5వ వారం మేటి చిత్రాలు

 • ప్రార్థించే పెదవుల కన్నా.. సహాయం చేసే చేతులు మిన్నా(ఫోటో: నరసయ్య,మంచిర్యాల)

 • తప్పెట దరువై.. అదిరేటి చిందై (ఫోటో: రియాజుద్దిన్‌, ఏలూరు)

 • తుపాకి పట్టడంతో హుషారు.. గన్ను గురి పెట్టారు సారు..(ఫోటో: సతీష్‌ కే, సిద్దిపేట)

 • ఐదుగురు ఉంటున్న కుటుంబాన్నే.. ఏ ప్రమాదం లేకుండా నడుపుతున్నోడిని.. ఈ చిన్న బండో లెక్కా..(ఫోటో: రవికుమార్‌, హైదరాబాద్‌)

 • ఎల్లో.. ఎల్లో​.. దట్టీ ఫెల్లో.. వైట్‌..వైట్‌ నా పళ్లు వైట్‌.. నే వాడేది పచ్చిగడ్డి పేస్ట్‌(ఫోటో: అరుణ్‌ రెడ్డి, ఆదిలాబాద్‌)

 • స్కూటర్‌ మీద స్కూటర్‌ పెట్టి నువ్వు కదిలితేనయ్య... ఓ .. ఒసే రాములయ్య ( ఫోటో: భాషా, అనంతపురం)

 • ఏందమ్మి అది.. సైకిల్‌ టైర్లతో ఆడుకుంటాండావు ఏంది?(ఫోటో: రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు).

 • ఏంటమ్మా! ఈ వేషంతో నేను భయపెట్టాలి కానీ.. నీ చూపుల్లో నన్ను భయపెడుతున్నావు(ఫోటో: రూబెన్‌, గుంటూరు)

 • రక్తం చిందని ఎర్రదనం.. విలయం సృష్టించిన విషాదం(ఫోటో: కే రమెష్‌ బాబు, హైదరాబాద్‌)

 • సాహసాలకు అమెరికాలో స్పైడర్‌మ్యాన్‌, సూపర్‌మ్యాన్‌, ఐరన్‌మ్యాన్‌.. ఇండియాలో పోలీస్‌ మ్యాన్‌ (ఫోటో: నాగరాజు, హైదరాబాద్‌)

 • నాలుగు కాళ్లతో నడిచే ముసలవ్వా.. మేం ఇద్దరం నీకు తోడవ్వా.. (ఫోటో: వేణుగోపాల్‌,జనగాం)

 • చదివితే.. గర్తు పెట్టుకోగలను.. చలి చదవనివ్వదు.. చలికాలం చదువులింతే.. (ఫోటో: వేణుగోపాల్‌,జనగాం)

 • నా పేరు చిన్న కాంతయ్య ఐపీఎస్‌.. నేను ఎవ్వరి వైపు చూడను...(ఫోటో: థశరధ్‌ రాజ్వా, కొత్తగూడెం)

 • ఒకడు నాకు అడ్డం వచ్చినా.. ఒకడికి నేను అడ్డం వచ్చినా వాడికే రిస్కు.. నల్లబాలు.. నల్లతాచులెక్క.. కొరికి చంపేస్తా(ఫోటో: రాజు, రాధారపు)

 • మంచు కురిసినా.. చలి పెనవేసినా.. ఆగునా ఈ బతుకు బండి(ఫోటో: హుశ్సేన్‌, కర్నూలు)

 • బండ్లు.. ఓడలవుతాయంటే ఏమో అనుకున్నా.. ఇలా నీళ్లలో పోవాలంటే ఓడలు కాదు.. పెద్ద పెద్ద షిప్పుల్లా కూడా మారాలి..(ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

 • రైతుకు.. కన్నీళ్లకు విడదీయరాని బంధం ఏదో ఉంది.. అందుకే.. కన్నీళ్లు ఇంకిపోయిన ప్రతిసారి వాననీళ్లు పంటను ముంచెత్తి కన్నీటి ఊటను పుట్టిస్తాయి.. (ఫోటో: స్వామి, కర్నూలు)

 • మనిషి మొదటి ఆవిష్కరణ చక్రం.. చక్రాన్ని తిప్పుతూ.. చక్రంలో తిరుగుతూ.. ఎన్నో సాధించాడు.. సాధిస్తున్నాడు..(ఫోటో: మురళీమోహన్‌, మహబూబాబాద్‌)

 • పిల్లలు.. దేశం మీద కల్మషంలేని ప్రేమకు పట్టుకొమ్మలు(ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • దేశం కోసం ప్రాణాలు విడిచిన రారాజు.. మన్యం దొర అల్లూరి సీతారామరాజు(ఫోటో: అజీజ్‌, మచిలీపట్నం)

 • కలిసుంటే కలదు సుఖం.. కమ్మని స్నేహ బంధం(ఫోటో: భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 • నవ్వుల రాణమ్మ రోజమ్మ.. (ఫోటో: ప్రసాద్‌ గరగ, రాజమండ్రి)

 • మనసుకు లేదు వైకల్యం.. మాలో ఉంది ఎవరెస్టును తాకే ఉత్సాహం(ఫోటో: జయశంకర్‌, శ్రీకాకుళం)

 • వెళ్లువచ్చి గోదారమ్మ వెల్లకిలా పడ్డాదంట..(ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • చిగురుటాకు మీద చినుకు అందం.. పండుటాకు మీద ఎందుకు నీకీ కోపం..(ఫోటో: యాకయ్య, సిద్దిపేట)

 • ఆయ్‌! మా తాత మీసంతో మిలిటరీ ట్రక్కు లాగాడురా.. కనీసం నేను కాళు అడ్డంపెట్టి బస్సును కూడా ఆపలేనా?..(ఫోటో: మహ్మద్‌ రఫి, తిరుపతి)

 • నిరసన మీది.. నీరసం మాది(ఫోటో: భగవాన్‌, విజయవాడ)

 • మనషులు.. ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందంటే ఏమో! అనుకున్నా.. ఈ రోజు నాదన్నమాట!(ఫోటో: భగవాన్‌, విజయవాడ)

 • విన్యాసాల అగ్గి భరాటా.. అదుపు తప్పితే అవుతావు మాడిన పరోటా.. (ఫోటో: చక్రపాణి, విజయవాడ)

 • పిల్లలు దేవుడితో సమానం.. అంతమంది దేవుళ్లను ఒకే ఆటోలో కుక్కితే కళ్లుపోతాయ్‌(ఫోటో:కిషోర్‌, విజయవాడ)

 • ఎగిరి దుమికితే.. కప్పు గెలిచెను.. ‌(ఫోటో:కిషోర్‌, విజయవాడ)

 • పెద్ద పెద్ద పిట్టగోడలే ఎగిరి దూకాను.. ఈ ప్లాస్టిక్‌ పైపులో లెక్క(ఫోటో: ఎండీ నవాజ్‌, వైజాగ్‌)

 • ప్రేమగా ఒక ముద్ద తినిపించడానికి తల్లే కావాలా?.. అమ్మాయే ఓ అమ‍్మలా అనాథకు అన్నం తినిపిస్తున్న వేళ.. (ఫోటో: మోహన్‌రావ్‌, వైజాగ్‌)

 • ఏనుగమ్మ ఏనుగు.. మా ఊరొచ్చిందేనుగు.. (ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top