర్తు పట్టలేని విధంగా ఆమె మారిపోయారు. కాగా.. ఈ చిత్రం మే3న థియేటర్లలో సందడి చేయనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement