రాయ్‌బరేలి బరిలో రాహుల్‌.. వయనాడ్‌ ఓటర్ల ఫీలింగ్‌ ఇదే..! | Sakshi
Sakshi News home page

రాయ్‌బరేలి బరిలో రాహుల్‌.. వయనాడ్‌ ఓటర్ల ఫీలింగ్‌ ఇదే..!

Published Sat, May 4 2024 4:37 PM

Wayanad People Response On Rahul Raibareli Nomination

తిరువనంతపురం: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ నుంచి నామినేషన్‌ వేయడంపై వయనాడ్‌ ప్రజలు ఆసక్తికర కామెంట్స్‌ చేస్తున్నారు. ‘తప్పేముంది రాహుల్‌ ఇండియా కూటమిలో అగ్రనేత’ అని ఒకరు అనగా రాయ్‌బరేలీలో గెలిస్తే వయనాడ్‌ సీటును రాహుల్‌ వదిలేస్తారని మరొకరన్నారు. 

అయితే రాహుల్‌ వయనాడ్‌ను వదిలేయడం తమకు అంత మంచిది కాదని చెప్పాురు. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని రాహుల్‌గాంధీ తీసుకున్న నిర్ణయం ఇండియా కూటమికి మేలు చేస్తుందని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌(ఐయూఎంఎల్‌)నేత కున్హలికుట్టి అన్నారు. ప్రధాని మోదీ కూడా గతంలో రెండు సీట్లలో పోటీ చేశారని కుట్టి గుర్తు చేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement