విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన చెస్‌ చిచ్చరపిడుగులు | Sakshi
Sakshi News home page

విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన చెస్‌ చిచ్చరపిడుగులు

Published Tue, Apr 30 2024 6:56 PM

Divith Reddy Adulla And Sharvaanica A S Are World Cadet Rapid 2024 U8 Open And U10 Girls Champions

భారత చెస్‌ చిచ్చరపిడుగులు విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించారు. తెలంగాణకు చెందిన దివిత్‌ రెడ్డి అడుల్లా బాలుర అండర్‌-8 ర్యాపిడ్‌ పోటీల్లో స్వర్ణ పతకాన్ని (10/11), బ్లిట్జ్‌లో కాంస్యాన్ని (8.5/11)సాధించగా.. తమిళనాడుకు చెందిన శర్వానికా ఏ ఎస్‌ బాలికల అండర్‌-10 ర్యాపిడ్‌లో బంగారు పతకాన్ని (9/11), బ్లిట్జ్‌లో రతజ పతకాన్ని (9/11) సాధించింది. 

అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడంతో ఈ ఇద్దరు చిన్నారులపై ప్రశంసల వర్షం కురుస్తుంది. వీరిద్దరిని భావి భారత గ్రాండ్‌మాస్టర్లని చెస్‌ అభిమానులు కొనియాడుతున్నారు. దివిత్‌ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ అండర్‌-7, అండర్‌-9 ఓపెన్‌ ఛాంపియన్‌గా ఉన్నాడు. శర్వానికా ఇటీవల జరిగిన కామన్‌వెల్త్‌ క్రీడల (2023-24) అండర్‌-10 బాలిక విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించింది.

 

 ర్యాపిడ్ అండర్-8 ఓపెన్‌లో ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల నుంచి మొత్తం 59 మంది క్రీడాకారులు, అండర్-10 బాలికల విభాగంలో 19 దేశాల నుంచి 43 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

 

అండర్-8 ఓపెన్ బ్లిట్జ్‌లో 22 దేశాల నుంచి 51 మంది క్రీడాకారులు, అండర్-10 బాలికల బ్లిట్జ్ విభాగంలో 18 దేశాల నుంచి 41 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

2024 ఏప్రిల్ 26 నుండి 28 వరకు అల్బేనియాలోని గ్రాండ్ బ్లూ FAFA రిసార్ట్‌లో (డ్యూరెస్‌) ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీలను ఫిడే, అల్బేనియా చెస్ ఫెడరేషన్ నిర్వహించాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement