శోభిత పోస్ట్‌.. స‌మంత స్టైలిష్ట్ రిప్లై | Sobhita Dhulipala Cryptic Post Amid Dating Rumours With Naga Chaitanya | Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala: అంద‌రికీ న‌చ్చ‌క‌పోయినా ప‌ర్లేదు.. మ‌ధ్య‌లో చై ఎందుకో!

May 4 2024 11:51 AM | Updated on May 4 2024 6:00 PM

Sobhita Dhulipala Cryptic Post Amid Dating Rumours With Naga Chaitanya

తెలుగు హీరో నాగ‌చైత‌న్య కూడా త‌న వెంటే ఉన్నాడ‌ని రూమ‌ర్స్ వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓపోస్ట్ షేర్ చేసిందీ

తెలుగుమ్మాయి శోభిత ధూళిపాళ టాలీవుడ్‌, బాలీవుడ్‌లోనే కాదు ఏకంగా హాలీవుడ్‌లోనూ ఆఫ‌ర్ అందుకుని అక్క‌డా సినిమాలు చేస్తూ త‌న స‌త్తా చాటుతోంది. ఈ మ‌ధ్య వెకేష‌న్‌కు వెళ్ల‌గా.. తెలుగు హీరో నాగ‌చైత‌న్య కూడా త‌న వెంటే ఉన్నాడ‌ని రూమ‌ర్స్ వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసిందీ బ్యూటీ. 'ఐయామ్ నాట్ ఎవ్రీవ‌న్ క‌ప్ ఆఫ్ చాయ్ (chai), అండ్ ద‌ట్స్ ఓకే' అని రాసుకొచ్చింది. నేనంద‌రికీ న‌చ్చ‌క‌పోయినా నాకేం ప‌ర్లేదు అని దాన‌ర్థం.

క‌ప్ ఆఫ్ చాయ్/చై
సాధార‌ణంగా క‌ప్ ఆఫ్ టీ అంటారు. కానీ శోభిత క‌ప్ ఆఫ్ చాయ్ అని పేర్కొంది. దీంతో కొంద‌రు నెటిజ‌న్లు చైత‌న్య‌ను ప్ర‌స్తావిస్తూనే చై అని రాసింద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. టీకి బదులుగా చాయ్‌/ చై అని రాయ‌డం దేనికో అని కామెంట్స్ చేస్తున్నారు. స‌మంత స్టైలిస్ట్ ప్రీత‌మ్ జుకల్క‌ర్ ఈ పోస్ట్‌కు స్పందిస్తూ.. నేను కూడా నా విష‌యంలో అలాగే ఫీల‌వుతుంటాను అని రాసుకొచ్చాడు.

కెరీర్‌
శోభిత కెరీర్‌ విష‌యానికి వ‌స్తే.. గూడ‌చారి, మేజ‌ర్ సినిమాల‌తో తెలుగు వారికి ద‌గ్గ‌రైంది. రామ‌న్ రాఘ‌వ‌న్ 2.0, పొన్నియ‌న్ సెల్వ‌న్ 1, ఘోస్ట్ స్టోరీస్ వంటి ప్రాజెక్టుల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. మేడ్ ఇన్ హెవెన్‌, ద నైట్ మేనేజ‌ర్ వెబ్ సిరీస్‌ల‌తో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం సితార అనే హిందీ చిత్రంలో న‌టిస్తోంది.

 

 

చ‌ద‌వండి: 25 ఏళ్ల కెరియర్‌లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు

Advertisement
 
Advertisement
Advertisement